మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------------
ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.


Reactions:

Post a Comment

 1. కామన్ సివిల్ కోద్ తెచ్చినంతమాత్రాన వివిధ సమూహాలవాళ్ళు తమ విధానం మార్చుకుంటారా? ముస్లింలలో కజిన్ మేరేజెస్‌ని నిషేధించినంతమాత్రాన ముస్లింలు కజిన్ మేరేజెస్ మానుకుంటారా? కామన్ సివిల్ కోద్ ఉంటే హిందువులకి నిషిద్ధమైనవి ముస్లింలకి కూడా నిషిద్ధమవుతాయి. ముస్లింలు కామన్ సివిల్ కోద్‌ని వ్యతిరేకిస్తున్నది ఇందువల్లే. మరి క్రిమినల్ లా సంగతి ఏమిటి? హలాల్ చేసిన (రక్తం లాంటివి తొలిగించిన) మాంసం మాత్రమే అమ్మాలని రూల్ పెడితే ముస్లింలు స్వాగతిస్తారు కానీ హిందూ వ్యాపారులు దాన్ని పట్టించుకుంటారా?

  చట్టం అనేది సమాజానికి భిన్నంగా నడవదు.

  ReplyDelete
  Replies
  1. చట్టం సమాజపుతీరుని పట్టించుకోదు. వరకట్నం, భౄణహత్యలు, అంటరానితనం వంటి విషయాల్లో చట్టం తీరు సామాజపు తీరుకి ఎడగా ఉండడం మనం గమనిస్తున్న విషయమేకదా!


   లౌకిక చట్టాలు హిందువుల్ని హిందువుల పురోహితవర్గపు కబంధహస్థాలనుండి విముక్తంచేసినట్లే, ముస్లిములను వారి పురోహితవర్గపు కబంధహస్థాలనుండి విముక్తం చేయగలవు. పూర్తిగా one sidedగా ఉన్న తలాకువిడాకులూ, బహుభార్యత్వమూ, బలవంతపు బుర్ఖాలు వంటి మూఢాచారాలనుండి స్త్రీలు విముక్తులవుతారు. 'సున్నా' పరిరక్షణపేరుతో ప్రజలని మూడాచారాలకి బంధీలుగాచేస్తున్న సోమరిపోతుల్ని రోడ్డుమీద నిలబెట్టడం సాధ్యమవుతుంది. ముస్లిముల్లోనూ కులవ్యవస్థ పట్టుసడలుతుంది.

   Delete
  2. కట్నం అనేది సాంఘిక దురాచారం కనుక అది ఏ మతంలో ఉన్నా దాన్ని నిషేధించాల్సిందే. కానీ కజిన్ మేరేజెస్ అలా కాదు. హిందువులలో కజిన్ మేరేజెస్ నిషిద్ధం అని చెప్పి ముస్లింలలో కూడా వాటిని నిషేధిస్తే ముస్లింలకి బాధ కలుగుతుంది. తమది హిందూత్వ పార్తీ అని బహిరంగంగా చెప్పుకునే భాజపా యూనిఫార్మ్ సివిల్ కోద్ గురించి మాట్లాడడం వల్లే హిందూ సంప్రదాయాలని ముస్లింలపై రుద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం బలపడుతోంది.

   Delete
  3. కట్నంలాగే పెళ్ళి అనేదికూడా సాంఘీక దురాచారమేకాబట్టి (పోనీ... ఆచారమే కాబట్టి), వధూవరులలో ఎవరి అభ్యంతరమూ లేనంతవరకూ (వారిమధ్య పరస్పరాంగీకారమున్నంతవరకూ) వారివారి పెళ్ళిళ్ళకి-ముందరి-వరుసలను చట్టం పట్టించుకోవలసిన అవసరంలేదు. Civil lawలో ఇలాంటి అల్ప విషయాలనుకాక అంగీకారానికి బయట ఉన్నవారి అభ్యంతరాలకు విలువనిచ్చే క్లాజులుండాలన్నదే నా అభిప్రాయం.

   Delete
  4. హిందూ వివాహ చట్టం ప్రకారం నిషిద్ధ వరసలు గల వారి మధ్య వివాహం నేరమే కానీ అది non-cognisable (కంప్లెయింత్ ఇస్తేనే గుర్తించే) నేరం. దాని మీద ఎవరూ కంప్లెయింత్ ఇవ్వకపోతే ఆ పెళ్ళి చేసుకున్నవాళ్ళకి ఏమీ కాదు. కానీ వరసలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయన్నప్పుడు వాటి ఆధారంగా చట్టాలు చెయ్యడం అనవసరమనే ఒక రాజనీతి శాస్త్ర పాఠకునిగా నా అభిప్రాయం.

   Delete
  5. కామన్ సివిల్ కోడ్ అంటే బీ.జే.పీ వారే చేయాలా?

   కామన్ సివి కోడ్ అనే పదం బీ.జే.పీ వారి గుత్త సొత్తుగా ఉండాలా?

   మతపరమైన అంశాలేవీ లేకుండా... ఏ మత పిచ్చలనూ పట్టించుకోకుండా శాస్త్రీయ పద్ధతులలో కామన్ సివిల్ కోడ్ ను తయారు చేయలేమా?

   మెజారిటీ మతమైనా మైనారిటీ మతమైనా ఆయా మత పిచ్చలతో ఆయా మతాలలోని మనుషులు పడుతున్న ఇబ్బందులను తొలగించేలా ఆయా అరాచకత్వాలనుండి మనుషులకు విముక్తి కలిగేలా కామన్ సివిల్ కోడ్ ఉంటే తప్పు లేదని నా అభిప్రాయం.

   Delete
 2. దేశం లో ఉండేది ప్రజాస్వామ్య ప్రభుత్వం. చట్టాలు చేసే ముందు ముస్లిం మత పెద్దలను సంప్రదించకుండా ఎలా చేస్తారు? బిజెపి తిరిగి ఎన్నికలలో గెలవాలా వద్దా? అయితే దగ్గరి బంధువులను పెళ్లి చేసుకొంటే ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఆ విషయానికి సంబందించిన లింక్ ఇంతక్రితం టపాలో ఇచ్చాను ఎందుకో ఆ వ్యాఖ్య ప్రచూరితం కాలేదు. ఆ లింక్ మళ్ళి ఇస్తున్నాను .

  Minister: Muslim 'inbreeding' in Britain is causing massive surge in birth defects

  Last updated at 19:36 10 February 2008

  http://www.dailymail.co.uk/news/article-513388/Minister-Muslim-inbreeding-Britain-causing-massive-surge-birth-defects.html

  ReplyDelete
 3. హిందూ యువకుడు తన మేనమామ కూతురిని పెళ్ళి చేసుకున్నా పుట్టబోయే పిల్లలకి జన్యుపరమైన సమస్యలు వస్తాయి. Inbreeding వల్ల వచ్చే సమస్యలు వరసలకి పరిమితం కావు. మనిషికి జన్యువులు 50% తల్లి నుంచి, 50% తండ్రి నుంచి సంక్రమిస్తాయి. ఈ విషయం తెలియకే ఇందియాలో చాలా మంది తండ్రి తరపు బంధువర్గాన్నే వంశం అనుకుంటారు కానీ తల్లి తరపు బంధు వర్గాన్ని కాదు. ఇలా అనుకోవడం వల్లే ఇందియాలో తల్లి తరపు బంధువుల (మేనమామల) పిల్లల్ని పెళ్ళి చేసుకోవడానికి అనుమతిస్తారు. కానీ సత్యం అనేది మత నమ్మకాల ఆధారంగా నిలవదు.


  ReplyDelete
 4. *హిందువులలో కజిన్ మేరేజెస్ నిషిద్ధం అని చెప్పి ముస్లింలలో కూడా వాటిని నిషేధిస్తే ముస్లింలకి బాధ కలుగుతుంది*
  కామన్ సివిల్ కోడ్ గురించి చాలా చర్చలు టివి లో విన్నాను. అక్కడ మాట్లాడిన వారెవ్వరు ఈ చట్టం వస్తే మేము కజిన్ పెళ్లి చేసుకొనే అవకాశాం మిస్ అవుతామని బాధ పడలేదు. మీకెందుకో చాలా బాధగా ఉంది. కందకు లేని దురద కత్తి పీఠ కెందుకు? ఆ లింక్ ఇంచ్చింది అభివృద్ది చెందిన యురోప్ లో ఉంట్టూ కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తునందుకు, అక్కడి ప్రభుత్వం వాళ్లు ఎలా ప్రతిస్పందించారు అని చెప్పటానికి.ఇది 2008 సంగతి. ప్రస్తుతం లండన్ ప్రభుత్వం ఒకడుగు ముదుకు వేసింది. పాకిస్థాన్,బంగ్లాదేశ్ ముస్లిం లు శెలవులలో వారి ఊరికి వేళ్లి, పెళ్లి చేసుకొని వస్తే వారిపైన అక్కడి ప్రభుత్వం ఒక కన్ను వేసిపెడుతున్నాది.

  ఇంకొక విషయం. ఇక్కడ కొంతమంది మనదేశంలో వివాహాలను, పాశ్చత్య దేశాల లో వివాహాలతో పోలుస్తూ మాట్లాడుతున్నారు. సాధారణం గా తెలుగులో కాల్పనిక సాహిత్యం రాసే రచయితలు ఇటువంటి వాదన వినిపిస్తూంటారు.వాస్త్వమేమిటంటే మనదేశంతో పోలిస్తే, పాశ్చత్యదేశాలలో పెళ్లి చేసుకొనేవారుచాలా తక్కువ. అక్కడ పెళ్లి ఎప్పుడో అవుట్ డేటేడ్ అయ్యింది. కుటుంబ వ్యవస్థ ఎప్పుడో కుంటిది కావటం మొదలైంది, ఇంట్లో
  టి.వి. ల సంఖ్య కన్నా భర్తల సంఖ్య తక్కువ, పిల్లలకి రోల్ మోడల్ లేదని యు.కె. లో మంత్ర్లు వాపోతూంటారు. అమెరికా పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు.
  More people in the United States are apparently leaving wedding rings sitting in jewelry stores, as new data shows a majority of American adults are now single.

  Specifically, about 50.2 percent of American adults over the age of 16 – roughly 124.6 million people – were single in August, according to a new Bureau of Labor Statistics report cited by Bloomberg. This marks the first time that single Americans make up the majority of the adult population since the government began tracking the data 38 years ago.

  http://rt.com/usa/186516-singe-americans-majority-marriage/

  ReplyDelete
 5. ప్రతీ దాంట్లో తన పెళ్లి తీసుకు వస్తాడు ప్రవీణ్!
  ఇంకొందరు తాము అసలు శాస్త్రాలలో పునీతులం కాబట్టి అన్న చెల్లెళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అన్నట్టు మాట్లాడుతారు, ఇక్కడ శాస్త్రాలలో హైందవ శాస్త్రం రాదు కేవలం అబద్దపు శాస్త్రాలు వస్తాయి.
  ఇక common civil code అంటే అందరికీ ఒకటే న్యాయం అని.
  ఉదాహరణకు
  అందరం ఒకటే రకం వస్త్రాలు కట్టుకోవాలి అన్నది ఒకటి కావొచ్చు!
  బహు బార్యత్వం బహు భర్తుత్వం ఉండకూడదు ఇంకొకటి కావొచ్చు!
  తన భర్త ద్వారా కానీ తన భార్య ద్వారా కానీ మాత్రమె పిల్లలు కలగాలి అన్నది ఇంకొకటి కావొచ్చు!
  అందరూ ఒక బాల్చీ నీటితో మాత్రమె స్నానం చెయ్యాలి అన్నది కావొచ్చు!
  అందరూ ఇంట్లో మొక్కలు పెంచాలి అన్నది కావొచ్చు!

  ReplyDelete
 6. చర్చ అటు తిరిగి ఇటు తిరిగి ప్రవీణూ వావి వరసలూ, పెళ్ళి చేసుకోవటం మేనత్తను చేసుకోవటం దగ్గిరకే వచ్చింది?!ముందసలు ప్రవీణుకి పెళ్ళి చేశెయ్యాలి!అప్పుడు గానీ ఒక దారికి రాడు!మాంఛి గయ్యాళిని చూస్తే మరింత బెటరు, యేమంటారు?!

  ReplyDelete
 7. సామాజికాంశాలు వ్యక్తిగతం కావు. నాకు పెళ్ళైనా కూడా కజిన్ మేరేజెస్ విషయంలో ముస్లింలని సమర్థిస్తాను.

  ReplyDelete
 8. మేనమామ కూతురిని పెళ్ళి చేసుకునే హిందువులు పెదనాన్న కూతురిని పెళ్ళి చేసుకునే ముస్లింలని అనాగరీకులు అంటే "జంగమయ్య వచ్చి దాసరిని వెక్కిరించినట్టు" ఉంటుంది. ముస్లింలకి శ్రీరంగ నీతులు చెప్పే ముందు మన లెవెల్ ఏమిటో ఆలోచించుకోవాలి.

  ReplyDelete
  Replies
  1. ఇక్కడెవరయినా నువ్వు తప్ప ముస్లిముల ముందు కెళ్ళి మీరు పెద్నాన్న కూతుర్ని చేసుకోవడం మానేసి మాలాగా మేనమామ కూతుర్ని చేసుకోమని వొత్తిడి పెదుతున్నారా?నువ్వే కదా అంటున్నావు హిందువులు కూడా మౌస్లిముల లాగా పెదనాన్న కూతుర్ని చేసుకోవచ్చు గదా అని.ఇప్పుదు నీ సామెత - జంగమయ్య వచ్చి దాసరిని వెక్కిరించినట్టు- లో జంగమయ్యా నువ్వే దాసరివీ నువ్వే, అర్ధమయిందా? ఇంకా విదమరిచి చెప్పాలా?

   యెవరు యెవరికి శ్రీరంగనీతులు చెప్తున్నారు?

   Delete
  2. జిన్ మేరేజెస్ విషయంలో ముస్లింలని సమర్థిస్తాను
   >>
   దానికి వున్న శాస్త్రీయమయిన పునాది యేమిటి?ఒక చోట పెరిగిన మతాచారాల్ని పాటించే ఒక గ్రూపు మేనమామ కూతుర్ని, మరొక చోట పెరిగిన మాతాచారాల్ని పాటించే మరొక గ్రూపు పెదనాన్న కూతుర్నీ చేసుకుంతే ఈ రెండు అంశాల్లో - పెదనాన్న కూతుర్ని చేసుకోవదానికీ మేనమామ కూతుర్ని చేసుకోవదానికీ - ఆధునిక విజ్ఞాన శాస్త్రం దేన్ని సమర్ధిస్తునదనేది నీకు తెలుసా?నువ్వు యే శాస్త్రీయ పునాదిపైన ముస్లిము సాంప్రదాయాన్ని సమర్ధిస్తున్నావు?

   Delete
  3. ముస్లింలని అనాగరీకులు
   --
   మా మాటల్ని తప్పుగా అర్ధం చేసుకుని పదే పదే నువ్వు అంటున్నావు తప్ప మేమెవరం ఆ మాట అనలేదు!యెదటివాళ్ళు అనని మాటల్ని అంతగట్టి మాట్లాడతం అనే తప్పు పదే పదే చేస్తున్నావు, అది మర్యాదా భంగమని తెలుసా తెలియదా?

   Delete
 9. మన హిందువులు ఏ అతీంద్రియ శక్తుల్నీ నమ్మని భౌతికవాదులన్నట్టు శాస్త్రం గురించి అడుగుతున్నావు. మనిషి జీవితాన్ని మతం నిర్దేశించనప్పుడు ఒక హిందువు తన పెదనాన్న కూతురిని పెళ్ళి చేసుకున్నా వేరే హిందువులకి అభ్యంతరం ఉండకూడదు.

  ReplyDelete
  Replies
  1. తిన్నగా అడిగిందానికి సూటిగా జవాబు చెప్పకుండా దొంకతిరుగుడు జవాబు యెందుకు?ఈ తింగరి తనం నా దగ్గిర కాదు, హిందూ అనేదానికి విరుధ్ధంగా యేది వుంటే అదల్లా నచ్చుతుందా?
   అట్లా అయ్యేటట్లయితే నువ్వొక్కడివీ ఆ మతం పుచ్చుకుంటే సరిపోతుంది, యే వాదనలూ అక్కర్లేదు?

   నువ్వు సూటిగా జవాబు చెప్పాల్సిన ప్రశ్న ముస్లిములు పెదనాన్న కూతుర్ని చేసుకోవడాన్ని యే శాస్త్రీయత ప్రకారం సమర్ధిస్తున్నావు అనేదానికి.అది చేసాక వాదన పొడిగించవచ్చు.

   Delete
  2. మన హిందువులు??
   >>
   యెంత ఘోరం జరిగిపోనాది!ప్రవీణు బాబు కూడా హిందువేనా?కమ్యునిష్తు కాడా?

   Delete
  3. మతానికి భౌతిక ధర్మంతో సంబంధం లేదు. ముస్లింలు కజిన్ మేరేజెస్ చేసుకోవడం తప్పు కానప్పుడు హిందువులు కూడా కజిన్ మేరేజెస్ చేసుకోవడం తప్పు కాదు. హిందువులు కజిన్ మేరేజెస్ చేసికున్నా వేరే హిందువులకి అభ్యంతరం చెప్పే హక్కు లేదనేది నిజం కాదా?

   Delete
  4. This comment has been removed by the author.

   Delete
  5. 1.మతానికి భౌతిక ధర్మంతో సంబంధం లేదు.
   ??
   లేదని యెవరన్నారు?మతం ఆ సామాజము యొక్క సామూహిక ఆధ్యాత్మికత అనినేను ఘోషించితినే చెవెకెక్కనే లేదా?హిందువుల్ల్లోనూ ముస్లిముల్లోనూ పెళ్ళిలో వుందే ఆచారాలు అన్నీ మతానికి సంబంధించినవే అని అంత స్పష్టంగా వుంటేనూ!

   2.ముస్లింలు కజిన్ మేరేజెస్ చేసుకోవడం తప్పు కానప్పుడు హిందువులు కూడా కజిన్ మేరేజెస్ చేసుకోవడం తప్పు కాదు.
   >>
   వారు వీరై వీరు వారయితే అస్సలు తప్పు కాదు?! లేదంటే ముస్లిములని పెదనాన్న కూతుర్ని చేసుకోవడం మానిపించు, అప్పుదు ఇదీ తప్పు కాకుండా వుంతుంది!అంతవరకూ మళ్ళీ ఈ ప్రశ్న వేసావో నీ తల వెయ్యి వక్క లవుతుంది!ఇదే నా శాపం?!

   3. హిందువులు కజిన్ మేరేజెస్ చేసికున్నా వేరే హిందువులకి అభ్యంతరం చెప్పే హక్కు లేదనేది నిజం కాదా?
   >>
   అభ్యంతరం తప్పకుండా వుంటుంది!యెందుకుందగూడదూ అంట!నువ్వు ముస్లిముల్ని మార్చిరా పెదనాన్న కూతుర్ని చేసుకోవదం ఆపి అప్పుదు మమ్మల్ని అడుగు, అస్సలు అభ్యంతరం చెప్పం.(యెందుకంటే ముస్లిముల ముందు ఈ రకం కూతలు కూసిన మరుక్షణం నిన్ను మక్కాకి పంపించేస్తారు మళ్ళీ వొచ్చి అదగటానికి నువ్వుందవుగా క్కీ క్కి క్కి)

   Delete
 10. ప్రవీణ్ మాట్లాడుతున్నప్పుడు వేరే ఎవరూ మాట్లాడక్కర్లేదు, అన్ని రకాలుగా మాటలు మారుస్తాడు!
  అందుకే నేను నా అభిప్రాయం వ్రాసేశాను, ఇక ఈ టపా ఎందుకు చూసాను అంటే వేరే ఎవరైనా అసలు ఒకే సామాజిక నిభందన గురించి వేరే అభిప్రాయం వ్రాస్తారేమో అని!

  ReplyDelete
 11. అయ్యా పట్టువదలని విక్రమార్కులారా. మీకందరకూ నా నమస్కారాలు. మీ‌కు ప్రవీణ్‌తో వాదించేందుకు ఉన్న అనంతమైన ఓపికకు మరిన్ని వందనశతాలు.

  కం. వలదని చెప్పిన వినరే
  విలువగు సమయమ్ము నెల్ల వెచ్చించెదరే
  కలబడి మీరు ప్రవీణుని
  గెలుచుట జరిగెడిది కాదు గెలుపతనిదే.

  ఆ.వె. అతని మాట వేద మతనికి మీమాట
  పొల్లుమాట కనుక చెల్లదనుచు
  తెలిసికూడ మీరు దినదినంబును
  వాదమునకి దిగుట మీది తప్పు.

  కొండలరావుగారూ, ఈ‌ ప్రజబ్లాగుకు ప్రవీణ్ కుమార్ ఒక deterent or repellent లాగా ఉంటున్నారు తప్ప మేలు చేకూర్చుతున్నారని నేను అనుకోలేకపోతున్నాను. సుదీర్ఘ చర్చలు అవీ‌ చక్కెర్లు కొట్టుకుంటూ విసువు పుట్టిస్తున్నాయండి. కనీసం‌ నాకు.

  ReplyDelete
  Replies
  1. ప్రవీణ్ మరికొందరు గురించి ప్రజలో కొంత ఇబ్బంది కలుగుతున్నమాట వాస్తవం. సీతయ్య ఎవరిమాటా వినడన్నట్లుగా ప్రవీణ్ తీరు ఉంటుంది. ఇక మరికొందరు పనిగట్టుకుని ప్రజలో వెకిలి కామెంట్లు ఉంచుతున్నారు. వీటన్నింటినీ రేపటినుండి చూడరు మీరు. ధన్యవాదములు.

   Delete
  2. కొన్ని రోజుల ముందు హరి బాబు సురనేని గారి కామెంట్లు కొన్ని మీరు తిసేసారని హరి బాబు గారు కాస్త అప్సెట్ అయ్యారు. కొద్ది రోజుల ముందు కూడా మీరు ఒకాయన కామెంట్లు తిసేసారని ఆ కమెంటరు ఈ బ్లాగును విడిచి వెళ్ళారు. అప్పుడు కూడా ప్రవీణ్ కుమార్ గారితో వాదనలలో అలా జరిగింది. ప్రవీణ్ కుమార్ గారితో వాదనలలో ప్రత్యర్థులు సహనం కోల్పోవటం తరుచుగా ఈ బ్లాగ్ లో చూస్తున్నాను. అదే సమయంలో మీరు ఆ కామెంట్లు తీసేస్తే ఆ కోపం మీ మీదకు మళ్ళుతుంది. ఇది ఈ బ్లాగుకు, మీకు కూడా నష్టమే. చెప్పాలనిపించి చెప్పాను, తప్పుగా అనిపిస్తే దీనిని డిలిట్ చెయ్యగలరు. నేను ఫీలవను.

   Delete
  3. శ్యామలీయమ్ మాస్టారుగారికి, ప్రవీణ్ మన సీతయ్య! మనకి ఆటవిడుపు! తను అనుకున్నదే రాస్తాడు, అదే నిజమంటాడు అని కొండలరావ్ గారు ఇది వరకే చెప్పారు.

   మనకి సహనం పెరగాడినికి అతను పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇది మీరు కూడా కాదనలేని సత్యం!

   Delete
  4. గొప్ప నిర్ణయం తీసుకున్నారు కొండలరావు గారు . ధన్యవాదములు

   Delete
  5. మీరు వాదించకపోతే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. వ్యక్తి స్వేచ్ఛ పేరు చెప్పుకునే పెట్టుబడిదారీ వ్యవస్థలో మీరు మత నమ్మకాలనే పట్టుకోవాలనుకుంటే మీ వ్యక్తిగత జీవితాలలో మాత్రమే అలా చేసుకోండి కానీ మీరు నాకు సలహాలు ఇవ్వక్కరలేదు.

   Delete
  6. నేను ఎవరి మాట వినకపోవడం కాదు. హిందూ మతంలో కజిన్ మేరేజెస్ నిషిద్ధం కదా అని ముస్లింలలో కూడా వాటిని నిషేధించలేము అని నేను మొదట్లోనే వ్రాసినా శ్రీరాం గారే inbreeding వల్ల వచ్చే సమస్యల పేరుతో సంబంధం లేని చర్చ తెచ్చారు. మేనమామ కూతురితో కలిసి inbreeding చేసినా పుట్టబోయే పిల్లలకి జన్యుపరమైన సమస్యలు వస్తాయి. Inbreeding మంచిది కాదనుకుంటే హిందువులు కూడా మేనరిక వివాహాలు మానుకోవాల్సి ఉంటుంది. Inbreedingకి వరసల విధానంతో సంబంధం లేదు అని మొదట్లోనే నేను చెప్పినా దాని గురించి చర్చ కొనసాగించింది మీరే కానీ నేను కాదు.

   Delete
  7. ప్రవీణ్ గారు, శ్రీరాం గారు ఎవరైనా చెపితే వింటారనిపిస్తోంది. మీరు ఎవరు చెప్పినా వినరు. వాదన అనేది నేర్చుకోవడానికో నేర్పడానికో ఉండాలి తప్ప మన వ్యక్తిగత ప్రతిభాపాటవాలు ప్రదర్శించడానికి కాదు. మీరు రెండో రకం అని మీ వాదనల మొత్తాన్ని సారాంశంగా పరిశీలించి చెప్పవచ్చు. వాద ప్రతి వాదాలలో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మీరు వ్యాఖ్యలు చేస్తారు. కనీసం రివ్యూ చేసుకుని క్షమాపణ చెప్పరు. కులం పేరుతో రివ్యూలు చేస్తారు. ప్రతీదానికి అర్ధం పర్ధం లేకుండా సమైక్యవాదం-విభజనవాదం అంటూ ఎవడికీ అర్ధం కాని లాజిక్ లు తీస్తారు. పెళ్లి - సంబంధాలు - మతాల గోల ఎటు తిప్పీ ఈ మూడింటికి లింక్ అయ్యేలా మీ స్వీయ మానసిక ధోరణల వద్దకే సంబంధం లేని విషయాలను సైతం తీసుకు రాగలరు. మత విషయాలు వ్యక్తిగత విశ్వాసాలు అయినప్పటికీ వాటి ఆధారంగా సామాజిక కట్టుబాట్లు జీవన విధానం ముడిపడి ఉన్నప్పుడు వాటిని డైరెక్ట్ ఎటాక్ చేసి వాటిని నమ్మి జీవితాలు కొనసాగించేవారిని హర్ట్ చేసేలా అదీ ఓ వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసేలా మీ వాదనలు ఉంటున్నాయి. మీరు హిందూ మత విశ్వాసాలను మాత్రమే ఎక్కువగా హేళన చేస్తున్నట్లుగా నాకు అనిపించింది. హిందూ మతంలో పిచ్చ సాంప్రదాయాలపై హిందూ మతానికి చెందినవారే పోరాడి విజయం సాధించిన చరిత్ర ఉంది. అది కొనసాగుతున్నది. ఎప్పటికప్పుడు తప్పుడు సాంప్రదాయాలు తొలగిపోతాయి. వాటికి ఓ నోడల్ పాయింట్ తప్పక వస్తుంది. ఇప్పటికిప్పుడే ప్రవీణ్ అనే వ్యక్తి మెదడుని తొలుస్తున్న సమస్యలను ఆయనకు రిలీఫ్ నివ్వడానికి జనమంతా పొలోమంటూ ఉరికి రారు. ఆ లెక్కన అన్ని మతాలలో పిచ్చ సాంప్రదాయాలున్నాయి. ఏ మతానికి సంబంధించిన పిచ్చనైనా ప్రజలలో విజ్ఞానాన్ని పెంచడం ద్వారా మాత్రమే నిర్మూలించగలం. ప్రవీణ్ అనే ఆన్లైన్ వర్గపోరాట విప్లవ వీరుడు అవసరానికి మించి పదే పదే విసుగొచ్చేలా పోరాడితే లాభం కంటే నష్టం ఎక్కువ. మనం వాదించేది మంచికి లాభం జరిగేలా ఉండాలి తప్ప నష్టం కలిగించేలా కాదు. మీ వ్యాఖ్యలెలా ఉంటాయంటే ఎవడికి నష్టం కలిగినా ఫర్వాలేదు. ఎవడేమనుకున్నా ఫర్వాలేదు. మీరు అనుకున్నదే మీరు వాదిస్తారు. దానికి నా దగ్గర హిడెన్ ఎజెండా లేదంటూ డప్పు కొట్టుకుంటారు. హిడెన్ ఎజెండా అవసరం మేరకు ఉండాలి. బట్టలేసుకోకపోయినా ఏమీ కాదని సైన్స్ చెపుతుంది కాబట్టి బట్టలేసుకోవాలనే సాంప్రదాయాన్ని తూలనాడాల్సిన అవసరం లేదు. బట్టలెంతమేరకు ఎందుకు అవసరమో చెప్పగలిగితే సైన్స్ సాంప్రదాయం ల మేలు కలయిక ప్రజ జీవనానికి మేలు చేస్తుంది. మనిషిలో చైతన్యం పెంచుతుంది. మీ వాదనా పద్ధతిని మీరు అణువంతైనా రివ్యూ చేసుకోరు. మీరు మారరు అనే నిర్ధారణకు వచ్చాకనే నేను కామెంట్ మోడరేషన్ ఉంచాలని నిర్ణయించాను. మీలాంటి వారు మరియు డేర్ 2 రైట్ అంటూ ఆడా-మగా-మాడా అర్ధం గాని తేడాగాళ్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను.

   Delete
  8. శ్రీ గారు మీరు చెప్పినది వాస్తవం. కానీ నేనైతే కామెంట్లకోసం ఈ బ్లాగుని నడపడం లేదు. దశలవారీగా ఈ బ్లాగును మంచి చర్చావేదికగా తయారు చేయగలననే నమ్మకం ఉన్నది. ఆ దిశగా 5% సక్సెస్ సాధించాను. మీ అందరి సహకారంతో మరింత మెరుగ్గా దీనిని తయారు చేయాలి. ఎవారికో కోపం వస్తుందనో, ఎవరో ఎవరిమీదనో అలిగి పోతానంటేనో నేను నిర్ణయాలు మార్చుకోను. ఎవరో అనుకుంటున్నట్లు ఏ ఇజం ప్రచారానికో ఈ బ్లాగు లేదు. ఓ బ్లాగు ద్వారా ఇజాలని ప్రచారం చేయలేము. చేసినా ఆ అవకాశం అన్ని ఇజాలకూ ఉంటుంది. అంత తెలివితక్కువ ఆలోచనలు నేను చేయలేదు. ఏ ఇజమైతే నిజానికి దగ్గరగా ఉంటుందో అది నిలబడుతుంది. ఏ ఇజమైతే కాలానుగుణంగా వాస్తవాలకు అనుకూలంగా మార్పులు గ్రహిస్తుందో ఆ ఇజం నిలబడుతుంది తప్ప ఎవడో బలవంతంగా నిలబెడితే ఇజాలు నిలబడవు. సహజంగా ఎవడి ఇజం ఎవడి ఈగో వాడికుంటుంది. అది మనిషి పెరిగిన వాతావరణాన్ని బట్టి అతనికేర్పడే అత్యంత సహజ లక్షణం. వాటిలో మంచి చెడులను ఆచరణలో బేరీజువేసుకుంటూ ముందడుగు వేయగలవాడే మానసిక ఎదుగుదలను పరిపక్వతను సాధించగలుగుతాడు. ప్రవీణ్ గారు - హరిబాబు గారు .... ఇలా ఎవరినీ నేను వ్యక్తిగతంగా చూడలేదు. పరిచయాలూ లేవు. కానీ అందరివద్దా చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రవీణ్ ని ఈ బ్లాగునుండి తొలగించమని సలహాలు వచ్చినా నేను పాటించలేదు. దానిని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇష్టమొచ్చినట్లు ప్రవీణ్ వాదిస్తానన్నా నేను అనుమతించదలచుకోలేదు. చాలామంది సరయిన కారణాలు లేకుండానే ఈ బ్లాగుకు దూరం అయ్యారు. వారికి అనుకూలమైన వాదనలు మాత్రమే వస్తేనే ఉంటాము లేకుంటే మీ ప్రజ నడవదన్నట్లు నాకు వార్నింగులు ఇచ్చారు. ప్రజ అనేది నా బ్లాగు కాదు. జస్ట్ చర్చావేదిక. తెలియనివి తెలిసినవారినుండి తెలుసుకోవడానికి ఓ వేదిక. ఎప్పటికీ ఎవ్వరికీ అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉండదు కనుక ప్రజ మూతపడే సమస్యే లేదని చెప్పగలను. నాకెవరిమీదా ప్రత్యేక అభిమానాలు లేవు. ద్వేషాలు లేవు. నాకు నచ్చని విషయాలు నేను ద్వేషించే అంశాలు ఉంటాయి. వాటిని నాకు నచ్చిన వ్యక్తులు ప్రేమిస్తున్నా నా అభిప్రాయం వారిపై ద్వేషం ఉండదు కానీ ఆ విషయాలపై ద్వేషం అభిప్రాయంగా చెప్తాను. ప్రజలో అంతా చెత్తే ఉండడం లేదు. చాలా మంచి విషయాలు చాలామంది ద్వారా తెలుసుకోగలుగుతున్నామని చెప్పగలను. అటువంటి వారికి చెత్త అనేది ఆటంకంగా ఉంటున్నదీ నిజం. అయితే సలహాలు ఇచ్చినంత తేలిక కాదు చెత్త నిర్మూలన అనేది. దానికీ ఓ ప్రాసెస్ ఉంటుంది. అది క్రమంగా చూస్తారు మీరు. మీ విలువైన సూచనకు ధన్యవాదములు.

   Delete
  9. @YJsSeptember 29, 2014 at 11:45 PM గారు, మీరన్నది నిజమే. ప్రవీణ్ సీతయ్య అనేదే నా అభిప్రాయం కూడా. ప్రవీణ్ వాదించే పద్ధతి కొంచెం సంస్కారం నేర్చుకుంటే ప్రవీణ్ తన వాదనలోని మంచిని ఎదుటివాడికి అందించగలడు. అది అతని వ్యక్తిగత విషయంగనుక పదే పదే చెప్పి ప్రయోజనం లేదు. అయితే ఇక్కడ గ్రహించాల్సిన వాస్తవం ఏమిటంటే ఆటవిడుపుగా ఉండడానికి ప్రజ నిర్వహించడం లేదు. మన ఆటవిడుపు ఇతరులౌ ఆటంకం కాకూడదు. మనకే సహనం కోల్పోయేలా ఉంటే ఇతరులకూ ఆ ఇబ్బంది ఉంటుంది కనుక చేసేదేమీ లేక కామెంట్ మోడరేషన్ ఉంచుతున్నాను.

   Delete
  10. మా ఊరిలో చాలా మందికి అర్ధం అయ్యింది, అసలు ఏడుతరాలు ఎందుకు చూడమంటారో, కొంతమంది అర్ధం చేసుకునే విధానం బట్టి ఉంటుంది. అసలు ఏడుతరాలు ఎందుకు చూడమంటారు అంటే ఏడుతరాలు మారితే జన్యు సంభందాలు ఒకే తాతిన ఉండే అవకాసం ఉండదు కాబట్టి!
   కొంతమంది తమని తాము విద్వాంసులు అనుకుని ఏడు తరాలు అంటే పెళ్ళికొడుకు తండ్రి పెళ్ళికూతురు తండ్రి దగ్గర బంధువులు కాకూడదు అలాగే పెళ్లి కూతురి తల్లి పెళ్లి కొడుకు తల్లి దగ్గర బంధువులు కాకూడదు అలా ఏడు తరాలు చూసుకున్నారు, కానీ నిజానికి పెళ్ళికొడుకు తల్లి తండ్రి ఏడు తరాలు పెళ్ళికూతురు తల్లి తండ్రి ఎదుతరాలలో ఎవరు దగ్గర బంధువులు కాకూడదు అని అర్ధం చేసుకోలేదు, అందుకే మేనరికాలు మొదలయ్యాయి!
   మధ్యలో ఎవడో ఒక తెలివి తక్కువ వ్యక్తీ, ఒక పెళ్లి లో పుట్టిన అమ్మాయి ఎ రకమైన జన్యులోపాలు లేకుండా పుట్టింది అని అని అందరిచేతా మొదలు పెట్టించాడు!

   ఇది అర్ధమైనా పెద్దమ్మ కూతురితో పెళ్లి అని మితండ వాదం చేస్తే నేనేమి చెయ్యలేను!

   Delete
  11. నా పేరు ప్రస్తావనకు యెక్కువగా వచ్చింది గనక ఒక రెందు విషయాలు చెప్పదలచాను.నాకు ప్రవీణ్ మీద కోపం యేమీ లేదు,తాను కొన్ని మంచి కామెంట్లు వేసినప్పుదు శెభాష్ ప్రవీణ్ అని మెచ్చుకున్నాను కూడా!తింగరి కామెంట్లు వేసినప్పుడు మాత్రం వదలకుండా వెంటాడుతున్నది కూడా సీరియస్ గా చర్చించేవాళ్ళు అలాగే వుండాలి,భిన్నాభిప్రాయం వచ్చినప్పుదు అలా వుండటంలో తప్పు లేదనే వుద్దేసంతోనే అలా చేస్తున్నాను.హాస్యానికి దిగైనా లాస్యానికి దిగైనా అక్కడ పట్తు వదలకుండా మన వాదన వినిపించాల్సిందే ననే వుద్దేశం నాది!

   ప్రవీణ్ స్థానంలో హిట్లర్ ని వూహించుకోండి ఒకసారి?తని ఆర్యజాతి వున్నతమైనదనేది కూడా కొంచెం ఆదమరిచి వింటే నిజమే ననే విధంగా వుటుంది.ఇక్కడ ప్రస్తుతం యే నియంతనూ యెదుర్కోవాల్సిన ప్రమాదం లేని సుఖమయిన పరిస్థితిలో వుండి కూడా ప్రవీన్ అనే అతన్ని నిగ్రహించలేక వెనక్కి తగ్గితే రేపు నిజంగా హిట్లర్ లాంటి వ్యక్తి ముందు నిలబడితే తట్టుకోగలమా, చెప్పండి!

   Delete
  12. ఇక ఈ ప్రవీణ్ గొదవ కాకుండా విషయం గురించి నా సొంత అభిప్రాయం చెప్తాను.

   ప్రస్తుతం చట్టంలో సివిల్, క్రిమినల్ అనై రెండు విభాగాలు ఆల్రెడీ వున్నాయి.మీరు యే లాయరు దగ్గిర కెళ్ళి యే కేసు పెట్టాలన్నా "సివిలా,క్రిమినలా" అని అడుగుతాడు, అవునా?క్రిమినల్ అయితే ఆక్కడ మతాలూ, ఆచారాలూ ఇవేవీ పని చెయ్యవు.ఇక సివిల్ కేసుల్లో కూడా కోర్టులకి కావలసింది నేరం, దానికి సంబంధించి తీర్పు లివ్వడానికి అవస్రమయిన క్లాజులు ఇప్పటికే చాలినన్ని వున్నాయి. ఇక ఈ కామన్ సివిల్ కోడు అనేది యెవరికి యెందుకు పనికొస్తుందో దాన్ని ప్రతిపాదించిన వాళ్ళకే స్పష్టత లేదు.

   సమాజంలో యే మతం చెప్పిన ధర్మాన్ని ఆమతం వాళ్ళు నిష్టగా పాటిస్తే చాలు.మతాచార్యులు క్రూరంగా మరీ చాదస్తపు నియమాల్ని జనం మీద రుద్దని వుదారు లయితే చాలు ప్రజలు సుఖంగా వుండటానికి.ఈ కామను సివిలు కోడు అనేది ఆధునిక కాలపు దీన్-ఎ-ఇలాహి మాత్రమే!

   Delete
  13. కొంతవరకు పై వ్యాఖ్యకు కొనసాగింపు, మరింత అసలు ప్రశ్నకు జవాబు ఇచ్చే ప్రయత్నం.

   న్యాయ వ్యవస్తలో (legal system) చట్టం (statute law aka constitutional law) అనేది ఒక ముఖ్యమయిన భాగం అనే విషయం కాదనలేము. అయితే కేవలం అదొక్కటే ముఖ్యం కాదు.

   న్యాయవ్యవస్తకు మరో మూడు (చట్టం కాక) ప్రముఖ ఆధారాలు (sources) ఉన్నాయి: ప్రకృతి పరమయిన న్యాయం (natural law), ధర్మ/మత ఉద్బోధలు (religious law aka caon law) మరియు అనాదిగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు (customary law).

   చట్టం క్రోడీకరించబడి (codified) ఉంటుంది. మిగిలిన వాటిలో ఇది కుదరక పోవొచ్చు. ఈ తేడా మన చర్చకు చాలా ముఖ్యం.

   చట్టాల క్రోడీకరణకు కూడా ఆధారం కావాలి కదా? వ్యక్తిగత విషయాలలో ఇవి చాలా మటుకు మత/ఆచార పరమయిన అంశాలను అనుకరిస్తాయి. సమాజం మొత్తానికి వర్తించే విషయాలకు (ఉ. శిక్షా స్మ్రితి) ఇలా చేయడం కుదరదు.

   Delete
  14. ఆంగ్లేయులు రాకముందు ఇందియాలో హిందువులకీ, ముస్లింలకీ వేరువేరు క్రిమినల్ కోద్స్ ఉండేవి. హిందువులలో బ్రాహ్మణుడు నేరం చేస్తే అతనికి తక్కువ కాలం చెరసాల శిక్ష, శూద్రుడు నేరం చేస్తే అతనికి ఎక్కువ కాలం చెరసాల శిక్ష పడేది. చట్టం ముందు సమానత్వం అనే కాన్సెప్త్ మనజి ఆంగ్లేయుల కాలంలో వచ్చింది. సివిల్ చట్టాలు ఇప్పటికీ హిందువులకీ, ముస్లింలకీ వేరుగానే ఉన్నాయి. హిందువులలో కజిన్ మేరేజెస్‌ని చట్టం గుర్తించదు. కానీ భౌతిక ధర్మానికి మతంతో సంబంధం లేదు. ముస్లింలు కజిన్ మేరేజ్ చేసుకుంటే పాపం అంటుకోదనీ, హిందువులు అటువంటి వివాహం చేసుకుంటే పాపం అంటుకుంటుందనీ అనుకుంటే అది మూఢనమ్మకాలని ప్రోత్సహించడమే అవుతుంది.

   Delete
  15. కామన్ సివిల్ కోద్ లోకి యే లిష్టుల్ని తీసుకు రావాలి?

   customary laws అనేవి ఖచ్చితంగా ప్రాంతాన్ని అంటిపెట్టుకుని వుంటాయి!వీట్ని కలపాలని చూస్తే యేదో ఒక ప్రాంతానికి సంబంధించిన వాటిల్లో ఒకటో రెండో సూత్రాల్ని యెత్తి తీసుకోగానే - ఆ ప్రాంతం వాళ్ళకి ఆధిపత్యం అంటగట్టబడుతుంది!కాబట్టి వీటితో కామన్ సివిల్ కోడ్ యేర్పరచటం జరిగే పని కాదు.

   religious laws అనేవి ఖచ్చితంగా మతపెద్దల అధీనంలోనే వుంటాయి గాబట్టి మతపెద్దలు తమ మతానికి సంబంధించిన ప్రత్యేకతనే అధికంగా కోరుకుంటారు గాబట్టి వీటితో కామన్ సివిల్ కోడ్ యేర్పరచటం అస్సలు కుదిరే పని కాదు.

   natural laws అనేవి యేవడికీ అక్కర్లేని అంతగా పట్టించుకోని వాటితో కూడి వుంటాయి గాబట్టి వీటితో కామన్ సివిల్ కోడ్ తేర్పరచవచ్చు గానీ వీట్ని పాటించే వాళ్ళు యెంతమంది?

   Delete
  16. హిందువులలో కజిన్ మేరేజెస్‌ని చట్టం గుర్తించదు.
   >>
   మళ్ళీ అదే గోల!నేను చెప్పలే?అదే పరిష్కారం!!

   Delete
  17. హరిబాబు గారూ, natural rights చాలా ముఖ్యం. ఒక మనిషికి జన్మతః సంక్రమించే హక్కులు ఉంటాయన్నది వీటి సారాంశం (e.g. right to human dignity). అయితే ఇవేవీ సివిల్ కోడ్ పరిధిలో రావు.

   నా ఉద్దేశ్యంలో సివిల్ విషయాలను మతపరంగా ఉండనిస్తూనే మతపెద్దల సహాయంతో సంస్కరణలు చేయొచ్చు. ఉ. నమూనా నికానామా.

   Delete
  18. @jai
   అయితే ఇవేవీ సివిల్ కోడ్ పరిధిలో రావు
   ..
   నా వుద్దేశం కూడా అదే, కొంచెం లూజ్ గా చెప్పాను.వీటి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

   Delete
  19. @Hari Babu Suraneni:

   I agree 100%.

   Most of the common civil code "supporters" are the same group that "oppose appeasement"! The entire debate is driven by ill-informed opinions floated for shallow political benefits.

   Delete
 12. అయితే ఇక్కడ గ్రహించాల్సిన వాస్తవం ఏమిటంటే ఆటవిడుపుగా ఉండడానికి ప్రజ నిర్వహించడం లేదు.
  >>
  కొండలరావుగారు, 'ప్రజ ఆటవిడుపు కోసం నిర్వహిస్తున్నారు' అనే అర్ధం వచ్చేలా నా వ్యాఖ్య వుంటే మన్నించండి. నా ఉద్దేశ్యం అది కాదు.
  ప్రజ లో కొన్ని విషయాల చర్చలో, ప్రవీణ్ గారు చేసే కొన్ని వ్యాఖ్యలు మనకు ఆటవిడుపు.

  ఒక ప్రశ్న దాని సమాధానం/చర్చ నుండి మనం ఎంతో కొంత నేర్చుకుంటాం - ఎవరు కాదన్నా సరే.

  ప్రజ మరిన్ని అర్ధవంతమైన చర్చలతో ఎదుగుతుందని ఆశిస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. మీరు ప్రజని ఆటవిడుపుగా యూస్ చేస్తున్నారనే ఉద్దేశం నాకు లేదండీ. మిమ్ములను బాధపెట్టీంట్లుంటే క్షమించాలి. ప్రజ మరింత అర్ధవంతమైన చర్చలతో ఎదగాలన్నందుకు ధన్యవాదములు. మీరు కోరినట్లు ప్రజ స్థాయిని పెంచేందుకు ప్రయత్నిస్తాను.

   Delete
 13. ప్రజ చర్చావేదిక యొక్క దృక్పధం విషయంలో ఎవరికీ అనుమానా లున్నాయనుకోను. ఈ వేదికలో జరిగే చర్చలను నేను ఆసక్తిగా గమనిస్తూనే ఉంటాను. రాజకీయాలపట్ల వైముఖ్యం కారణంగా నేను తత్సంబంధిత ప్రశ్నలపై చర్చలకు దూరంగా ఉంటున్నానని మీకు లోగడనే విన్నవించాను. కొన్నికొన్ని చర్చలలో ప్రస్తుతం తీరికలేని ఉద్యోగసంబంధమైన పనులవల్ల పాల్గొనలేకపోతున్నాను. కొన్ని చర్చలు ప్రవీణ్ చేస్తున్న గలాభాకారణంగా అనవసరంగా వేడేక్కుతూ ప్రక్కదారి పడుతుంటే వాటిలో దూరి మట్లాడేందుకు సాహసించలేకపోతున్నాను. ప్రవీణ్ పట్ల నాకేమీ వైరభావం లేదు. కాని ప్రవీణ్ కొంచెం అనవసర ప్రసంగాలు తగ్గించుకుని చర్చావిషయానికి కట్టుబడితేనూ, అందరికీ ఇబ్బంది కలిగించేలా తన వ్యక్తిగత విషయాలు ప్రస్తావించకుండా ఉంటేనూ, తరచూ ఆవుకథలోకి వచ్చే పిల్లాడిలా కొన్ని విషయాల్లోకే అన్ని సంగతుల్నీ మళ్ళించాలని తాపత్రయపడకుండా ఉంటేనూ చాలా బాగుంటుంది. కాని అవేవీ జరిగే అవకాశం కనిపించటం లేదు. మీరు కామెంట్లను మోడరేట్ చేయటం అనేది - అందరికీ ఇదే దారి అని చివరకు మీరూ నిరూపించటమే. కాని వేరే దారి కనిపించనప్పుడు తప్పదు మరి.

  ReplyDelete
  Replies
  1. :)) ఇంతకంటే ఏమి చేయాలో అర్ధం కాలేదండీ.

   Delete
 14. ఆ మధ్య తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు (ఆయన కూడా బ్లాగరే) సాక్షి పత్రికలో వచ్చిన ఒక వార్తపై అభ్యంతరం చెపుతూ ఒక టపా వ్రాసారు. ఆ వార్త ఒక జూలో inbreeding వల్ల తగ్గిపోతున్న పులుల సంఖ్య గురించినది. సాక్షివాళ్ళు inbreedingకి తెలుగు సమానార్ధం తెలియక దానికి అనువాదంగా మేనరికం అనే పదాన్ని ఉపయోగించారు. Inbreeding అంటే ఒక ప్రాణి తనకి దగ్గర సంబంధం ఉన్న ఇంకొక ప్రాణితో సంపర్కం చేసి పిల్లల్ని కనడం. దానికి హిందూ మతంలో ఉన్న మేనరిక వివాహ ఆచారంతో సంబంధం లేదు. ఇదే విషయం తాడేపల్లి గారు కూడా చెప్పారు. "మేనరికం అనేది హిందూ మతంలో ఉన్న ఒక ఆచారం. దగ్గర బంధువుల మధ్య జరిగే వివాహాలు అన్నీ మేనరికాలు కావు. కనుక inbreedingకి అనువాదంగా మేనరికం అనే పదాన్ని ఉపయోగించకూడదు" అని తాడేపల్లి గారు అన్నారు.

  Inbreeding వల్ల పుట్టిన పిల్లలకి జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలియక ఇప్పుడు కూడా దగ్గర సంబంధం ఉన్న జంతువులని జత కట్టేసి వాటి ద్వారా పిల్లల్ని పుట్టిస్తుంటారు. మనుషులైనా సరే దగ్గర సంబంధం ఉన్నవాళ్ళని (మేనమామ పిల్లలనైనా, పెదనాన్న పిల్లలనైనా) పెళ్ళి చేసుకుంటే పుట్టబోయే పిల్లలకి జన్యుపరమైన లోపాలు వస్తాయి. దూరపు బంధువుల్ని పెళ్ళి చేసుకుంటే పిల్లలు లోపాలతో పుట్టే అవకాశాలు తక్కువ. కులాంతర వివాహం చేసుకున్నవాళ్ళకి అటు వంటి సమస్య వచ్చే అవకాశాలు ఇంకా తక్కువ. ఈ విషయం మన పూర్వికులకి తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు కూడా జూ ఉద్యోగులు తెలియక inbreeding ద్వారా జంతువులని పుట్టిస్తున్నప్పుడు inbreeding వల్ల వచ్చే సమస్యల గురించి మన పూర్వికులకి తెలుసనుకోలేము.

  మన బ్లాగర్లలో కొంత మంది "Inbreeding వల్ల సమస్యలు వస్తాయనే హిందూ మతంలో కజిన్ మేరేజెస్‌ని నిషేధించారు" అనే అర్థంతో మాట్లాడుతున్నారు. కులాంతర వివాహాలు చేసుకోవడం వల్ల జన్యుపరంగా perfect సంతానాన్ని కనొచ్చు. మరి హిందూ మతం కులాంతర వివాహాలని ఎందుకు ప్రోత్సహించలేదు?

  Regarding cousin marriages, it is not a congisable offence. Police would write FIR only by complaint in such cases. If no one complains to police in such case, the couple would have no problem with their marriage. If capitalism really grants individual freedom, no one should spill venom on those couples who are cousins, even if they are from Hindu background.

  ReplyDelete
  Replies
  1. ఎవరూ వారి మీద విషం జల్లట్లేదు, వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల ఆడపిల్ల జన్యు పరమైన ఇబ్బందులు ఎక్కువ పడుతుంది అని చెబుతున్నాం!
   వాళ్ళు అలా చేసుకుంటే నీకేంటి బాధ అని నన్ను అడగ వచ్చు, పుట్టిన పాప జన్యులోపాలతో పుడితే చూసే నాలాంటి వాళ్లకు బాధ అందుకే నేను అవి ఒప్పుకోను!
   ఇప్పుడు కాలంలో మేనరికాలు చాలా తగ్గాయి.
   ఇక కులాంతర వివాహాల దగ్గరికి వస్తే అసలు వాళ్ళ జన్యు సంభంధం వీళ్ళతో ఎలా కలుస్తుందో చెప్పగలరా?
   ఎదో కొన్ని కుదిరాయి అని అన్నీ కుదురుతాయి అనుకోవడం అవివేకం!

   Delete
 15. కొండల రావు గారు,
  ఈ క్రింద వీడియో లో యునిఫాం సివిల్ కోడ్ గురించి చర్చించటం జరిగింది. ఈ లింక్ ను ఇక్కడ ఇంతక్రితం ఇచ్చినట్లు గుర్తు. ఆ వీడియోను ఎవ్వరు చూసినట్లు లేదు. బహుశా అందుకే పాత ప్రశ్నను మళ్ళి వేసినట్లున్నారు.
  https://www.youtube.com/watch?v=qWJlS04PYlE

  సుబ్రమణ్య స్వామిప్రకారం సుప్రీం కోర్ట్ యునిఫాం సివిల్ కోడ్ ను సాధ్యమైనంత త్వరగా, అమలు చేయవలసినది గా ప్రభుత్వాన్ని కోరింది. అక్కడ జరిగిన చర్చ ఎక్కువ భాగం వారసత్వం పైన చర్చ జరిగింది. అందులోను అమ్మాయిలకు ఆస్థిలో భాగం కూడా చర్చించించారు. ఈ యునిఫాం సివిల్ కోడ్ వచ్చేలోగా ముస్లిం మహిళలకు, పురుషులతో సమానంగా ముస్లిం మహిళల వారసత్వం హక్కుల పై సుబ్రమణ్య స్వామి కేరళ హైకోర్ట్ లో కేసు టేకప్ చేయటం జరిగింది. ఆయన మహిళల తరపున వాదిస్తున్నారు.
  The Kerala High Court on Thursday impleaded BJP leader Subramanian Swamy as an additional respondent in a writ petition for equal inheritance right to Muslim women

  http://www.thehindu.com/news/national/hc-impleads-swamy-in-muslim-inheritance-case/article5326774.ece

  చర్చను ప్రారంభిస్తూ, మొదట్లోనే ప్రవీణ్ కజిన్ మారేజ్ గురించి ప్రస్థావించటం వలన నేను దానికి సంబంధించిన వ్యాఖ్యలు రాయవలసి వచ్చింది. ఇక్కడ గమనించవలసినదేమంటే హిందువులలో కజిన్ మారేజ్ తిప్పికొడితే సౌత్ ఇండియాలో రెండు, మూడు రాష్ట్రాలకే పరిమితం. అలా పెళ్లి చేసుకొంటే జరిగే నష్టాల గురించి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తే పరిస్థితిలో ఎంతో మార్పు ఉంట్టుంది అని నమ్ముతాను. మరి ముస్లిం లో కజిన్ మారేజ్ లండన్ నుంచి ఇండియా వరకు ఉన్నట్లుంది. ఎంతో మంది ఆరోగ్యాలను అది ప్రభావితం చేస్తున్నాది. ఇండియా లో నివసించే వారి సమాచారం నా దగ్గర లేదు. అందుకే లండన్ లో పరిస్థితి ని తెలియజేసే ఆర్టికల్ కోట్ చేశాను.

  ReplyDelete
  Replies
  1. ప్రవీణ్ వ్యాఖ్యలు వరసలు - పెళ్లిల్లు అనేవి కాకుండా భారత ప్రజలందరికీ కామన్ సివిల్ కోడ్ తయారు చేయడమెలా అనేదానిపై మీరు సమాచారం అందించవచ్చు శ్రీరాం గారు. ప్రవీణ్ చెప్పేవాటిలో పనికివచ్చేవి ఏరి వాటికీ సమాధానాలు ఆలోచించవచ్చు. మీరందించిన వీడియో లింకులను వీలుని బట్టి చూస్తాను. నేనుడేది పల్లెటూరు. ఇక్కడ వీడియోలు రావు. ఖమ్మం వెళ్లిన రోజు చూస్తాను. ఈ అంశం చాలా లోతుగా చర్చించాల్సినదని నా అభిప్రాయం. కేవలం ఓటుబేంక్ రాజకీయం కోసం గాక దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచించాల్సినదని నా అభిప్రాయం.

   Delete
  2. శ్రీరాం, నేను రెండుమూడు రాష్ట్రాల సమస్య గురించి మాట్లాడలేదు. హిందూ వివాహ చట్టంలో prohibited degree of relations(నిషిద్ధ వరసలు) మధ్య వివాహం నేరం అని వ్రాసి ఉంది. దాని అర్థం certain types of cousins (చిన్నాన్నలు లేదా పెదనాన్నల పిల్లలు) మధ్య పెళ్ళిళ్ళు మాత్రమే నిషిద్ధం. Close kin marriages (దగ్గర బంధువుల మధ్య వివాహాలు) వేరు, degree of relations (వరసలు) వేరు. ఇందియాలోని ఏ చెట్టు కింద ప్లీదరైనా ఈ విషయం స్పష్టంగా చెప్పగలడు. నాకు ఇంగ్లిష్ వచ్చు కాబట్టి న్యాయశాస్త్ర భాష నాకు స్పష్టంగానే అర్థమవుతుంది.

   Delete
  3. నాకు తెలిసింది చెప్పాను. అంతకుమించి నాకేమి తెలియదు. మీ ఉద్దేశం ఎమిటో అర్థం కాలేదు. మీరు హిందువులలో కూడా చిన్నాన్నలు లేదా పెదనాన్నల పిల్లల మధ్య పెళ్ళిళ్ళ పై నిషిద్ధం ఎత్తివేయాలని అనుకొంట్టూన్నరా? ఇక యునిఫాం సివిల్ కోడ్ ను సుప్రీం కోర్ట్ తొందరగా అమలు జరపమని ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం బిజెపి అధికారంలో ఉంది కనుక వారు ఆపనికి నడుంబిగించక తప్పదు.

   Delete
  4. కొండల రావు గారు,
   నాకు తెలిసిన విషయాలు చెప్పాను. కొత్త విషయాలు తెలిస్తే చెప్తాను.

   Delete
  5. దీనికి సంబంధించి యెవరయినా వారసత్వం, భాగస్వామ్య వొప్పందాలు లాంటివాటికి పరిమితం అయితేనే బాగుంటుంది.అసలు సమస్యాత్మకమయిన విషయాలు కూడా అవే!

   Delete
 16. యూనిఫాం సివిల్‌ కోడ్‌ భారదేశం లాంటి దేశాలకు ఆరోగ్య కరమైనది కాదు. భిన్న మతాలు, భాషలు, సంస్కృతులు ఉన్న దేశంలో యూనీ ఫాం సివిల్‌ కోడ్‌ గురించి ఒక్క మతం వారు తప్ప ఇంకెవరూ మాట్లాడం లేదు. యూని ఫాం సివిల్‌ కోడ్‌ పాటించడమంటే భిన్నత్వాన్ని నోటి మీద కొట్టి నోరు మూపియ్యడమే. అప్పుడు అది ప్రజా స్వామ్యం ఎలా అవుతుంది? అందుకే మనది లౌకీక వాద ప్రజాస్వామ్యం అంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అంటున్నారు. అంటే భిన్న వర్గాలు( జాతులు మతాలు) వారి సాంస్కృతిక ప్రత్యేకతను కాపాడుకుంటూనే ఐకమత్యంగా ఉండ మనే కాని, అఖండం లో కలవ మని కాదు ఎవరు ఏవరిని పెళ్లి చేసుకున్నారు, ఎలాంటి పిళ్లలు పుట్టారు అన్నది ప్రధానం కాదు. రాజ్యం, రాజ్యాంగ స్పూర్తి మనం వప్పుకుంటే దీన్ని అంగీకరించ్చల్సిందే!

  ReplyDelete
  Replies
  1. ముస్లింలలో కజిన్ మేరేజెస్‌కి అనుమతి ఉంది కానీ అవంక్యులర్ మేరేజెస్ (మేనమామ-మేనకోడలు పెళ్ళి చేసుకోవడం) నిషిద్ధం. యూనిఫార్మ్ సివిల్ కోద్ తెస్తే ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలో జరుగుతోన్న అవంక్యులర్ మేరేజెస్‌ని అనుమతిస్తారా లేదా నిషేధిస్తారా? వాటిని అనుమతిస్తే ముస్లింలు అంగీకరించరు. మరి రూల్స్ అనేవి అందరికీ ఒకేలా వర్తించాలి కదా! యూనిఫార్మ్ సివిల్ కోద్ ఉండాలి కానీ భాజపా లాంటి మతతత్వ పార్తీలని దూరం పెట్టి యూనిఫార్మ్ సివిల్ కోద్‌ని రూపొందిస్తే మంచిది.

   Delete
 17. *యూని ఫాం సివిల్‌ కోడ్‌ పాటించడమంటే భిన్నత్వాన్ని నోటి మీద కొట్టి నోరు మూపియ్యడమే*
  ఈ మాటను వెళ్లి సుప్రీం కోర్ట్ వారికి చెప్పుకోవచ్చు.కాని ఇప్పటికే సుప్రీం కోర్ట్ యునిఫాం సివిల్ కోడ్ చట్టంచేయటం చాలా ఆలస్యమైందని ప్రభుత్వానికి చెప్పింది. ముస్లిం లైన మాజి కేంద్ర మంత్రి అరిఫ్ మొహమద్ ఖాన్, జావేద్ అక్తర్ నుంచి మాజి సుప్రీం కోర్ట్ జడ్జ్ మార్కండేయ కట్జు వరకు యునిఫాం లా ను కోరుకొనేవారే!
  http://timesofindia.indiatimes.com/india/Muslim-personal-law-unjust-barbaric-outdated-Markandey-Katju-says/articleshow/43916395.cms

  ReplyDelete
  Replies
  1. మన దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని సమర్థిస్తున్నది భాజపా ఒక్కటే. భాజపా తమది హిందూత్వ పార్తీ అని బహిరంగంగా చెప్పుకుంటోంది కనుక భాజపా ఉమ్మడి నెపంతో హిందూ పౌర స్మృతిని ముస్లింల మీదకి నెడుతుందనుకోవాలి. అలాంటప్పుడు నాస్తికులైనా, సెక్యులరిస్త్‌లైనా ఉమ్మడు పౌర స్మృతిని ఎలా సమర్థిస్తారు? శ్రీమాన్ కట్జూ భాజపాకా అసలీ సూరత్ దేఖా నహీ హోగా!

   Delete
  2. ప్రవీణ్ గారు, బీ.జే.పీ ఎల్లి అంటే మనం పుల్లి అనాలా? బీ.జే.పీ నిర్ణయాల ఆధారంగా నిర్ణయాలు చేయాలా? ఉమ్మడి పౌర స్మృతి అంటే మతపరమైన అంశాలతోనే ఉండాలని రూల్ ఉన్నదా? ఉమ్మడి పౌరస్మృతిని కోరుకోవడమంటే నాన్ సెక్యులరిజమెలా అవుతుంది? అసలు సెక్యులరిజం అంటే ఏమనుకుంటున్నారు మీరు? మతం పేరుతో మానవత్వానికి ఆటంకంగా అడ్డమైన పనులు చేయడాన్ని సమర్ధించడం సెక్యులరిజం ఎలా అవుతుంది?

   Delete
  3. భాజపా ఉమ్మడి పౌర స్మృతిపై ఒక draft తయారు చేసి దాన్ని బయట పెట్టాలి. అందులో హిందూత్వ అనుకూల అంశాలు ఏమీ లేకపోతేనే దాన్ని నమ్మొచ్చు. భాజపాకి అలా draft విడుదల చేసే ధైర్యం ఉందా?

   Delete
  4. ఈ అభిప్రాయం + డిమాండ్ బాగున్నది. అలా చేయకపోతే బీ.జే.పీ అసలు స్వరూపం బయటపడుతుంది. అయినా బీ.జే.పీ వారికి మాత్రమే అనుకూలమైనవి ఉమ్మడి పౌరస్మృతికి ఎలా పనికి వస్తాయి? ఉమ్మడి పౌరస్మృతి ఉండడం అంటే అన్ని మతాలలోని పిచ్చలను రూపుమాపడం అయి ఉండాలి. అలా చేస్తేనే అసలైన లౌకికవాదం అవుతుంది అని నా అభిప్రాయం. ఏది వ్యక్తిగతం? ఏది సామాజికం? అనేది తేల్చడానికి సామాజిక ఆర్ధిక వేత్తలను నిపుణలతో కమిటీ వేసి తేల్చవచ్చు. మత పెద్దలను పిలవాల్సిన అవసరం లేదు. పిలిచి వారి అభిప్రాయాలలో పనికి వచ్చేవి తీసుకున్నా అభ్యంతరం ఉండకూడదు. ఇలా ఓ పద్ధతిని ఏర్పాటు చేసుకుంటే ఉమ్మడి పౌరస్మృతి ఉండడమే దేశానికి మంచిదని నా అభిప్రాయం. బీ.జే.పీ ఎత్తుగడలేమైనా మెజారిటీ మతోన్మాదమైనా - మైనారిటీ మతోన్మాదమైనా దేశానికి ప్రమాదమే. మతం పేరుతో మానవత్వానికి సవాల్ గా ఉన్న వెకిలి అంశాలు ఏ మతంలోనివైనా గర్హించాల్సిందే. అంతే తప్ప ఓట్లకోసం మెజారిటీ మతం వైపు ఒకరు, మైనారిటీలను బుజ్జగించడానికి మిగతావారు వేసే వెధవ వేషాలవల్ల ఉన్మాదులకే మేలు జరుగుతున్నది.

   Delete
  5. కొండలరావు గారు,
   ఆ బిల్లు తయారైతే ప్రభుత్వం మొదట పార్లమెంట్ లో ప్రవేశ పెడుతుంది. అక్కడ చర్చ జరుగుతుంది. ఆ తరువాత వచ్చిన సలహాల ను స్టాండింగ్ కమిటి ముందుకు పరిశీలన వేళుతుంది. అందులో అన్ని పార్టిల సభ్యులు ఉంటారు. వారంతా కలసి చర్చిస్తారు. అంతేకాదు స్టాండింగ్ కమిటి పరిశీలనలో ఉన్నపుడు దేశం లోని సామాన్య ప్రజలలు మైల్ ద్వారా అభిప్రాయం చెప్పవచ్చు. వాటిని పరిఘణలోకి తీసుకొంటారు. ఇవ్వన్ని జరిగి చట్టమైతే, ఆ చట్టం లో నచ్చని అంశాలు ఉన్నాయని పిస్తే కోర్ట్ లో కేసు వేయవచ్చు. ఇంత ప్రాసెస్ ఉంది. ఇక్కడ బిజెపి ఎలా ప్రభావితం చేయగలదు. ముస్లిం ప్రజలపైన బలవంతం గా రుద్ద గలదు?

   అయినా ఆదర్శ పురుషులు ఇలా వాదించటం ఆశ్చర్యంగా ఉంది. వాళ్లు ఒక్కొక్క సందర్భం లో ఒక్కొక్క విధంగా వాదిస్తుంటారు. పురుషదిక్య సమాజం కనుక హిందూ మహిళలకైతే వెస్ట్ లో వలే చట్టాలు అండగా నిలబడాలని బల్ల గుద్దివాదిస్తారు. ముస్లిం సమాజంలో పురుషాదిక్యత లేదా? వాటిగురించి ఎప్పుడు మాట్లాడినట్లు చూడం. ఎంతసేపటికి హిందు మతం లోని చిన్న తప్పులను పెద్ద భూతద్దంలో చూసి గగ్గోలు పెడుతూంటారు. బిజెపి మీద అంత అనుమానం ఉంటే కేరళలో ,బెంగాల్ లో ఇన్నేళ్లు అధికారంలో ఉన్న కమ్యునిస్ట్ లు, ముస్లిం మహిళలకు వారసత్వ హక్కు గురించి చట్టంలో మార్పులు తెస్తే బిజెపి వారెవరైనా అడ్డుకొన్నారా? అక్కడ ఆ పార్టికి ఒక్క యం.యల్.ఏ.సీట్ కూడాలేదు కదా! సుబ్రమణ్య స్వామి ముస్లిం మహిళల తరపున కేసు వాదిస్తున్నందుకు, ఎంతో మంది ముస్లిం లు అభినందనలు,మద్దతు తెలిపారు. ఓటు బాంక్ రాజకీయాలను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్, కమ్యునిస్ట్ లు వారి సమాజంలో ఏ మార్పు రాకుండా ఇంతకాలం అడ్డుకొన్నారు. ముస్లింలకి వారి క్షేమం గురించి వారికి తెలుసు. మంచి మార్పును ఏ పార్టి చేసినా ఆహ్వానిస్తారు.
   ఇక్కడ వాదన వినిపించే గతంలో ఉన్నట్లు న్నారు. వారి దృష్టిలో బిజెపి కి ముస్లిం లు ఓటువేయరనే భావన ఉన్నట్లుంది. వేస్ట్ బెంగాల్ లో బిజెపి పార్టి లోకి కమ్యునిస్ట్ పార్టికి చెందిన ముస్లింలు క్యుకట్టి చేరిపోతున్నారు. అదే విధంగా అసెంబ్లి ఎన్నికలు జరిగే మహరాష్ట్రలో కూడా చేరుతున్నారు. మరి వీరీకి ఆ విషయం తెలుసోలేదో.

   Delete
  6. ఉమ్మడి పౌర స్మృతిపై ఏ పార్తీకీ లేని శ్రద్ధ భాజపాకి మాత్రమే ఉందని ఎలా నమ్మాలి? జంతు బలులు ఇచ్చేవాడు జీవ హింస చెయ్యొద్దు అని చెప్పినట్టు ఉంటుంది ఒక మతతత్వ పార్తీ ఉమ్మడి పౌర స్మృతి గురించి మాట్లాడితే.

   Delete
  7. @Praveen Kumar garu, BJP కి ఇక్కడ ఎవరు సర్టిఫికెట్ ఇచ్చారు? BJP నిజాయితీ గురించి ఇక్కడ చర్చించడం లేదు. విషయం పక్కదారి పట్టేలా చర్చ అవసరం లేదు.
   @ UG SriRam garu,పార్టీల ఓటుబేంకు రాజకీయాలు పక్కనబెట్టి చర్చిద్దాం. ఎన్నికలలో పాల్గొనే అన్ని పార్టీలు దాదాపుగా ఓటుబేంక రాజకీయాలకే పాల్పడుతున్నాయి.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top