రాజకీయాలకతీతంగా ఇంకుడు గుంతలు నిర్మిద్దాం

రాజకీయాలకతీతంగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం ద్వారా భూగర్భ జలాలను కాపాడుకుందామని పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు అన్నారు. శనివారం బోనకల్ మండలం చొప్పకట్లపాలెం బి.సి కాలనీ అంగన్వాడి కేంద్రంలో సంస్థ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతను నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వం పల్లెల్లో ప్రక్రుతిని కాపాడే విధంగా జీవన విధానం ఉండేదని, నేడు విచ్చలవిడిగా ప్రక్రుతి వనరులను ధ్వంసం చేయడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం ద్వారా భూగర్భ జలాలను కాపాడుకోవడం వల్ల త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించాలని, ఈ అంశంపై ప్రభుత్వం ఏమి సహకారం అందజేస్తున్నదో ప్రజలలో చైతన్యం కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. స్వచ్చంధ సంస్థలు, రాజకీయపార్టీలు ఇటువంటి కార్యక్రమాలలో రాజకీయాలకతీతంగా పాల్గొని అందరి భవితకు బంగారు బాటలు వేయాలన్నారు. ప్రక్రుతిని , పర్యావరణాన్ని కాపాడుకోవడానికి గ్రాంఇన ప్రాంతాలలో ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం జరిగేలా అందరూ క్రుషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల ఇ.జి.ఎస్ ఎ.పి.ఒ బోజెడ్ల అప్పారావు, టి.ఆర్.ఎస్ నాయకుడు మండేపుడి శ్రీనివాసరావు, సిపిఎం కార్యదర్శి బొప్పాల అజయ్కుమార్, పల్లెప్రపంచం ఫౌండేషన్ కార్యదర్శి అంజయ్య, డి వై ఎఫ్ ఐ నాయకుడు కొండేటి అప్పారావు, అంగన్వాడి టీచర్ బండి జయమ్మ, వార్డు సభ్యుడు పరిటాల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top