అగ్రవర్ణాలలో పేదలకీ రిజర్వేషన్ వర్తింపజేయాలి

బి.జె.పి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి  బోళ్ళ భిక్షపతి

రిజర్వేషన్లపై మాట్లాడుతున్న భిక్షపతి
అగ్రవర్ణాలలోని పేదలకు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కలిపించాలని బి.జె.పి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బోళ్ళ బిక్షపతి తెలిపారు. ఆదివారం బోనకల్ లో పల్లెప్రపంచం ఫౌండేషన్ సంస్థ ఆద్వర్యంలో రిజర్వేషన్లపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలో కుల అణచివేత ఉన్నంతవరకూ అంబేద్కర్ సూచించిన ప్రస్తుత రిజర్వేషన్లను అమలు చేస్తూనే అగ్రవర్ణాలలోని పేదలకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు బి.జె.పి పై చేస్తున్న ఆరోపణలు తప్పని అన్నారు. తాము రిజర్వేషన్లకి వ్యతిరేకం కాదన్నారు. సమాజంలో మేధస్సు ఉండి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అగ్రకులాలకు చెందిన నిరుద్యోగులు అనేక విధాలుగా నష్టపోతున్నారన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయలకోసం మతపరమైన రిజర్వేషన్లకు మద్దతునిస్తున్న రాజకీయ పార్టీలు అగ్రకులాలలోని పేదలకోసం ఆలోచించడం లేదన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బి.జె.పి వ్యతిరేకిస్తుందన్నారు. దేశవ్యాపితంగా దళితులు, బి.సి లు, ఇతర వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి నిజాయితీగా పని చేస్తున్నది బి.జె.పి మాత్రమేనన్నారు. ఒక బి.సి ని ప్రధానిని చేయగలిగిన సత్తా బి.జె.పి కి మాత్రమే ఉందన్నది నరేంద్ర మోడీ ఉదంతం తెలియజేస్తుందన్నారు. పల్లెప్రపంచం ఫౌండేషన్ సభ్యులు రామన అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సమాచార హక్కు చట్టం - అవకాశాలు అనే అంశంపై విశ్రాంత ఉపాధ్యాయులు వజ్రాల పరబ్రహ్మం ప్రసంగించారు. సమాచార హక్కుపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని కోరారు. గ్రామాలలో సమాచార హక్కు చట్టంపై ప్రచారం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు, కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు బలగాని నాగరాజు, మచ్చా రాజెష్, పల్లా అరవింద్, బి.జె.పి గీతకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దొంతు జ్వాలా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం పల్లె ప్రపంచం మార్కెటింగ్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ప్రకృతి జీవన విధానం, పర్యావరణం , ఇంటింటా గ్రంధాలయం అంశాలపై సమీక్ష జరిగింది. వివిధ గ్రామాలనుండి వచ్చిన సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపారు. ఈ వారం మార్కెటింగ్ ద్వారా ఆదాయం పొందిన వారి వివరాలను ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు ప్రకటించారు.
దినపత్రికల వార్తల క్లిప్పింగులు
ఈ బ్లాగులో గత టపాకోసం ఇక్కడ నొక్కండి

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top