మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------------
ప్రశ్న సంఖ్య : 61
అంశం : రాజకీయం
ప్రశ్న పంపినవారు : Palla Kondala Rao
------------------------------------------------

( image courtesy : google )

యోగా హిందువులు మాత్రమే చేయాలా?

గతంలో యోగాసనాలు శాస్త్రీయమా? అంటూ ఓ పోస్టు చూసి ఆశ్చర్యపడ్డాను. ప్రాణాయామం చాలా మేలు చేస్తుంది. ఇతర ఆసనాలవల్ల కూడా ఉపయోగాలున్నాయి. అయితే వీటి శాస్త్రీయతపై ఓ చోట చర్చ జరగడమూ చూశాను. మంతెన సత్యనారాయనరాజు గారు అయితే తేలికగా ఉండేలా సెలెక్టెడ్ ఆసనాలను వాటివల్ల కలిగే ప్రయోజనాలను ఆరోగ్యపరంగా శాస్త్రీయంగా వివరిస్తారు. ఆయన ప్రసంగాలు , వీడియోలు చూస్తే మనకా విషయం అవగతమవుతుంది. 

మన సనాతన ధర్మం, ఋషి సంస్కృతి లేదా సాంప్రదాయాలలో చాలా సైన్స్ దాగి ఉంది. మతాన్ని మితిమీరి విమర్శించడం లేదా అభ్యుదయం పేరుతో ప్రతీదానిని మూఢత్వంగా కొట్టి పారేయడమూ సరయినది కాదు. ఇపుడు యోగాని ఐక్యరాజ్య సమితి వారు గుర్తించారంటున్నారు. ఇటీవలి వరకు ఆక్యుపంచర్ కు కూడా గుర్తింపు లేదు. కొన్ని ముఖ్యమైన జబ్బులకు ఆక్యుపంచర్ ను గ్రీన్ తెరపీగా గుర్తిస్తున్నారు. చైనాలో ఆక్యుపంచర్ కు మoచి ప్రాధాన్యత ఉంది. ఇండియాలో ఆయుర్వేదాన్ని అటకెక్కిస్తున్నారు. చదువుకున్నవారు ఎన్ని సైడెఫెక్టులున్నా ఇంగ్లీషు వైద్యం పై అవసరానికి మించిన మోజుని పెంచుకుంటున్నారు.

ప్రతి వైద్య విధానమూ మంచిదే. వీటన్నికంటే జీవన విధానం ముఖ్యమైనది. జీవనవిధానాన్ని అలవాట్లు శాసిస్తాయి. అందుకే మంచి అలవాట్లను ఆచారాలుగా, సాంప్రదాయాలుగా పెట్టుకోవాలి. ఇప్పటికే ఉన్న సాంప్రదాయాలలో మంచివాటిని సైంటిఫిక్‌గా ప్రూవ్ కాగలిగిన వాటిని కొనసాగించాలి. ఆచరణలో నష్టం కలిగించని వాటిలో సైన్స్ ఇంకా కనిపెట్టలేకపోయినా వాటిలోని అంతరార్ధాన్ని వెలికితీసే పాజిటివ్ ప్రయత్నాలు చేయాలి.

అలాగే గతంలో ఏదైనా దేవుడి పేరుతో చెపితే వింటారని అనేక మంచి విషయాలను హిదూ మత ఆచారాలలో పొందుపరచారు. వీటిలో పరిశీలన, అనుభవం , సైన్స్ దాగి ఉందనడం అతిశయోక్తి కాదు. అనేక అలవాట్ల వెనుక ఉన్న సైన్స్ ని కేవలం అభ్యుదయం అనే మూఢత్వంతో వెక్కిరింపుగా, హేళనగా చూడడం అశాస్త్రీయమే అవుతుంది.

ఐన్‌స్టీన్ లాంటి గొప్ప సైంటిస్టే నేను చదువుకున్నవారి నుండి కొంత , చదువురాని వారి నుండి మరికొంత జ్ఞానం సంపాదించానని వినయంగా చెప్పాడని నా మిత్రుడొకరు చెప్పేవాడు. ఆచరణ ద్వారా ఫలితాలు రాబట్టిన అలవాట్లను, సాంప్రదాయాలను, సదాచారాలను హేళనగా చూడడం కంటే వాటిలో దాగి ఉన్న సైన్స్ ని వెలికి తీయడమే సమాజానికి అసలైన మేలు చేస్తుంది. మతం-దేవుడు వేరు కార్యాచరణలోని సదాచారాలు, సాంప్రదాయాలు వేరు. ఈ రెండింటినీ ఒకేలా చూడడం హ్రస్వదృష్టే కాగలదు.

ఏ మతం పేరుతో చెప్పినా అందులో కార్యాచరణకు మంచి ఉన్న ప్రతీ మంచిని స్వీకరించాలి. అలాగే హిందూ జీవన విధానంలో సైన్స్ నీ స్వీకరించాలి. అదే సందర్భంలో హిందూ జీవన విధానంలో మంచికీ , హిందూ మతమలోని చెడుకీ పొంతన పెట్టి చూడడమూ మంచిది కాదు. ఏ మతానికైనా ఇది వర్తిస్తుంది.

యోగా పేరుతో మత ప్రయోజనాలు పొందుదామనుకునే సంకుచిత ఆలోచనలవల్ల సమాజానికి నష్టం జరుగుతుంది కనుక ఇలాంటి అంశాలలోని సైన్స్‌ని అవి ఏ మతానివైనా సరే వెలికి తీసి అందరికీ పంచాల్సిన అవసరం ఉన్నది. ప్రక్రుతిలో ఉన్నదానినే సైన్స్ కనిపెట్టగలదు. ప్రక్రుతి సిద్ధమైన ధర్మాలతో పరిశీలనగా, ఫలితాత్మకంగా తయారైన మంచి సాంప్రదాయాలు ఏమి చెప్తున్నాయో పరిశీలించి వాటిలోని మంచిని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత సైన్స్ పై ఉందంటే మీరేమంటారు?
*Republished
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం అవినీతి ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కరంట్ అఫైర్స్ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి హ్యూమనిజం
 
Top