చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

సమాజంలో ప్రజాస్వామ్యం సక్రమంగా మనుగడ సాగించాలంటే ప్రతి పౌరుడు చట్టాలపై తగినంత అవగాహన పెంచుకోవాలని పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు తెలిపారు. ఆదివారం బోనకల్ లో పల్లె ప్రపంచం కార్యాలయంలో చట్టాలు-అవగాహన అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన ప్రసంగించారు. చట్టాలు ద్వారా సంక్రమిస్తున్న హక్కులను సాధించుకోవాలన్నా, అధికారులు వాటిని దుర్వినియోగపరస్తున్నా ఏమి చేయాలనేది చట్టాలపై అవగాహన ఉన్నదానికి, లేనిదానికి చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు. గ్రామాలలో చోటా లీడర్లు నుండి మంత్రులవరకు అధికార దుర్వినియోగానికి పాల్పడడం తగ్గాలంటే సామాన్యులకు చట్టాలపై తగినంత అవగాహన ఉండాలన్నారు. ఈ మేరకు ప్రజలలో చైతన్యం కల్పించేందుకు అన్ని సంస్థలు, పార్టీలు కృషి చేయాలన్నారు. ఏ అధికారికి ఏ అంశంలో ఎలాంటి అధికారాలు ఉన్నాయి? వాటిని దుర్వినియోగం చేస్తున్నపుడు న్యాయపరంగా ఎలా పోరాడాలనేదానికి చట్టాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా చైతన్యం పెంచుకోవచ్చన్నారు. పల్లె ప్రపంచం సంస్థ ద్వారా గ్రామాలలో సామాన్యులకు వివిధ చట్టాలపైనా, పాఠశాలలు,కళాశాలల విద్యార్ధినిలకు మహిళాసాధికారత, రేగింగ్ నిరోధం వంటి చట్టాలపైనా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశ్రాంత అధ్యాపకుడు వజ్రాల పరబ్రహ్మం అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో పల్లెప్రపంచం ఫౌండేషన్ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు రామన అప్పారావు, బంధం శివ ప్రసాద్, సురభి వెంకటేస్వర రావు, మరీదు రోషయ్య, యడ్లపల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు.
News Clippings







ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top