వసివాడే పసి మొలకలు

బడిని  ఆలయం (విద్యాలయం ) అని పిలుచుకొనే సంస్కృతి  మనది.  తండ్రి తరవాత   ఆడపిల్ల  అంతే చనువుగా ఉండేది గురువు దగ్గరే.  పసి బిడ్డల మొదలుకొని  ఎదిగిన యువతుల వరకూ  చదువుల ఒడిలో గురువుకు దగ్గరగా మసలుతారు.

నేటి విద్యా విదానాలలో  మార్పులూ, వ్యాపార నిమిత్తమైన విద్యాలయాలూ, ఉపాద్యాయుల నియామక విషయంలో సరైన పద్దతులు పాటించటం లేదు. ఎదుగుతున్న ఆడపిల్లల్లో ఎన్నో భయాలు చోటుచేసుకుంటాయి. వాటి నివృత్తి కై వారు ఇతరుల మీద  ఆదారపడకుండా తల్లి దగ్గరికి  తీసుకొని  కొంతమేర సహకరించగలగాలి.

ఇకపోతే  ఎక్కువగా  లైంగిక వేదింపులకు గురయ్యేది  బీద విద్యార్దునిలే. వారి తల్లిదండ్రులు కూలీ నాలీ చేసుకొంటూ, ఇంటిపట్టున లేకపోవటమూ, లేదా పిల్లలని పోషించలేక  హాస్టల్స్ లో వేయటమూ జరుగుతుంది. వారికి ఏమి జరిగినా  ఎదుర్కొనే  శక్తి ఉండదనే ధైర్యం  కామాందులను ఇలాంటి పనులకు పురిగొల్పుతుంది.

ఇక్కడ గమనించాల్సిన   విషయం  ఏమిటంటే, పిల్లలపై  జరిగే అరాచకాలకు  అక్కడి  ఉద్యోగులే కొమ్ముకాయటం. బైటివారెవరూ అడుగు పెట్టలేని కట్టుదిట్టాలుంటాయి. ముఖ్యంగా  అక్కడి  మహిళా ఉద్యోగులే ఇలాంటి పనికి మాలిన వ్యవహారాలు నడుపుతారు. వారు  నమ్ముకున్న బడాబాబుల  అండదండల కొసం ఈ పసి పిడ్డల ఆడ మాంసాన్ని ఎరగా వేసిన ఎన్నో సందర్బాలు వెలుగు చూశాయి. 

శిక్షలు లేని   దౌర్భాగ్యపు  సమాజం మనది. ఆడతనం  మచ్చుకైనా లేని, నీతీ,జాతీ లేని  మహిళా ఉద్యోగులున్న హాస్టల్స్ లో బాలికలకు  రక్షణ ఉండదు.

వలువలూడిన  విలువలకు నీతి పాఠాలు బోదించినా పలితం ఉండదు. కుటిలమైన ఈ మురుగు నీటి కొలనులో ఎన్ని కలువలు విలపిస్తూ.. వసివాడుతున్నాయో.. ప్రభుత్వం తన గాంధారి కట్టు విప్పి  కళ్ళుతెరిస్తే, కొంచమైనా చర్య తీసుకోగలిగితే.. కీచక  పర్వాలు  ముగుస్తాయేమో!?

జీవితమే ఆరంభం కాని  ఆ పసి మనస్సులు వార్తల్లో నాని  మనల్ని   ప్రశ్నిస్తున్నాయి.  ఏంటి  పరిష్కారం  అని? అతి  సామాన్యులమైన  మనమూ... ఆలోచించే  సమస్యలివి. రండి అందరమూ కలసి పోరాడదాం. విలువల విద్యాలయాలు నిర్మించుకుందాం.
*Re-published
--------------------------------------------------

మీరూ 'జన విజయం' కు రచనలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.

Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top