మానవుని దృష్టి పరిమితం .
మానవుని మేథస్సు పరిమితం .
మానవుని శక్తి పరిమితం .
మానవుని జీవితం పరిమితం .
అందుకే తన శక్తి  కంటే అపరిమిత శక్తి వైపు ఊహ మొదలైంది .
ఊహ నుండి శోథన మొదలైంది .
ఫలితంగా భగవద్భావన మొదలైంది .
తన కంటే శక్తి సంపన్నులైన లోకోత్తర పురుషుల ఆరాథన మొదలైంది .
ఈ భూమి పై జన్మించిన ఆ లోకోత్తరులే-
మానవ జాతి నుథ్థరించిన మహాను భావులైనందున –
వారే భగవంతుని ప్రతిరూపాలుగా భావింప బడినారు .
వారి లోకోత్తర జీవితాలు పరిసమాప్తమైనా –
వారి నామ సంకీర్తనల , పూజనల , ఆరాథనల ద్వారా –
తమ జీవితాలు సాఫీగా సాగుతా యనే అపరిమిత విశ్వాసం ఏర్పడింది .
ప్రబలమైన ఈనమ్మకం వల్లనే –
లోకోత్తర పురుషులంతా లోకారాథ్యులైనారు .
మతమేదైనా మహిమాన్వితులైనారు .
వారు చూపిన త్రోవలు జీవన మార్గాలైనవి .
సత్యం , థర్మం , ప్రేమ , దయ , అహింస , పరోపకారం –
అన్ని మతాలలో ప్రతిపాదింప బడి –
సందేశాలై మానవాళికి సర్వదా ఆచరణీయాంశాలైనవి .
వివిథ దేశాలలో , వివిథ కాలాలలో అవతరించి –
మానవాళి మనుగడకు దిశా నిర్దేశం చేసి , ఉథ్థరించిన –
జీసస్ , మహమ్మదు , కృష్ణుడు , రాముడు , బుథ్థుడు , శిరిడి సాయి  మొదలైన
లోకోత్తరులు సర్వదా లోకారాధ్యులు .
వారి జయంతులు మానవాళికందరికీ పర్వదినాలు .
ఆయా దినాలలో  ఆయా మతస్థులు ఆనందంగా –
పండుగ సంబరాలు జరుపు కుంటున్నారు .
ఐతే ,
లోకోత్తర పురుషులంతా –
మతాతీతంగా –
మానవ జాతి కంతటికీ ఆరాథ్యులు .
మానవ జాతి నుథ్థరించిన  మహాను భావులందరి యెడల –
కృతజ్ఞతలు తెలుపు కుందాం .
ప్రతి మహానుభావుని జయంతినీ మతాతీతంగా స్మరించు కుందాం .
లోకారాథ్యు లందరికీ మతాతీతంగా ప్రణామా లర్పిద్దాం .
మానవులంతా ఒకటేనని చాటుదాం .
కుల , మత , దేశ , కాల – సంకుచిత తత్త్వాలతో
మానవ జాతి సమైక్యతను నిర్వీర్యం చేయడానికి
ఎత్తుగడలు రచించే మహానుభావుల యెడల
అప్రమత్తులమౌదాం .
                                   వెంకట రాజారావు . లక్కాకుల
--------------------------------------------------
మీరూ 'జన విజయం' కు రచనలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి. ఇంతక్రితం పోష్టు కోసం ఇక్కడ నొక్కండి.
*Re-published
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర చర్చావేదిక జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top