భాష పుట్టి  , ముందు ప్రజల పలుకు బడుల
వృధ్ధి చెంది నాక  పధ్ధ తెరిగి
భాష పుట్టి  , ముందు ప్రజల పలుకు బడుల
వృధ్ధి చెంది నాక  పధ్ధ తెరిగి
భాషలోని మార్పు వ్వాకరణము జెప్పు
వ్యాకరణము గాదు _  భాష ముందు .

గ్రాంధికమ్ము వీడి   గ్రామీణ తెలుగులో
వ్రాసి  ,  తియ్యదనము వండి వార్చి
తర తరాలు తెలుగు తలయెత్తుకొని నిల్వ
తెలుగు భాష కొరకు దీక్ష గొనుడు !

ఘనుల మన్న బ్రమల  జనహిత మెరుగని
పండితులకు  తెలుగు పలుకు బళ్ళు
విన  నసాధువులుగ గనుపించ నికనెట్లు
తెలుగు వృధ్ధి యగునొ ?   తెలియరాదు .

వాడుక పద యొరవడిలో
వేడుక గలదన్న నిజము వెలిగి  బుధులలో
గాఢముగా నిండినచో
నాడు గదా !   తెలుగు భాష నాట్యాలాడున్

సభలు బెట్టి  తెలుగు విభవమ్ము భూషించి
తెలుగు నుధ్ధరించు ధిషణు లార !
ప్రజల పలుకు బడుల  గ్రామ్యాలని  హసించు
తీరు మార్చు కొనుడు ,  తెలుగు వెలుగు .
  - వెంకట రాజా రావు లక్కాకుల.
                                                                                                       

--------------------------------------------------
మీరూ 'జన విజయం' కు రచనలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
*Republished
--------------------------------------------------
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top