మృతుని కుటుంబ సభ్యులకు పల్లెప్రపంచం ఫౌండేషన్ నగదు వితరణ

బోనకల్ మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో శనివారం గుండెపోటుతో కార్పెంటర్ పనిచేస్తున్న చీమకుర్తి లక్ష్మణాచారి(30) మృతి చెందారు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబ నేపథ్యమైనందున మృతుని కుటుంబ సభ్యులకు పల్లెప్రపంచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దహన సంస్కారాల నిమిత్తం 5000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా పల్లె ప్రపంచం అధ్యక్షులు పల్లా కొండల రావు మాట్లాడుతూ పేద కుటుంబం కావడంతో తాము నిర్వ్హిస్తున్న స్వచ్చంధ సంస్థ సభ్యులు చలించి తమవంతుగా ఈ ఆర్ధిక సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. 30 ఏండ్ల చిన్న వయసులోనే లక్ష్మణాచారి మృతి చెండం బాధాకరమన్నారు. లక్ష్మణాచారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఇద్దరు పసి పిల్లలు ఉన్నందున, వారి కుటుంబ పరిస్తితిని గమనించి ప్రభుత్వం నుండి ఈ కుటుంబానికి తగిన సహాయం అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు, కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు మరీదు రోషయ్య, సురభి వెంకటేస్వర రావు, మరీదు కిషోర్, బలగాని నాగరాజు, రామన అప్పారావు, చలమల అజయ్ కుమార్ పాల్గొన్నారు. 

News Clippings
27-12-2015 navatelangana

27-12-2015 andhrabhumi

27-12-2015 andhrajyothy

27-12-2015 eenadu

27-12-2015 manatelangana

27-12-2015 namaste telangana

27-12-2015 visalandhra27-12-2015 andhraprabha

Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top