సలహాలు - సంగతులు !

సామెతలు చాలా పవర్ఫుల్. అనుభవం లోనుండి వచ్చిన తిరుగులేని సత్యాలవి. కొన్ని అవుట్ డేట్ అయినవి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంత పవర్ ఉన్న అవుట్ డేటెడ్ కాని సామెతలలో ఒక మంచి సామెత గురించి నా అభిప్రాయాలను మీతో పంచుకుందామని ఈ పోస్టు వ్రాస్తున్నాను.

 " చెప్పేవాడికి వినేవాడు లోకువ

ఈ సామెత ఇప్పటికీ మన సమాజానికి బాగా వర్తిస్తుందని చెప్పవచ్చు. మనం వినాలేగానీ చెప్పడానికి రెడీగా ఉంటారు. వినకపోయినా చెప్పడానికి ఇబ్బంది పెడతారు. ఎందుకు చెపుతున్నామో అర్ధం చేసుకోవాలంటూ దీర్ఘాలు తీస్తారు. నెత్తిమీద రూపాయి పెట్టి అమ్మినా అర్ధరూపాయకు అమ్ముడుపోని మానవులు సైతం తగుదునమ్మా అంటూ సలహాలు ఇస్తుంటారు. అందుకే " ఉచిత సలహాలు " అనే పదం ఆవిర్భవించి ఉంటుంది. అన్ని సలహాలు లేదా అన్ని ఉచిత సలహాలు తప్పుడువే ఉంటాయని కాదు గాని అత్యధికం అలాగే ఉంటాయి.

మనం ఏదైనా పని కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్నామనుకోండి, ఇక వీళ్లు బయలుదేరుతారు. వాళ్ల పనులు మానుకుని, ఇంట్లో తిట్లు తినైనా సరే మన బుర్రలు తినందే వదలరు. అడ్డమైన సలహాలు - నెగిటివ్ మోటివేషన్ కు తమ శక్తిమేరకు కృషి చేస్తారు. ఇలాంటివారి మాటలతో అటు ఇటు కానివాడి పరిస్తితైతే ఇక చెప్పనే అవసరం లేదు. వాడు ఎందుకొచ్చిన గోలరా! భగవంతుడా! అనుకోపోతే ఒట్టు. చేద్దామనుకున్న పనిని మరచిపోయి ఏమి చేయాలో తెలీని స్తితికి చేరుకోవడం ఖాయం. అంత పవర్ఫుల్ మోటివేషన్ ఉంటుందీ గాంగ్ ది.

ఇలాంటివారిలో అందరూ దుర్మార్గులు ఉండకపోవచ్చు. ఇతరులు ఇబ్బంది పడుతుంటే ఓ రకమైన ఆనందం అనుభవించడం కొందరిలో ఉంటే, కొందరు అలవాటుగా ఇలా చేస్తుంటారు. తమకు తోచిందే నిజమని, కొత్తదనంలో రిస్క్ ఉంటుందనే భయంతో అలా ప్రవర్తించేవారూ ఉంటారు. కొత్తదనాన్ని, మార్పును ఆహ్వానించలేని తత్వం అభివృద్ధికి ఆటంకమని చెప్పాలి.

మన సమాజంలో ఈ గేంగ్‌దే మెజారిటీ. నెగిటివ్ మోటివేటర్ల సంఘం పెడితే పబ్లిసిటీ అవసరం లేకుండానే పాపులర్ అవుతుందనవచ్చు. వీరిలో యూనిటీ ఎక్కువ. వీళ్ల మాటలకు సపోర్ట్ చేసేవారు ఎక్కువగా ఉంటారు. వీరిని, వీరి సలహాలను లక్ష్యపెట్టని వారిపై గుస గుసలు , చెవులు కొరుక్కోవడాలు, రూమర్లు వ్యాప్తి చేయడాలు.... వంటి పవిత్ర కార్యక్రమాలు చేస్తుంటారు.ఈ పవిత్ర కార్యక్రమాన్ని ప్రత్యేకమైన ఎజెండాగా పెట్టుకుంటారు కూడా. పట్టువదలని విక్రమూర్ఖులుగా ప్రవర్తిస్తారు. తమ శతృవుపై(?) గోబెల్స్ ప్రచారం చేస్తారు.

వీరేమైనా ఆరితేరి అనుభవాలు చెపుతారా!? అంటే అదీ ఉండదు. పోనీ వీళ్లను మనం నిజాయితీగానే మరి ఆ పని వద్దు ఏమి చేస్తే బాగుంటుందని అడిగితే ఒక్కడూ సలహా చెప్పలేడు. ఆ ఏముంది అందరూ బ్రతకట్లా! అంటూ నిట్టూర్పులు తప్ప చాలా సందర్భాలలో వీళ్లకి తెలిసింది జీరో మాత్రమే.

ఎక్కడో మనసు లోతుల్లో తమకే తెలియని ఈర్ష్య లాంటి ఓ మానసిక స్తితే ఇందుకు కారణమనేది నా అంచనా. ఏదో అంటారే వరిగడ్లో కుక్క సామెత అని అలా ఉంటుందండీ వీళ్లలో కొందరి వ్యవహారం. ఇంకో సామెతా చెప్పోచ్చు "అమ్మ పెట్టదు - అడుక్కు తిననివ్వదూ" అని. ప్రవాహానికి అనుగుణంగా గొర్రెల్లా వెళ్ళేవారే ఏ సమాజం లోనైనా ఎక్కువ మంది ఉంటారు. సాంప్రదాయ బద్ధంగా జీవించడం వరకూ మాత్రం వీళ్లు చేయగలరు. సమస్యలు వస్తే సాహసాలు చేయడం - ఎదురీదడం చేతకాని వీళ్లు అందరికీ అదే సలహాలు ఇవ్వడమే తప్పు. 

అవసరం లేక పోయినా, అడగక పోయినా ఉచిత సలహాలు ఇచ్చేది తమకంటే ఎదుటివాడు ఎదిగితే ఇబ్బందనే ఓ తెలియని మానసిక ఝాఢ్యమే దీనికి కారణం అనుకుంటా. ఇలాంటి వాటిని పట్టించుకోవద్దు ! 1000 సార్లు బల్బును కనుగొనడం లో ఫెయిల్ అయ్యాడంటే థామస్ ఆల్వా ఎడిషన్ ఒప్పుకున్నాడా? 1000 పద్ధతులు బల్బు తయారీకి పనికి రావని కనుగొన్నానూ! అన్నాడు.

యెస్ ! దట్ ఈస్ ద కాన్‌ఫిడెన్స్ !


ప్రతీదీ శాస్త్రీయంగా విశ్లేషించుకుని - తగిన ప్లాన్ చేసుకుని - గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రయత్నించడమే చేయాల్సింది. భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం "చక్కగా అనుష్టించిన పరధర్మము కంటే , గుణము లేని దైననూ స్వధర్మమే మేలు". ఎవడి సలహా వద్దనను కానీ, అవసరమైన సలహాలు మాత్రమే తీసుకోవాలి. అందరిదీ వినాలి. నిర్ణయం మాత్రం మనమే తీసుకోవాలి. అది మంచో - చెడో ఆచరణ ద్వారా లభ్యమయ్యే అనుభవం మాత్రమే డిసైడ్ చేస్తుంది. చరిత్రలో ప్రతి విజేత ఇలాంటివి ఎదుర్కుంటూనే ఉంటాడు. అది విజేతగా ఎదగాలనుకునేవాడికో అవకాశం మాత్రమే.


అడగకుండా సలహాలు ఇచ్చేది ఏ పనీ లేని వాళ్లే అని గుర్తుంచుకోండి !
ఏ పనీ లేని వాళ్లు మనకేమీ చెప్పే అర్హత లేనివాళ్లనీ గుర్తుంచుకోండి !!

అవసరమైనపుడు సలహాలు తీసుకోండి - నిర్ణయం మాత్రం ఆలోచించి మీరే తీసుకోండి . అడిగినవారికి సలహాలు చెప్పండి - ఎట్టిపరిస్తితులలోనూ ఈర్ష్యాద్వేషాలు మనసులో ఉంచుకుని మాత్రం ఎదుటివారిని ఇబ్బంది పెట్టకండి.

- పల్లా కొండల రావు.
--------------------------------------------------
మీరూ 'జనవిజయం' కు రచనలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.ఇంతక్రితం పోష్టు కోసం ఇక్కడ నొక్కండి.
*Republished 
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం అవినీతి ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కరంట్ అఫైర్స్ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి హ్యూమనిజం
 
Top