ఇటీవల విజయవంతంగా రికార్డులు బ్రద్దలుకొట్టిన తెలుగు సినిమా 'అత్తారింటికి దారేది'. టైటిల్ తో సహా పవన్ కల్యాణ్ ఇమేజ్ కి భిన్నంగా వచ్చిన ఈ సినిమా విజయానికి హీరో, డైరెక్టర్ తో పాటు వినపడ్డ పేరు నదియా. ఆ సినిమాలో అత్త పాత్రలో నదియాను దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ ఎంత హుందాగా మలచారో సినిమా చూసినవారందరికీ తెలుసు. తెలుగు సినిమాలలో అగ్రహీరోలు సైతం అత్తను అల్లరి పెట్టే అసభ్యకరమైన చెత్త సినిమాలు తీసి చూపించిన దానికి భిన్నంగా, మన సంస్కృతిలో తల్లితో సమానంగా గౌరవించే అత్త బంధాన్ని అపహాస్యం చేసి కక్కుర్తిగా సొమ్ము చేసుకునే సాంప్రదాయానికి చెక్ చెప్పి పాత సినిమాలలోలా 'అత్తారింటికి దారేది'లో అత్త పాత్రను హుందాగా సినిమాలో ఆ పాత్రను కీలకంగానూ మలచిన దర్శకుడు త్రివిక్రంను, గబ్బర్‌సింగ్ హిట్ ఇమేజ్ ను పక్కన పెట్టి మరీ కథాబలం ఉన్న సినిమాను అంగీకరించిన  స్టార్ హీరో పవన్  లను అభినందించాలి. తన అన్న చిరంజీవి అల్లుడా మజాకాలోనూ, ఇతర కొందరు హీరోల సినిమాలలోనూ అత్తను అపహస్యంగా ఎబ్బెట్టుగా  చూపించి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేయగా, పవన్ సినిమాలలో అనుబంధాలకు హుందాగా పెద్ద పీట వేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు సినిమాలలో అత్త అనగానే గుర్తొచ్చేది మాత్రం ఒక్క పేరే. మీ అందరికీ తెలిసిన ఆ పేరు 'సూర్యకాంతం'. ఆంధ్రుల అత్తగారూ అంటే సూర్యకాంతమే. భానుమతి,సావిత్రి,శారద,వాణిశ్రీ,రమ్యకృష్ణ,నగ్మాల నుండి నిన్నటి నదియా వరకూ ఎందరు అత్త పాత్రలు పోషించి మెప్పించినా సూర్యకాంతం స్టైల్ డిఫరెంట్. వీళ్లెవరినీ ఆమెతో పోల్చలేము. అత్తంటే గుండత్తే ! నో బడీ కెన్ రీప్లేస్ హర్ !


రేలంగి, రమణారెడ్డి లాంటి కమెడియన్లు,  ఎస్వీఆర్,నాగయ్య లాంటి ఉద్ధండ నటులు, సావిత్రి,జమున లాంటి టాప్ హీరోయిన్లు, ఆఖరుకు ఎన్.టీ.ఆర్, ఏ.ఎన్.ఆర్ లాంటి స్టార్ హీరోలు, ఎవరయినా ఆమె ముందు గజ గజ లాడాల్సిందే. పుల్లవిరుపు మాటలుకు పిల్లిలా వణకాల్సిందే. చేతులు తిప్పుతూ పళ్లు కొరుకుతూ పిడిగుద్దులు గుద్దినా, చీపురు దెబ్బలు, గరిటె వాతలు పెట్టినా హీరోయిన్లు పడి ఉండాల్సిందంతే. అవి ఆమె సహజ నటన గొప్పతనానికి దాసోహమయిన కేరక్టర్లు.
గుండత్త ! 
ఈ పదం తెలీని తెలుగువారుండరు. ఎవర్ గ్రీన్ హిట్ 'గుండమ్మకథ' సినిమాలో ఎన్.టీ.ఆర్ గుండమ్మను ఆత్మీయంగా పిలిచే పిలుపది. ఆంధ్రుల అత్తగారు సూర్యాకాంతం గురించి వికీపీడియాలో వ్రాయబడిన ఈ వాక్యాలు ఆమెగురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా ఉన్నాయనిపించింది.
సూర్యకాంతం! ఈ పేరు వింటేనే ఆంధ్రా కోడళ్ళకు హడల్. తల్లిదండ్రులు తమ కూతురికి సూర్యకాంతం పేరు పెట్టడానికి ఈ నాటికీ సాహసించరు. నిజ జీవితాల్లో ఏ అత్తగారైనా గయ్యాళి అయితే ‘అమ్మో - ఆవిడా? సూర్యకాంతమే!’ అని అందరూ భయపడి చెప్పుకునే స్థాయిలో సహజంగా నటించింది సహజనట కళా శిరోమణి సూర్యకాంతం. విశేషం ఏమిటంటే, అత్తగారి పాత్రలో ఆమెకనిపించినా, అమెగయ్యాళే అని తెలిసినా - ఎన్ని సినిమాల్లో చూసినా ఏ మాత్రం విసుగు అనిపించకపోవడమే! ఒకే రకం పాత్రల్ని పోషించి - అంతకాలంపాటు, అన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందడానికి కారణం ఆమె సహజ నటన.  ప్రసిద్ధ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు - "నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. 'సూర్యకాంతం' అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు"


(మేకప్ లేని సూర్యాకాంతం ఫోటోలు

సినిమాలు సమాజం పై చాలా రకాలుగా ప్రభావం చూపుతుంటాయి. కొన్ని అలవాట్లను ట్రెండ్ గా సెట్ చేస్తాయి. అనుబంధాల విషయంలో వ్యక్తిత్వ వికాసం విషయాలలో కూడా యువత పై పనిచేస్తాయనడంలో సందేహం లేదు. , కథలు, నటీ నటులు, పాత్ర చిత్రణ, పాటలు ఇలా చాలా విషయాలలో పాత సినిమాలు హుందాగానూ నిజజీవితానికి దగ్గరగా ఉండేవి. అందుకే నేటికీ అవి ఎవర్గ్రీన్ హిట్స్. కొన్ని సినిమాలయితే లెజెండ్స్. కొందరు నటులు కూడా అంతే. అందులో అగ్రగణ్యులలో ఒకరు మన 'సూర్యకాంతం'. 

గయ్యాళి అత్తగా ఆమె నటన అమోఘం. అమాయకపు భర్తలను, కోడళ్లను వేధించే పాత్రలో ఆమె కలకాలం గుర్తుండేలా నిలిచిపోయారంటే ఆమె ఆ పాత్రలలో జీవించేవారు. ఆమె నటన అత్యంత సహజంగా ఉండేది. బయట సూర్యకాంతం చాలా సహృదయురాలైనా ఆమె ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి కూడా అప్పట్లో భయపడేవారంటే ఆమె ఆ పాత్రలలో ఎంతగా ఒదిగిపోయిందో తెలుసుకోవచ్చు. థియేటర్లలో సావిత్రిని హింసిస్తున్న ఆమెను తిట్టనివారు లేరంటే ఆమె నటనకవి ప్రేక్షకులిచ్చిన మార్కులేనని చెప్పాలి.

సినిమాలలోని మిగతా హీరోయిజమో, ట్రాజెడీయో కొద్దిరోజుల తరువాత మరచిపోతారేమోగానీ నేటికీ సూర్యకాంతం అత్త పాత్రలను మరచిపోవడం లేదంటే అది ఆమె సహజనటన ప్రభావమే. అంతెందుకు 'గుండమ్మ కథ'లో నాటి స్టార్ హీరోలయిన ఎన్.టీ.ఆర్, ఏఎన్నార్ లకు సమానమైన, కాదు కాదు ఒకింత ఎక్కువే ప్రాధాన్యం, కాదు కాదు సినిమా పేరే ఆమె పాత్ర పేరుతో ఉన్న పాత్రగా తీసారంటే ఎంత ధైర్యం-నమ్మకం ఉండాలి నిర్మాతలకు ఆ నటి మీద.

ఇప్పటికీ సూర్యకాంతం చనిపోయాక కూడా గయ్యాళి అత్తలను ఆ పేరుతో పోల్చుతూ తిడుతూ ఉంటారు. ఇంకోవిధంగా కూడా ఆమె భయపెడుతున్నదనే చెప్పాలి. గుండమ్మ కథ సినిమాను రీమేక్ చేయాలని బాలయ్య-నాగార్జున, ఆ తరువాత జూనియర్ - నాగ చైతన్యలు ప్రయత్నించినా గుండమ్మకు ఎవరూ సూట్ కాక , సూర్యకాంతం తో పోల్చలేక ఆ ప్రయత్నాలు విరమించారంటే సూర్యకాంతం ప్రతిభను అర్ధం చేసుకోవచ్చు. నాటి నటులకు నేటి నటులకూ , నాటి సినిమాలకూ నేటి సినిమాలకూ ఇలా చాలా విషయాలలో తేడా ఉన్నది.
వెండితెరపై ఇంత గయ్యాళిగా ఉండే సూర్యకాంతం నిజజీవితంలో అమ్మ మనసు కలిగి ఉండేదని అవసరమైన సందర్భాలలో అందరినీ ఆదుకునేదనీ చెపుతారు. తోటి నటులతో మర్యాదగా, కలివిడిగా ప్రవర్తించేదని, సెట్లో సరదాగా జోక్‌లేస్తూ ఉండేదని చెపుతారు. పాత్రలు గయ్యాళివే అయినా... సూర్యకాంతం గారి మనసు వెన్నపూస అని అంతా అనే వారట. అందరికీ భోజనాలు పెట్టటం పండుగలకు పర్వదినాలకు, అందరీనీ ఇంటికీ ఆహ్వానించి బట్టలు పెట్టటం తోటి వారికి సాయపడటంలో సూర్యకాంతంగారు ముందుండే వారట.

ఆమెకు సంబంధించిన విశేషాలు మరి కొన్ని ! (వికీపీడియా మరియు ఇతర సైట్లనుండి సేకరించినవి)
 • తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకొంది. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకొంది.
 • మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియబరచిన మీదట 75 రూపాయలు చేశారు. తరువాత ధర్మాంగద (1949)లో ఆమెది మూగవేషం. ధర్మాంగద టైములో చిన్నా చితకా వేషాలువేసినా తరువాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకొంది.
 • ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది.
 • అసలు సంసారం చిత్రం తరువాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాక ముందే ఇంకొక హీరోయిన్ ను పెట్టుకొని తీశేసారని తెలియడంతో, "ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను" అని ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. 
 • వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానేకాదు - మామూలు మనిషే. ఏ సమావేశాలకో, సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్లినప్పుడు ఆటోగ్రాపులకోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరకి వెళ్లడానికి భయపడేవారు. ఐతే ఆమె నికార్సయిన మనిషి, కచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపునిండా తినేది, పదిమందికీ పెట్టేది. షూటింగ్‌కి వచ్చినప్పుడల్లా - తనతో ఏవో తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి, కృష్ణకుమారి, జానకి వంటి నటీమణులకీ వుండేది. విశేష దినాలూ, పండగపబ్బాలూవస్తే సరేసరి!
 • షూటింగుల్లో జోకులు చెప్పడం, సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగులో బయట కేకలు వినిపిస్తున్నాయని ‘సైలెన్స్‌! అవుట్‌సైడ్‌’ అని ప్రొడక్షన్‌ మేనేజర్‌ గట్టిగా అరిచాడు. ఫ్లోర్‌లో వున్న సూర్యకాంతం ‘ఓ!’ అని అంతకన్నా గట్టిగా అరిచింది. ‘ఏమిటమ్మా?’ అని అడిగితే, ‘సైలెన్స్‌ అవుట్‌ సైడ్‌ - అని గదా అన్నారు!’ అందామె నవ్విస్తూ. అలాంటి అల్లరి వుండేది ఆమెలో. 
 • ఓ సినిమాలో నాగయ్య ను నానామాటలూ అని, నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్‌ అయిపోయాక ఆయన కాళ్లమీద పడి ‘అపరాధం - క్షమించండి!’ అని వేడుకుంది. ‘పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావూ? లే!-’ అని నాగయ్య లేవనెత్తితే, కన్నీళ్లు తుడుచుకున్న భక్తీ, సెంటిమెంటూ ఆమెవి. దబాయింపూ, కచ్చితత్వమూ ఉన్న మనిషే అయినా, మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్లకి ఆర్థికసహాయం చేసేదిగాని అనవసరం అనిపిస్తే మాత్రం ‘పూచికపుల్ల’ కూడా విదిలించేది కాదు.
 • ఓసారి 'శ్రీమంతుడు' సినిమా షూటింగులో జరిగింది. స్క్రిప్ట్ ప్రకారం తాను చెప్పవలసిన డైలాగులు అయిపోయినప్పటికీ ఆమె ఇంకా ఏవో డైలాగులు చెబుతూనే ఉందట. దర్శకుడు ప్రత్యగాత్మ కట్ చెప్పకుండా అలానే చూస్తుండిపోవడంతో, ''అదేంటి నాయనా... నా మటుకు నేను ఏదో చెప్పుకుపోతుంటే కట్ చెప్పడంలేదు'' అన్నారు. ''మీరు అదనంగా చెబుతోన్న డైలాగులు బాగానే ఉన్నాయి కదా... అని ఊరుకున్నాను'' అన్నారాయన. ''అలాగా ... అయితే అదనంగా చెప్పిన డైలాగులకి కాస్త అదనంగా ఏదైనా ఇప్పించు నాయనా'' అంటూ ఆమె అందర్నీ నవ్వించారు. 
 • అవి దాసరి నారాయణరావు సినిమా పరిశ్రమకు కొత్తగా వచ్చిన రోజులు. దాసరి రాసిన ఒక డైలాగ్ సూర్యకాంతంకు నచ్చలేదు. ఆ డైలాగ్ మార్చమని సూర్యాకాంతం అడిగితే దాసరి ఒప్పుకోలేదు. దీంతో ఆమె అదే డైలాగ్ ను చెప్పి షాట్ ఒకే చేశారు. అయితే, ఈ సంఘటనతో దాసరి బాధపడ్డారు.  కాగా, తరువాత మరో షూటింగ్ లో పాల్గొన్న సూర్యకాంతం అక్కడ కూడా డైలాగ్ మార్చమని అడిగారు. వెంటనే ఆ రైటర్ ‘సరే’ అన్నాడు. దానికి సూర్యకాంతం 'నువ్వేం. రైటర్ వయ్యా.. ఏది మార్చమంటే అది మారుస్తానంటున్నావు.. నవ్వు రాసిన దాని మీద నీకు నమ్మకం లేదా.. దాసరి చూసి నేర్చుకో‘ అని మందలించారు. ఈ సంగతి తెలిసిన దాసరి ఎంతగానో సంతోషించారు.
 • మొహమాటపడకుండా తనకి రావాల్సిన పారితోషకాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందర్నీ నమ్మేది కాదు. తన కారు రిపేరుకొస్తే ఎంత పెద్ద రిపేరైనా, మెకానిక్‌ ఇంటికొచ్చి తన కళ్లముందు చెయ్యవలసిందే - ఎంత ‘ఎక్స్‌ట్రా మనీ’ అయినా తీసుకోనీగాక! చివరి దశలో వేషాలు తగ్గిపోయినా, చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది. తన ఆరోగ్యం బాగులేకపోయినా, ‘నటిస్తాను’ అని ధైర్యంగా చెప్పేది.
 • బి.నాగిరెడ్డి, చక్రపాణి లు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు. నాగిరెడ్డి చక్రపాణిల చిత్రాలు గమనిస్తే అందులో సూర్యకాంతం గారి పాత్రలేని చిత్రాలు బహు అరుదుగా కన్పిస్తాయి. ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో నటించి... ఆంధ్రుల అత్తగారిగా గయ్యాళి పాత్రలకు స్టాండర్డ్‌గా నిలిచిన సూర్యకాంతం గారు 1996 డిసెంబర్‌ 17వ తేదిన సూర్యకాంతం గారు స్వర్గస్తులయ్యారు... ప్రస్తుతం అవిడ స్వర్గంలో సేదతీరుతున్నారేమో... అమ్మా... సూర్యకాంతం గారూ నమోనమామి.
- సంకలనం : పల్లా కొండల రావు  
*Re-published   
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర చర్చావేదిక జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top