మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------
ప్రజ - 25
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు
----------------------------------------

ఒకే వ్యక్తి భిన్నమైన పేర్లతో,విభిన్న వైఖరులతో కామెంట్లు చేస్తుంటే ఏమి చేయాలి?


ప్రజ బ్లాగులో నాకీ అనుభవం ఎదురయింది. ఒక్కడే రక రకాల పేర్లతో కామెంట్లు ఉంచేవాడు. అతనికి టెక్నికల్ నాలెడ్జ్ బాగానే ఉన్నది. తెలుగు బ్లాగుల అభివృద్ధికి కృషి చేసే తలంపు ఉన్నది. ఆ దిశగా పట్టువదలని విక్రమార్కుడిలా పని చేస్తున్నాడు కూడా. చాలా వరకూ సఫలీక్రుతుడైనాడు. అయితే ఇతనే మరికొన్ని పేర్లతో విచిత్రమైన కామెంట్లు చేస్తుంటాడు. మొదట నాకు అర్ధం కాలేదు. తరువాత అర్ధమయింది. ఈ విషయాన్ని కొందరు మిత్రులతో చర్చించాను. ఒక్క వ్యక్తే ఓ పేరుతో పొగుడుతూ కామెంటు పెట్టి, మరో ముసుగు పేరుతో తెగుడుతూ కామెంట్ పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి? తప్పు చేసేవారు ఎప్పటికైనా దొరుకుతారు. అలాంటి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్టవేసేదెలా? వ్యక్తిలో మార్పునే నేను కోరుకుంటున్నందున, ఇలాంటివి ఇంకెవరూ చేయకూడదనే సదుద్దేశంతో మీ అభిప్రాయాలు చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

------------------------------------------------
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.

  *Re-published
  Reactions:

  Post a Comment

  1. కొండలరావుగారు

   మొత్తం గా చెప్పేదేమంటే వారిని ప్రత్యక్షంగానో , పరోక్షంగానో మీరే పెంచి పోషిస్తున్నారు. పరిష్కారం చాలా సులువు, మీకు మీరే తెలుసుకుంటే మంచిది . ఎందుకంటె ఎవరి విధానం వారికుంటుంది.

   ఇదేమి ప్రత్యేకమయిన సమస్యకాదు నిజానికి సమస్యే కాదు బ్లాగరుకు ఒక పంథా ఉంటే . ఇక్కడ మీకు ఒక వ్యక్తీ కనిపించి ఉండొచ్చు అలా. కాని మీకు సహకరిస్తున్నట్లు నటిస్తూ, ఇంకొందరిని టార్గెట్ వాళ్ళే ఎక్కువ . ఈ మధ్య పాపం మీరు ఒక టపా డెలీట్ కూడా చెయ్యాల్సి వచ్చింది .

   ప్రశ్నలు కాని , వ్యాఖ్యలు కాని మీ ఏ దృష్టికోణం లో నయినా అంగీకారం గా ఉంటేనే ప్రచురించండి. అర్ధం కాకుంటే అడిగి తెలుసుకోండి . కాని ప్రశ్నించిన వారిని తర్వాత విమర్శించడం మానేయ్యండి. వ్యక్తిగత సమస్యను సామాజిక కోణం లో ప్రశ్నించినపుడు తప్పు పట్టడం కన్నా ఆ టాపిక్ ప్రచురించకుంటే ఈ భిన్నవైఖరులతో భిన్న వ్యాఖ్యలు వ్రాసే వాళ్ళు కాస్త విరామం తీసుకోగలుగుతారు .

   ReplyDelete
   Replies
   1. మీ సూచనకు ధన్యవాదములు మౌళి గారు.

    Delete

  * మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
  * పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
  * నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
  * పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
  * ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
  * అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
  * తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
  * మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
  * మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
  * తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

  p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
   
  Top