మహాకవి శ్రీశ్రీ వ్రాసిన ఈ పాటను మనసు కవి ఆత్రేయ వ్రాసారని పొరపాటు పడడం సహజం. నాకు నచ్చిన పాటలలో ఇదొకటి. ఈ పాట గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పదలచుకోలేదు. పాట వింటే చాలు దాని గురించి మనం చెప్పడం అనవసరమనిపించడమే అందుకు కారణం. విననివారు ఓ సారి వినండి. ముఖ్యంగా ఈ తరం వారికి ఇలాంటి పాటల పరిచయం అవసరమని నా అభిప్రాయం.
  • మనసున మనసై బ్రతుకున బ్రతుకై.... అను ఈ పాట డాక్టర్ చక్రవర్తి (1964) సినిమా లోనిది.
  • ఈ పాటకి శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతం అందించగా....శ్రీ శ్రీ గారి సాహిత్యానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం తీడైతే వెలువడిన అద్భుతమైన ఆణిముత్యం. 
  • ఈ పాట కోసం అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి మరియు జగ్గయ్య లు నటించారు. 
  • ఈ సన్నివేశం నాగార్జున సాగర్ నిర్మాణానికి ముందు అక్కడి లేక్ వ్యూ అతిథిగృహపు ఉద్యానవనంలో చిత్రీకరించిబడినది.
  • ఈ పాట ను ఆధారం చేసుకుని తెలుగు సాహిత్యంలో కొన్ని కథలు వ్రాయబడ్దాయి. అంపశయ్య నవీన్ ఇదే పేరుతో ఒక నవల రాశారు. అదే "షరతులు లేని ప్రేమ" (అన్ కండిషనల్ లవ్) "నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు" రూపంలో తొలిసారిగా తెలుగు సినీ గీతాల్లో ప్రతిపాదించబడింది.                                                                                                                                                                                         (వికీపీడియా నుండి)
***   ***   ***   
పల్లవి :

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

చరణం: 1

ఆశలు తీరని ఆవేశములో...ఆశయాలలో....ఆవేదనలో...
చీకటి మూసిన ఏకాంతములో.....
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

చరణం: 2

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు....నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

చరణం: 3

చెలిమియె కరువై.. వలపే అరుదై
చెదిరిన హృదయమే శిలయై పోగా...
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే...
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము.

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

ఈ పాటపై వికీపీడియా వారి లింకు: http://goo.gl/02bAQH
- పల్లా కొండల రావు.
***   ***   ***   
మీరూ మీకు నచ్చిన పాట గురించి వ్రాయాలనుకుంటే ఇక్కడ నొక్కండి.
ఈ శీర్శికలో ఇంతక్రితం పాటల కోసం ఇక్కడ నొక్కండి.
***   ***   *** 
*Re-published
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర చర్చావేదిక జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top