ప్రజలు పౌరులుగా బ్రతికే వ్యవస్థ కోసం కృషి చేద్దాం!


ప్రజలు ఓటర్లుగా కాక పౌరులుగా బ్రతికేలా తీర్చిదిద్దేందుకు పాలకులు కృషి చేయాలని పల్లె ప్రపంచం అధ్యక్షులు పల్లా కొండల రావు కోరారు. ఆదివారం బోనకల్‌లోని పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. సంస్థ అధ్యయన కేంద్రం కన్వీనర్ చలమల అజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. ప్రజాస్వామ్యం ద్వారా లభించే స్వేచ్చ విచ్చలవిడితనంగా మారకుండా ఉండాలన్నా, మెరుగైన వ్యవస్థ ఏర్పడాలన్నా ప్రజల చైతన్యం పెరగాలన్నారు. ప్రజలలో శాస్త్రీయ ధృక్పథం పెంచేందుకు పాలకులు ప్రయత్నించాలన్నారు. ఎన్నికలలో గెలుపు ద్వారా ప్రజలపై పెత్తనం చేసేందుకు కాక వారిని చైతన్యవంతులైన పౌరులుగా తయారు చేయాలని కోరారు. దురదృష్ట వశాత్తూ రాజకీయ పార్టీలు ప్రజలను ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారన్నారు. ఓటు బేంక్ రాజకీయాలకు చెక్ చెప్పాలన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన, సమానమైన విద్యా, వైద్య అవకాశాలు, పని అవకాశాలు ప్రభుత్వమే కల్పించేలా ఉండాలన్నారు. ప్రజలు ఏది కోరుకుంటున్నారనేది కాక, ప్రజలకు ఏది అవసరం అన్న ధృక్పథంలో పాలకుల ఆలోచనలు ఉంటేనే సమాజ ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, బంధ శివ ప్రసాద్, సురభి వెంకటేశ్వర రావు, మరీదు రోశయ్య తదితరులు పాల్గొన్నారు.


25-1-2016 andhrajyothy

25-1-2016 navatelangana

ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి

Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vm అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top