నేను ఈ మధ్య మార్క్సిజం గురించి వ్రాయకపోవడం వల్ల మిత్రుల నుంచి మెయిల్స్ వస్తున్నాయి, ఎందుకు వ్రాయడం లేదో అడుగుతూ. వ్యక్తిగత పనులలో నిమగ్నమై ఉన్నప్పటికీ మిత్రుల కోరిక వల్ల మళ్ళీ వ్రాయాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా నాకు ఎన్ని పనులు ఉన్నా మిత్రుల కోరిక మేరకు కొత్త వ్యాసాలు వ్రాస్తాను.

ఆ మధ్య మన తెలుగు బ్లాగుల్లోనే చర్చ జరిగింది, "స్కూల్ పుస్తకాలలోని నీతులు మనిషిని నీతివంతునిగా ఎందుకు మార్చలేకపోతున్నాయి?" అని. అప్పట్లో నేను దాని గురించి స్పష్టంగా చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పగలను. పిల్లలు స్కూల్ పుస్తకాలలో చదివినది ఒకలా ఉండి సమాజం ఇంకోలా ఉంటే పిల్లలు సమాజ ప్రభావానికే ఎక్కువ లోనవుతారు. హాస్తల్‌లో ఉండి చదువుకుంటూ సమాజాన్ని చూడకుండా పెరిగిన పిల్లలైతే స్కూల్ పుస్తకాలలో వ్రాసినవే పరమ సత్యాలు అనుకుంటారు కానీ ఇంటిలో ఉంటూ స్కూల్‌కి వెళ్ళే పిల్లలు అలా అనుకోరు. వాళ్ళు ఇంటిలో ఉంటూ స్కూల్‌కి వెళ్తూనే సమాజాన్ని గమనిస్తారు. తాము స్కూల్ పుస్తకాలలో వ్రాసినవాటిని నమ్మాలా?, సమాజంలో చూసినవాటి వల్ల తమకి కలిగిన భావాలని నమ్మాలా? అనేది వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయించుకుంటారు. 

మనిషి పుట్టినప్పుడు అతనికి ఏమీ తెలియదు. మొదట్లో అతని మెదడు ఖాళీగానే ఉంటుంది. మంచి భావాలైనా, చెడు భావాలైనా అతను సమాజాన్ని చూసే నేర్చుకుంటాడు. కుల వ్యవస్థ ఒక సాంఘిక దురాచారం అని స్కూల్ పుస్తకాలలో నొక్కి చెపుతూ వ్రాసినా చదువుకున్నవాళ్ళు కూడా కుల కట్టుబాట్లని ఎందుకు నమ్ముతున్నారో ఇక్కడే అర్థమైపోతుంది. కుల కట్టుబాట్లని నమ్మకూడదని పిల్లలు స్కూల్ పుస్తకాలలో చదువుతారు కానీ నిజ జీవితంలో వాళ్ళ కుటుంబ సభ్యులూ, బంధుమిత్రులందరూ కుల కట్టుబాట్లని నమ్మడం చూస్తారు. పిల్లలపైన స్కూల్ పుస్తకాలలో చదివినవాటి ప్రభావం కంటే నిజ జీవితంలో చూసిన వాటి ప్రభావమే ఎక్కువగా పడుతుంది. మనిషి జీవితానికి సమాజం అనేది పునాది అయితే చదువు అనేది కేవలం ఉపరితల అంశం. ఉపరితలం అనేది పునాదులని కదిలించదు.

మనిషికి సహజమైన ఆలోచన శక్తి ఉంటుంది. కొంత మంది తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నమ్మేవాటిని కూడా నమ్మరు. హిందూ సమాజంలో మేనత్త వరసైన స్త్రీని పెళ్ళి చేసుకోవడం నిషిద్ధం కానీ కొన్ని సమాజాలలో అది నిషిద్ధం కాదు. లైబ్రరీలో ఆంథ్రొపాలజీ పుస్తకాలు చదివేవాళ్ళకి ఈ విషయం తెలిసిపోతుంది. తాము హిందూ సంప్రదాయాన్ని నమ్మాలా?, ఇతర సమాజాన్ని చూసి తెలుసుకున్నదాన్ని నమ్మాలా? అనేది ఆలోచించేవాళ్ళు కూడా ఉన్నారు. ఏ ఆలోచన అయినా ఏదో ఒక దాన్ని చూస్తేనే కలుగుతుంది కానీ శూన్యం నుంచి కలగదు. మూఢనమ్మకాలైనా సరే అలాగే కలుగుతాయి. "మనిషి చనిపోయిన తరువాత అతని జీవం ఏమవుతుంది?" అనే ఆలోచన పుట్టుక, చావులని చూడడం వల్లే మనిషికి కలుగుతుంది. మరణానంతర జీవితం (life after death లేదా afterlife) అనేది మూఢనమ్మకమే కానీ "మరణం తరువాత జీవితం ఉంటుందా? లేదా?" అని విచారించే శక్తి మెదడు అభివృద్ధి చెందిన మనిషికే ఉంటుంది, అది జంతువులకి ఉండదు. మూఢనమ్మకాలు మనిషికి మాత్రమే కలుగుతాయి కానీ అవి జంతువులకి కలిగే అవకాశం లేదు. మూఢనమ్మకాలని వదులుకునే కొత్తభావాలు కూడా అదే అభివృద్ధి చెందిన మెదడులో కలుగుతాయి. మూఢనమ్మకాలని నమ్మేవాడికైనా, నమ్మనివాడికైనా మెదడు ఒకటే కానీ వాళ్ళు సంఘటనలని చూసి ఏర్పరుచుకున్న అవగాహనలే వేరువేరుగా ఉంటాయి.

ఏమీ తెలియనప్పుడు ఏదైనా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. మనిషి పుట్టినప్పుడు మొదట తన ఇంటిలో మాట్లాడే భాషని విని నేర్చుకుంటాడు. ఫొనాలజీలోనైనా, వాక్య నిర్మాణంలోనైనా ఇంటిలో విన్న దాన్ని అనుకరిస్తాడు. తనకి భాష అలవాటైపోయిన తరువాత వేరేవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అతను గమనించడు. తాను ఉపయోగిస్తున్న ధ్వనులకీ, అవతలివాడు ఉపయోగిస్తున్న ధ్వనులకీ మధ్య తేడా ఉన్నా అతను గమనించకపోవచ్చు. British Englishలో దంతాలతో పలికే స్పర్శములు (dental plosives) అయిన "త, ద, న"లని ఉపయోగిస్తే Indian Englishలో నాలుక వెనక్కి తిప్పి పలికే స్పర్శములు (retroflex plosives) అయిన "ట, డ, ణ"లని ఎందుకు ఉపయోగిస్తున్నారో ఇక్కడ అర్థమవుతుంది. అవతలి వాళ్ళ మాటలలో తేడా గమనించే సమయం లేకపోవడం వల్ల మనవాళ్ళు British Englishలో కూడా retroflex plosives ఉన్నాయనుకుంటారు కానీ ఇది మెదడు యొక్క లోపం వల్ల కాదు. సామాజిక విషయాలలో కూడా చాలా వాటిని ఇలాగే గమనించకుండా ఉండిపోతాం. అది మనం వ్యక్తిగత పనుల్లో నిమగ్నమై వేరే ఆలోచనలు రాకపోవడం వల్ల కావచ్చు లేదా సామాజిక కట్టుబాట్లని ఎదిరించే ధైర్యం లేక కావచ్చు.

హిందూ సమాజంలో పుట్టి పెరిగినవాడు మేనత్త వరసైన స్త్రీని పెళ్ళి చేసుకోవడం పాపమనుకుంటాడు. అతని చిన్నప్పుడే సమాజ ప్రభావం వల్ల అతను ఆ అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటాడు. తన అభిప్రాయాన్ని పున:పరిశీలుంచుకోవాలనే ఆలోచన అతనికి పెద్దైన తరువాత రాదు. అతనికి సామాజిక కట్టుబాట్లని ధిక్కరించే ధైర్యం లేకపోవడం వల్ల లేదా వేరే సమాజాలలో ఆచారాలు ఎలా ఉన్నాయో తెలియకపోవడం వల్ల అలా జరుగుతుంది కానీ కేవలం ఆలోచించే సమయం లేకపోవడం వల్ల కాదు. ఆంథ్రొపాలజీ పుస్తకాలు చదివినవాళ్ళకి మేనత్తని పెళ్ళి చేసుకునే ఆచారం కొన్ని సమాజాలలో ఉందనే విషయం తెలుస్తుంది. వాళ్ళలో కొంత మందైనా ఈ విషయం గురించి ఆలోచించి ఇది తప్పా?, కాదా? అనే నిర్ణయానికి రావచ్చు. చలం గారు తన పెదనాన్న గారి కూతురిని ప్రేమించారు. ముస్లింలలో కజిన్స్‌ని పెళ్ళి చేసుకునే ఆచారం ఉందని ఆయనకి తెలిసి ఉండొచ్చు. అందుకే ఆయన హిందూ సమాజంలో కూడా కజిన్ మేరేజెస్‌ని అనుమతించాలని కోరుతూ  శృంగేరి పీఠంవాళ్ళకి ఉత్తరం వ్రాశాడు. కొంత మందికి ఒక సందేహం వస్తుంది. "వరసలు పాటించకపోవడానికి మతంతో గానీ భావజాలంతో గానీ సంబంధం ఏమిటి? అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్ళకి ఆ పట్టింపులు ఉండవు. వాళ్ళకి మేనత్త అయినా, పిన్ని అయినా తేడా ఉండదు కదా!" అనేది వాళ్ళ సందేహం. అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్ళకి ఎలాంటి నియమాలూ ఉండవు అనేది నిజమే కానీ వరసల నియమం (kinship terminology) ఒక్కో సమాజంలో ఒక్కోలాగ ఉంటాయి అనేది కూడా నిజమే కదా. మన సమాజంలో ఉన్న వరసల నియమమే సరైనదనీ, వేరే సమాజాలలో ఉన్న వరసల నియమాలు సరైనవి కావనీ అనుకోవడం సంకుచితత్వమే అవుతుంది. ఇన్సెస్త్ వేరు, దగ్గర బంధువుల మధ్య వివాహాలు వేరు. ఇన్సెస్త్ అంటే సొంత కుటుంబ సభ్యులతో శారీరక సంబంధం పెట్టుకోవడం. ఇది పూర్తిగా అసామాజికమైన పని కనుక దీన్ని ఎవరూ సమర్థించరు. నాగరికత తెలియని రోజుల్లో తల్లికొడుకులు పెళ్ళి చేసుకునే ఆచారం కూడా ఉండేది. అంగాలు మనిషిని ప్రభావితం చేస్తాయి. కనుక మొదట్లో సొంత కుటుంబ సభ్యుల మధ్య వివాహాలని నిషేధించారు, ఆ తరువాత దగ్గర బంధువుల మధ్య వివాహాలని నిషేధించడం, వరసలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వరసల నియమం అనేది పరిణామ క్రమంలో భాగంగా ఏర్పడింది. కానీ ఈ పరిణామం ఒక్కో సమాజంలో ఒక్కోలాగ జరిగింది. సమాజం నుంచి సంప్రదాయం పుడుతుంది కానీ సంప్రదాయం నుంచి సమాజం పుట్టదు కదా!?.

దేవుడు ఉన్నాడా? లేదా? అనే విషయం నేను చర్చించదలచుకోలేదు. కేవలం దేవుడు లేడు, దెయ్యాలు లేవు అని తెలుసుకుంటే ఏదీ రాదు కానీ సమయం వచ్చింది కాబట్టి దేవుడు లేదనడానికి నేను కొన్ని ఆధారాలు చూపించదలిచాను. కొంత మంది వ్యవస్థీకృత మతాన్ని నమ్మరు కానీ ఈ సృష్టికి మూలమైన దేవుడు ఎక్కడో ఉన్నాడని నమ్ముతారు. దీన్ని deism (దైవికవాదం) అంటారు. ఆలోచన అనేది అనుభవం నుంచి పుడుతుంది కానీ శూన్యం (ఖాళీ) నుంచి పుట్టదు. దేవుడు సృష్టిని చెయ్యకముందు ఏముండేది? ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఏమీ కనిపించవు, ఏవీ వినిపించవు, తాకేది కానీ వాసన చూసేది కానీ రుచి చూసేది కానీ ఏదీ ఉండదు. అనుభవానికి అందేది ఏదీ లేనప్పుడు దేవుడు ఎలా కదిలాడు? అతనికి సృష్టిని చెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఏమీ లేనప్పుడు ఏమీ చేసే అవకాశం ఉండదు. అటువంటప్పుడు అతనికి సృష్టిని చెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చింది? లక్షలు, కోట్ల అణువులు కలిస్తే పదార్థం ఏర్పడుతుంది. పదార్థం-పదార్థం కలిస్తే పరిణామం ఏర్పడుతుంది. దీనికి సృష్టికర్త అవసరం లేదు.

ఆలోచన మొదట పుట్టి వస్తువు తరువాత పుట్టిందనే అభిప్రాయం ఒకప్పుడు యూరోప్‌లో బాగా వ్యాప్తిలో ఉండేది. ప్రజలలో వ్యక్తిగత చైతన్యం పెరగకుండా చెయ్యడానికి అప్పటి పాలకవర్గాలు ఆ భావనని ప్రోత్సహించాయి. ఆ భావన తప్పని నిరూపించడానికి మొదట ప్రయత్నించినది ఫ్రెంచ్ భౌతికవాదులు. మనిషి కలప దుంగని చూస్తేనే అతనికి ఆ దుంగని చెక్కి దానితో బల్ల తయారు చేసుకుని కూర్చోవచ్చు అనే ఆలోచన వస్తుంది కానీ శూన్యాన్ని చూస్తే ఆ ఆలోచన రాదు. ఫ్రెంచ్ భౌతికవాదులు దీని ఆధారంగా వాదనలు చెయ్యడం వల్ల వస్తుగతానికి ప్రాధాన్యత పెరిగింది. ఏ ఆలోచన అయినా భౌతిక పునాదుల మీదే నిలిచి ఉంటుందని స్పష్టంగా తెలిసొచ్చింది. ఫ్రెంచ్ భౌతికవాదుల సూత్రీకరణలు లుద్విగ్ ఫోయర్బాఖ్ లాంటి జెర్మన్ భౌతికవాదులని బాగా ప్రభావితం చేశాయి, అలాగే కార్ల్ మార్క్స్‌ని కూడా. Man makes religion but religion doesn't make man అన్నది ఇందుకే.

Human beings are guided by self-interest అని ఆదమ్ స్మిత్ అన్నాడు. మనిషిని సొంత ప్రయోజనాలు నిర్దేశిస్తాయి. మనిషి తన అవసరం కోసమే ఏదైనా చేస్తాడు, చదువు నేర్చుకునేది కూడా అందుకే. తాను స్కూల్ పుస్తకాలలో చదివినవి తన నిజ జీవితానికి దూరంగా ఉన్నాయనిపిస్తే అతను వాటిని మర్చిపోతాడు. సామాజిక పరిస్థితులు మారితే వాళ్ళ అభిప్రాయాలు మారుతాయి కానీ నీతి పాఠాలు చెప్పడం వల్ల మాత్రం మారవు. 1950లలో మన దేశంలో చక్కెర కర్మాగారాలు కట్టడానికి నెహ్రూ అమెరికాకి సాంకేతిక సహాయం అడిగితే వాళ్ళు చెయ్యలేదు కానీ రష్యా మన దేశానికి ఆ సహాయం చేసింది. సామాజిక ప్రయోజనాల కంటే వ్యక్తి ప్రయోజనాలే గొప్ప అని నమ్మే అమెరికాలో స్కూల్ పుస్తకాలలో స్కూల్ పుస్తకాలలో ఎన్ని బైబిల్ ప్రవచనాలు వ్రాసినా అక్కడివాళ్ళకి ఇతరులకి సహాయం చేసే గుణం అలవడుతుందా?
*Republished
--------------------------------------------------
మీరూ జన విజయం శీర్షికకు రచనలు పంపాలనుకుంటే వివరాలకు ఇక్కడ నొక్కండి
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top