పర్యావరణాన్ని కాపాడుకోకుంటే వినాశనం తప్పదు
- పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు


పర్యావరణాన్ని, ప్రక్రుతి సమతుల్యతను కాపాడుకోకుంటే మానవాళికి వినాశనమే మిగులుతుందని పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు అన్నారు. ఆదివారం బోనకల్ లోని సంస్థ కార్యాలయంలో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ చెట్లపెంపకం, భూగర్భ జలాలను కాపాడుకోవడం, పంటపొలాలను రక్షించుకోవడం, పల్లె సాంప్రదాయాలను కొనసాగించడం వంటి చర్యలద్వారా మానవాళి మనుగడకు దోహదపడేలా మనిషి జీవన విధానం మారాలన్నారు. మనిషికి డబ్బుపై వ్యామోహంతో జీవితంలో అన్నింటా శ్రుతిమించిన వేగం పెరిగిందని ప్రకృతి జీవన విధానానికి, ప్రక్రుతికి దూరమై క్రుత్రిమత్వం పెరిగిందన్నారు. ఈ పోకడలు అత్యంత ప్రమాదకరంగా పరిణమించాయన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలంటే మహాభాగ్యంతో ఆరొగ్యం కొనుక్కోవచ్చనే భ్రమలతో నేటి మానవుడు జీవనం కొనసాగిస్తూ కొత్త కొత్త జబ్బులతో నేస్తం చేస్తూ నిత్య అభద్రతతో జీవిస్తున్నాడన్నారు. భారతీయ సంస్కృతిలోని మంచి సాంప్రదాయాలను కొనసాగించడం ద్వారా తిరిగి ప్రశాంతమైన జీవనవిధానాన్ని, మానవసంబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పల్లెప్రపంచం సభ్యుడు మేడి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, విశ్రాంత అధ్యాపకుడు వజ్రాల పరబ్రహ్మం, పెంటేల వెంకటేశ్వర్లు, కోటి శ్రీధర్, మరీదు రోషయ్య, చలమల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

భూగర్భ జలాలను కాపాడుకోవడానికి గాను ఇంకుడు గుంతలను నిర్మించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి పల్లెప్రపంచం ఫౌండేషన్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. సంస్థ కార్యాలయంలో ఇంకుడు గుంతను నిర్మించడానికి పెంటేల వెంకటేశ్వర్లు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు పల్లా కొండల రావు మాట్లాడుతూ మండల కేంద్రమైన బోనకల్ గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. బోనకల్ గ్రామాన్ని దత్తతు తీసుకుని ఇంకుడు గుంతలను నిర్మించేందుకు ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామంలో వీలైనన్ని ఇంకుడు గుంతలను నిర్మింపజేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, విశ్రాంత అధ్యాపకుడు వజ్రాల పరబ్రహ్మం, పెంటేల వెంకటేశ్వర్లు, కోటి శ్రీధర్, మరీదు రోషయ్య, చలమల అజయ్ కుమార్, మేడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

andhrajyothy
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top