మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------
ప్రశ్నిస్తున్నవారు -  Srikanth Chari 
అంశం : పత్రికా స్వేచ్చ, భావ ప్రకటన 

----------------------------------------

Name:Srikanth Chari 
E-Mail:
deleted
Subject:ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బక్కోడు అని సంబోధించడం ఎంతవరకు సబబు?
Message:
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బక్కోడు అని సంబోధించడం ఎంతవరకు సబబు? ఎవరో ఒకరు అలా అన్నా గానీ పత్రికా స్వేచ్చ అంటూ కబుర్లు చెప్పే ఆంధ్రజ్యోతి దాన్ని హెడ్‌లైనుగా వెయ్యడం ఎంతవరకు సబబు?

వార్త కోసం క్రింది లింకు నొక్కండి.
http://goo.gl/ASRroL

Reactions:

Post a Comment

 1. ఎవరైనా అలా అమర్యాదగా సంభోదించడం ఖచ్చితంగా సబబు కాదు. ఆంద్ర జ్యోతి దాన్ని హెడ్ లైన్ గా వేయాల్సిన అవసరం కూడా లేదు. కాని పదికిలోమిటర్ల లోతులో బొంద పెడతా అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వాళ్ళు మాట్లాడడం కూడా సబబు కాదు.దాని స్పందన, ప్రతిస్పందన లే ఇవన్నీ.

  ReplyDelete
  Replies
  1. vkbabu గారు ఆలోచించాల్సిన పాయింటు లేవనెత్తారు. కృతజ్ఞతలు.

   Delete
  2. ముఖ్యమంత్రి తప్పు మాట్లాడితే అలా మాట్లాడకూడదనే అందరం తప్పు పట్టాం. ప్రతీదానికి ఆయనను వెనుకోసుకొచ్చే కొద్దిమంది తప్ప ఆనాడు కే.సీ.ఆర్ వ్యాఖ్యలను ఆయన కుమార్తెతో సహా అందరూ తప్పేనన్నారు. అయితే ఓ పత్రికలో విలువలు పాటించాల్సిన అవసరం లేదా? నేతలు నోటికొచ్చింది వాగితే దానిని ఎలా ఎడిట్ చేయాల్నో పత్రికలకు తెలీదా? కావాలనే కే.సీ.ఆర్ పై మంటతోనే బక్కోడు అనేదానిని లీడ్ చేసి వ్రాశారు ఆంధ్రజ్యోతిలో. ఇది మంచి సంప్రదాయం కాదు. ఎవరైనా నోటిదూలగా వాగడం తప్పు. ఒకవేళ అలవాటుగా భావావేశంలో వస్తే వాటిని పత్రికలు మరింతగా రెచ్చగొట్టడం కాకుండా ఎడిట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. దానిని ఆంధ్రజ్యోతి ఉల్లంఘించిందిక్కడ. ఉల్లంఘించడమే కాదు కే.సీ.ఆర్ పై తమకున్న వ్యతిరేకతను ఇలా శాదిజంగా బయటపెట్టుకున్నది. స్పందన- ప్రతిస్పందన విషయాన్ని బట్టి ఎంతమేరకున్నా చర్చలో ఎవరో ఒకరు నేర్చుకోవచ్చు. ఇలా బజారు గొడవలా వ్యాఖ్యలు చేసుకోవడం దానిని యధాతధంగా ప్రచురించడం తాము చెప్పుకునే దమ్ము క్రిందకు వస్తుందనుకుంటున్నాడేమో రాధాకృష్ణ. ఇది తప్పు.

   Delete
 2. ఆ విధంగా సంబోధించడం చాలా దారుణం.మానవతా విలువలు కాపాడవల్సిన మీడియాయే ఈ స్థిత్ కి దిగజారడం మరీ దారుణం.

  ReplyDelete
 3. తప్పు.
  తప్పు ఎవరు చేసినా తప్పే.
  భారత నీతిని స్మరించండి.
  కం. ఒరు లేయవి యొనరించిన
  నరవర యప్రియంబు తన మనంబున కగు తా
  నొరులకు నవి సేయకునికి
  పరాయణము పరమధర్మపథముల కెల్లన్

  ReplyDelete
 4. అలా ఎవరు సంబోధించారో తెలీదుగానీ. అది ఖచ్చితంగా తప్పే.

  ఆంధ్రజ్యోతివారి (నేలబారు) ప్రమాణాల ప్రకారం దాని వారు ప్రచురించడం సరైనపనే! :-)

  ReplyDelete
 5. media no mso lu ban chesaaru aa paper ni tg janaalu ban chese roju vastundi chdandi

  ReplyDelete
 6. >>> స్పందన, ప్రతిస్పందన లే ఇవన్నీ.

  ఇలాంటి రాతలు ఆంధ్రజ్యోతికి ఇది మొదటి సారి కాదు. ఇటువంటి పక్షపాత పోకడలతో మీడియాను అడ్డం పెట్టుకుని దాడులు చేస్తున్నందుకే ఆ గ్రూపు ప్రజాగ్రహానికి గురైంది. దానికి స్పందనే ఎమేస్వోల బ్యాన్, కెసిఆర్ మాటలు. బ్యాన్ ను వ్యతిరేకించిన మేధావులు సహితం ఆయా పత్రికల తీరుతెన్నులను మెచ్చుకోలేదు, పైగా పధ్ధతి మార్చుకోవాలని స్పష్టంగా చెప్పారు.

  అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రజ్యోతినుండి ఇది ప్రతిస్పందన ఎలా అవుతుంది? ప్రతిస్పందన అంటే తన తప్పులను సరిదిద్దుకునేలా వుండాలి. సరిదిద్దుకొని అప్పుడు తనకు జరిగిందనుకుంటున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. కాని ఇటువంటి 'ప్రతిస్పందన' ద్వారా ఆ మీడియా ఏం చెప్పదలుచుకుంది? మేం ఏమైనా చేస్తాం, మీరు మాత్రం మాకున్న స్వేచ్చ(?)ను గౌరవిస్తూ ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వకూడదనే గదా?

  ReplyDelete
 7. ముఖ్యమంత్రి తాను ముఖ్యమంత్రి ని అని తానే మర్చి నా నా కూతలు కూసి ఆ పదవి స్థాయిని దిగజార్స్తున్నప్పుడు, ఆయన్ను బక్కోడు అని కాని, ఇంకోటి అని కాని పిలచి, ఆయన స్థాయి ని ఆంధ్రజ్యోతి గాని, ఇంకెవరయినాకాని దిగజార్చగలరా?

  ReplyDelete
  Replies
  1. @krishna

   ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో జర్నల్ ఏదో కూసినంత మాత్రాన ముఖ్యమంత్రి స్థాయికి కలిగిన ఇబ్బందేమీ లేదు లెండి. ఇక్కడ ప్రశ్న తాను పాత్రికేయ విలువలు పాటిస్తున్నానని, తన పత్రికా స్వేచ్చపై దాడి జరుగుతుందని పదే పదే గోల పెడుతున్న పత్రిక ఇటువంటి పనులు చేయడం ఎంతవరకు సబబు అని.

   Delete
 8. గొంగట్లో తింటూ వెంట్రుకలు వేరడమెందుకు? ఉద్యమం అన్న పేరుతో నోట్లో నాలుక ఎలా తిరిగితే అలా మాట్లాడలేదా? దొంగలు, దోపిడీ దారులు, ఫాసిస్టులు ఇలా ఒకటేమిటి, ఎన్నెన్ని మాటలో ! రోములో ఉన్నప్పుడు రోమనులా ఉండమన్నారు కదా!! ఇప్పుడు ఆంధ్రజ్యోతి వారికి అన్యాయం జరిగింది అనిపిస్తోంది. కాబట్టి వాల్లూ ఉధ్యమం చేస్తున్నారు. ఉధ్యమాల్లో ఇవన్నీ మామూలే.

  ReplyDelete
  Replies
  1. @శుక్రా చార్య

   ఉద్యమ సమయంలో గొంగట్లో తిననివారెవరు? విడిపోదామనే వారు సరే, కలిసుందామన్న వారు ఎలాంటి కూతలు కూశారో అందరం చూశాం గదా! పాత్రికేయ విలువలు పూర్తిగా పక్కకు పెట్టిన మిధ్యమాలు ప్రత్యేక ఉద్యమంపై ప్రభుత్వ దమనకాండ వార్తలు తొక్కిపెట్టడం, మిధ్యా సమైక్య ఉద్యమాలను 24 గంటలు చూపించడం లాంటి పనులను అప్పుడూ చేశాయి, విభజన వాస్తవాన్ని జీర్ణించుకోలేక, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి పురిట్లోనే సంధికొట్టించేందుకు ఇప్పుడూ ప్రయత్నిస్తున్నాయి.

   సుఫ్రీంలోనూ చుక్కెదురైన సమయంలో తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో వున్న ఆంధ్రజ్యోతి ఇలాంటి వార్తలు వెయ్యడం నిలుచున్న కొమ్మ నరుక్కోవడం తప్ప మరోటి కాదు.

   Delete
  2. శుక్రాచార్యగారు ఆలోచించాల్సిన పాయింటు లేవనెత్తారు. కృతజ్ఞతలు

   Delete
  3. ఉధ్యమ సమయములో సమైక్య వాదులు కూడా గొంగట్లోనే తిన్నారు. తప్పదు మరి, వేర్పాటువాదులు కూసిన కారు కూతలకు సమాధానం కారు కూతలే వస్తాయి కానీ, కోయిల కూతలు వచ్చునా?? అయినా ఎందుకు అలాంటి పదాలు వాడుతున్నారు అంటే, ఇది మా సంస్కృతి, మా భాష అని సమర్ధించుకో చూసిన వారికి సమాధానం వారి సంస్కృతిలోనే ఇవ్వాలి కదా?

   పది మీటర్లలోపల బొంద పెడతాం అనే మాటలు ఎంత తప్పో ఈ బక్కోడు అనడం కూడా అంతే తప్పు. కానీ, పది మీటర్లలోపల పాతేస్తాం అన్నవారిని ఎవ్వరూ బ్యాన్ చేయలేదు. పాపం ఈ మీడియాలను మాత్రం నిందిస్తూ.. ఇందుకే బ్యాన్ చేశాం అంటున్నారు. నోరుంది కదా అని తిట్టడం, అధికారం ఉంది కదా అని బ్యాన్ చేయడం మానేసిస్తే, పేపరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాసేవారికి గడ్డిపెట్టొచ్చు. కానీ ఎక్కడ, అందరూ గొంగట్లోనే తింటున్నారాయే. ఎవరినేమంటామిప్పుడూ??

   గాంక్రెస్ అవసరార్ధం రాష్ట్రం విడిపోయిందే కానీ, మిధ్యా ప్రత్యేక ఉధ్యమం ఊడబొడవడం వల్ల కాదని అందరికీ తెలుసు. గాంక్రెస్ అవసరం లేకపోయి ఉంటే, కలిసే ఉండి ఉండుంటే, ఈ పాటికి, రైతుల ఆత్మహత్యలన్నీ అమరవీరుల త్యాగాల జాబితాలోకి వెల్లుండేవి. పాపం ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. అయినా తగ్గకుండా తమ చేతగాని తనాన్ని పక్కరాష్ట్రం "అకౌంటులో" వేస్తూనే ఉన్నారనుకోంది అదివేరే విషయం.

   మీడియా తన బాధ్యతగా వేర్పాటువాదాన్ని, సమైక్యాన్ని రెండింటినీ 24గంటలూ చూపింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అన్యాయం జరగకుండా, పాలకుల అసలు రంగు బయట పెడుతున్నాయనేగా ప్రస్తుతం వాటిని బ్యాన్ చేసారు.

   సుప్రీముకోర్టులో చుక్కెదురైంది కాబట్టే, పాలకులను ఎండగడుతూ ప్రజల పక్షం వహిస్తూ, ప్రజలకు మేలు చేస్తున్నాయి పత్రికలు. కానీ, దొరగారిని సేవించే భక్తులకు అది నచ్చడం లేదు. అంతే.

   పత్రికల పాతివ్రత్యం ప్రజలపట్లే కానీ పాలకుల పట్ల, వారి భజన పరుల పట్ల కాదని గ్రహిస్తే ఇలాంటి అనుమానాలు రావు.

   అయినా ఇప్పుడు పత్రికలు తమ పైన ఉన్న బ్యాన్ కు వ్యతిరేకంగా ఉధ్యమిస్తున్నాయి. కబట్టి ఇప్పుడు వారు కూడా తమ నిరసనను "రోమను" సంస్కృతిలోనే తెలియజేస్తున్నారు. విడ్డూరమేమిటంటే, అది మా సంస్కృతి అన్న రోమనులు ఇప్పుడు పాపం విలపిస్తున్నారు. ఎంత విచిత్రం??

   Delete
  4. జర్నలిజం ముసుగులో వెకిలివేశాలు వేస్తే పది మీటర్ల లోతు పాతిపెడతాం అన్న మాటల్ని అలాంటి వెకిలి వేశాలే వేస్తూ నిజం చేయదలుచుకున్నారన్న మాట! బాగుంది!!

   Delete
  5. వెకిలి మాటలు కావవి రోమను సంస్కృతిలో భాగాలు. అవి వెకిలి వేశాలే అయితే, ఇది వరకు రోమనులు ఉధ్యమం పేరిట వేసినవన్నీ వెకిలి వేషాలే. పదికిలోమీటర్ల లోపల బొంద పెడతాం అనడం కూడా వెకిలి వేషమే. ఇప్పుడు జరుగుతున్నది ప్రజల తరపున పాలకుల నిరకున్శత్వం పై పోరాటమే తప్ప మరొకటి కాదు.

   PS: While you are in Rome be a Roman

   Delete
  6. "ఉధ్యమ సమయములో సమైక్య వాదులు కూడా గొంగట్లోనే తిన్నారు."

   అందరూ రోమన్లే అన్నమాట!

   Delete
  7. ఉధ్యమ సమయములో సమైక్య వాదులు కూడా గొంగట్లోనే తిన్నారు. తప్పదు మరి, వేర్పాటువాదులు కూసిన కారు కూతలకు సమాధానం కారు కూతలే వస్తాయి కానీ, కోయిల కూతలు వచ్చునా?? అయినా ఎందుకు అలాంటి పదాలు వాడుతున్నారు అంటే, ఇది మా సంస్కృతి, మా భాష అని సమర్ధించుకో చూసిన వారికి సమాధానం వారి సంస్కృతిలోనే ఇవ్వాలి కదా?

   Delete
  8. అందరూ కారుకూతలు కూస్తున్నప్పుడు అందరి సంస్కృతీ ఒకటే లెండి. ఎవరు ముందు ఎవరు వెనక అనేది ఎవరు చెప్పగలరు? కొండలరావుగారే చెప్పారుగా "ఎన్.టీ.ఆర్ శాసనసభలో ఓ మహిళా ఎమ్మెల్యేని అసభ్యంగా మాట్లాడి"నాడని!

   కాబట్టి తమరేదో గొప్ప సంకృతి గలవారని, ఇతరులు తక్కువ వారని అర్థం వచ్చేట్లు మాట్లాడి లాభం లేదు. ఇటువంటి చేష్టలవల్లనే విడిపోయారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది.

   రాజకీయులు ఒకరికొకరు తిట్టుకోవడం వేరు. ఒక పత్రిక బరితెగించి అంతకన్నా అధ్వాన్నంగా ప్రవర్తించడం వేరు. అలా ప్రవర్తించి ఆ పత్రిక ఉద్యమం చేస్తున్నానని అనుంకున్నా, అది ఉద్యమం చేస్తుందని మీరు తృప్తి పడినా అది అఞ్ఙానాన్ని మాత్రమే సూచిస్తుంది.

   Delete
  9. తిట్టుకుంటే విడిపోవోచ్చు కానీ కలిసి ఉండలేం. అంచేత వారిని "సమైక్య" వాదులు అనడం కంటే తెలంగాణా వ్యతిరేకులు అనాలి.

   Anyone wishing to stay together with those whom they curse must be a masochist. Hatred & unity are antitheitcal.

   Delete
  10. తిట్టి, అడిగితే మా సంస్కృతి ఇదే అని సమర్ధించుకోజూసిన వారు, తిట్టి తప్పు తెలుసుకుని క్షమాపన చెప్పిన వారు ఒక్కటి కాదు. మొదటిది అహంకారం, రెండవది మనిషి సహజ గుణం (ఆవేశములో తప్పు చేసినా తరువాత క్షమాపణ చెప్పడం). ఎవరు ముందు ఎవరు వెనుకా అనేది నాకూ అనవసరం, కానీ నోట్లో నాలుక ఎలా తిరిగితే అలా తిట్టి, అడిగితే మా సంస్కృతి అనడమే ఇక్కడ అసలు విషయం. అంతగా మీ సంస్కృతి అదే అని మీరు ఫీలయితే, కాసేపు అవతలి వారు కూడా వారి సంస్కృతిని పక్కన పెట్టి, ఎదుటివారి సంస్కృతిని ఫాలో అయ్యారు అంతే. ఇక్కడ తమ సంస్కృతిని కాసేపు పక్కన పెట్టారే కానీ, తమ సంస్కృతిని మర్చిపోలేదు, తిట్టడం మా సంస్కృతి అని సమర్ధించుకోలేదు. అంటే చర్యకు ప్రతిచర్యే తప్ప తిట్టడం అలవాటుకాదు. కాబట్టి.. తిట్టడం వారి సంస్కృతి కనట్టే లెక్క.

   >>>కాబట్టి తమరేదో గొప్ప సంకృతి గలవారని, ఇతరులు తక్కువ వారని అర్థం వచ్చేట్లు మాట్లాడి లాభం లేదు. ఇటువంటి చేష్టలవల్లనే విడిపోయారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది.

   ఇక్కడ విషయం ఏమిటంటే, ఇతరులను మేము తక్కువ చేయలేదు. వారే తిట్టి, మా సంస్కృతి ఇదే అని సమర్ధించుకున్నారు. అంటే, తక్కువచేయడం అనేది ఏదన్నా ఉంటే అది ఘనత వహించిన రోమనుల స్వయంకృతమే అవుతుంది కానీ, ఎదుటివారి తప్పు కాదు గదా? మరి పక్కవారిని బుద్ది తెచ్చుకోండి అనడం ఎందుకు? బుద్ది తెచ్చుకోవాల్సింది, సంస్కరించుకోవాల్సింది అలా తిట్టిన వారే. ఇక ఎదుటివారు తిరిగి తిట్టడం అనేది.. రియాక్షన్ మాత్రమే. వారు బుద్దిజీవులే. కాకపోతే తిట్టిన వారిని తిరిగి తిట్టారు. అది బుద్దిలేని తనం కాదు.

   >>>అలా ప్రవర్తించి ఆ పత్రిక ఉద్యమం చేస్తున్నానని అనుంకున్నా, అది ఉద్యమం చేస్తుందని మీరు తృప్తి పడినా అది అఞ్ఙానాన్ని మాత్రమే సూచిస్తుంది.

   అఙ్ఞానం కాదు రోమను సంస్కృతిని ఫాలో అవ్వడం అవుతుంది. అంతకు ముందు రోమనులు చేసిన ఘనత వహించిన ఉధ్యమం అలానే ఉందికదా?ఆ సమయములో ఆ ఉధ్యమాన్ని సమర్ధించిన పత్రికల తీరు కూడా ఇలానే ఉంది. మరి వారిది అఙ్ఞానం కాదా? తాము చేస్తే ఉధ్యమం, పక్కోడు చేస్తే అఙ్ఞానం ఏమి విచిత్రం? కాబట్టి, ప్రస్తుతం పత్రికలు చేసేది ఉధ్యమం కాదు అనడం కేవలం మీ అఙ్ఞానాన్నే సూచిస్తుంది అని తెలుస్కోండి.

   Delete
  11. అంటే సమైక్యవాదం అంటే, వేర్పాటు వాదులు తిట్టే తిట్లను సిగ్గులేకుండా భరించడం అన్నమాట !? డెఫినిషన్ అదిరింది. తిరిగి తిట్టడం తెలంగాణా వ్యతిరేకతా? భలే చెబుతారండీ ఇలాంటి కొటేషన్లు, తుమ్మితే తెలంగాణా వ్యతిరేకత, దగ్గితే తెలంగాణా వ్యతిరేకత, ఒక నాయకుడి అక్రమాలను, చెత్త నిర్ణయాలనూ వేలెత్తి చూపితే తెలంగాణ వ్యతిరేకత. ఇప్పుడేమో, తిట్టినవాడిని తిరిగి తిట్టడం తెలంగానా వ్యతిరేకత. భేష్. కాకపోతే మేము దాన్ని ఆత్మాభిమానం అంటామండి. మీరు దానికి ఏపేరు పెట్టుకుంటారో పెట్టుకోండి అది మీ ఇష్టం. తిట్టుకు సమాధానంగా తిట్టినా, వారు సమైక్యవాదులే ఎందుకంటే..వారు తిట్లను వ్యతిరేకించారే కానీ కలిసి ఉండడాన్ని కాదు. అనవసరంగా తిట్టకుండా కలిసి ఉండండి అని చెప్పారు.

   Anyone expecting others to be calm after they scold them, must be Sadists. Scolding back & wishing for unity can co-exist.

   Delete
  12. తిట్ల సంస్కృతిలో మిమ్ము మించిన వారెవరు లెండి, ఆనాటి ఎన్టిఆర్ నుండి మొన్నటి రాజశేఖరుని దాకా! అందులో తమర్ని మించడం ఎవరికీ సాధ్యం కాదు. అదేకాదు ఫ్యాక్షనిజం, రౌడీయిజం, గూండాయిజం, నక్సలిజం ఇలా ఒకటేమిటి, ప్రతీదాంట్లో ఆద్యులు ఎవరో వేరే చెప్పనేల? ఇక పొతే ప్రపంచంలో అతి ఎక్కువ వ్యక్తిగత దాడులకు, దూషణలకు గురైన నాయకుడు ఎవరో కూడా ప్రతి ఒక్కరికీ తెలుసు, అందుకు కారణమైన వారెవరో కూడా తెలుసు. అదంతా మీరు చెప్పే రోమను సంస్కృతే నేమో మరి. అందులోనే తరిస్తాం మేం అనుకుంటే తరించండి. ఎవరు కాదన్నారు?

   Delete
  13. మీరు మొహమాట పడుతున్నట్లుంది. మీ గొప్పదనాన్ని మీరు అంగీకరించక పోయినా, గుర్తుచేయకుండా మేముండం లేండి. నేను హిట్లరు బాబులాంటోడిని అని చెప్పిన వ్యక్తి, పది కిలీమీటర్లలోపల బొంద పెట్టే వ్యక్తి మీకు తోడుండగా మీకు అసాధ్యమా ఇవన్నీ. ఆయన మాటను సమర్ధించడానికి ఎంతదూరమైనా వెల్లి, అదేమిటి అని అడిగితే సంస్కృతి ఇది చెప్పినవారు ఎందరు లేరు. అన్ని రికార్డులు బ్రేకయ్యాయి కదా రోమను ఉధ్యమములో. ఎక్కడో సినిమా షూటింగులు జరిగితే వెల్లి దాడి చేయడాలూ, చూడ్డానికి యూనివర్సిటీకి వస్తే తన్నడాలూ ఒకటేమిటీ.. అన్నీ ఘనంగానే జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. విశేషమేమిటంటే, అవి తప్పని చెప్పడం లేదు. వాటిని ఏవేవో సాకూ చెప్పి సమర్ధించుకుంటున్నారు. అదీ అసలు విషయం. నక్సలిజన్ని మాత్రం మా అకౌంటులోనుండి మీ అకౌంటూలో వేసుకోండి. అది రోములో ఉన్నంత స్ట్రాంగుగా ఇక్కడ లేదు.

   ఫ్యాక్షనిజాలు, రౌడీ ఇజాలు మాకు తెలుసు. వాటిని రూపు మాపడానికి ఇప్పటికీ కూడా కృషి చేస్తున్నాం. వాటిని మా సంస్కృతి అని పొగుడుకోవడం లేదు. ఫ్యాక్షనిజాలూ, రౌడీ ఇజాలు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడంత బలంగా లేవు. ఫ్యాక్సనిజం, రౌడీ ఇజం చేసిన వెధవ పనులకు, వారిని ఇప్పటికీ పూర్తిగా ఆపలేకపోయిన (కొంత అణచివేసినా) మా చేతగాని తనానికి సిగ్గుపడుతున్నాం కూడా. వాటి మీద మా పోరాటం ఆగదు. ఫ్యాక్షనిజాన్ని, రౌడీ ఇజాన్ని రూపు మాపడానికి కృషి చేస్తూనే ఉంటాం. అవి మా సంస్కృతి అని సమర్ధించుకోవడం మాత్రం జరగదు. ఎవడన్నా అంటే వాడ్ని నాలుగు తిడతాం కూడా.

   Delete
  14. అబ్బే లేదండీ మీరే మొహమాటపడుతున్నట్టున్నారు తమరి సంస్కృతి చెప్పుకోవడానికి.

   కుక్కమూతిపిందెలు, దుష్టులు, త్రాష్టులు అంతూ రాజకీయాల్లో తిట్ల పురాణం మొదలుపెట్టిందే తమ నటరత్నం కదండీ! తర్వాత అల్లుడు వెన్నులో కసక్కున కత్తి దింపిన తర్వాత కూడా తిట్లతో బాగానే ఆశీర్వదించారు అల్లున్ని... నీచుడు, దశమగ్రహం, వగైరా అంటూ. కాకపోతే వాటిని వొదిలేద్దాం లెండి, ఎంతైనా బాధల్లో తిట్టాడు కదా!

   ఇక పోతే నిండు శాసనసభలో బాబును పట్టుకొని అమ్మనా బూతులు తిట్టిన రాజన్నను అప్పుడే మరిచారా? మీరు మరిచినా మేం గుర్తుచేస్తూనే వుంటాం లెండి మీ "సంస్కృతిని". రోమన్లైనా, గ్రీకులైనా మిమ్మల్ని మించిన వారెవరండీ. అంతలేసి గొప్పదనం మీకుండగా మీముందు మేమెంత లెండి.

   కొట్టుకోవడాలూ తన్నుకోవడాలగురించి చెప్పుకుందామంటారా! చూసాం గదా పరిటాల చావులో, వంగవీటి చావులో జరిగిన లూటీలు, దమనకాండ. దేనిలో కూడా అగ్రతాంబూలం తమదే మరి! ఇక ఉజ్జెమాల విషయానికి వస్తే మీ పదిరోజుల ఉద్యమాన్ని మించిన ఉజ్జెమమేదండీ! మేం పదేళ్ళు ఉద్యమం జేసినా మీరు పదిరోజుల్లో చేసిన నష్టంలో పదోవంతు కూడా చేయలేక పోతిమాయె!

   మొహమాటమెందుకండీ తమకు? నక్సలిజాన్ని తెలుగుజాతికి అంటించిందే తమరు కాదా? ఇబ్బంది పడతారెండుకు చెప్పుకోవడానికి? ఒక్కటి గుర్తుంచుకోండి, తెలంగాణ జాతిని సంస్కృతిని ఎంత తెగనాడాలని ఎంత ప్రయత్నించినా ప్రతీ విషయంలోనూ ముందు మీరే కనపడతారు, అది గుర్తుంచుకుని మసలుకుంటే మీకే పరువుదక్కుతుంది.

   ఫాక్షనిజాన్ని రూపుమాపుతున్నారా? ఎవరూ? పరిటాలను మంత్రిని చేసిన పెద్దన్నా? ఆయన్ని మర్డరు చేయించిన మారాజా? ఆ మర్డరు కేసులో వున్నాయన్ని ఎంపీని చేసిన చినబాబా? ఎవరూ రూపు మాపుతున్నది? రూపుమాపేటంత వరకూ ఆ బాబులను మోసుకుంటూ కృషి చేస్తూనే వుండండే! మీరు తగ్గొద్దు.

   >>> ఎవడన్నా అంటే వాడ్ని నాలుగు తిడతాం కూడా.

   దానికేం తక్కువలేదు లెండి.

   Delete
  15. పర్వాలేదు లెండి. మేము మొహమాట పడినా మీరున్నారుగా గుర్తు చేయడానికి. మీరు కూడా అదే భరోసా ఇచ్చేశారాయే. ఇంకేం బ్రహ్మాండం. కాకపోతే, మాతరపునుంచి కూడా మీకు అదే భరోసా ఇస్తున్నాం. గుర్తుచేయడానికి మేమున్నామని.

   మీరో విషయాన్ని ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటె, మాకు తిట్లు, శపనార్థాలు, హత్యారాజకీయాలు, మరీ ముఖ్యంగా కుల రాజకీయాలు కొత్త కాదు. అవన్నీ చేసిన వారు బ్రహ్మాండంగా ఉన్నారు. అలాంటివారికి మీప్రాంతం మాప్రాంతం అని తేడా ఏమిటిలెండి. అన్నీచోట్లా గలరు. కానీ, అది తప్పని, అలా చేయడం పద్దతి కాదని, మర్యాదస్తుల్లా ఉండాలనీ ఒక భావన కూడా మాలో ఉంది. అంటే తప్పు చేసినప్పుడు అది తప్పు అని ఒప్పుకుంటాం. ఎవరైనా అటువైపు రెచ్చగొట్టినప్పుడు చేసి ఉండొచ్చు. అంతే కానీ దాన్ని మా గొప్ప సంస్కృతి అని సమర్ధించుకోం. అలాంటి వాటికి సిగ్గు పడతాం. కనీసం ఇకమీదైనా అలాటివి జరక్కుండా ఉండాలని అభిలశిస్తాం. రోజు రోజుకీ మమ్మల్ని మేము మెరుగు పరుచుకోవడానికి అది దోహద పడుతుంది. అందుకే ఒకప్పుడున్న ఫ్యాక్షనిజం, రౌడి ఇజం ఉన్నంత తీవ్రంగా ఇప్పుడు లేవు. మార్పు ఉంది. అంతే కాదు భవిశ్యత్తు మరింత బావుంటుంది అన్న భరోసా కూడా ఉంది.

   ఉన్న ఫలంగా రూపుమాపలేకపోయినా, తప్పును తప్పుగా ఒప్పుకుని, సరిచేసుకుంటూ పోవడం మనిషికుండాల్సిన లక్షణం. ప్రస్తుతం ఇంక కొంత చెత్త ఉండొచ్చు, కానీ భవిశ్యత్తులో అది కూడా పోతుంది. ఆ దిశగా కృషి చేస్తూనే ఉంటాం. అంతే కానీ, తిట్టిన తిట్టు తిట్టకుండా అడ్డమైన బూతులూ తిట్టి, మా సంస్కృతి అని సమర్ధించుకో జాలం.

   కానీ మరో వైపు కొంత మంది, కనీసం మాటవరసకు అలాంటి నీచమైన పదజాలం తప్పని, అలా జరగడం దురదృష్ట కరమని, జరిగిన దానికి సిగ్గుపడుతున్నామనీ, కనీసం ఇకమీదటైనా అలాంటివి జరక్కూడదని ఆశిస్తున్నామనీ చెప్పలేదు చూశారు, దాన్నే మేము అహంభావం అంటాం. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోవడం మనిషి లక్షనాల్లో ఒకటని గ్రహించి, ఒప్పుకుని ఉంటే, ఇన్నిన్ని వ్యర్థ కామెంట్లు ఉండేవి కావు కదా?

   Delete
  16. ఇక ఉజ్జమాలూ గట్రా అంటారా, అన్నన్నా.. ఎంత మాట, ఇప్పటికీ కూడా ఘనత వహించిన విశ్వవిధ్యాలయములో రోజూ జరుగుతున్న కామెడీలతో పోలిస్తే .. మా ఉజ్జమాలేపాటివిలెండి. పరువుగురించి మీరు మాట్లాడడం.. అబ్బో, ఈ జోకు నేను భరించలేను. కాసేపాగండి నవ్విన తరువాత మిగిలిన కామెంటు రాస్తాను.

   Delete
  17. >>> మాకు తిట్లు, శపనార్థాలు, హత్యారాజకీయాలు, మరీ ముఖ్యంగా కుల రాజకీయాలు కొత్త కాదు.

   అంటే మీరూ రోమన్లే నన్న మాట. నేను ప్రశ్నలో అడిగింది ఒకటే. "పత్రికా స్వేచ్చ అంటూ కబుర్లు చెప్పే ఆంధ్రజ్యోతి దాన్ని హెడ్‌లైనుగా వెయ్యడం ఎంతవరకు సబబు?" అని. మీరు ఆ పత్రిక ఉద్యమం చేస్తుంది, కాబట్టి తిట్టొచ్చు అంటున్నారు. రేపు ఇంకో సాక్షి పత్రిక వారిని చంద్రబాబు ప్రెస్‌మీట్లకు రానివ్వడం లేదని "రోమను" తరహా ఉద్యమం జేస్తూ (మీరూ రోమన్లే కాబట్టి) ఆయన్ను "బొల్లిబాబు" అని సంబోధిస్తూ హెడ్డింగులో వేయవచ్చా? అలా వేయవచ్చు అన్నది మీ సమాధానమైతే ఇక ఇక్కడ చర్చే అవసరం లేదు.

   Delete
  18. రోమన్లు ఎవరు, రోమను సంస్కృతి ఏమిటి?
   తిట్టడం మా సంస్కృతి అనే వారు రోమనులు. వారు సంస్కృతి అని చెప్పుకుంటున్న తిట్లు వారి సంస్కృతి. ఈ మాట నేననలేదు. వారే చెప్పారు. కాబట్టి నన్ను తప్పు పట్టకండి. అలా తిట్టడం సంస్కృతి అని చెప్పేవారు తిడుతూ పోతూ ఉంటారు, అడిగితే మా సంస్కృతి ఇంతే అంటారు, అంతేనా దాన్ని కాదంటే "రోమన్లకు వ్యతిరేకి" అని ముద్ర కూడా వేస్తారు. అలాంటి వారితో వేగడం ఎలా? ఏముంది వారి సంస్కృతిని ఫాలో అయ్యి మాటకు మాట అప్పజెప్పడమే. ఇంకో దారిలేదు.

   పత్రికా స్వేచ్చకు తిట్టడానికీ సంబంధములేదు. తిట్టడం పత్రికా స్వేచ్చలో భాగం కాదు. కానీ రోమను సంస్కృతిలో భాగంగా వారూ అలానే మట్లాడుతూ ఉండవచ్చు. మొదట రోమనులు, ఇది తమ సంస్కృతి కాదని, తిట్టడం తప్పనీ, "తిట్టం, తిడితే ఊరుకోం" అనీ ఒక్క చిన్న నిర్ణయం, గట్టిగా తీసుకుని కాస్త నాలుక అదుపులో పెట్టుకుంతే, పేపరు వాల్లు ... రాసే తమ చేతుల్ని, ప్రింటు చేసే ప్రింటింగ్ ప్రెస్సులూ అదుపులో పెట్టుకుంటారు, అలా పెట్టుకోక దమ్మున్న పత్రిక, దిల్లున్న పత్రిక అని కామెడీ మాటలు చెబితే సీను సితారవుతుంది. దానికి అందరి మద్దతూ ఉంటుంది. కానీ, ఇప్పుడు అందరి మద్దతూ దొరకడం లేదు ఎందుకంటే, నీతి చెప్పాల్సిన రాజావారే బూతులు తిడుతున్నారు, తిట్టి సంస్కృతి అని సమర్ధించుకుంటున్నారు. అలాంటప్పుడు, ఆ పత్రిక చేసింది తప్పా అంటూ ప్రశ్నిచే అధికారం మాత్రం రాజా వారికి ఎక్కడుంది? "నీవు నేర్పిన విధ్యయే నీరజాక్షా" అనే కదా అటువైపు వారంటున్నారు?? అది తెలుసుకోకుండా.. మీరూ రోమనులే కదా అంటే, దానర్ధం ఫర్లేదు ఇక మీదట కూడా మేము ఇలానే తిట్టి, మా సంస్కృతి అని సమర్ధించుకుంటామనా?

   ఇక అటుపక్కనున్న వారు కూడా రోమనులే కదా అనేదానికి వద్దాం. తిట్టుకోవడం, కొట్టుకోవడాం కుల రాజకీయాలు చేసుకోవడం ఇక్కదే కాదు దేశములో అన్ని చోట్లా కామన్. కానీ, దాన్ని సంస్కృతి అని సమర్ధించుకున్నారా? లేదే. ఒక వేల ఎవరైనా అలా సమర్ధించుకో చూసినా, వాడి మాటలు పట్టించుకోకు అని మిగిలిన వారు వారిని తప్పు పడుతూనే ఉంటారు.

   తప్పులు మేమూ చేస్తున్నాం, అవి తప్పని మాకు తెలుసు,నిదానంగానైనా సరిదిద్దుకుంటాం, అలాంటి వాటిని ఉపేక్షించం అనడానికీ, అది తప్పేం కాదు మా సంస్కృతిలో భాగం, దాన్ని కాదంటే నువ్వు మమ్మల్ని "వ్యతిరేకిస్తున్నట్లే" లెక్క అనే దానికీ తేడా ఇన్ని కామెంట్ల తరువాత కూడా మీకు అర్థం కాకపోవడం, విషాదం.

   ఇంకో విషయం, బొల్లి బాబు అని రాస్తే ఊరుకుంటారా అని అడిగారు కదా.. "ఊరుకోం". దాన్ని తప్పని విస్పష్టంగా గుర్తిస్తున్నాం. అలాంటి తప్పులు చేసి మా సంస్కృతి అని చెప్పుకునే "రోమను సంస్కృతి" మేము వ్యతిరేకిస్తూనే ఉంటాం.

   Delete
  19. >>> వారు సంస్కృతి అని చెప్పుకుంటున్న తిట్లు వారి సంస్కృతి.

   అది కేవలం మీ భ్రమ మాత్రమే. తిట్లను సంస్కృతి అని ఎవరూ చెప్పుకోలేదు.

   కాని మీలాంటి కొందరు అతితెలివి మనుషులు వారి మండలికంలో వాడే పదం తిట్టు కాదని, అదే ఇతర ప్రాంత మాండలికంలో వాడేది సమానార్థకమే అయినా తిట్టు అని దుష్ప్రచారం చేస్తుంటారు. అటువంటి వాటికి సమాధానాలు చెప్తే చెప్పి వుండవచ్చు. అంత మాత్రాన అవి తిట్లూ కావు. ఒకవేళ తిట్లు అయితే అవతలి ప్రాంతంవారు ఉపయోగించిన అవే పదాలు కూడా తిట్లు అయి వుండాలి.

   తిట్లను సంస్కృతిగా చెప్పుకుంటున్నారు అన్నదే ఒక నీచమైన ఆలోచన.

   Delete
  20. అతి తెలివి ఎవరిది?
   తిట్టును తిట్టు అని నిర్ధారించిన వారిదా? లేక తిట్టి, ఏమిటని ప్రశ్నిస్తే, తీరిగ్గా "అబ్బే అది మా మండలికం" అంటున్న వారిదా? మీలంటి వారికోసం "పవర్" కళ్యాన్, బమ్మెర పోతనను కోట్ చేసి చెప్పాడు ఇటీవలే. నాకు తెలిసినంత వరకూ మాండలికాలూ, భాషలూ ఎవ్వరినీ కించ పరచవు. అలా కాకుండా, నాలికలు కోస్తాం, తోలు తీస్తాం, బొంద బెడతాం అనే మాటలన్నీ, నోటి దూల మాత్రమే.

   తిట్లను సంస్కృతిగా చెప్పుకుంటున్నారు అనడమే నీచమయితే.. మరి "అది మా సంస్కృతి/మండలికం అని చెప్పుకోవడం" ఏమవుతుంది? చెప్పనలవి కాని నీచాతి నీచం కదూ? ఇంత జరిగిన కూడా తప్పును తప్పు అని ఒప్పుకోవడానికి బదులు కాసేపు సంస్కృతి అని "మాండలికం" అని సమర్ధించుకోవడం .. రోమను సంస్కృతిలో భాగమే.

   పోనీ, కాసేపు ఇవన్నీ మాండలికాలే అనుకుందాం, మీ తృప్తికోసం. మరి, పైన ఆంధ్రజ్యోతి పత్రిక వారు రాసినది మాత్రం మీ "మాండలికం" కాదా? అది మాండలికమే అయితే, ఈ కంఠ శోష, ఘోష ఎందుకు? "మాండలికాన్నీ" పాటిస్తున్నారని అనుకోవచ్చు కదా? ఈ ప్రశ్నెందుకు. బొంతకు తగ్గ గంత అనుకుంటే సరిపోతుంది.

   Delete
  21. తమరు అర్థం చేసుకోవడానికి శ్రమించవలసి వస్తున్నట్టుంది. తిట్లను ఎవరూ సంస్కృతిగా చెప్పుకోలేదు. ఒకే పదం మీమాండలికంలో తిట్టు కానప్పుడు మా మాండలికంలో తిట్టు ఎలా అవుతుంది అని మాత్రమే అడిగారు.

   ఉదాహరణకు, ఇదే బ్లాగులో రెండురోజుల క్రితం నేను "కూశారు" అంటే అది సంస్కార హీనం అని శ్యామలీయంగారు కొంపలు మునిగిపోయినట్టు పరిగెత్తుకొచ్చి మరీ ఙ్ఞాన బోధ చేయడం మొదలు పెట్టారు. అదే అంతకు ముందు వ్యాఖ్యలో అదే పదాన్ని మీరు (మీరే) ఉపయోగించారు కదా అని అడిగితే వారివద్ద సమాధానం శూన్యం. ఇది ఏ ఒక్క శ్యామలీయానికో పరిమితం కాదు, ప్రతి సీమాంధ్ర వ్యక్తీ తెలంగాణా వారు ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో నీతులు చెప్పేవాడే. అదే పని అక్కడ చేస్తున్నారెందుకు అంటే సమాధానం వుండదు. రెత్తిస్తే మేంఊ మాట్లాడతాం, కాని తప్పు తెలుసుకున్నాం, మీరు మాత్రం సంస్కృతి అని చెప్తున్నారు అని సన్నాయి నొక్కులు. దీనికి ఆధారాలు ఏమిటి? తెలంగాణ వారిపై ఇటువంటి వివక్ష కూడదని మాత్రమే అంటున్నది.

   Delete
  22. ఇప్పటి వరకూ నేను రాసిన అన్ని కామెంట్లలో చెబుతూ వచ్చిన మాట. మల్లీ చెబుతున్నాను. అది మీ మాండలికమే అయితే, మేము మాటాడిన మాటలు కూడా మీ మాండలికానికి చెందినవి కావా?

   రెత్తిస్తే మీరూ మాట్లాడగలరని నాకు తెలుసు. అసలు నేను ఇలా మాట్లాడుతున్నది కూడా దాని కారణంగానే. నేను మాట్లాడగలిగానంటే, మీరూ మాట్లాడగలరు(మాట్లాడుతారు) అనే విషయం నాకు తెలుసు. నిజానికి నేను వాటికి సిద్దపడే ఈ కామెంట్లు రాశాను.

   >>>రెత్తిస్తే మేంఊ మాట్లాడతాం, కాని తప్పు తెలుసుకున్నాం
   ఈంతటితో ఈ పోస్టుకు సంబందించినంత వరకూ కామెంట్లు ముగిస్తున్నాను.మీరేమైనా రాసుకోదలుచుకుంటే రాసుకోండి.

   Delete
  23. తెలంగాణాది తిట్ల సంస్కృతి అని మీరనుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. అదే నేను చెప్పదలుచుకున్నది. అలా అనుకోవడం అత్యంత హేయమైన సంస్కృతి, అందునా మేమే అలా అన్నామని చెప్పజూడడం మరింత సంస్కార హీనమైనది. "నేనలాగే అనుకుంటాను" అంటే అది మీ ఇష్టం, కాని పబ్లిక్ ఫోరంలలో అంటే వ్యతిరేకించవలసి వస్తుంది.

   Delete
  24. శ్రీశ్రీకాంత్ చారిగారి నిన్నటి వ్యాఖ్య కు జవాబుగా ఈ‌ నాలుగు మాటలూ వ్రాయవలసి వస్తోంది. కూశారు అనే పదాన్ని ప్రస్తావిస్తూ, అయన "అదే పదాన్నిపదాన్ని మీరు (మీరే) ఉపయోగించారు కదా అని అడిగితే వారివద్ద సమాధానం శూన్యం." అని నన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

   ఒక వేళ, వారన్నదే నిజమై, నా వార్థక్యం కారణంగా నేను మతిమరపుతో ఆ అవిషయాన్ని మరచిపోయి ఉంటే తప్ప, ఆ పదాన్ని నేను ఉపయోగించలేదనే నా నమ్మకం. అలా ఆ పదం ఉపయోగించాననటం నాకు చాలా అశ్చర్యం కలిగించింది. ఒకవేళ అలా నిందించి ఉంటే నిశ్చయంగా క్షంతవ్యుడను.

   ఆయన నన్ను "శ్యామలీయంగారు కొంపలు మునిగిపోయినట్టు పరిగెత్తుకొచ్చి మరీ ఙ్ఞాన బోధ చేయడం మొదలు పెట్టారు." అన్నారు కానీ అటువంటిదేమీ‌ లేదు. అందరూ ఎలా వీలు కలిగినప్పుడు వ్యాఖ్యలు ఉంచుతున్నారో‌ నేనూ అలాగే చేస్తున్నాను. నిజానికి చాలా తక్కువ సందర్భాల్లోనే రాజకీయవిషయాల మీద, అదీ, తప్పనిసరి అనిపించినప్పుడు మాత్రమే వ్యాఖ్యలు చేస్తున్నాను. ఐతే వారన్నట్లు నా వ్యాఖ్యలు లేకపోతే కొంపలేమీ ములిగిపోవన్నది వాస్తవమే.

   పైగా ఆయన నన్ను "ఇది ఏ ఒక్క శ్యామలీయానికో పరిమితం కాదు, ప్రతి సీమాంధ్ర వ్యక్తీ తెలంగాణా వారు ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో నీతులు చెప్పేవాడే. " అని ఒక విమర్శించారు. ఇది కొంచెం అధికప్రసంగం అనిపించింది. నేను సీమాంధ్రవ్యక్తిని అని కించపరచవలసిన అగత్యం ఉన్నదా? నేను సీమాంద్రవ్యక్తినీ కాని తెలంగాణావ్యక్తినీ కాను. కేవలం భారతీయుడిని. ఒక బారతీయుడిగా నాకు హైదరాబాదులో నివసించే అర్హత లేదని ఆయన ఆక్షేపించదలచుకుంటే అది ఆయన హ్రస్వదృష్తి మాత్రమే అవుతుంది. సీమాంధ్రలో పుట్టటం అనేదే ఒకరకమైన అనర్హత అనుకునే వారికి నా బోటివాడు చెప్పగలిగింది ఏమీ కనిపించటం లేదు. ఎందుకంటే అటువంటి వారు ఎవరు చెప్పేదీ వినదలచుకోరు కాబట్టి. చాలా? అదలా ఉంచండి. ప్రత్త్యేకించి తెలంగాణావారిని ఉద్దేశించి నేను ఏమైనా విమర్శిస్తున్నానా? రెచ్చగొట్టే మాటలు వాదానికి ఉపయోగపడవు. విషయానికి కట్టుబడండి. వ్యక్తిగత నిందాలాపాల వలన అవి చేసే వారికే గౌరవహాని కాని అవి చేకూర్చే ప్రయోజనం ఏమీ‌ ఉండదు. ఇంతకంటే వ్యాఖ్యానించను. ఈ వ్యాఖ్య చేయటమూ నా అభిమతానికి అంతగా రుచించని వ్యవహారమే కాని మీరు అది తప్పనిసరి చేసారని గ్రహించవలసిందిగా శ్రీకాంత్ చారిగారికి నా విన్నపం.

   ఆయన "అడిగితే వారివద్ద సమాధానం శూన్యం" అని నా గురించి అన్నారు. నాకు అనంతమైన తీరికా లేదు ఓపికా లేదు. ఉద్యోగజీవితంలో ఉండటం వలనా, ఇతర వ్యాపకాల వలనా నా తీరికకూ, వయస్సు కారణంగా నా ఓపికకూ పరిధి చాలా చిన్నదిగా ఉంది.

   ఈ విషయంలో ఇంక జవాబులు చెప్పననీ దానికి నన్ను నిందించటం వలన ప్రయోజనం లేదనీ గ్రహించవలసిందిగా వారికి నా విజ్ఞప్తి,

   Delete
  25. శ్యామలీయం గారు,

   నేను అన్నది మిమ్మల్ని కాదు. పైన Krishna K గారి గురించి. ఆయన "ముఖ్యమంత్రి తాను ముఖ్యమంత్రి ని అని తానే మర్చి నా నా కూతలు కూసి" అని నేను రాసిన వ్యాఖ్యకు పైనే రాసి వున్నారు, కాని అది మాత్రం మీకు కనపడలేదు. నేను "కలిసుందామన్న వారు ఎలాంటి కూతలు కూశారో" అన్నది మాత్రం మీకు కనపడింది. మామూలుగా కూడా కాదు, సంస్కార హీనంగా కనపడింది.

   అలాగే ఈ చర్చలో మొత్తం "శుక్రా చార్య" గారు వాదిస్తున్న విధానాన్ని గమనించండి. "రోములో రోమన్లలాగే వ్యవహరించాలి" అని ఆయన అంటున్నారు. అంటే ఏమన్న మాట? తెలంగాణా వారు అందరూ తిట్లు తిట్టే సంస్కృతి గలవారు. అందుకనే ఆంధ్రజ్యోతి తెలంగాణా ఏడిషన్లో తిట్లు రాసింది (సీమాంధ్ర ఎడిషన్లో రాసిందా లేదా అన్నది వేరే సంగతి) అని. మరి ఆయన మాటల్లో తెలంగాణా వారిని తిట్లు తిట్టే సంస్కృతి గలవారిగా అభివర్ణిస్తున్నట్టు మీకు కనిపించలేదు.

   మీకు నేను వాడిన "కూతలు" అన్న పదం అసభ్యకరంగా కనిపించింది. అదే పదం వేరే ఇంకో వ్యక్తి అంతకు ముందే వాడినా కూడా కనిపించలేదు. అంతేకాక రోమన్లు అంటూ మాత్రాన తెలంగాణా వారి స్వభావం మీద శుక్రా చార్య గారు చేస్తున్న దాడి కూడా మీకు అన్యాయంగా అనిపించలేదు. మీరు ఒక తెలంగాణా వ్యక్తి అయి వుంటే కచ్చితంగా. మీరు తెలంగాణా ప్రాంతానికి చెందిన వారైనా మీకు అలా అనిపించకుండేదా అని ఒకసారి ఆలోచించండి.

   మీకు సులభ గ్రాహ్యం కావడానికి ఇంకో ఉదాహరణ ఇస్తాను. సీమాంధ్రలోని ఏదైనా పత్రిక చానెలు సీమాంధ్ర నాయకులను పచ్చి బూతులు తిట్టిందనుకోండి. అప్పుడు ఎవరైనా "రోములో రోమన్ల లాగే ప్రవర్తించాలి కదా! ఆ పాత్రిక బాగానే రాసింది" అని అంటే మీకు ఏమనిపిస్తుందో ఆలోచించుకో గలరు, సమాధానం ఇవ్వ వలసిన అవసరం లేదు.

   మీరు నీతి సూక్తులు చెప్పలనుకోవడం తప్పు కాదు. "కూశాడు" అన్న పదం లోని అసభ్యత(?) కన్నా వెయ్యి రెట్లు అసభ్యంగా అంతకన్నా శిశ్టమైన పదాలు ఉపయోగిస్తూనే రాయ వచ్చు. ఉదాహరణ పైనే వుంది. గమనించ ప్రార్థన.

   Delete
  26. శ్రీకాంత్ చారిగారూ మీరు అపార్థం చేసుకోవధ్దు. దురుసుగా ఎవరు మాట్లాడటమూ నాకు హితవు కాదు. ఈ విషయం ఇక్కడే లోగడనే వ్రాసాను. నేను October 13, 2014 at 2:25 PM న చేసిన వ్యాఖ్యను గమనించగలదు. ఈ చర్చ ఇంక ముగిద్దామని నా సూచన. అన్యథా భావించవద్దు.

   Delete
  27. తెలంగాణా మాండలికం ఏది? సంస్కృతి ఏది?
   "పవర్" కళ్యాన్ అన్నట్టు, "ఇంతింతై ఒటుడింతై ... " అంటూ బమ్మెర పోతన రాసినది ఏమాండలికం? కాకతీయుల వైభోగం, వారు తెలుగు భాషకు చేసిన సేవ, వారి సంస్కృతి తెలంగాణాది కాదా? ఆ విషయములో రెండవ అభిప్రాయానికి తావులేదు. గర్వించే సంస్కృతి, వినసొంపైన మాండలికం తెలంగాణా సొంతం. ఇక్కడ వ్యతిరేస్తున్నది దాన్ని కాదు.

   ఒక వ్యక్తి తన నోటి దురుసు తనముతో ఇతరులను దూషించాడు. ఇది తప్పుకదా అని ప్రశ్నిస్తే, ఆయన గారు అది మా సంస్కృతి అని సమర్ధించుకున్నాడు. దానికి, "దొరగారి" సేవే పరమావధి అని భావించిన కొంత మంది వెనకేసుకు వచ్చారు. "నాలికలు కోస్తా అనడం, బొంద పెడతాను" అనడం, "లుచ్చా, లఫంగి" అని తిట్టడం మాండలికాలా లేక సంస్కృతులా ? కావు. కానీ ఓపెద్దాయన సమర్ధించుకుంటే, దానికి ఇక్కడ కొంత మంది వంత పాడారు. వారే తిరిగి ఇతరులకు ఇప్పుడు సంస్కారం గురించి లెచ్చర్లిస్తున్నారు.

   వెరైటీ ఏమంటే, తిరిగి వారే .. ఆంధ్ర జ్యోతి వాడు ఏదో చిన్న మాట, అది కూడా ఎవరో అన్న మాటను యధాతధంగా రాస్తే రాద్దాంతం చేస్తున్నారు. "పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడేవారు" ఇలా రాయడం తప్పా కాదా అని అడుగుతున్నారు. మరి, బాధ్యతాయుతమైన పదవులలో ఉండేవారు "కిలో మీటర్ల లోపల బొందపెడతాం" అనడం మాత్రం తప్పు కాదా? దాన్ని వీరు సమర్ధించుకోలేదా? అలా సమర్ధించుకున్న తరువాత ఆంధ్రజ్యోతి వారి చర్యను తప్పు పట్టడం అంటే.. "దొంగే దొంగ అనడం" కాదా?? (ఈ లాంటి పదాలు కూడా వారు ఇదివరకే వాడారు).

   తిట్టడం అనేది తెలంగాణా సంస్కృతి కాదు, అది దొరల అహంకారానికి చిహ్నం. దాన్ని వెనకేసుకు రాకండి. ఇదే మేము చెప్పాలనుకున్నాం. కానీ, దాన్ని కొంత మంది సమర్ధించుకోవడం చూసిన తరువాత, "రోమను సంస్కృతి" గురించి తెలుసుకున్నాం. తిట్టి, మా సంస్కృతి/ మాండలికం అనేవారు రోమనులు. అలా తిట్టడం వారి సంస్కృతి. దీన్ని తెలంగాణాకంతటికీ ఆపాదించే ఉద్దేశ్యం లేదు. వారిలో తెలంగాణా వారూ ఉండొచ్చు, ఎవ్వరైనా ఉండొచ్చు. ఆ రోమనులతో మాట్లాడేప్పుడు .. వారి మధ్యలో ఉన్నప్పుడు మనం కూడా రోమనుల్లా ఉండాలి తప్పదు. లేకపోతే, వారు యదేచ్ఛగా తిడుతూ పోతారు. అఫ్ కోర్స్, మనం తిరిగి తిడితే వారు తిట్టడం ఆపేస్తారని కాదు. మరింతగా రెచ్చిపోవచ్చు. కానీ, తిరిగి మనం తిడుతున్నాం కదా. కనీసం, చెల్లుకు చెల్లు అని అనుకోవచ్చు.

   తప్పు వ్యక్తి చేసినా, ఒక సమూహం చేసినా, ఒక ప్రాంతం చేసినా, ఒక దేశం చేసినా తప్పు తప్పనే చెబుతాం. అలా చెప్పకూడదు, మా ఆత్మాభిమానం దెబ్బతింటుంది, అలా తప్పును ఎత్తి చూపడం సంస్కారం కాదు అంటే వినాలా? అలా జరగడానికి కారణం మీ స్వయంకృతం కాదా?

   ప్రపంచములో, అనేక మాండలికాలూ, భాషలు, సంస్కృతులూ ఉన్నాయి. అయినా ఇతరులతో మాట్లాడేప్పుడు, వారిని విమర్శించేప్పుడు గౌరవ ప్రధంగానే అవన్నీ చేసుకునేందుకు కొన్ని పద్దతులు ఉన్నాయి. ఎవరైనా ఆపద్దతులనే పాటిస్తారు. అలా కాకుండా, మా మాండలికములోనో, మా సంస్కృతిలోనో మేము చేస్తాం. భరించాల్సింది మీరే అంటే ఏమవుతుంది? ఇప్పుడు ప్రపంచములో ఉన్న చాలా దేశాలు నిరంతరం యుద్దాలు (కనీసం మాటల యుద్దాలు) చేసుకుంటూ ఉండేవి. మీ మాండలికం ఏదైనా ఎదుటి వారితో సంభాషించేప్పుడు .. కనీస జాగ్రత్తలు తీసుకోవాల్నా లేదా? మాండలికాలు, ఆత్మగౌరవాలు ఏ ఒక్క ప్రాంతానికో సొంతం కాదు అని గుర్తిస్తే బావుంటుంది. ఒకవేల ఏవ్యక్తైనా వీటిని పాటించనపుడు అతన్ని వెనకేసుకు రాకుండా, తప్పును తప్పు అని చెప్పి తప్పుకోవాలి. కానీ, ఇక్కడ అలా జరగ లేదు.

   సంస్కారం ఏది? నీచాతి నీచం ఏది?
   తిట్టిన వారు, వారిని వెనకేసుకు వచ్చిన వారు .. సంస్కారులట, దాన్ని ఎత్తి చూపిన వారు మాత్రం సంస్కార హీనులట?? ప్రశ్నిస్తే, అది మా సంస్కృతి / మాండలికం అని సమర్ధించుకోవడం నీచాతినీచం కాదట? ఆత్మాభిమానముతో తిరిగి "వారి మాండలికాన్ని" వారికే అప్పగించడం మాత్రం నీచాతి నీచమట. ఔరా, ఎంతటి గడుసరులు?

   ఇక మీదట ఈ పోస్టుఓ కామెంట్లు రాయకూడదని అనుకున్నాను. కానీ, జరిగిన దానికంతటికీ కారణం నేనే అని, వారు మాత్రం అగ్నిపుణీతులని చెప్పుకోవడం చూసిన తరువాత తిరిగి రాయాల్సి వచ్చింది. నిజానికి, ఈ కామెంటులో నేను కొత్తగా ఏమీ రాయలేదు. ఇప్పుటి వరకు రాసిన కామెంట్లలో వీటినే ప్రస్తావిస్తూ వచ్చాను. వాటినే తిరిగి మళ్ళీ రాయాల్సి వచ్చింది. కొంత మంది తాము ఏమి మాట్లాడుతున్నామో, ఇదివరకు తాము ఏమి అన్నమో, ఇతరులు ఎందుకు అలా రెస్పాండ్ అయ్యారో పట్టించుకోకుండా రాస్తూ ఉంటారు. వారికి సమాధానం ఇచ్చేప్పుడు, ఇలా రాసినవే మళ్ళీ రాయాల్సి వస్తుంది. తప్పదు మరి.

   Delete
  28. @శుక్రాచార్య,

   ఇంత వాదన జరిగినా మీ వరస మారలేదు చూశారూ, దానే మరొక మాటలో "ప్రాంతీయ దురహంకారం" అని కూడా అనవచ్చు.

   >>> నాలికలు కోస్తా అనడం, బొంద పెడతాను" అనడం, "లుచ్చా, లఫంగి" అని తిట్టడం మాండలికాలా లేక సంస్కృతులా ?

   ఇటువంటి మాటలు అవతలి పక్క వారూ మాట్లాడారు. వాటికి అనేక ఉదాహరణలూ ఇవ్వడం జరిగింది. అదంతా ఆవేశంలో మాట్లాడిన మాటలని ఉద్యమ వేడిలో భాగం అని వారూ అన్నారు. మరి మేం అది మీ సంస్కృతి అనడం లేదే?

   ముందు మీరు ఆ దురహంకారాన్ని వదిలివేస్తేనే అర్థవంతమైన చర్చకు ఆస్కారం వుంటుంది.

   Delete
 9. ఇలాంటి భాష ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భాజపా వారిని "ఎంగిలి తిన్న కుక్కలు" అన్నపటినుండి మొదలయ్యింది. ఇప్పుడు బాధ పడి లాభం ఏముంది?

  ReplyDelete
  Replies
  1. ఉందని అనుకుంటున్నాను జైగారూ. ఎటువంటి భాష చెడ్డది అని అనుకుంటున్నామో దానిని మనం వాడకుండా ఉండవచ్చును, అలా దుర్భాషలే వాడమని ఎవరూ నిర్భంధించరు కదా? ఈ దుస్సాంప్రదాయం ఎవరు మొదలు పెట్టినా సరే, వీలైనంయ్త త్వరగా దానికి మంగళం పాడటం‌ మంచిది. అది వేరే వారు చెయాలీ అని ఎదురు చూడటం దేనికి, మనతోనే ఆ సత్సాంప్రదాయం మొదలు కావచ్చును కదా?

   Delete
 10. హుందాగా ఉండే భాషను వాడటం అందరికీ శోభనిస్తుంది. ఒక ముఖ్యమంత్రిని బక్కోడుగా అభివర్ణించి, ఆంధ్రజ్యోతి సరైన భాషవాడిందని ఎవరూ భ్రమపడటం లేదు.

  ఇప్పుడు శ్రీకాంత్ చారి గారు "కలిసుందామన్న వారు ఎలాంటి కూతలు కూశారో" అంటూ తాము కూడా అదే రకమైన సంస్కారరహితమైన భాషనే ప్రయోగిస్తున్నా రేమిటి? ఆంధ్రజ్యోతి తప్పుడు భాషను వాడిందని బాధపడేవారూ, అక్షేపించేవారూ కూడా స్వయంగా తామూ అలాంటి స్థాయి భాషనే వాడి ఎటువంటిదిగా చాటుకుంటున్నారు తమ సంస్కారాన్ని? 'ఒక్క వ్రేలు చూపి యొరులను నిందింప వెక్కిరించు నిన్ను మూడు వ్రేళ్ళు' అన్నట్లుగా ఉంది వీరి పరిస్థితి. నాకు ఎవరి రాజకీయభావాలను గురించీ పట్టింపు లేదు. ఇక్కడ అటూ ఇటూ కూడా సరైన భాషప్రయోగించబడటం లేదు, ఇది మంచిది కాదన్నదే నేను ప్రస్తావిస్తున్నది.

  ReplyDelete
  Replies
  1. శ్యామలీయం గారు,

   కూఁత : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
   noun.

   1. a cry, shout;
   2. the cry of any animal.

   "కూత" యను శబ్దమున తమరికి సంస్కార విహీనమైనదేమి గనిపించినదో తెలియుట లేదు.

   బక్కోడు యను శబ్దమునకు ఎటువంటి దోషమును గనపడదు. కేవలము ఒక మనిషి యొక్క బక్క తనమును వ్రేలెత్తి చూపుటయే యక్కడ అభ్యంతరకరమైన విషయమని తెలియ వలెను. సందర్భమునకు తగిన వాక్యమును, అందలి పదములను వాడుట శ్రీక్రిష్ణదేవరాయల కాలము నుండియు గాంచుచుంటిమి.

   దూషించిరి యను సందర్భమున కూతలు కూసిరి యన్నను భావ భ్రష్టము గానేరదు. "కూతలు కూసిరి" యనుమాట తప్పు అయినచో "దూషించిరి" యనునది గూడ తప్పే గావలెను.

   తమకు సులభగ్రాహ్యమగు విధమున నొక యుదాహరణ మిచ్చెదను. "మంత్రములను జపించుట" యన్నది ఒప్పు, అటులనే "మంత్రముల గూయుట" యనుట అపచారము. "చెడుమాటల గూసెను" యనుట ఒప్పు, "చెడుమాటల జపించెను" యనుట తప్పు.

   Delete
  2. మహానుభావా శ్రీకాంత్ చారిగారూ,
   ప్రతిమాటకూ అర్థాలు మూడు రకాలుగా ఉంటాయి. రూఢము, యోగము, యోగరూఢము అని. వివరాలు ప్రక్కన బెట్టి ఒకటి రెండు సంగతులు ప్రస్తావిస్తాను. జలజము అటే పద్మం అని చెబుతారు సాధారణంగా. అది యోగార్థాల్లో ఒకటి మాత్రమే. కాని అదే రూడమైన అర్థం. నత్తగుల్లలనీ జలజములనే అనవచ్చును అంటే ఏం వాదిస్తాం? నిఘంటువులో అర్థం కనిపించినంత మాత్రాన ప్రతిమాటకూ వ్యావహారిక రూఢి ఉంటున్నదా? కూత అన్న పదానికి జంతువు అరుపుగా రూఢి ఉన్నది నిజమే కాని ఒక మనిషిని ఉద్దేశించి 'అలా కూశాడూ అన్నప్పుడు లోకవ్యవహారంలో నిందార్థమే రూఢిగా ఉందని మీకు తెలియదని నేను అనుకోను. ఈ మీ‌ వ్యాఖ్యలోనే అటువంటి అర్థం ద్యోతకం అవుతున్నది కదా. అలాంటప్పుడు "ఎలాంటి కూతలు కూశారో" అని మీరు అన్నది నిందార్థంలోనే అన్నది విస్పష్టం. అలాంటి విధమైన నిందాలాపాలభాష సంస్కారాన్నే నేను తప్పుబట్టినది. మీకు అది ఒప్పుగా అనిపిస్తే అలాగే కానివ్వండి. ఇతరుల భాషా సంస్కారాల తప్పులను మాత్రం మీరు అప్పుడు ఎత్తిచూప జాలరన్నది కూడా మీకు విదితం కావాలి.

   మరొకమాట. చెడుమాటలను ఉటంకిస్తూ అవి కూతలు అనవచ్చును అన్న తమ తీర్మానం చిత్రంగా ఉంది. ఈ‌ప్రకారం ప్రతస్పర్థుల మాటలను ప్రతిరాజకీయపార్టీవారూ చెడుమాటలవలెనే భావించి ఆవలి వారు కూస్తున్నారని అనటాన్ని హర్షించాలన్నమాట. బాగుంది. వీరి మాటలు వారికి కూతలు మరియు వారి మాటలు వీరికి కూతలు. ఇక శ్రవణానందకర మరియు నయనానందకరమైన తెలుగును ఇలా తయారు చేస్తామన్న మాట. నాకైతే ఇది అభ్యంతరకరమైన అలోచనా ధోరణియే.

   మీరు గ్రాంధిక భాషలో మీ వ్యాఖ్యను పెడుతూ, "బక్కోడు యను శబ్దమునకు ఎటువంటి దోషమును గనపడదు." అన్నారు. గ్రాంధికంలో భేషుగ్గా ఆ మాటను తప్పుపట్టవచ్చునన్నది మీరు గ్రహించాలి మరి. బక్కవాడు ఒప్పు కాని బక్కోడు అన్నది కాదు - అది గ్రామ్యమే,

   నేను శుధ్ధగ్రాంధికంలో వ్రాయగలిగి కూడా ఇక్కడ వ్యావహారికంలో వ్రాయటం జరిగింది కాని అన్యధా కాదని కూడా మీరు గ్రహించగోరుతాను.

   Delete
  3. మహానుభావులైన శ్యామలీయం గారూ,

   మీరు తరచుగా శుద్ధ గ్రాంధికం వాడుతుండడం చూసి ఆ విధంగా చెప్తే మీకు సులభంగా అర్థం అవుతుందేమో అని భావించాను. పోనీ లెండి, మరోసారి వ్యావహారికంలో ప్రయత్నిస్తాను.

   నిఘంటువు ప్రకారం కూత అన్న పదానికి అర్థాలు రెండు, ఒకటి అరుపు, రెండు జంతువు అరుపు. మొదటి అర్థం తీసుకున్నట్టైతే అది అరుపు, తిట్లు సాధారనంగా అరుస్తూనే తిడతారు, మంద్రమైన గొంతుతో కాదు గదా? అందుకే ఒకరు తిట్టిన తిట్లకు నేను "కూతలు" అన్న పద ప్రయోగం చేస్తే అది సంస్కారవిహీనం ఎలా అయిందో తమరికే తెలియాలి!

   "ఎలాంటి కూతలు కూశారో" అన్న పదప్రయోగం మీకు సంస్కార విహీనంగా కనిపించింది. అవునా? ఆదే అర్థం వచ్చేటట్టు "ఎలాంటి తిట్లు తిట్టారో" అంటే అది సంస్కార వంతమైనది అని మీ ఉద్దేశం, అవునా? "కూత" అనే పదానికి లేని సంస్కారం "తిట్టు" అనే పదానికి ఎలా వచ్చింది?

   శబ్దాల తప్పొప్పులను చూడవలసింది అవి గ్రాంధికములా, మాండలికములా అన్న విచక్షణతో కాదు. మీకు ఇటువంతి భావన ఉంది కనుకనే తెలంగాణా వారు ఏది మాట్లాడినా మీకు తిట్లవలె కనిపిస్తుంది. బహుశ మీ దృష్టిలో చదువు సంధ్యలు లేక ప్రాకృతిక భాషా మాట్లాడేవానికి సంస్కారమనేదే వుండదేమో! హతవిధీ!!

   ఉదాహరణకు ఒక వాక్యం చూద్దాం.
   1. XXX బక్కోడు, ఎక్వ దూరం నడువలేడు.
   2. XXX బక్కపలుచని వాడు కావడం వల్ల ఎక్కువ దూరం నడువ జాలడు.

   పై రెండు వాక్యాల్లో భాష వేరైనా నిందార్థకాలు కావు. రెండు వాక్యాలు కూడా "బక్క" అనే విశేషణాన్ని కలిగివున్నా, అది అతను ఎక్కువ దూరం నడువలేక పోతున్నందుకు చెప్పిన కారణం కాబట్టి తిట్టు కాదు.

   అదే ఈ వాక్యాలు చూడండి.

   1. XXXనే బండక్కొట్టినం, బక్కోడు YYY ఎంత?
   2. XXX గారిని కూడా బండకేసి బాదితిమి, బక్కపలుచని YYY ఎంతటి వాడు?

   ఈ రెండు వాక్యాల్లో రెండోది భాష గ్రాంధికమైనంత మాత్రాన సంస్కార వంతమైంది అని చెప్పడానికి లేదు. రెండూ సంస్కార విహీనాలే. ఆ వాక్యాల్లోని "బక్క" అనే పదం అతని శారీరిక లోపాన్ని ఎత్తిచూపుతూ, నిందార్థకం అవుతుంది. ఈ విషయం తెలుగు పండితులైన మీకు తెలియంది కాదు.

   మీ ప్రాంతంలో తిట్లను "కూతలు" అననంత మాత్రాన ఎక్కడా అనరు అనుకోవడం మీ హ్రస్వ దృష్టిని మాత్రమే చూపుతుంది. "కారు కూతలు" అని తిట్లకు ప్రతిపదార్థంగా వాడడం సర్వ సాధారణం, అది మీ దృష్టికి ఎందుకు రాలేదో?

   "విప్రు లెల్ల గూడి వెర్రి కూతలు కూసి - సతి, పతుల గూర్చి సమ్మతమున" అంటూ వేమన పద్యం కూడా వుంది. అంటే మీ దృష్టిలో వేమన కూడా సంస్కారహీనుడేనా?

   Delete
  4. శ్రీకాంత్ చారిగారూ,

   ఏదో విధంగా మా ప్రాంతం మీ‌ ప్రాంతం లాంటి ప్రస్తావనలు తీసుకొని రావటం అవసరమా? అన్నిరకాల ప్రాంతీయదృక్పధాల సంకుచితత్త్వం పైన నాకు కొద్దోగొప్పో వైమనస్యం ఉంది.

   మీరే మీ విపుల వ్యాఖ్యలో కూత అనేది తిట్టుపదంగా ఉందనీ చెబుతున్నారు, దానిని వాడటం సంస్కారయుతమే ననీ చెబుతున్నారు. అసలు తిట్టుపదాలు వాడకుండా ఉండటం మంచిదని చెప్పటం‌ నా ఉద్దేశం.

   వేమన విషయంలో మరో వివాదం రాజేయాలని చూడకండి. ఆయనొక విశృంఖలకవి -భాషాప్రయోగం విషయకంగా చూస్తే. ఒకానొక పద్యంలో "కంసలికిని మించి కడజాతి లేదురా" అని కూడా వ్రాసాడనీ, వేమనపద్యాలను ఆచ్చువేస్తున్నవారు విశ్వబ్రాహంణులు కావటంతో అది పంటికిందిరాయి వలే తోచి వారు ఆ పాదాన్ని "కంసలికిని మించి ఘనజాతి లేదురా" అని అచ్చులో‌ మార్చారనీ రాళ్ళపల్లివారి వ్యాసంలో చదివాను నాలుగుదశాబ్దుల క్రితం. ఆయన సభాయోగ్యం కాని మాటలు చాలానే వాడినప్పటికీ, ఆయనిది చాటుపద్య ధోరణి. వేమన శతకం అంటారే కాని అవి వందలకొద్దీ చాటువుల వంటి పద్యాలు. ఆయన భావశబలతా, సులభభాషా ఆయన్ను జనహితుణ్ణి చేసాయి. అదంతా ప్రక్కన బెట్టండి. వేమన ఇక్కడ చర్చాంశం కాదు,

   Delete
  5. శ్యామలీయం గారు,

   మీరు "కూత" అన్న పదం సంస్కారహీనం అన్నారు. ఎలాగో ఇంతవరకు వివరించలేక పోయారు.

   "కూత" అన్న పదం తిట్టు కాదు. తిట్టు భావాన్ని వ్యక్తం చేసే పదం.

   వారు దుర్భాషలాడిరి
   వారు చెడు కూతలు కూసిరి.

   పై రెండు వాక్యాలూ "తిట్టారు" అన్న భావం కోసం వాడబడ్డవి. "కూత" అన్న పదాన్ని "తిట్టు" అన్న పదానికి పర్యాయంగా వాడడం ఇది మొదటిసారికాదు. వాటిలో ఒకటి సంస్కారవంతంగానూ, మరొకటి సంస్కార విహీనంగానూ కనపడ్డం శొచనీయం.

   Delete
  6. >>> వేమనపద్యాలను ఆచ్చువేస్తున్నవారు విశ్వబ్రాహంణులు కావటంతో అది పంటికిందిరాయి వలే తోచి వారు ఆ పాదాన్ని "కంసలికిని మించి ఘనజాతి లేదురా" అని అచ్చులో‌ మార్చారనీ రాళ్ళపల్లివారి వ్యాసంలో చదివాను

   వేమన కాలం నాడు కులం పేరు ప్రస్తావించడం మామూలు విషయం. కాని ఇప్పుడు కులం పేరుతో కించపరచడం చట్టరీత్యా నేరం. కాబట్టి ఆ వాక్యాన్ని మార్చడాన్ని అర్థం చేసుకోవచ్చు. కాని "కూత కూయుట", "కారు కూతలు" వంటి ఉపయోగాలు, అప్పుడూ ఇప్పుడూ సర్వసాధారణం. ఎక్కడో ఎందుకు, మీ బ్లాగులోని వ్యాఖ్యల్లో కూడా నేను చూశాను. అప్పుడు మీకది సంస్కారహీనంగా కనిపించలేదు.

   అంతెందుకు? "ముఖ్యమంత్రి ని అని తానే మర్చి నా నా కూతలు కూసి" అంటు వాచ్చిన వ్యాఖ్యకు కాదా నేను సమాధానం ఇచ్చింది? అక్కడా మీకు అది సంస్కార హీనంగా కనిపించలేదు. కాని అదే పదం నేను సమాధానంగా వాడే సరికి మీకు అభ్యంతరం కనపడింది. మరి దీన్న్ని ప్రాంతీయ పక్షపాత తత్వం అనుకోవాలో మరోటి అంకోవాలో నాకు తెలియదు. మీరే ఆలోచించుకోగలరు.

   Delete
 11. ఈ రోజు ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ లోని పేరా.

  కేసీఆర్‌, ఆయన తనయుడు కేటీఆర్‌ హైదరాబాద్‌ను అలా అభివృద్ధి చేస్తాం- ఇలా అభివృద్ధి చేస్తాం అంటూ అడ్డం పొడుగు ప్రకటనలు చేస్తూ ప్రధాన సమస్యలను విస్మరించారు. కేంద్రం వద్ద పనులు జరగాలన్నా లాబీయింగ్‌ చేసుకోవలసిన పరిస్థితి ఉంది. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నారో ఒక్కసారి చూద్దాం. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ర్టానికి ఎన్నో పనులుంటాయి. ఆ కారణంగా ఆమె భర్త పరకాల ప్రభాకర్‌ను మీడియా సలహాదారుడిగా కేబినెట్‌ హోదా ఇచ్చి నియమించుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా నియమితులైన వేణుగోపాలాచారికి కేసీఆర్‌ ఇంతవరకు కేబినెట్‌ హోదా కూడా ఇవ్వలేదు. రాజధాని నిర్మాణంతో పాటు ఇతర నగరాల అభివృద్ధికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సహకారం అవసరం కనుక చంద్రబాబునాయుడు ఆయనను పదేపదే ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి కేసీఆర్‌ చేస్తున్నదేమిటి? ఆ నాయుడు ఈ నాయుడు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నా రని నిందిస్తూ చప్పట్లు కొట్టించుకుంటున్నారు. వెంకయ్యనాయుడు ఇప్పుడు భారత ప్రభుత్వంలో మంత్రి. ఆయనతో ఎన్నో అవసరాలు ఉంటాయి. అలాంటప్పడు ఆయనను మంచి చేసుకోవలసింది పోయి చంద్రబాబుతో కలిపి నిందించడం వల్ల ప్రయోజనం ఉంటుందా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూసి కేంద్ర మంత్రులే వణుకుతున్నారు. పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఆయన అంతలా పట్టు బిగించారు. ఇది గమనించిన చంద్రబాబు నాయుడు ఒక అడుగు తగ్గి ప్రధానమంత్రిని సందర్భం వచ్చినప్పుడల్లా ఇంద్రుడు-చంద్రుడు అని పొగుడుతున్నారు

  వారు సెలవిచ్చిన ప్రకారం నిధులు కావాలంటే కాకా పట్టాలట! వారి బంధువులకు పదవులు అప్పగించాలట! ఇంద్రుడు చంద్రుడు అని పోగాడాలట! మరి గతంలో మోడీ, అంతకు ముందు ఎన్టిఆర్ మన్మోహన్ను, ఇందిరాను ఎంతలా పొగిడారో! ఇవీ జ్యోతి వారి ప్రమాణాలు! మరి అవే ప్రమాణాలను రాష్ట్రంలో నిషేధం ఎత్తి వేయించుకోవడానికి వారు ఎందుకు ఉపయోగించుకోవడం లేదని అడిగితె రాధాకృష్ణ గారు ఏం చెపుతారో?

  ReplyDelete
  Replies
  1. మిగిలిన కేంద్ర మంత్రులకు భార్యా భర్తలు, పిల్లలు, సాలీ సాలాలు, చుట్టాలు పక్కాలు, చంచాలు వగైరా గణాలు ఉండరా? వాళ్ళందరినీ కూడా ఏదో ఒక పదవితో సన్మానిస్తే లేదా అది కుదరకపోతే నలుడు కుబేరుడు అంటూ పొగడితే ఆంధ్రకు రత్నాల వర్షం కురుస్తుందో ఏమో? ఇదీ ఆలోచించండి వేమూరి వారూ!

   Delete
  2. @జై గొట్టిముక్కల,
   తిట్టుకుంటే విడిపోవోచ్చు కానీ కలిసి ఉండలేం. అంచేత వారిని "సమైక్య" వాదులు అనడం కంటే తెలంగాణా వ్యతిరేకులు అనాలి.
   ---మీరు చాలా ఫోరంస్ లో ఈ లాజిక్ వాడటం చూశాను. ఇదే లాజిక్ విభజన వాదానికి అప్లై చేద్దాం. "మంచి గా మాట్లాడితే విడిపోలేం. పైగా కలిసి ఉండాల్సి రావొచ్చు.మంచిగా మాట్లాడుకోవాలని ఆశించేవారిని విభజన వాదులనలేం. సమైక్య వ్యతిరేకులనాలి."

   Delete
  3. కాసేపు ఈ కాకా పట్టడం, బంధువులకు పదవులు అప్పగించడం, ఇంద్రుడు చంద్రుడు అని పొగడటం పక్కన పెడదాం.

   తిడితే పనులు జరుగుతాయా? మీరే ఆలొచించండి: నాకు మీతో పని వుంది. నేను మిమ్మల్ని తిడితే మీరు నాకు కావలసిన పని చేసి పెడతారా? మిమ్మల్ని 'ఇంద్రుడు చంద్రుడూ అని పొగడటం మూలాన నాకు వచ్చే నష్టం లేదు - కాసేపు కంఠ శోష తప్పితే.

   కేసీఆర్ అజెండా యేమిటి? తిట్టడం. తెలంగాణాలో టీఆరెస్ పార్టీ వునికి కోసం చంద్రబాబుని తిట్టాలి. మైనారిటీల వోట్ల కోసం మోడీని తిట్టాలి.

   ఆంధ్రజ్యోతి రాసిన ఒక ముఖ్యమైన వాక్యం: కేంద్రం వద్ద పనులు జరగాలన్నా లాబీయింగ్‌ చేసుకోవలసిన పరిస్థితి ఉంది.

   పొగిడితే పనులు జరుగుతాయో లేదో తెలీదుగానీ తిడితే మట్టుకు ఖచ్చితంగా జరగవు. కేంద్ర సహకారం లేనిదే రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా పరిపాలన కొనసాగించలేదు. ఈ విషయం గ్రహిస్తే మంచిది. ఈ విషయాన్నే ఆంధ్రజ్యోతి రాసింది.

   Delete
  4. @ఉలిపికట్టె:

   "సమైక్య వ్యతిరేకులనాలి"

   అంత వినసొంపుగా ఉన్నట్టు లేదు. ఇంతకంటే "వేర్పాటువాదులు" అని ఎప్పటినుంచో వాడుతున్న "ముద్దుపేరు" బెటరేమో?

   Delete
 12. తెలుగుదేశం అభిప్రాయం బక్కోడు అంటే సన్నగా ఉన్నవాడు కాదు అనుకుంటున్నా, వాళ్ళ అభిప్రాయం ప్రకారం ప్రజా బలం లేకుండా గెలిచిన వాడు అయి ఉండవచ్చు అందుకే ఆంధ్రజ్యోతి ప్రచురించి ఉండ వచ్చు!
  అదే కాకుండా తెలంగాణలో ఆమోద యోగ్యమైన భాషలోనే ప్రచురణలు ఉండాలి అన్నట్టు కొందరు వ్యవహరిస్తున్నారు అందుకే, అక్కడ తెలుగుదేశం మాట్లాడిన భాషను వెంటనే ప్రచురించారు!

  ఇక పొతే అసలు ప్రశ్న ఇక్కడ మనం అడగవలిసినది, నిజంగా kcr ప్రజల బాధలు పట్టించుకోవట్లేదా అని!

  ReplyDelete
  Replies
  1. గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,

   >>> అదే కాకుండా తెలంగాణలో ఆమోద యోగ్యమైన భాషలోనే ప్రచురణలు ఉండాలి అన్నట్టు కొందరు వ్యవహరిస్తున్నారు అందుకే, అక్కడ తెలుగుదేశం మాట్లాడిన భాషను వెంటనే ప్రచురించారు!

   ఇక్కడ ప్రశ్న వేసింది "బక్కోడు" అన్న పదం వాడినందుకు కాదు. అలా కాక "బక్క పలుచని వాడు" అనో మరొ గ్రాంధిక పదమో పెడితె అది దూషణ కాకుండా పోదు. అతని శారీరిక లక్షణమైన బక్కతనాన్ని ఎత్తి చూపుతూ ఒకరు మాట్లాడితే అది ఎంతవరకు సబబు అని.

   పోనీ మీరు చెప్పినట్టుగానే రెపు ఇంకొకడెవడైనా "బొల్లి బాబు" అని పక్క రాష్ట్రపు ముఖ్యమంత్రిని సంభోధిస్తే అది కూడా ప్రచురించొచ్చంటారా మీరు. దాన్ని కూడా హెడ్‌లైను వేసి ప్రచురిస్తుందా ఆంధ్రజ్యోతి?

   Delete
 13. శ్రీకాంత్ చారి గారు, అప్పుడు NTR అవలంభించిన పద్దతి
  ఆయన అధిపతి అయినప్పుడు ఇందిరాగాంధీ ఇక్కడ వసూలు అయిన పన్నులు ఇక్కడకు రాకుండా ఆపేసే వారు, దాని వల్ల కరువు వచ్చింది, దాంతో ఆయన state tax అని కొత్తగా ప్రవేశ పెట్టారు, దాంతో అభివృద్ది చెయ్యగలిగారు!
  కానీ ఇప్పుడు పరిస్థితులలో state tax వల్ల లాభం తక్కువ ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగులు ఎక్కువ, ధనవంతులు వ్యాపారస్తులు తక్కువ, ఉద్యోగస్తులు కట్టే Tax Central Government కు వెళుతుంది, కాబట్టి నిధులు అక్కడ నుంచీ తెచ్చుకోవాలి! లేకపోతె ప్రతీ state లో జరిగే అన్ని పనులకు ఆ state లోనే పన్ను చెల్లించే విధానం తేవాలి!
  వాటిలో అతిముఖ్యమైన
  Mutual funds
  Shares
  F&O
  Currency Trading
  Exports

  ReplyDelete
  Replies
  1. @గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు

   Your explantion may be valid for NTR, what about Modi, wasn't he interested in getting funds from center?

   Delete
  2. మీరు ఇక్కడ రెండు విషయాలు అర్ధం చేసుకోవాలి!
   ౧. ఇందిరాగాంధీ congress గెలవలేదు అని రాష్ట్రం మీద కక్ష కట్టింది, దానికి ఇంకో కారణం కూడా ఉంది ఆమె చేసిన మోసాలు ఎండగట్టారు కాబట్టి!
   ౨. మోడీ గెలవలేదు కాబట్టి కక్ష కట్టలేదు, కానీ మోడీ కోరుకుంటున్నది దూషణలు కాదు సఖ్యత!

   Delete
  3. నేనన్నది మీరు సరిగా అర్థం చేసుకోలేదు. మోడీ CMగా పదిహేనేళ్ళ పాలనలో ఎన్నిసార్లు కేండ్రానికి చెంచాగిరీ చేశాడూ అని.

   Delete
 14. ముఖ్యమంత్రి పదవిని బట్టి ఆ వ్యక్తికి ప్రత్యేక కొమ్ములుండకూడదు. ఎవరినీ అలా వ్యక్తిగత ఆకారాన్ని బట్టి దూషించడం తప్పు. కుంటోడా... గుడ్డోడా.... అనడం వారి అంగవైకల్యాన్ని దెప్పిపడవడం అవుతుంది. అది శాడిజమే అవుతుంది. మానసిక వికలాంగులు మాత్రమే అలా మాట్లాడతారు. చాలా సందర్భాలలో ఈ మానసిక వికలత్వం సమాజంలో ఓ అలవాటుగా ఉన్నది. ఇది మారాలి.

  ముఖ్యమంత్రిని అనగూడదు. ముఖ్యమంత్రీ అనకూడదు. రాజకీయ నేతల భాషకు హద్దు లేకుండా పోతున్నది. మహిళలపట్ల గౌరవంగా ఉండే ఎన్.టీ.ఆర్ శాసనసభలో ఓ మహిళా ఎమ్మెల్యేని అసభ్యంగా మాట్లాడి తరువాత క్షమాపణ చెప్పినట్లు గుర్తు. ఇలా భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేక వచ్చేవి కొన్నీ, భాష-యాస అలవాట్లను బట్టి వచ్చేవి కొన్ని అయితే, కావాలని ఓ వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక కించపరచే దుర్మార్గపు మాటలు కొన్నీ ఉంటున్నాయి.కావాలని కించపరచడం మాత్రం క్షమించరాని నేరమని నా అభిప్రాయం.

  రేవంత్ రెడ్డిని పొట్టోడంటూ కొందరు ఇటీవల వ్యాఖ్యానించడం చూశాను. అదీ అతని ఆకారాన్ని కించపరచడమే.

  ఇక ఆంధ్రజ్యోతి అసభ్యం గురించి తెలిసిందే. దీనినే ఆ పత్రిక దమ్ముగా అభివర్ణించుకుంటుంటుంది. ఒక్క ఆంధ్రజ్యోతే కాదు మీడియాలో చాలా పత్రికల స్వంత ఎజెండాలకు ఎలా పాతర వేయాలా? అనేది కూడా చర్చనీయాంశమే ఇప్పుడు.

  ReplyDelete
  Replies
  1. >>> మీడియాలో చాలా పత్రికల స్వంత ఎజెండాలకు ఎలా పాతర వేయాలా? అనేది కూడా చర్చనీయాంశమే ఇప్పుడు.

   పత్రికలకి స్వంత ఎజెండాలుండడం తప్పు కాదండీ కొండలరావు గారు. విశాలాంధ్ర, ప్రజాశక్తి లాంటి పత్రికల్లక్కూడా స్వంత ఎజెండాలుంటాయి.

   తొడేలు మెకతోలు కప్పుకున్నట్టు వాటి ఎజెండాలను బయటికి కనపడకుండా దాచుకుని జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నించడమే తప్పు.

   Delete
  2. పత్రికలు స్వంత ఎజెండాలంటే వ్యక్తిగత ప్రయోజనాలతో కూడినవి ఉండకూడదనేది నా ఉద్దేశం శ్రీకాంత్ చారి గారు. ఆంధ్రజ్యోతి-సాక్షి-ఈనాడు-నమస్తే తెలంగాణాలకుండే ఎజెండాలకు ప్రజాశక్తి-విశాలాంధ్రలకు ఉండే ఎజెండాలకు తేడా ఉంటుంది. ఇందులో మళ్ళీ నమస్తే తెలంగాణా ఎజెండాను జ్యోతి-సాక్షి-ఈనాడులతో పోల్చలేము.ప్రస్తుతం ఆంధ్రజ్యోతి - సాక్షి లు కొంచేం బరితెగించాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కావాలని కొందరికి లేదా కొన్ని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ వ్రాసే ఎజెండాకు , వ్యవస్తీకృత అంచనాలతో ఉండే ఎజెండాలకు పొంతన పెట్టకూడదు.

   Delete
  3. కొండలరావు గారు,

   నమస్తే తెలంగాణా పత్రిక తెలంగాణా పక్షపాతి. ఆ విషయంలో దాపరికమేదీ లేదు. దాన్ని ఈనాడు, జ్యోతి పత్రికలతో కలపి చూడ్డం సరికాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి లోలోపల ప్రాంతీయ పక్షపాతం వహిస్తూ బయటికి మాత్రం తటస్థంగా ఉన్నట్టు నటిస్తాయి, జనాన్ని భ్రమింప జేస్తాయి.

   విశాలాంధ్ర, ప్రజాశక్తి ఎజెండా కమ్యూనిజమే ఐనా మళ్ళీ దేని ప్రత్యేక ఎజెండా దానికి వుంది లెండి. అలాగే నమస్తే తెలంగాణాది తెలంగాణా వాదపు టెజెండా.

   Delete
  4. రేవంత్ రెడ్డిని పొట్టోడంటూ కొందరు ఇటీవల వ్యాఖ్యానించడం చూశాను
   >>
   అలా అన్నదెవరు!ఖచ్చితంగా తెదెపా వారు కాక తెరాసా వారే అయి వుండాలి, అవునా?కాదా?
   పొట్టోడు - బక్కోడు.
   మరి చెల్లుకు చెల్లు సున్నకి సున్న హళ్ళికి హళ్ళి - ఇంకేంటి గొడవ?

   Delete
  5. తె.దే.పా తెరాసా వారి నోటిదూల చెల్లుకు చెల్లు అయితే ఎలా? ప్రజల బాగోగులను చూడమనికదా ఈ పోటుగాళ్లను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నది?

   Delete
  6. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?వుద్యమ కాలంలో యెట్లా మాట్లాడినా నాతో సహా యేదోలే వుద్యమం వుద్రేక ఆర్చింది అని సర్దుకు పోయాం!కానీ ఇప్పుదు తను యే పదవిలో వున్నాడో అతనికి తెలియదా?తను మాట్లాడుతున్న భాష ఆ పదవికి వన్నె తెచ్చేదిగా వుండాలనే విషయం మరొకరు చెప్పకుండానే తెలియాలి గదా!అంత ఖచ్చితంగా టైమింగు పాటిస్తూ వ్యూహత్మకంగా ఆ బానాలు వొదులుతున్నాదని మీకు తెలియదం లేదేమో కానేఎ నాకు తెలుసు. ప్రభుత్వాధినేతయే విశంఖలంగా వ్యవహరిస్తుంతే అడిగేవాడు లేని చోట అతనికి చెప్పి మార్పు తీసుకు రాలేని స్థితిలో ఇతరుల్ని తప్పు పట్టడం దేనికి?కేసీఆర్ అంత వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నా కేవలం నోటిదూల అనుకుంటే అది అమాయకత్వమే తప్ప మరొకటి కాదు?!

   Delete
  7. కేసీఆర్ డెలిబరేట్ గా యేమి అన్నా నోటిదూల పోనిద్దురూ దగ్గిర్నుంచి శంకరాచార్యుల వారికి అప్పలాచార్య్ల వారి భాష్యం లాగా శ్రీవారి మాటలను ఇదిగో ఈ విధముగా అర్ధము చేసుకొనవలెనే తప్ప మీ ఇష్టము వచ్చినట్లు అర్ధము చేసుకొనరాదు అని సూత్రీకరిస్తారు.యెదటివారు కూడా తమవలెనే తమ భాష లోనే మాట్లాడినచో అది నేరము అని తీర్మానించెదరు.అనగా ఆవిధముగా తాము మాత్రమే మాట్లాడవలయును అని భావమా?

   Delete
  8. లెస్స పలికితిరి సూరానేనివారూ!

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి