పల్లె సాంప్రదాయాలను కాపాడుకుందాం
- పల్లె ప్రపంచం అధ్యక్షులు పలా కొండల రావు


పల్లెల్లో ఉండే మంచి సాంప్రదాయాలను కాపాడుకోవాలని పల్లె ప్రపంచం అధ్యక్షులు పల్లా కొండల రావు తెలిపారు. ఆదివారం బోనకల్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ గతంలో పండుగ సమయాలలో పల్లెల్లో కనిపించిన ఆనందం నేడు కనిపించకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. మానవ సంబంధాలు, ఆత్మీయతానురాగాలు కూడా గతంతో పోలిస్తే బలహీనపడుతున్నాయన్నారు. మార్కెట్ మాయాజాలం, ప్రపంచీకరణ నేపధ్యంలో మనవైన మనిచి సాంప్రదాయాలను మరచిపోవడం మంచిది కాదన్నారు. భారతీయ పల్లెల ఔన్నత్యాన్ని, మంచి సాంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.కలం నేస్తం జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు మాట్లాడుతూ పల్లెల అభివృద్ధి కోసం, పల్లెటూరి ఔన్నత్యాలను కాపాడడం కోసం పల్లె ప్రపంచం ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సురభి వెంకటేశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, వింజం సుధీర్ కుమార్, రామన అప్పారావు,యడ్లపల్లి పద్మ, బోయనపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
News ClippingsReactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top