మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------------
అంశం : భాష
ప్రశ్నిస్తున్నవారు : Philosopher

ఇంగ్లిష్ మాధ్యమ స్కూల్‌లో చదివినంతమాత్రాన ఇంగ్లిష్ సరిగా రాదు. ఇంగ్లిష్ సరిగా రావాలంటే ఫోనాలజీ, ప్రనన్సియేషన్ కూడా సరిగా రావాలి. అయిదు వేల రూపాయల కోసం convent schoolలో ఉపాధ్యాయ ఉద్యోగం చేసేవాడు received pronunciation నేర్చుకుని రాడు. అక్కడ ఇంగ్లిష్ నేర్చుకున్న పిల్లలు native English speakersలాగ మాట్లాడలేరు. 

ఆంగ్లోఫోన్ దేశాలకి చెందిన బ్యాంక్‌లూ, ఇన్షూరెన్స్ కంపెనీలకి హైదరాబాద్, బెంగళూరులలో call centers ఉన్నాయి. ఆ call centersకి ఫోన్ చేసే native English speakers యాస ఆ call center ఉద్యోగులకి అర్థం కాదు, ఆ call center ఉద్యోగుల యాస native English speakersకి అర్థం కాదు. ఏడాదికి 36,000 రూపాయలు (12 ఏళ్ళకి 4,32,000) రూపాయలు ఖర్చు పెట్టి ఇంగ్లిష్ మాధ్య స్కూల్‌లో చదివితే అక్కడ మనం నేర్చుకున్న ఇంగ్లిష్ ఆ భాష యొక్క native speakersకి ఏమాత్రం అర్థం కాదు. 

ఇలాంటప్పుడు మన దేశంలో ఇంగ్లిష్ మాధ్యమ విద్య అవసరమా? మన దేశంలో ఉన్నవాళ్ళకి Indian English అర్థమైపోతుంది. హిందీ వ్యాకరణం & ఫోనాలజీ తెలిసినవానికి హిందీ యాసతో మాట్లాడే ఇంగ్లిష్ అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. మనం మన దేశంలోనే ఏదైనా సెమినార్‌కి వెళ్ళినప్పుడు అక్కడి వక్తలు ఉపయోగించే ఇంగ్లిష్ మనకి అర్థమైపోతుంది కానీ అదే సెమినార్‌కి విదేశీయులు వస్తే మన వక్తల ఇంగ్లిష్ యాస విదేశీయులకి విచిత్రంగా ధ్వనిస్తుంది. 

మన దేశంలో ఎవరూ దైనిక జీవితంలో ఇంగ్లిష్ మాట్లాడరు. మాట్లాడినా మనవాళ్ళ ఇంగ్లిష్ యాస native English speakersకి అర్థం కాదు. అటువంటప్పుడు పిల్లలకి బలవంతంగా ఇంగ్లిష్ నేర్పించే బదులు, మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీ నేర్పించొచ్చు కదా!? 

మనలో చాలా మంది native Hindi speech వినే ఉంటారు. పదుల సంఖ్యలో తెలుగు చానెల్‌లు లేని రోజుల్లో మనం దిల్లీ దూరదర్శన్‌లో హిందీ సీరియల్‌లు చూసేవాళ్ళం కనుక native Hindi speech ఎలా ఉంటుందో మనకి తెలిసే ఉంటుంది. Native English speakersకి ఒక్క ముక్క కూడా అర్థం కాని యాసతో ఇంగ్లిష్ నేర్చుకోవడం వల్ల మనకి రూపాయి ప్రయోజనం కూడా ఉండదు. అటువంటప్పుడు ఇంగ్లిష్ మాధ్యమ విద్య పేరుతో జనాన్ని ఫూల్ చెయ్యడం ఎందుకు? హిందీ మాధ్యమంలో స్కూల్‌లు నడిపితే అంత కంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. 


పిల్లలకి విదేశీ భాషని బలవంతంగా నేర్పడం అవసరమా? మీ అభిప్రాయం?
Reactions:

Post a Comment

 1. వి.వి.గిరి ఇంటి పేరు తెలిసినవానికే గుమాస్తా ఉద్యోగం ఇస్తామనడం ఎలాంటిదో, ఇంగ్లిష్ మాధ్యమంలో చదివినవానికే ఉద్యోగం ఇస్తామనడం కూడా అలాంటిదే. ఇంగ్లిష్ మాధ్యమ స్కూల్‌లో చదివినవానికి మన దేశంలో అయితే ఉద్యోగం దొరుకుతుంది కానీ అరబ్ దేశాల్లోనో, రష్యాలోనో, చైనాలోనో ఉద్యోగం దొరకదు. అరబ్ దేశాల్లో చాలా మందికి ఇంగ్లిష్ రాదు. అక్కడ ఇంజనీరింగ్, మెదిసిన్ కూడా సొంత భాషలోనే నేర్పిస్తారు కనుక ఇంగ్లిష్ రాకపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి సమస్య రాదు. రష్యా, చైనాలలో కొంత మంది ఇంగ్లిష్ మాట్లాడగలరు కానీ అక్కడి స్కూల్‌లలో సొంత భాషే నేర్పిస్తారు. ఇంగ్లిష్ మాధ్యమంలో చదివినవాళ్ళకి అక్కడ ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరు.

  ReplyDelete
 2. ఇంగ్లీషు వద్దనుకోవద్దు. కాని తెలుగును నిర్లక్ష్యం చెయ్యడం చాలా ప్రమాదం. చదువును కేవలం ఉద్యోగం కోసమే అనుకున్నంత కాలం ఇదే పరిస్థితి. పల్లెలకు, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తే ఫలితం ఉంటుంది. ఏమైనా మొదట మార్పు తల్లి తండ్రుల దగ్గర మొదలవ్వాలి.
  gksraja.blogspot.in

  ReplyDelete
  Replies
  1. Native English speakersలో ఎక్కువ మందికి received pronunciation అర్థమవుతుంది. ఐదు వేలు లేదా పది వేల జీతానికి స్కూల్‌లో ఉపాధ్యాయ ఉద్యోగం చేసేవాడు received pronunciation నేర్చుకుని రాడు. Call center ఉద్యోగులకి నెలకి పదిహేను వేలు జీతం ఉంటుంది కనుక స్కూల్ ఉపాధ్యాయుల కంటే call center ఉద్యోగులే మెరుగైన ఇంగ్లిష్ నేర్చుకుని వస్తారు. దైనిక జీవితంలో ఇంగ్లిష్ ఎవరూ మాట్లాడని భారత్ లాంటి దేశాల్లో ఇంగ్లిష్ మాధ్యమ స్కూల్‌లు అనవసరమే.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top