శశాంకం అంటే కుందేలు. ఈ ఆసనం వేస్తున్నపుడు, శరీరం విశ్రాంతి తీసుకుంటున్న కుందేలును పోలి ఉంటుంది. అందుకే దీన్ని శశాంకాసనం అంటారు. చంద్రునిలోని మచ్చ ఈ ఆసనం ఆకారాన్ని పోలి ఉంటుంది. అందుకే దీన్ని చంద్రాసనం అని కూడా అంటారు. ఏ యోగాసనమైనా వేసిన తర్వాత దానికి సంబంధించిన విశ్రాంతి ఆసనంలో కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాతే వేరే ఆసనం వెయ్యాలి. వజ్రాసనంలో ఉండి చేసే ఆసనాలను వజ్రాసన సముదాయపు ఆసనాలంటారు. వీటన్నింటికీ విశ్రాంతి కోసం శశాంకాసనాన్ని వాడతారు.

చేసే విధానం :

వజ్రాసనంలో ఉండి గాలిని వదులుతూ, చేతులను వెనకకు ఉంచి, నడుమును, తలను ముందుకు వంచి, నుదిటిని నేలకు తాకించాలి. పిరుదులు, తొడలు, కాలి పిక్కలకు అంటి ఉండాలి. కొద్ది సేపు అలా ఉన్న తర్వాత గాలిని తీసుకుంటూ మొదట శరీరాన్ని, తర్వాత తలను పైకి ఎత్తి వజ్రాసనంలోనికి రావాలి.


ప్రయోజనాలు :
కేవలం వజ్రాసన సమూహ ఆసనాలకు విశ్రాంతి కోసం మాత్రమే కాకుండా దీనివల్ల ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి. ముఖ్యం గా మానసిక ఒత్తిడిని ఈ ఆసనం ద్వారా త్వరగా తగ్గించుకోవచ్చు. స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలలోని లోపాలను సరిచేస్తుంది. స్లిప్డ్‌ డిస్క్‌, సయాటిక, నడుమునొప్పి, ఒబేసిటి, గ్యాస్‌ ట్రబుల్‌, డయాబెటిస్‌, అధిక బిపి, ఆస్థమా, మలబద్దకం, ఆర్థిరైటిస్‌ తదితర వ్యాధులతో బాధపడే వారికి ఈ ఆసనం మేలు చేస్తుంది. అడ్రినల్‌ గ్రంధి పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ ఆసనంలో శరీరం మొత్తం విశ్రాంతి పొందుతుంది. రోజులో ఎప్పుడైనా మానసిక ఒత్తిడికిగానీ, ఆందోళనకుగానీ గురైనప్పుడు రెండు నిమిషాలు ఈ ఆసనంలో ఉంటే ఉపశమనం పొందవచ్చు.
డాక్టర్‌ రాచుమల్ల రంగనాథ్‌రెడ్డి ,  మిత్ర యోగ సెంటర్‌, కడప. , సెల్‌ : 9440074773
( From : prajasakti daily)
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర చర్చావేదిక జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top