మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------------
ప్రజ - 21
ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
అంశం : భావ ప్రకటన, అతివాదం, ముసుగు వాదనలు
------------------------------------------------


ముసుగు పేర్లతో అతివాదం చేసేవారిని ఎలా ఎదుర్కోవాలి?
 • తెలుగు బ్లాగులలో అత్యధికులు మంచివారు. కొందరు మాత్రమే మతోన్మాదులు, అతివాదులు ఉన్నారు. వీరి భాష హేయంగా ఉంటుంది. ఏదో ఒక ముసుగు పేరుతో తెగ జ్ఞానబోధ చేస్తారు. ప్రొఫైల్ వివరాలు లభ్యం కావు. వీరు ఆడో మగో తెలీదు.
 • ఎదుటివారికి ఓ అభిప్రాయం కలిగి ఉండడాన్ని వీరు గౌరవించలేరు. తమకు తెలిసిందే కరెక్టని తద్విరుద్ధంగా ఉంటే ప్రపంచం తలక్రిందులవుతుందని వీరి ఆందోళన. ఈ ఆందోళన ఆక్రొషంగానూ, అసహనంగానూ మారి కనీస మర్యాదను, ప్రజాస్వామిక లక్షణాలను కోల్పోతారు. ఒక్కోసారి జంతు లక్షణాలూ సంతరించుకుంటుంటారు. 
 • మనిషి తను పెరిగిన వాతావరణం - చుట్టూ ఉండే పరిస్తితులవల్ల నిరంతరం ప్రభావితుడవుతుంతాడు. ఎవరు ఏ అభిప్రాయంతో ఉన్నా ఎదుటివారిని భౌతికంగా లేదా కార్యాచరణలో ఇబ్బంది పెట్టనంతవరకూ వారి భావ ప్రకటనను గౌరవించలేని వారు ఎన్ని పుస్తకాలు చదివినా ప్రయోజనం ఉండదు. 
 • కాళిదాసు కవిత్వం కొంత జ్ఞానదాసు పైత్యం కొంత అని ఓ నానుడి ఉంది. అతి జ్ఞానం లేదా ఆచరణకు పనికిరాని జ్ఞానం కంటే చేయూతనిచ్చి చేతనైన సహాయమందించే అల్ప జ్ఞానుల వల్లే సమాజానికి మేలు. 
 • ఒడ్డునుండి అతిగా అనవసరంగా జ్ఞానబోధ చేసే వారు ఓ రకమైన శాడిజం జబ్బుతో బాధపడుతున్నట్లేననేది నా అభిప్రాయం. అసలు పేరు చెప్పుకోలేని ముసుగు వీరులను ఎలా ఎదుర్కోవాలి. కొందరు అసలు పేరు పెట్టుకోకున్నా తామెవరో చెప్తారు. తామాపేరు ఎందుకు పెట్టుకున్నదీ చెప్తారు. వీరినీ ప్రొఫైల్ వివరాలు లేనివారినీ ఒకే గాటన కట్టలేము. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి?

------------------------------------------------------------
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.

  *Re-published
  Reactions:

  Post a Comment


  1. ప్రశ్న: ముసుగు పేర్లతో అతివాదం చేసేవారిని ఎలా ఎదుర్కోవాలి?

   జవాబు : ముసుగు వీరులకి పట్టు బడ కుండా ఉండే టట్టు పటిష్టం గా టపా కట్టాలి !

   జిలేబి
   (ముసుగు వీరాంగణ!)

   ReplyDelete
   Replies
   1. జిలేబీగారూ,
    "ముసుగు వీరాంగణ" కాదండీ "ముసుగు వీరాంగన" అంగణం అంటే ప్రదేశం. ఉదాహరణకు సమరాంగణం అంటే యుధ్ధప్రదేశం అనగా యుధ్ధరంగం. అంగన అంటే స్త్రీ అని అర్థం. స్వస్తిరస్తు. అందుచేత మీరు వీరాంగన అన్నమాట.

    Delete
   2. "జిలేబీ పేరుగల ముసుగు వీరాంగన ముసుగులో వీరాంగణం చేసారు" అంటే సరిపోతుందా సార్ :)

    Delete
  2. Please clarify Do you give value to the Person or his opinion ?

   ReplyDelete
   Replies
   1. ఆ వ్యక్తులెవరో తెలీదు దిలీప్ గారు. ప్రొఫైల్ లో వివరాలుండవు. ఉదాహరణకు iconoclast, Dare2write ఇలాంటి పేర్లతో ఉంటాయి. కొన్ని విషయాలు మంచిగా వాదిస్తారు, కొన్ని అతిగా వ్యక్తిగతదాడితో ఉంటాయి. అసలు పోస్టుకు సంబంధం లేని కామెంట్లు ఉంటాయి. వీరికి ఎవరిమీదో , ఏ భావజాలమ్మీదో బాగా కోపం ఉంటుంది. అటువంటి వారిని నేను సైతం వారిలా చీల్చి చెండాడం లేదనేది వీరి అభిమతంగా కనిపిస్తున్నది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం మినిమం ప్రజాస్వామిక లక్షణం. వ్యక్తిగతంగా కించపరచకుండా, వ్యక్తిగత దాడి చేయకుండా ఎంత తప్పుగానైనా, ఏ భావజాలాన్ని సమర్ధిస్తూనైనా తమ అభిప్రాయాలు వెల్లడించవచ్చని జనవిజయం శీర్షికలో ప్రకటించాను. ఆ మేరకు వచ్చే పోస్టులకు నా అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేస్తాను. లేదా అక్కడ అసలు కామెంట్ చేయకుండా గమనిస్తుంటాను. అంతమాత్రాన ఆ పోస్టులో అభిప్రాయాలన్నీ నేను సమర్ధించినట్లు కాదు. ఇలాంటివాటిపై కూడా కొందరు వ్యక్తులు వారి ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా కూడా కామెంట్లు ఉంచుతున్నారు.

    Delete
  3. పాత టపాలన్ని ఎమయ్యాయి? కనపడటంలేదు.

   ReplyDelete
   Replies
   1. శ్రీరాం గారు, 1-1-2015 నుండి ఈ వెబ్‌పోర్టల్ లో పోస్టులన్ని ఓ పద్ధతి ప్రకారం ఉంచాలని నిర్ణయించాను. పాత పోస్టులలో అవసరమైనవన్నీ వరుసగా రీ పబ్లిష్ అవుతాయి. నన్ను ఫలానా వాదినంటూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కామెంట్లు, పోస్టులు వస్తుండడంతో అందరికీ అర్ధమయ్యేలా ముఖ్యంగా నా గోల్ కు ఉపయోగపడేలా ఈ పోర్టల్ నిర్వహణ ఉంటుందిక.

    " తెలియంది తెలుసుకోవడం - మంచిని ప్రచారం చేయడం - పల్లెప్రపంచం విజన్ కు ఉపయోగించుకోవడం " ఈ మూడంశాలు లక్ష్యంగా పల్లెప్రపంచం పోర్టల్ పనిచేస్తుంది.

    రోజులో కొంత సమయం మాత్రమే దీనికోసం కేటాయించగలను కనుక కామెంట్ మోడరేషన్ కూడా స్ట్రిక్టుగానే అమలు పరచాలని నిర్ణయించాను.

    తెలుగు బ్లాగులలో పల్లెప్రపంచానికి మెరుగైన స్థానం కల్పించేందుకు మీ అందరి సహకారం కోరుతున్నాను.

    Delete

  * మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
  * పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
  * నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
  * పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
  * ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
  * అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
  * తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
  * మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
  * మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
  * తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

  p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
   
  Top