భారతదేశంలో ఈ బాల్యమిలా ఎంతకాలం!?

నాకున్న చిన్ని ఆస్తి నా చొక్కా జేబులో ఇమిడి పోతుంది. 

అదేంటో తెలుసా? 

ఒకటి "చారణా" బిళ్ళ.  ఇంకోటి ''ఐస్ క్రీం" పుల్ల.

ఇవి 'రెండూ' నాకు ప్రాణం.
     
అవునూ! నా గురించి  మీకు చెప్పలేదు  కదా!? 

నాకు మూడేళ్ళు. మీరు నన్ను చాలా సార్లు చూసే వుంటారు. 

ఎక్కడా అనుకుంటున్నారా?  

ఫుట్ పాత్ మీద.

ఎర్ర సిగ్నల్ పడినప్పుడు ఒక్క నిమిషం నా వంక చూస్తారు.

నేనక్కడే ఆడుకుంటూ ఉంటా !

మీతో  వుండేది మీ పాపనుకోండి, నేను కరెంటు స్థంభం చాటుకెల్తా.

ఎందుకంటారా? 

నాకు సిగ్గు బాబూ! నా చెడ్డి చిరిగి పోయింది కదా!

మా అమ్మకీ ఆస్థి వుంది. అదంతా రెండు సంచుల్లోకి వస్తుంది. రెండు బొచ్చెలు, రెండు ప్లాస్టిక్ గ్లాసులు, రెండు చీరెలు. పూసలూ, బొమ్మలూ అమ్ముతుంది. మేముండే స్థలం కూడా రెండు బారలే.

అసలీ "రెండు" అనే పదం మా బ్రతుకులో అచ్చు పడిపోయింది. మేమూ ఇద్దరమే.

నేను అనుకుంటూ ఉంటా! 

ఎన్ని కార్లో! ఎన్ని మోటారు సైకిల్లో! అసలీ జనాలంతా అటూ ఇటూ ఎందుకు తిరుగుతుంటారు!? షాపుల నిండా వీళ్ళే! హోటళ్ళ నిండా వీళ్ళే! 

ఏమి కావాలంటే అవి కొనుక్కుంటారు. ఎక్కడివి ఇన్ని డబ్బులు. 

సదువుకుంటే వస్తాయా? 

ఎట్లా సదువుకోవాలి? 

ఎవర్ని అడగాలి? 

నేను సదువుకోవాలంటే ఏం చేయాలి? 

అడగదామంటే ఒక్కరూ ఆగరుకదా!?

మీకు తెలుసా? 

మా అమ్మ చెప్తాది. చానా మందికి రెండు జన్మలకి సరిపడా డబ్బులు ఉంటాయట!

నాకూ సదువుకోవాలని ఉంది.

సదువుకుని డబ్బులు సంపాదించి అమ్మకూ, నాకూ ఓ  దుప్పటి కొనాలి. 

కానీ, సదువుకోవడం ఎట్లా!? 
   
ఎవరైనా , ఒక్క క్షణం ఆగి చెప్పండి!

*Re-published
--------------------------------------------------

మీరూ 'జన విజయం' కు రచనలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top