మహిళలు అన్ని రంగాలలో విజయం సాధించాలని పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు అన్నారు. గురువారం బోనకల్ లోని పల్లెప్రపంచం ఫౌండేషన్ కార్యాలయంలో మహిళలు-ఉపాధి అవకాశాలు అనే అంశంపై ఆయన మాట్లాడారు. మహిళలు తలచుకుంటే పురుషులతో సమానంగా అన్ని రంగాలలో విజయం సాధించగలరని అనేక విషయాలలో నిరూపించారని తెలిపారు. డ్వాక్రా సంఘాల ద్వారా పొదుపు ఉద్యమంలో విజయం సాధించడం ద్వారా రెండు అగ్ర రాజ్యాలైన అమెరికా, బ్రిటన్ దేశాల అధినేతలను ఆంధ్రప్రదేశ్ కు రప్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పల్లె ప్రపంచం ద్వారా మహిళలకు ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. చలమల అజయ్ కుమార్ అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫౌండేషన్ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు బలగాని నాగరాజు, రామన అప్పారావు, సురభి వెంకటేస్వర రావు (కొండబాల) తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని వివ్దిధ గ్రామాలనుండి షుమారు 50 మంది పాల్గొన్నారు.


వార్త పత్రికల క్లిప్పింగులు


ఈ బ్లాగులో గత టపాకోసం ఇక్కడ నొక్కండి
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top