నాకు నచ్చే మరో పాటతో వచ్చేసాను. ఈ పాటంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇందులోని సాహిత్యం చాలా హృద్యంగా, ప్రతీ మనిషిని కదిలిస్తుంది. బంధాలు, అనుబంధాలను ప్రతిబింబించే ఈ పాటను మీతొ పంచుకోవాలనిపించింది.
చిత్రం            :  ఉయ్యాల జంపాల ( 1965 )

గాయకులు    :  మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 

రచన             :  కొసరాజు

సంగీతం         :  పెండ్యాల

***   ***   ***
     ఏటిలోని కెరటాలు ఏరు విడచి పోవు
     ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
     
     ఊరువిడచి వాడ విడచి యెంత దూరమేగినా
     సొంత ఊరు ఐనవారు అంతరాన ఉందురోయ్ అంతరాన ఉందురోయ్


     ఏటిలోని కెరటాలు ఏరువిడచి పోవు 
     ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు

     తెంచుకున్న కొలదిపెరుగు తీయని అనుభందమూ
     గాయపడిన హృదయాలను ఙాపకాలే అతుకునోయ్ ఙాపకాలె అతుకునోయ్
     
      
     ఏటిలోని కెరటాలు ఏరు విడచిపోవు 
     ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదూ

     కనులనీరు హిందితే మనసు తేలికవునులే
     తనకూ తన్వారికీ ఎడబాటే లేదులే

     ఏటిలోని కెరటాలు ఏరు విడచిపోవు
     ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు,ఎక్కడికీ పోదూ.

   మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటాను. నచ్చిన వాళ్ళు మీ మీ స్పందనలు తెలియ చేయగలరు. మళ్ళీ మరో      మంచి ఆ పాత మధురంతో కలుస్తా! 
మీ,
మల్లంపల్లి స్వరాజ్యలక్ష్మి.
***   ***   ***   
మీరూ మీకు నచ్చిన పాట గురించి వ్రాయాలనుకుంటే ఇక్కడ నొక్కండి.
***   ***   *** 
Reactions:

Post a Comment

 1. కనుల నీరు చిందితే మనసు తేలికౌనులే......ఆయ్యో ఏడవమన్నాడడీ కవిగారు కూడా.... మంచి పాటా సాహిత్యం.

  ReplyDelete
 2. < ఏటిలోని కెరటాలు ఏరు విడచి పోవు
  ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు

  ఊరువిడచి వాడ విడచి యెంత దూరమేగినా
  సొంత ఊరు ఐనవారు అంతరాన ఉందురోయ్ అంతరాన ఉందురోయ్ >
  అవును కదా! బాగుందండీ సాహిత్యం.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top