హరితహారం,మిషన్ కాకతీయ కు పార్టిరహితంగా మద్దతు తెలపాలి


తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, హరిత హారం పథకాలకు గ్రామాలలో రాజకీయాలకతీతంగా మద్దతు తెలపాలని పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు తెలిపారు. ఆదివారం బోనకల్ లోని పల్లెప్రపంచం ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన అధ్యయన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ రెండు పథకాలవల్ల గ్రామసీమలకు, సమాజానికి మేలు జరుగుతుంది కనుక అన్ని పార్టీలవారు, మేధావులు సంపూర్ణ మద్దతు పలకాలని కోరారు. అన్ని పథకాలమాదిరిగానే ఈ పథకాల అమలులో కూడా అవినీతి, అవకతవకల వార్తలు వినపడడం ఆందోళన కలిగించే అంశమన్నారు. అవినీతికి తావు లేకుండా ఈ కార్యక్రమాలను నిరంతరం కొనసాగేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. చలమల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బోనకల్ జెడ్.పి.టి.సి సభ్యుడు బాణొతు కొండా మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కలిపించాలన్నారు. సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య యోగాసనాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బలగాని నాగరాజు, వజ్రాల పరబ్రహ్మం, కంసాని చలపతి రావు, రామన అప్పారావు, మరీదు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
news clippings



ఈ బ్లాగులో గత టపాకోసం ఇక్కడ నొక్కండి

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top