తెలుగు-వెలుగు - 12
చర్చాంశం - మాతృభాష-ప్రాంతీయ భాష మధ్య తేడా
చర్చాంశాన్ని పంపిన వారు - పల్లా కొండల రావు.


ఏది మాతృభాష? ఏది ప్రాంతీయ భాష? రెండింటికీ తేడా ఏమిటి?

ఒక ప్రాంతంలో నివసించేవారిలో వలస వచ్చినవారూ ఉంటారు. వారు చాలా కాలంగా వలసకు పోయినచోటే ఉంటే వారి పిల్లలకు ఏ భాష మాతృభాష అవుతుంది. ఒక వ్యక్తికి ఏది మాతృభాష అవుతుంది? ఏది ప్రాంతీయ భాష అవుతుంది? ఈ రెండింటి మధ్య తేడాను వివరించగలరా? 

*Re-published
-----------------------------------------
తెలుగు భాష అభివృద్ధి పడే ఏ అంశం గురించి అయినా మాకు వ్రాసి పంపితే తెలుగు-వెలుగు లేబుల్ క్రింద పబ్లిష్ చేస్తాము. ఏదైనా పదం గురించి చర్చించాలనుకుంటే వివరాలకోసం ఇక్కడ నొక్కండి. 
---------------------------------------------
Reactions:

Post a Comment


  1. మాతృ భాష యనగా తల్లి నేర్పు భాష. ప్రాంతీయ భాష యనగా అక్కన ప్రక్కన వారు నేర్పు భాష . రెండూ ఒకటే కావచ్చు . రెండూ వేరు వేరు కావచ్చు ఒకటే ఐన భేదం లేదు . వేరు వేరు ఆయన భేదము కలదు . వీటి రెండింటి కి మధ్య తేడా , వ్యత్యాసము నకు తేడా కి ఉన్న తేడా వ్యత్యాసము !!

    జిలేబి

    ReplyDelete
  2. ప్రాంతీయ భాష అంతే ఒక ప్రాంతంలో ప్రధానంగా వాదబదే భాష!కానీ ప్రపంచంలో ఇవ్వాళ మనకు వినబద్య్తున్న ప్రతి భాషా యేదో ఒక ప్రాంతంలో కంద్రీకృతమై వున్నది?హిందీ లోని మాండలిక భెదాల్ని బట్టి చూస్తే ఈ మధ్యనే తీసుకున్న సెన్సస్ లెక్కల ప్రకారం ఒక్కో హిందీ మాందలికం కేవలం 7% ప్రజలకు మాతృభాష అని తెలుస్తుంది.మొత్తంగా హిందీని మాతృభాషగా అంటే తమ రోజువారీ వ్యవహారాల్లో సులువుగా వాదగల్గిన వాళ్ళు 25%మనది మాత్రమే. వేరే ప్రాంతాల వాళ్ళు కూదా హిందీ మాత్లాడే వాళ్ళతో తప్పనిసరిగా సంభాషించాల్సిన అవసరం వుండి నేర్చుకోవదం వల్ల దేశం మొత్తం మీద హిందీ వచ్చిన వాళ్ళు 41% మంది మాత్రమే.ఒక రకంగా భారత స్వాతంత్ర సంగామంలో అందరూ కలివిడిగా తిరగినా సమావేశాల పేరుతో కలుసుకోవదం వుత్తర దేశంలోనే యెక్కువగా జరిగాయి కాబట్టి 41% శాతం అయ్యిందని నా అభిప్రాయం. లేని పక్షంలో హిందీ కూడా ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రాంతీయ భాషే!

    సుబ్బారావు వాళ్ళ అమ్మ మాట్లాడేది సుబ్బారావుకి మాతృభాషా మరియూ పుల్లారావు వాళ్ళమ్మ మాట్లాడేది పుల్లారావుకి మాతృభాషా అవదు! ఒక ప్రాంతంలో యే భాష ప్రధానంగా మాట్లాడే భాషగా వుంటే ఆ భాషని అలవాటుగా తమ ఇళ్ళలో మాట్లాడే వాళ్ళకి ఆ భాషే మాతృభాష అవుతుంది.

    కాబట్టి ఒక ప్రాంతంలో యే భాష ప్రముఖంగా వ్యవహారంలో వుంటే అక్కడ పుట్తే ప్రతి పిల్లడూ పిల్లదీ ఆ భాష నేర్చుకుంటారు,నేర్చుకోవటం అవసరం - కాబట్టి అదే ఆ ప్రాంత ప్రజలకి మాత్భాష అవుతుందని నా పరిశీలనతో కూడిన అభిప్రాయం?!

    ReplyDelete
  3. ప్రాంతీయ భాష అనేది ఏది లేదు. ప్రతివారు పుట్టగానే వారి తల్లిదండ్రుల నుండి నేర్చుకునేదే మాతృభాష. ఇందులో ప్రాంతీయం, జాతీయం, అంతర్జాతీయం అనేవి ఉండవు... అవసరాలని బట్టి నేర్చుకునే భాషలన్నీ ఇతర భాషలు అవుతాయి... అంతే... అంటే, అవసరం ఉన్నా లేకున్నా తనంతలతానుగా వచ్చేదే మాతృభాష. మిగిలినవి పరాయి భాషలు. ఎవరికైనా తల్లి ఒక్కరే ఉంటారు... మిగిలిన వారు తల్లి లాంటి వారే కానీ...తల్లి కారు...కాలేరు....

    ReplyDelete
  4. @radhakrishana
    ప్రాంతీయ భాష అనేది ఏది లేదు.
    ?
    స్థూలంగా చూస్తే ప్రాంతీయ భాష అనేది యేదీ లేకపోయినా ప్రతి భాషా ఒక ప్రాంతంలో ప్రముఖంగా వుండటం వల్ల మొత్తం దేసం అనే రేనంజిలో చూస్తే ఆ ప్రాంతానికి అది ప్రాంతీయమే అవుతుంది కదండీ!

    *అవసరం ఉన్నా లేకున్నా తనంతలతానుగా వచ్చేదే మాతృభాష. మిగిలినవి పరాయి భాషలు
    **మాతృభాషకి ఈ నిర్వచనమే సరయినది!

    ReplyDelete
  5. కుక్కని ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రాంతాల్లో బేపి అంటారు. పట్టణ ప్రాంతాలవాళ్ళు మాత్రం కుక్క అనే అంటారు. నేను పల్లెటూరిలో పుట్టినా మా ఇంటిలోవాళ్ళు చదువుకున్నవాళ్ళు కావడం వల్ల నాకు కుక్క అనే పదమే అలవాటైంది కానీ బేపి అనే పదం అలవాటవ్వలేదు. ఆంధ్రాలో మార్వాడీలు ఇంటిలో హిందీ మాట్లాడుతారు కనుక ఇక్కడి మార్వాడీలకి హిందీయే సులభంగా అలవాటు అవుతుంది.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర చర్చావేదిక జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top