• చరణ్‌ కుమార్‌ తెలివైన యువకుడు. ఏ విషయంలోనైనా స్పష్టమైన అభిప్రాయం కలిగివుంటాడు. అయితే ఎదుటివారు చెప్పిందంతా తప్పని, తాను చెప్పేదే సరైనదని భావిస్తుంటాడు. తన ఆలోచనలే సరైనవని అతని నమ్మకం. ఎవరైనా అతని అభిప్రాయంతో విభేదిస్తే ఓర్చుకోలేడు. తీవ్రంగా మదనపడిపోతాడు. లేదా ఘర్షణకు దిగుతాడు. దీనంతటికీ కారణం భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని అంగీకరించకపోవడమే అంటున్నారు మనోవికాస నిపుణులు.
 • అందరి అభిప్రాయాలూ ఒకేలా ఉండవు. మనం ఆలోచించినట్లే అందరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరి దృక్పథంలోంచి వారు ఆలోచిస్తారు. ఎవరి దృక్పథంలోంచి వారు నడుకుచుకుంటారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం మాత్రమే ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లు చూస్తున్నామనుకుంటే ఎదుటివారు చెప్పేదాన్ని అంగీకరించలేం. ఎదుటివారు సరైన దారిలో వెళ్లడం లేదని కూడా అనిపిస్తుంది. అందుకే వారిని గౌరవించడానికి అంగీకరించం. వారితో మాట్లాడటానికి ఇష్టపడం. మనం మాత్రమే సరైన దృక్పథంలో ఆలోచిస్తున్నామని ఎవరికివారు అనుకుంటే అది హ్రస్వ దృష్టే అవుతుంది. ఇలావుండేవారు కొత్త విషయాలు తెలుసుకోడానికి అవకాశాలు కోల్పోతారు. తమ నియంత్రణ పరిధికి వారు పరిమితమైపోతారు.
 • సరిగా ఆలోచించడం అంటే...ఎదుటివారికి భిన్నాభిప్రాయం ఉండొచ్చని కూడా ఆలోచించాలి. దాన్ని అంగీకరించకున్నా కనీసం గౌరవించాలి. మనకంటే భిన్నమైన అభిప్రాయం, ఆలోచన చెప్పినపుడు అందులోని మంచిచెడులు ఏమిటో ఆలోచించాలి. ఆ ఆలోచన మన ఆలోచన కన్నా మెరుగ్గావుంటే నిజాయితీగా అంగీకరించాలి. ఆ ఆలోచన చేసిన వారిని అభినందించాలి. 'మీలాంటి ఆలోచన నాకు రాలేదు' అని నిజాయితీగా అంగీకరించాలి. ఇలా చేయడం వల్ల కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కలుగుతుంది.
 • మన ఆలోచనే సరైనది కావచ్చు. ఎదుటివారిది తప్పు కావచ్చు. అయితే ఇది ఆచరణలో రుజువుకావాలి. మన ఆలోచన చెప్పడం వరకే మన పని. దాన్నే అందరితో అంగీకరింపజేయాలని అనుకోవడం అవివేకం. వాస్తవంగా మన ఆలోచన సరైనదైతే, ఎదుటివారిది తప్పయితే ఆచరణలో తేలుతుంది. అప్పుడు అందరూ అనివార్యంగా మిమ్మల్ని అభినందిస్తారు. బహిరంగంగా అభినందించకున్నా మనసులోనైనా ఆ పని చేస్తారు. అదే నేను చెప్పిందే సరైనదని పట్టుబట్టి అందరితో ఘర్షణకు దిగితే మనపైన ఎవరికీ గౌరవం ఉండదు. మొండివాడిగా, మూర్ఖునిగా ముద్ర కూడా వేస్తారు. 
from prajasakthi daily
--------------------
*Re-published
  ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.

  Reactions:

  Post a Comment

  * మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
  * పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
  * నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
  * పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
  * ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
  * అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
  * తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
  * మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
  * మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
  * తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

  అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
   
  Top