మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------------
ప్రశ్న సంఖ్య : 57
అంశం : సాహిత్యం, సినిమా
ప్రశ్న పంపినవారు : Palla Kondala Rao
------------------------------------------------

Name:Marxist-Leninist 
E-Mail:deleted 
Subject:పెద్దలు కుదిర్చిన పెళ్ళి మేలా లేదా dating మేలా? 
Message:
మన దేశంలో dating అనే పదాన్ని అక్రమ సంబంధం అనే అర్థంతో వాడుతారనేది అందరికీ తెలిసినదే. కానీ ఇక్కడి చర్చ Indian terminology గురించి కాదు. అమెరికాలో పెళ్ళికి ముందు శారీరకంగా కలుసుకోవడాన్ని dating అంటారు. అక్కడివాళ్ళు datingలో ఒకరికొకరు నచ్వితేనే పెళ్ళి చేసుకుంటారు. 


ఇందియాలో ఎక్కువ మంది పెద్దలు కుదిర్చిన వివాహాలే చేసుకుంటారు. పెద్దవాళ్ళు కులం, ఇంటి పేర్లూ, గోత్రాల పేర్లూ, వరసలూ, ఆస్తులూ, అంతస్తులూ చూసి పెళ్ళి చేస్తారు. ఇక్కడ అమ్మాయి, అబ్బాయి తమ వ్యక్తిగత అభీష్ఠాల ప్రకారం ఒకరినొకరు ఎంచుకోవడం అనేది ఉండదు. పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుని గుడ్డిగా కాపురం చేసుకోవడమే ఉంటుంది ఇక్కడ. 



పెద్దలు కుదిర్చిన సంబంధం అని ముక్కూముఖం తెలియని వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం మేలా? పెళ్ళికి ముందు dating చేసి అది సక్సెస్ అయితేనే పెళ్ళి చేసుకోవడం మేలా? 
--------------------------------------------------
*Republished
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

  1. శ్యామలీయo మాస్టారు చెప్పినా సరే... నా తోక వంకర కాబట్టి నేను మళ్ళీ ప్రవీణ్ గారు అడిగిన ప్రశ్నలకు నా అభిప్రాయాలు చెప్పడానికి తయారు.

    మన దేశంలో dating అనే పదాన్ని అక్రమ సంబంధం అనే అర్థంతో వాడుతారనేది అందరికీ తెలిసినదే.
    >> మీరు కేవలం మీకు అర్ధం అయ్యిన పదాలు రాస్తే సరిపోతుందా? డేటింగ్ అంటే ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి కేటాయించిన సమయం అనుకోవచ్చుగా? డేటింగ్ అంటే సెక్స్ మాత్రమేనా? అక్రమ సంబంధం అంటే 'illegal/illicit relationship'. మీరు బోడి కాలుకీ, మోగుండుకి భలే లింకులు పెట్టేస్తారు.

    కానీ ఇక్కడి చర్చ Indian terminology గురించి కాదు. అమెరికాలో పెళ్ళికి ముందు శారీరకంగా కలుసుకోవడాన్ని dating అంటారు.
    >>తప్పు. అమెరికాలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే, పెళ్ళికి ముందో తరువాతో శారీరకంగా కలుసుకోవడాన్ని 'సెక్స్' అంటారు. డేటింగ్ అనరు. ఇక్కడ సెక్స్ అనేది ఇద్దరు adults మధ్యన పరస్పర అంగీకారంతో జరిగే తంతు. అది డేటింగ్ లో ఒక చాప్టరు. అంతే.

    అక్కడివాళ్ళు datingలో ఒకరికొకరు నచ్వితేనే పెళ్ళి చేసుకుంటారు.
    >> అవును.

    ఇందియాలో ఎక్కువ మంది పెద్దలు కుదిర్చిన వివాహాలే చేసుకుంటారు. పెద్దవాళ్ళు కులం, ఇంటి పేర్లూ, గోత్రాల పేర్లూ, వరసలూ, ఆస్తులూ, అంతస్తులూ చూసి పెళ్ళి చేస్తారు. ఇక్కడ అమ్మాయి, అబ్బాయి తమ వ్యక్తిగత అభీష్ఠాల ప్రకారం ఒకరినొకరు ఎంచుకోవడం అనేది ఉండదు. పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుని గుడ్డిగా కాపురం చేసుకోవడమే ఉంటుంది ఇక్కడ.
    >> గుడ్డిగా అని ఎందుకు అనుకోవాలి? చాలా మంది అర్ధం చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటారు. నచ్చని వాళ్ళు విడిపోతారు. ఇక అసలు ప్రశ్నకు వద్దాం.

    పెద్దలు కుదిర్చిన సంబంధం అని ముక్కూముఖం తెలియని వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం మేలా? పెళ్ళికి ముందు dating చేసి అది సక్సెస్ అయితేనే పెళ్ళి చేసుకోవడం మేలా?
    >> దీనికి 'ఇదీ సరైన సమాధానం' అని ఎవ్వరూ ఇవ్వలేరు. పెద్దలు కుదిర్చిన సంబంధాలు చేసుకుని హాయిగా పెళ్లి చేసుకుని ఉన్నవాళ్ళూ వున్నారు, పెళ్ళైన పదేళ్ళకి జుట్టూ జుట్టూ పట్టుకుని జీవితాన్ని పీకి పాకం పెట్టేసుకున్న వాళ్ళూ వున్నారు. డేటింగ్ చేసి హాయిగా పెళ్లి చేసుకుని ఉన్నవాళ్ళూ వున్నారు, పెళ్ళైన మరుసటి రోజే టాటా చెప్పుకున్న జంటలు కూడా వున్నాయి.
    ఏది మేలు అంటే ఏం చెప్తాం?

    అసలు మమ్మల్ని సమాధానం అడిగే ముందు మీ అభిప్రాయం చెప్పండి ప్రవీణ్ గారు.

    ReplyDelete
    Replies
    1. భారత్‌లో పెళ్ళీ అనేది ఒక license to sex లాంటిది. పెళ్ళి'చూపులు'లో ఉన్న అంతరార్ధం ఇదే.

      ఏ పురాణాన్ని తిరగేసినా విచ్చలవిడి sex అనేది లేకుండా ఉండదు (శ్రీ చాగంటివారు రామాయణంలోంచి చెప్పిన చెప్పిన 'కార్తికేయ జననం'గానీ, జయదేవుని అష్టపదులనుగానీ చదివితే మనకు అర్ధం అయ్యేది ఇదే). ఐతే ఈ విలవలన్నీ భారత్‌లోకి క్రైస్తవం రాకతో మారిపోయాయి. ఒక్కసారిగా హైందవం inferiorityతో కుమిలిపోయి, క్రైస్తవంకన్నా తాను 'మరింత పవిత్రం' అనిచెప్పుకోడంకోసం తన పురాతన సంస్కృతికి విరుధ్ధంగా విలువలను రచించడం మొదలుపెట్టింది. దాంట్లో భాగంగానే ఇలా వ్యక్తి సమాజానికి (సమాజము అనగా కొందరు నిరక్ష్యరాస్య పురోహితులు అని అర్ధంచేసుకోగలరు) వ్యక్తి ఎప్పుడూ బానిసయే అన్న భావజాలం. ఈ రోగం ముదిరి వ్యక్తి తన partnerతో ఎప్పుడు sexలో పాల్గొనాలి, ఎప్పుడు ఒక తల్లి తన పిల్లలకు పాలివ్వాలి అనే విషయాలనుకూడా ఈ పురోహితవర్గానికి దఖలుపరిచారు.

      గౌరవనీయులైన శ్యామలీయాలూ, ఫణీంద్ర విశ్వవిశ్వనాధులూ ఈ విషయములను ignore చేసెదరు. ఇలాంటివారు తమచుట్టూ ఉన్నప్రపంచములోని సంఘటనలను, తామునమ్మే పురానములలోని సంఘతనలతో పోల్చుకోవడానికి సాహసించరు. వీళ్ళు అసలు ఆలోచించరు. these guys are the mere propagandists of some-others' thoughts. Moreover these guys could never face the trust and instead hide themselves behind the abstracts.

      Delete
    2. హిందూ మతానికి క్రైస్తవం చూసి న్యూన్యాతా భావానికి గురయ్యిందా? ఇంత కన్నా పెద్ద జోక్ ఉండదు. క్రైస్థవం లో ఉన్న అంత గొప్ప అంశాలేమిటో?

      Delete
    3. @Iconoclast
      "గౌరవనీయులైన శ్యామలీయాలూ,.....ఈ విషయములను ignore చేసెదరు. ... "
      అలాగే మరికొన్ని ఆరోపణలు.

      గౌరవిస్తూనే నిందించటం ఒక తమాషా.
      ఇలాంటి వారికి కావలసినది సమాధానాలు కాదు. మరింతగా నిందారోపణలు చేసే అవకాశం. వీరిలాంటివారితో తలడి సమయం వృధాచేసుకోలేను. అంత తీరిక కూడా లేదు నాకు.

      Delete
  2. ఇందియాలో సెక్స్, dating, ఈ రెండు పదాలూ వాడడం నిషిద్ధమే, వీటి గురించి బంధువులు లేదా స్నేహితుల దగ్గర చర్చించే ధైర్యం ఎవరికీ ఉండదు. ఇందియాలో dating నిషిద్ధం కాదన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. నా అభిప్రాయం ప్రకారం dating తప్పు కాదు కానీ భారతీయులకి dating గురించి తమ బంధుమిత్రులతో చర్చించేంత మానసిక పరిణితి ఉందనుకోను.

    ReplyDelete
  3. సమాజంలో పెళ్లి అనేది నాకు నేను విధించుకున్న ఒక బంధనం !
    Dating అనేది బంధనం లేకుండా సమాజాన్ని నాశనం చేసే ఒక అస్త్రం!

    Dating లో చాలా ఉదాహరణలు పత్రికలలోనే ప్రచురితం అయ్యాయి!
    వాటిలో కొన్ని
    అమ్మాయి పలువురితో సంభోగం చేసి STD లు తెచ్చుకుంది, వాటిని తను ఇంకొకరితో పంచుకుంది!
    కొంత మంది అబ్బాయిలు వాళ్ళు అద్దెకు ఉన్న గృహ యజమాని కూతురితో సంభోగం చేసారు చేస్తూనే ఉన్నారు, దాన్ని కూడా వాళ్ళు Dating అనే అంటారు!
    విదేశాలలో ఉన్నది ఎ రకంగా మంచిదో ఈ మట్టి బుర్రకు అర్ధం కాదు, ఎందుకంటే అక్కడ పెళ్లి ఒక శారీరక అవసరం ఇక్కడ పెళ్లి ఒక బాధ్యత!

    ఇక కొండల రావుగారు మీకు ఒకటే ప్రశ్న
    ఒకే బాటలో వెళుతున్న ప్రశ్నలను ఎందుకు ప్రచురిస్తున్నారు?

    మీరు నిన్న కొన్ని రోజుల క్రిత్రం అందరికీ ఒకటే నియమం అని దాని మీద అర్ధవంతమైన చర్చే జరగలేదు, మళ్ళీ ఈ పిచ్చి ప్రశ్న ఎందుకు ప్రచురించారు, ఒక వేల అర్ధవంతమైన చర్చ జరగక పొతే తిరిగి అదే ప్రశ్న ప్రచురించండి, ఈ పెళ్లిని శారీరక సంబంధంగా చూసే ప్రశ్నలు ఉంచకండి!

    ReplyDelete
    Replies
    1. ప్రసాద్ గారు,
      datingకంటే పెళ్లి గొప్పదని అనుకుంటే మీరు నిరూపించలేరా? dating అంటే పెళ్లికి ముందు సెక్స్ కాదని మీరు వాదించలేరా? dating కంటే పెళ్లి గొప్పదని నిరూపించేంత సమాచారం మీ వద్ద ఉంటే ఈ ప్రశ్నకు మీరు భయపడకుండా వాదించి నిరూపించండి. నేను ప్రశ్నను అనుమతించకుండా ఉన్నంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు. ఏది సక్రమ సంబంధం ఏది అక్రమ సంబంధం సమాజంలో నైతిక విలువలనెలా కాపాడాలనేది ఎంతైనా డిబేట్ చేయొచ్చు. ఎలాంటి ప్రశ్నలు పబ్లిష్ చేయాలనేది వదిలి మీరూ అవసరమైన ప్రశ్నలు పంపడానికి ప్రయత్నించండి.

      Delete
  4. Dating పేరుతో మోసాలు ఎక్కువగా ఇందియాలో జరుగుతుంటాయి. తన్‌హాయీ నవలలో కలహార స్నేహితురాలు తాను ఇందియన్‌తో dating చేస్తానంటే నువ్వు ఇందియన్ మగవాళ్ళని నమ్మొద్దు అని కలహార ఆమెకి చెపుతుంది. Dating పేరుతో జరిగే రేప్‌లు విదేశాలలో అంతగా ఉంటాయనుకోను.

    ReplyDelete
    Replies
    1. You are wrong Praveen, daterapes are aplenty in western countries.

      Delete
    2. విదేశాలలో మనిషి ఇంకో మనిషికి పనిముట్టు కాబట్టే Dating అన్నది వాళ్లకు అలవాటు అయ్యింది, మన దేశంలో అలా కాదు!
      ఇక Indian మగవాళ్ళను నమ్మొద్దు అన్నది అంటున్నావు, అది కథ కథ ఎప్పటికీ నిజం కాదు, పైగా అది వ్రాసినది ఒక తెల్లవాడు అయి ఉండవచ్చు ఎందుకంటే అక్కడ వాళ్లకు నల్లగా ఉన్న వాళ్ళు అంటే చులకన!
      మనదేశంలో లేరు అని చెప్పలేను కానీ, రంగు బట్టి వివక్ష ఇక్కడ తక్కువే!

      Delete
    3. Mr Syamala Rao, you may be true. It's because dating is common in western countries. But dating is uncommon in India and here it is synonym of illegal relation. Indian women usually do not dare to date with men and thus daterapes are less in India.

      Delete
  5. సమాజానికి కీడు చేసేవి భాద్యతా రాహిత్యం మరియు అహంకారం.

    భాద్యతా రాహిత్యం అంటే కండోమ్ పెట్టుకుని వ్యభిచారం చేసాను ఇంకొకరితో కాబట్టి ఏవిధమైన తప్పు లేదు అనుకోవడం, కానీ అది ఒక ప్లాస్టిక్ వస్తువు అన్న విషయం మరచిపోతున్నారు, అది ఒక రకంగా ప్రకృతిని నాశనం చేస్తుంది.

    ఇక అహంకారం అంటే నాకు తెలిసిన కొంతను ఉపయోగించి అది నిజం అని నిరూపించే తత్త్వం!
    ఇక డేటింగ్ విషయానికే వస్తే, ఒకరితో సుఖం పొంది ఇంకొకరిని పెళ్లి చేసుకున్న అబ్బాయిలూ అమ్మాయిలూ పాత వాళ్ళతో కలయిక జరుపుతూనే ఉంటారు అన్నది జగమెరిగిన సత్యం, ఎందుకంటే అందరు అబ్బాయిలూ ఒకేలా సంభోగం చెయ్యలేరు అన్నది జగమెరిగిన సత్యం, అందరు అమ్మాయిలూ తమ అవయవాలు ఎదుట వ్యక్తీ ఒక వస్తువులాగా చూసి సహించలేరు!

    పెద్దలు కుదిర్చిన పెళ్లి కు కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి మధ్యలో అక్రమ సంభంధం బహు భార్యత్వం వస్తే!

    ఇక పెళ్ళికి ముందు రాజమహేంద్ర పురం లో జరిగిన ఒక సంఘటన, అతను వ్యసన పరుడు చాలా మంది అమ్మాయిలను లొంగ దీసుకున్నాడు, ఆ క్రమంలో STD వచ్చింది, తరువాత ఒక అమ్మాయితో డేటింగ్ చేసి ఆ తరువాత పెద్దలను పెళ్ళికి ఒప్పించాడు, తరువాత తెలిసింది ఏమిటి అంటే ఆ అమ్మాయికి ఇతని వల్ల STD వచ్చింది అని!

    ఇంకో మనిషిని పనిముట్టుగా చూడటం మానేస్తే ఖచ్చితంగా పెళ్లి నిజం అని నమ్ముతాము!

    పనిముట్టుగా చూస్తే ఇలాంటి STD లు పెరుగుతూనే ఉంటాయి
    ఆడవాళ్ళను లేదా మగవాళ్ళను పనిముట్లుగా చూసే వాళ్లకు Dating అవసరం, ఇంకో మనిషిని బ్రతికించాలి అనే వారికి పెళ్లి అవసరం.

    ReplyDelete
  6. పిల్లల ఇష్టాలను గమనించి పెద్దల సమక్షంలో పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటే బాగుంటుందని ఎక్కువమంది అనుభవాలు తెలియజేస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన సంబంధాలలో బాగాలేనివి ఉన్నా చాలావరకు బాగానే ఉంటున్నాయి. dating అనేది మన దేశంలో ఎప్పటికీ ఇష్టపడరనే అనుకుంటున్నాను. అలాంటి ఆలోచనలను గ్రామాలలో అయితే చాలా నీచంగా చూస్తారు ఇప్పటికీ. ఎవరెలా చూస్తారనే దానికంటే dating అనే సాంప్రదాయం మంచిది కాదనే నా అభిప్రాయం.

    ReplyDelete
  7. మానవ నైజం ఏ దేశంలోనైన ఒకటే అనిపిస్తుంది నాకు. కాకపొతే దేశ,కాల, సంస్కృతులు ప్రభావం చుపుతయేమో .డేటింగ్ అంటే పెళ్ళికి ముందు సెక్స్ కావాలని రూల్ ఏమి లేదు. జంటగా గడిపిన వాళ్ళు చెప్తే తప్ప ఎవరికీ ఏమి తెలుస్తుంది వాళ్ళ మధ్య ఏమి జరిగిందో ? పెళ్లి చేసుకుని సవ్యంగా కాపురాలు చేసుకునే వాళ్ళున్నారు, అలాగే ప్రేమించి పెళ్ళాడి సుఖంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. పసితనం నుండి పెళ్ళాం మొగుళ్ళుగా పేరు పెట్టబడి, పెళ్ళయ్యే దాకా పోయే గారాలు, సరాగాలూ డేటింగ్ కాదా ? ఒక వ్యక్తీ తో సానుకూలంగా జీవితం గడపగలమా అని నాలుగు (పది కావచ్చు , ఇంకా ఎక్కువ కావచ్చు ) సార్లు కలిసి, అర్ధం చేసుకోడానికి ప్రయత్నించడం తప్పేమీ కాదు కదా. నలభై , యాభై ఏళ్ళు కాపురం చేసి కూడా అశాంతి తో జీవించే వాళ్ళున్నారు.
    వందల మంది తో పరిచయాలున్నా , అందులో ఏ పది మందో స్నేహితులుతారు, అందులో బాగా దగ్గరైన వాళ్ళు ఒకరో,ఇద్దరో ఉంటారు. అలాగే ఒక మనిషి పైన ఆకర్షణ కలగడం కూడా (సహజం గా) అంత సులువుగా జరగదు. విండో షాపింగ్ కి,అసలు షాపింగ్ కి ఉన్నతేడా ఆకర్షణకి, పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనుకొవలనే భావనకి కూడా ఉంటుంది. వేరే ఉద్దేశ్యాలతో వ్యవహరించే వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. ఆడ , మగా ఎవరైనా అంతే అనుకుంటాను నేను. విదేశాల గురించి నేను మాట్లాడడం లేదు మన దేశంలో కూడా మార్పులు ఒచ్చాయి. పిల్లలు ఇష్ట పడితే కులాంతర , మతాంతర వివాహాలు చేస్తున్నారు పెద్దవాళ్ళు . కొద్ది exeptions ఉంటాయి ఎక్కడైనా . అయిన పెద్దలు చూసిన పెళ్ళిళ్ళు ఇంకా చాలా ఎక్కువే. Coeducation లో చదువుతున్న పిల్లలందరూ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోడం లేదు కారణం వాళ్ళు ఎవరి పట్లా ఆకర్షితులు కాకపోవటం అయి ఉండదు గదా . ఏర్పడ్డ ఆకర్షణ, స్నేహం శారీరకము, మానసికము రెండు అయితే గాని పెళ్లి గా మారదు మరి.
    Datings ఫెయిల్ కావచ్చు, నెలలో , ఏళ్ళో డేట్ చేసి కూడా. అది కూడా సంభవమే. జీవిత కాలపు సంసారం తర్వాత భార్యా భర్తల మధ్య పొడచూపే సమస్యల వల్ల బాధ పడుతూ కలిసి ఉండక తప్పదు దంపతులకు. పెళ్లి కాక ముందే కలిసి ఉండలేమేమో అనిపించినప్పుడు డేటింగ్ మాత్రం పెళ్ళికి దారి తియ్యదు.
    ప్రేమించడము, ప్రేమించి పెళ్లి చేసుకోడము ప్రతి ఒక్కరి వల్ల అయ్యేది కాదు. అందుకే ,( పెళ్ళికి కట్టు బడి ఉండే వారైతే ) ప్రేమించి ( డేట్ చేసి) పెళ్ళాడినా , పెళ్ళాడి ప్రేమించినా , వాళ్ళ understanding లెవెల్స్ , అడ్జస్టింగ్ మెంటాలిటీ పైన ఆధారపడుతుంది వాళ్ళజీవితం. అంటా సవ్యంగా ఉంటె ఏది కూడా తప్పు కాదు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర చర్చావేదిక జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top