మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------
ప్రశ్నిస్తున్నవారు -  విన్నకోట నరసింహారావు
అంశం : రాజకీయం
----------------------------------------
Name:విన్నకోట నరసింహారావు  
E-Mail:deleted 
Subject:సంస్ధలకు, భవనాలకు, పధకాలకు ఒకే వ్యక్తి పేరు పెడుతూ పోవడం సమర్ధనీయమా?  
Message:
ప్రభుత్వ సంస్ధలకు, ప్రభుత్వ పధకాలకు వ్యక్తుల పేర్లు పెట్టటం దాదాపు ఆనవాయితీగా తయారయింది. అధికారంలో ఉన్న పార్టీ తమ పార్టీ వ్యవస్ధాపకుడి / నాయకుడి / నాయకుల పేర్లు పెడుతున్నాయి. 

కాంగ్రెస్ హయాంలో వారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాటికి ఇందిరా గాంధి పేరు, రాజీవ్ గాంధి పేరు తగిలించారు. 

తమిళనాడులోనూ అంతే, అంతా అమ్మమయం. 

సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ పేరు విరివిగా పెట్టుకున్నారు.

విభజన తర్వాతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అదే పరిస్ధితి తయారవుతోంది. NTR క్యాంటీన్, NTR ఆరోగ్యశ్రీ, NTR సుజల, NTR భరోసా. సరే NTR హెల్త్ యూనివర్సిటీ అని ఇదివరకే పేరు పెట్టారు. కొత్త రాజధానికి, కొత్త ఎయిర్పోర్టులకి కూడా బహుశా ఆ పేరే పెడతారేమో? 

మరి ఆనాడు కాంగ్రెస్సుని విమర్శించి, ఈనాడు మనం చేస్తున్నదేమిటి?

అసలు వ్యక్తుల పేర్లు, అదీ ఒకే వ్యక్తి పేరు అన్నిటికీ నామకరణం చేసే వ్యక్తిపూజ ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసం?

(నాకు NTR అంటే విముఖతేమీ లేదు. ఈ సంస్కృతి మంచిది కాదనేదే నా అభిప్రాయం.)  

--------------------------------------------------
*Republished

ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

 1. నేను అదే అనుకున్నా,
  నాకైతే పేర్లు ఇలా ఉండాలి అనే అభిప్రాయం
  అందరికీ ఆహారం
  ఆరోగ్యం మీక్కోడా
  సుజలాం
  శ్రామిక భరోసా
  ప్రజల ఆరోగ్య కళాశాల

  ReplyDelete

 2. మీతో ఏకీభవిస్తున్నాను.ఏవో రెండు,మూడు సంస్థలకో,కార్యక్రమాలకో అలా పేరు పెట్టుకోవచ్చును,కాని ప్రతిదానికి ఒకవ్యక్తి పేరు పెట్టడం మంచిదికాదు. అంతకు ముందు ఇంకొక పేరు ఉంటే దాన్ని తీసివేసి మరొకపేరు పెట్టడం మరీ అనుచితం.రేపు మరో పార్టీ అధికారంలోకి వచ్చిందనుకొండి.అప్పుడు మళ్ళీ పేర్లు మారుస్తారా?నేను రాసింది అన్ని పార్టీలకి,అన్ని ప్రభుత్వాలకి వర్తిస్తుంది.

  ReplyDelete
 3. రాజకీయ పార్టీలు ప్రజలకు మేలు చేస్తూనే కొంత లబ్ది పొందాలని & ప్రచారం చేసుకోవాలని కోరుకోవడం తప్పు కాదు. అందులో భాగంగా తమ పార్టీకి (లేదా సిద్దాంతానికి అనుగుణంగా ఉన్నటువంటి) నాయకుల పేర్లు పెట్టుకోవడం. చేస్తున్నది మంచి పని అయినప్పుడు (అయితే) అభ్యంతరం అనవసరం.

  ప్రస్తుత ఉదాహరణకొస్తే టీడీపీ సిద్దాంతాలకు ఎన్టీఆర్ అడ్డం పట్టినంతగా ఇంకెవరూ సరిపోరు. ఆయనకు ఉన్న ప్రజాదరణ కూడా ఎక్కువే. ఈ రెండు విషయాలలో కూడా మిగిలిన నాయకులు (బాలయోగి, ఎర్రన్నాయుడు, ఏరాసు ప్రతాప్ రెడ్డి వగైరా) ఆయన దరిదాపుల్లో కూడా రారు.

  అంచేత "మరీ అతి" చేయనంత వరకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ఆక్షేపనీయం కాకూడదు. కెఎల్ రావు, గురజాడ, నార్ల తాతారావు లాంటి పార్టీలకు అతీతంగా పని చేసిన వారి పేర్లు మరియు క్షేత్ర స్థాయి నాయకుల పేర్లు అక్కడక్కడా వార్వారి రంగాలకు అనుగుణంగా వాడితే "మరీ అతి" అభియోగం తప్పుతుంది.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top