• అటు చదువులో, ఇటు ఉద్యోగాల్లో పోటీ, సమయాభావం, నిద్రలేమి, ఉరుకుల పరుగుల ఆధునిక జీవనం.. ఈ కారణాలతో నేడు ఎంతోమంది మానసిక వత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు అదనపు బాధ్యతల వల్ల మరింత వత్తిడికి లోనవుతున్నారు. 
 • గొంతు ఎండిపోవడం, చెమట పట్టడం, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వత్తిడికి గురవుతున్నట్టే! 
 • కొన్ని జాగ్రత్తల్ని పాటిస్తే వత్తిడిని తగ్గించుకోవచ్చు.
 • సహజ సిద్ధంగా లభించే పదార్థాలనే ఆహారంలో తీసుకోండి. పండ్లు, తాజా కూరగాయలు, మొలకలు, గింజలు తీసుకోండి.
 • ఉదయం విధిగా అల్పాహారం తీసుకోండి. బ్రేక్‌ఫాస్ట్‌గా గుడ్లు తీసుకుంటే మరీ మంచిది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఇవి ఆకలిని సంతృప్తిపరచడమేగాక రోజుకు సరిపడా శక్తిని క్రమక్రమంగా విడుదల చేస్తాయి.
 • లంచ్‌లో కూడా కార్బోహైడ్రేట్ల కన్నా ప్రొటీన్లనే ఎక్కువగా తీసుకునేలా జాగ్రత్త వహిండం అవసరం.
 • తినే ఆహారం ఎక్కువ, తక్కువ కాకుండా ఉండాలి. బరువు తగ్గాలని భోజనం మానేయడం లాంటివి చేయొద్దు. రోజుకి కనీసం అయిదుసార్లు ఏదో ఒక రూపంలో ఆహారం తీసుకోవాలి. అప్పుడే రక్తంలో చక్కెర నిల్వలు సరిపడా వుంటాయి.
 • ఆఫీసులో కిటికీ తలుపులు తెరుచుకుని పనిచేసుకోండి. మూసి ఉన్న క్యాబిన్లలో, ఇరుకు గదుల్లోనూ పని చేస్తే తలనొప్పి రావచ్చు, త్వరగా  అలసిపోవచ్చు. తాజా గాలిని గుండెల నిండా పీల్చడం  వల్ల మనలో ఉత్సాహం, శక్తి రెట్టింపు అవుతాయి.
 • రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. పాలు తాగితే మరీ మంచిది. కనీసం ఎనిమిది గంటలయినా పడుకునేందుకు ప్రయత్నిస్తే, అందులో ఆరు గంటలైనా మంచి నిద్ర దక్కే అవకాశం ఉంటుంది. 
 • మధ్యాహ్నం వేళ కొద్దిసేపైనా చిన్నకునుకు తీయండి. పగటిపూట మరింత ఉత్సాహంగా  పనిచేసేందుకు ఇది దోహద పడుతుంది.
 • కూల్‌డ్రింక్స్, స్నాక్స్ తగ్గించండి. వీటికంటే పాలు, పెరుగు, నట్స్ ఉత్తమం. పెద్ద పెద్ద కప్పుల్లో కాఫీ తాగొద్దు. రోజుకు మూడు చిన్న కప్పులకు మించవద్దు.
 • మంచినీళ్ళు ఎక్కువగా తాగండి. రోజుకి కనీసం 2 లీటర్ల నీరు శరీరానికి అవసరం.
 • ఐరన్ కూడా మీలో నూతనోత్సాహాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మహిళలు తోటకూర, క్యారెట్, బెల్లంవంటివి తీసుకోవాలి. 
 • ఎన్ని పనులున్నా ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాలు నడవండి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగై మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందుతుంది. దీంతో అలసటంతా చేత్తో తీసినట్లుగా మాయమవుతుంది.
(from : - పిఎంఎస్andharabhoomi daily )
*Republished
ఇంతక్రితం పోష్టు కోసం ఇక్కడ నొక్కండి.


Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top