సమాచార హక్కును గూర్చి ప్రజలకు తెలియజేయాలి
- వజ్రాల పరబ్రహ్మం
ప్రసంగిస్తున్న పరబ్రహ్మం
ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని తెలిసికొనుట. అధికార యంత్రాంగంలోని పని విధానాన్ని తెలిసికొనుట, అవినీతిని నిర్మూలించుట, qధికారులతో జవాబుదారీ తనాన్ని పెంపొందించుట బొదలగు వానిని సాధించుటకై ఏర్పడినదే సమాచార హక్కు చట్టమని వజ్రాల పరబ్రహ్మం పేర్కొన్నారు.  ఆదివారం బోనకల్ లోని పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన స్టడీ సర్కిల్ లో సమాచార హక్కు చట్టం - అవగాహన అనే అంశంపై ఆయన మాట్లాడారు.  స్టడీ సర్కిల్ కన్వీనర్ చలమల అజయ్ కుమార్ అధ్యక్షత వహించారు.  గత 2 ఆదివారాలుగా సమాచార హక్కును గూర్చి అవగాహన కలిగించటం జరిగింది. సమాచారం పొందే హక్కు ప్రతి పౌరునకు ఉందనీ, దరఖాస్తుదారుడు ప్రభుత్వం నుండి 30 రోజులులోగా ఏ కార్యాలయం నుండైనా కోరిన సమాచారం పొందుటకు హక్కు కలిగి ఉన్నాడని, సంబంధిత అధికారి 30 రోజులలోగా సమాచారం ఇవ్వకపోతే అతనిపై కమీషన్ కు ఫిర్యాదు లేదా పై అధికారికి అప్పీలు చేసుకునే అవకాశం ఉందని, తెలిపారు. ప్రతి గ్రామంలోని ప్రజలకు సమాచార హక్కును గూర్చి విద్యావంతులకు, నిరక్షరాస్యులకు తగిన అవగాయన కలిగించుతకు మనం ఎంతో కృషి చేయాలని కోరారు. పల్లె ప్రపంచం స్టడీ సర్కిల్ లో తదుపరి వారం నుండి ప్రకృతి జీవన విధానం - షుగర్ వ్యాధి నివారణ మార్గాలు అనే అంశంపైనా, రిజర్వేషన్ల పైనా చర్చలు కొనసాగుతాయని పల్లా కొండల రావు తెలిపారు. ఆదివారం ఉదయం బిజినెస్ ప్లాన్ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఆదాయం పొందిన ఏజెంట్లకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు, కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు చలమల అజయ్ కుమార్ , బలగాని నాగరాజు, రామన అప్పారావు, పల్లా అరవింద్ , షేక్ నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. 
హాజరైన సభ్యులు
మాట్లాడుతున్న సభ్యులు, ఏజెంట్లు

వార్తల క్లిప్పింగులు

మన తెలంగాణ


ఆంధ్రజ్యోతి

నమస్తే తెలంగాణ

సూర్య


నవ తెలంగాణ



ఈ బ్లాగులో గత టపాకోసం ఇక్కడ నొక్కండి
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top