మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
ప్రజ 68
అంశం : వ్యాసుడు 

ప్రశ్నిస్తున్నవారు : ఊసరవెల్లి  

Name:ఊసరవెల్లి 
E-Mail:usaravelli5202@gmail.com 
Message:వ్యాసుడు బ్రాహ్మణుడా? బ్రాహ్మణేతరుడా??

వ్యాసుడు పరాశరుడు – సత్యవతిల పుతృడు. ఒక బ్రాహ్మణునికీ, మరొక హీన వర్ణానికి చెందిన స్త్రీకి జన్మించిన బిడ్డ. వర్ణ వ్యవస్థ ప్రకారం, ఒక వ్యక్తి బ్రాహ్మనుడు అవ్వాలంటే అతని తండ్రి తప్పనిసరిగా బ్రాహ్మణుడు అయ్యుండాలి, అతని తల్లి బ్రాహ్మణ స్త్రీ కానీ లేద క్షత్రియ స్త్రీ కానీ అయ్యుండాలి. అలా కాని పక్షములో వారి సంతానం బ్రాహ్మణులు అవ్వలేరు. కాబట్టి, వ్యాసుడు బ్రాహ్మణేతరుడే అన్నది నా వాదన.

మరి కొందరు ఏమంటున్నారంటే, స్త్రీ క్షేత్రం మాత్రమే, క్షేత్రములో బీజము నాటిన వారిని భట్టి వర్ణ నిర్ణయం జరుగుతుంది అని. కానీ, వర్ణ వ్యవస్థ ప్రకారం ఇది తప్పు.

మహాభారతములో భీష్ముడు చెప్పిన దాని ప్రకారం, నేను గ్రహించిన దానిని ఇక్కడ టూకీగా ఇస్తున్నాను. దాన్ని చదివి మీరే నిర్ణయించండి, వేద వ్యాసుడు బ్రాహ్మనుడా లేదా బ్రాహ్మనేతరుడా అన్నది.

వర్ణాలు అన్నీ సమానం కాదు. ఆ వర్ణాలలో కూడా స్త్రీ పురుషులు ఇరువురూ సమానం కాదు. పురుషుడికి ఉన్న వెసులు బాట్లు స్త్రీకి లేవు. ఇది చాల ముఖ్యమైన విషయం.

బ్రాహ్మ పురుషుడు వివాహం చేసుకోదలుచుకుంటే అతను నాలుగు వర్ణాలలోని ఏ వర్ణం స్త్రీ నైనా వివాహం చేసుకోవచ్చు. క్షత్రియుడు బ్రాహ్మన స్త్రీని తప్ప మిగిలిన వర్ణాలలోని స్త్రీలను వివాహ మాడొచ్చు. వైశ్యుడు వైశ్య స్త్రీని, శూద్ర స్త్రీని వివాహ మాడొచ్చు. శూద్రుడు కేవలం తన వర్ణములోని స్త్రీని మాత్రమే వివాహ మాడొచ్చు.

ఫస్ట్ ఆర్డర్ :
——–

బ్రాహణ పురుషుడు + బ్రాహణ స్త్రీ / క్షత్రియ స్త్రీ — బ్రాహ్మణులు.
క్షత్రియ పురుషుడు + క్షత్రియ స్త్రీ / వైశ్య స్త్రీ — క్షత్రియులు.
వైశ్య పురుషుడు + వైశ్య స్త్రీ / శూద్ర స్త్రీ — వైశ్యుడు.
శూద్ర పురుషుడు + శూద్ర స్త్రీ — శూద్రులు.

స్వచ్చమైన వర్ణానికి చెందిన వారు వీరంతా ! ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, పురుషుడు తన వర్ణానికి చెందిన స్త్రీని గానీ లేదా తనకన్నా కేవలం ఒక మెట్టు దిగువన ఉన్న వర్ణానికి చెందిన స్త్రీకి కానీ కలిగే సంతాన మంతా స్వచ్చమైన వర్ణానికి చెందిన వారే అవుతారు. వీరికి సమాజములో ఆయా వర్ణాలను భట్టి డీఫాల్టుగా వచ్చే గౌరవం వస్తుంది.

సెకండ్ ఆర్డర్ :
———-
(ఉన్నత వర్ణం పురుషుడు + హీన వర్ణం స్త్రీ)

బ్రాహ్మణ పురుషుడు + వైశ్య స్త్రీ / శూద్ర స్త్రీ — కలిగిన సంతానానికి మాత్రం బ్రాహ్మణ హోదా దక్కదు. వీరి హోదా అనేది వీరికి తండ్రి నుండి కాకుండా తల్లినుండి సంక్రమిస్తుంది.

బ్రాహ్మన పురుషుడి + శూద్ర స్త్రీ — పరాశరులు.
వీరి హోదా బాగా తక్కువ. వీరు తన తండ్రికి, అగ్రవర్ణ స్త్రీ వలన కలిగిన పిల్లలకు సేవలు చేసుకుంటు బతకాలి. వయసులో వీరే పెద్దవారైన సరే వారికి సేవలు చేసుకుంటూ బతకాలి.

క్షత్రియ పురుషుడి + శూద్ర స్త్రీ — సంతానం హోదా మాత్రం బాగా తక్కువ.

విశేష మేమిటంటే, వీరి గౌరవం బాగానే ఉంది. వీరు కాస్త ఫర్వాలేదన్నట్టు.

థర్డ్ ఆర్డర్:
——-
(హీన వర్ణం పురుషుడు + ఉన్నత వర్ణం స్త్రీ)

క్షత్రియ పురుషుడు + బ్రాహ్మణ స్త్రీ — సూత (కర్ణుడు ఉదాహరణ).
వైశ్య పురుషుడు + బ్రాహ్మణ స్త్రీ — వైదేహకులు.
(వీరి పని కంసాలి పని అనుకుంటా. వీరికి గొప్పింటి స్త్రీల అనగా “కుల స్త్రీల” ప్రైవసీని రక్షించడం వీరి డ్యూటీ).
శూద్ర పురుషుడికీ + బ్రాహ్మణ స్త్రీ — చండాలురు.
వీరి నివాసం ఊరి బయటే. వీరి పనికూడా అప్పట్లో నీచమైనవిగా భావించబడేవే.

వైశ్య పురుషుడికీ + క్షత్రియ స్త్రీ — వంది / మాగదులు.
వీరి పని రాజులను పొగుడుతూ బతకడం.
శూద్ర పురుషుడికీ + క్షత్రియ స్త్రీ — నిషధ.
వీరి పని చేపలు పట్టుకోవడం.

శూద్ర పురుషిడికీ + వైశ్య స్త్రీ — అయోగవ.
వారు చెక్క పని చేసుకుని బతకాలి (కార్పెంటర్). బ్రాహ్మనులు వీరి నుండి ఎటువంటి బహుమతులూ తీసుకో కూడదు.

వీల్లే కాదు ఇంకా చాలా ఉన్నాయి. మగధా, సైరంద్రీ, వైదేహ, మరిరేయక, మద్గుర, దాస, స్వపక, మగధి, మాన్స, స్వదుకర, క్షౌద్ర, సౌగంధ, మద్రనభ, పుక్కస, కరవర, పందుసౌపక, ఆంధ్ర.. ఇలా చాలా ఉన్నాయి.

వీరిలో మూడు కులాలు చాల హీనమైన స్టేటస్ కలిగి ఉన్నాయి. క్షుద్ర, ఆంధ్ర, కరవర. ఇవి బాగా హీనమైనవట.

ఇవన్నీ, హీనమైనవి అవ్వడానికి కారణం వారి పుట్టుకే. వర్ణ వ్యవస్థనూ, దాని ఆర్డర్నూ ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు జంట కట్టడమే.

ఇదీ వర్ణవ్యవస్థ.

చాలా మంది ఇంటర్నెట్ హిందువులు కుల వ్యవస్థ అనేది జన్మతః వచ్చింది కాదని, గుణాన్ని భట్టి వచ్చేదని చెబుతూ ఉంటారు. కానీ, ఈ మాటలు చెప్పింది మహాభారతములో భీష్ముడు. కాబట్టి, కులం అనేది పుట్టుకతోనే వస్తుందని నిర్దారించుకోవచ్చు. బహుషా ఈ వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా జైనిజం, బౌద్దిజం లాంటివి ఉండడం వలన, చాలా మంది హిందువులు అటువైపు ఆకర్షితులవుతూ ఉండడం వలన, తిరిగి వారిని ఆకట్టుకునేందుకు వర్ణం అనేది పుట్టుకతో వచ్చినది కాదు అని చెబుతూ ఉండి ఉండవచ్చు.

ఇక మనం వేదవ్యాసుని వద్దకు వద్దాం. వేద వ్యాసుడు బ్రాహ్మణుడా?

వేదవ్యాసుని తండ్రి పరాశరుడు. తల్లి సత్యవతి.

తల్లి సత్యవతి వద్దకు వద్దాం. సత్యవతి ఉపరిచర వాసు అనే రాజుకు, అద్రిక అనే అప్సరసకు పుట్టిన సంతానం. ఒక సారి ఉపరిచర వాసు యుద్దానికి వెలతాడు. గెలిచిన తరువాత అనుకుంటా, ఏదో ఒక సుందరమైన ప్రదేశానికి వెల్లి అక్కడి పరిసరాలకు మోహావేశం చెంది, వీర్యాన్ని స్కలిస్తాడు. ఆ వీర్యాన్ని ఒక ఆకులో ఉంచి, ఒక పావురానికి కట్టి, తన భార్యకు ఇవ్వమని పంపిస్తాడు. దారిలో ఆ పావురం డేగల వల్లనో మరి దేనివల్లనో వీర్యం ఉన్న ఆకుని జారవిడిస్తే.. శాపవశాత్తూ చేపగా మారిన అద్రిక ఆ వీర్యాన్ని మింగేసి గర్భవతి అవుతుంది. ఒక చేపలు పట్టేవాడు ఆ చేపను పట్టుకుని కోసి నప్పుడు ఇద్దరు పిల్లలు కనిపిస్తారు. ఆ పిల్లలకు జన్మనివ్వగానే అద్రిక శాపం నుండి విముక్తి పొంది దేవలోకానికి వెల్లి పోతుంది. ఆపిల్లలను తీసుకుని ఆ మత్య కారుడు ఉపరిచర వాసు వద్దకు వెలతాడు. వాసు, మగ పిల్లాడిని తిసుకుని, ఆడపిల్లను ఆ మత్యకారుడికె ఇచ్చేస్తాడు. చేప గర్భాన పుట్టడం వలన, ఆ ఆడపిల్ల చేపలా సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి ఆమెకు మత్స్యగంధి అనే పేరు వచ్చింది. ఆమే సత్యవతి.

ఉపరిచర వాసు క్షత్రియుడు కావచ్చు లేదా యాదవుడు కూడా కావచ్చు. మరి ఈ అప్సరస అద్రిక ఎవరు ? భాగవత పురాణం ప్రకారం అప్సరసలంతా కశ్యప ఋషికీ, ఆయన భార్య “ముని”కి పుట్టిన వారే. కశ్యపుడు బ్రహ్మ వలన పుట్టిన వాడు. “ముని” దక్ష ప్రజాపతి కూతురు. సో, ఇక్కడ వీరిద్దరికీ పుట్టిన అప్సరసలంతా బ్రాహ్మణుల కిందకే వస్తారు, మన వర్ణ వ్యవస్త ప్రకారం. అలా కాకుండా వృత్తి ప్రకారం తీసుకుంటే అప్సరసలు దేవ వేశ్యలు.

ఉపరిచర వాసు క్షత్రియ పురుషుడు + అప్సరస అద్రిక, బ్రాహ్మన స్త్రీ = సూత సంతానం.

అలా కాదు అప్సరసలు దేవ వేశ్యలు అనుకుంటే .. క్షత్రియుడికీకి పుట్టిన వారు క్షత్రియులు అవ్వాలంటే తల్లి క్షత్రియురాలయ్యుండాలి లేదా వైశ్య స్త్రీ అయ్యుండాలి. కానీ దేవ వేశ్యలు రెండింటిలో దేనికీ చెందరు.

కాబట్టి ఉపరిచర వాసుకు, అప్సరస అద్రికకూ పుట్టిన సత్యవతి అయితే సూత జాతికి చెందినది అవుతుంది లేదా మరో జాతికి చెందినది అవుతుందే తప్ప క్షత్రియురాలు అయ్యే అవకాశం లేదు.

వేద వ్యాసుని తండ్రి పరాశరుడు బ్రాహ్మణుడు కానీ, తల్లి సత్యవతి బ్రాహ్మణ యువతి కానీ, క్షత్రియ యువతి కానీ అయ్యే అవకాశమే లేదు. అయితే సూత జాతికి చెందిన స్త్రీ అవుతుంది లేదా మరో తక్కువ శ్రేనికి చెందిన స్త్రీ అవుతుంది.

కాబట్టి, వేద వ్యాసుడు బ్రాహ్మనుడు కాదు. అబ్రాహ్మనుడే అన్నది నా అభిప్రాయం. ఎవ్వరికైనా ఇది తప్పు అనిపిస్తే నిరూపించ వచ్చు. 
-------------------
*Re-published
  ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.
  Reactions:

  Post a Comment

  * మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
  * పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
  * నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
  * పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
  * ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
  * అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
  * తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
  * మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
  * మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
  * తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

  p v satyanarayana video's p v satyanarayana videso vm vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
   
  Top