సహాయం అవసరం లేని ప్రపంచం కోసం కృషి చేద్దాం! 
- పల్లె ప్రపంచం అధ్యక్షులు పల్లా కొండల రావు


సహాయం అవసరం లేని సమాజం కోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాలని పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు తెలిపారు. సోమవారం చిరునోముల ఉన్నత పాఠశాలలో దృష్టిలోపం ఉన్న బాలికలకు పల్లె ప్రపంచం ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో కళ్ళజోళ్ళ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో కొండల రావు మాట్లాడుతూ పిల్లలకు చిన్నతనం నుండే పోషకాహరంపై అవగాహన కల్పించాలన్నారు. విద్యార్ధులలో శాస్త్రీయ ధృక్పథం పెంపొందించేందుకు, సామాజిక అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రకృతి జీవన విధానాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరించడం ద్వారా పిల్లలకు సరయిన, సమతుల ఆహారాన్ని అందించవచ్చన్నారు.ప్రభుత్వ పాఠశాలలలో చదివిన విద్యార్ధులే సామాజిక బాధ్యతతో , మానసిక స్థైర్యంతో ఎదుగుతున్నారన్నారు. ప్రభుత్వ విద్యను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉన్నదన్నారు.  పేదరికం ఉండి మరొకరు సహాయం అందించాల్సిన అవసరం లేని సమాజం కోసం పల్లె ప్రపంచం కృషి చేస్తుందని తెలిపారు. ఈ సభలో 14 మంది విద్యార్ధులకు 7000 విలువ జేసే కళ్లజోళ్లను పంపిణీ చేశారు. సభలో చిరునోముల గ్రామ సర్పంచ్ శాఖమూరి రాజశేఖర్, ఫౌండేషన్ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, ఉపాధ్యక్షులు యడ్లపల్లి నరసిమ్హా రావు, సభ్యులు చలమల అజయ్ కుమార్, సురభి వెంకటేశ్వర రావు, జన విజ్ఞానవేదిక జిల్లా ఉపాధ్యక్షులు సీతారామారావు, పాఠశాల ఉపాద్యయినీ, ఉపాధాయులు, విద్యార్దులు పాల్గొన్నారు.

News Clippings
29-12-2015 andhra bhumi

29-12-2015 andhrjyothy

29-12-2015 eenadu


29-12-2015 namaste telangana


29-12-2015 navatelangana


ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top