మీరూ వార్త - వ్యాఖ్య లో పాల్గొనదలచుకుంటే వివరాలకు ఇక్కడ నొక్కండి
-----------------------------------------------------------
21వ శతాబ్దిలోనూ రిజర్వేషన్లా?
 •  కోటాపై పునఃసమీక్ష జరగాలి
 •  కులం, వర్గం, మతం కాదు...
 • ఆర్థిక వెనుకబాటే ప్రాతిపదిక కావాలి
 •  కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ వ్యాఖ్యలు
 •  రిజర్వేషన్లపై మరో కలకలం
 •  ఆరెస్సెస్‌ చీఫ్‌పై మండిపడ్డ పార్టీలు
 •  కోటా కొనసాగాల్సిందేనన్న బీజేపీ
 • పునఃసమీక్షకు వ్యతిరేకమని వెల్లడి


న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: ‘ఎన్నాళ్లీ రిజర్వేషన్లు?’ అని మరో గళం ప్రశ్నించింది. ఈసారి... కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి మనీశ్‌ తివారీ ఈ అంశంపై స్పందించారు. ‘పటేల్‌ కులస్తులను ఓబీసీలో చేర్చాలి’ అని గుజరాత్‌లో మొదలైన ఉద్యమంతో కోటాపై కలకలం చేలరేగుతున్న సంగతి తెలిసిందే. ‘రిజర్వేషన్లు ఎవరెవరికి, ఎన్నాళ్లకాలం ఉండాలో నిర్ణయించేందుకు కమిటీని నియమించాలి’ అని ఆదివారం ఆరెస్సెస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. ఇప్పుడు మనీశ్‌ తివారీ ఈ విషయంలో మరో అడుగు ముందుకేశారు. ‘‘మోహన్‌ భగవత్‌ ఏమైనా చెప్పి ఉండొచ్చు! అయితే... రిజర్వేషన్ల వ్యవస్థపై సమీక్ష మాత్రం అవసరం. 21వ శతాబ్దంలోనూ కోటా ఉండాలా? ఒకవేళ ఉండాలంటే... అది ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగానే ఉండాలి. కుల ప్రాతిపదికన కాదు. దారిద్య్రమే వెనుకబాటుతనానికి ప్రాతిపదిక’’ అని మనీశ్‌ తివారీ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. వర్గం, కులం, మతాలకు అతీతంగా... ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ రిజర్వేషన్ల ఫలాలు అందాలన్నారు. అంటే... కుల రిజర్వేషన్ల స్థానంలో, ఆర్థిక స్థితి ప్రాతిపదికన కోటా ఉండాలంటారా అని ప్రశ్నించగా... ‘‘అసలు రిజర్వేషన్లు ఉండాలా, వద్దా అనే అంశంపైనే చర్చించాలి. ఉంటే... దేని ప్రాతిపదికన ఉండాలి? కుల ప్రాతిపదిక నుంచి ఆర్థిక ప్రాతిపదికన మార్చాలా? దీనిపై చర్చ జరగాలి’’ అని మనీశ్‌ తివారీ తెలిపారు. గతంలో కాంగ్రె్‌సకే చెందిన జితిన్‌ ప్రసాద, జనార్దన్‌ ద్వివేదీ కూడా రిజర్వేషన్ల కొనసాగింపుపై భిన్నగళం వినిపించారు. వీరిద్దరూ ఏకంగా అధిష్ఠానానికే తమ అభిప్రాయాలు తెలియచేశారు. ‘‘బలహీన వర్గాల్లోని పేదల్లాగే, అగ్రవర్ణ పేదలూ ఇబ్బందులు పడుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందనే ఆందోళన, ఆక్రోశం అగ్రవర్ణ పేదల్లో పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో మండల్‌ రాజకీయాలపై పునఃసమీక్ష అవసరం’’ అని జితిన్‌ ప్రసాద కాంగ్రెస్‌ అధిష్ఠానానికి సూచించారు. ఇదే అంశంపై జనార్దన్‌ ద్వివేదీ గత ఏడాది లోక్‌సభ ఎన్నికల ముందు స్పందించారు. ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన కోటా అమలు చేయాలన్నారు. అదే సమయంలో... తాను కుల రిజర్వేషన్లు తొలగించాలని అనడంలేదని, అవసరంలేని వారికి కోటా రద్దు చేయాలని మాత్రమే కోరానని చెప్పారు. అయితే... ద్వివేదీ అభిప్రాయాలను ఖండిస్తూ, ప్రస్తుత రిజర్వేషన్ల విధానాన్ని సమర్థిస్తూ సోనియా గాంధీ స్వయంగా తీవ్ర పదజాలంతో ఒక లేఖ రాశారు. తాజాగా... మనీశ్‌ తివారీ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై కాంగ్రెస్‌ ఇప్పటిదాకా స్పందించలేదు. ‘అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం’ అని తేల్చేసింది. ఇక... ఎన్‌సీపీ నేత మజీద్‌ మెమన్‌ సైతం... ‘రిజర్వేషన్లు నిర్దిష్ట కాలపరిమితి వరకే అమలు చేయాలని రాజ్యాంగ నిర్మాతలు సూచించారు’ అని తెలిపారు.
రద్దు చేయండి చూద్దాం: లాలూ సవాల్‌
కోటాపై మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయ కలకలం మొదలైంది. అసలే బిహార్‌ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మొదలైన చర్చ రాజకీయ వేడినీ పుట్టించింది. ‘దమ్ముంటే, నిజంగా తల్లిపాలు తాగి ఉంటే రిజర్వేషన్లను రద్దు చేయండి. ఎవరి సత్తా ఏమిటో తేలుతుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీకి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సవాల్‌ విసిరారు. రిజర్వేషన్లకు చరమగీతం పాడేందుకు తగిన వాతావరణాన్ని సృష్టించేందుకు బీజేపీ, ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ‘‘తన బాస్‌ (భగవత్‌) కోసం రిజర్వేషన్లకు ముగింపు పలుకుతారా, లేదా అన్న విషయాన్ని ఇటీవలే బీసీగా మారిన మోదీ స్పష్టం చేయాలి. మేం అధికారంలోకి వస్తే పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లనూ పెంచుతాం’’ అని లాలూ తేల్చిచెప్పారు. ఇక... భగవత్‌ వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని జేడీ (యూ) నేత కేసీ త్యాగి పేర్కొన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలను బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. భగవత్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. ఇక... ఎన్డీయే మిత్రపక్షమైన రాషీ్ట్రయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎ్‌సపీ).. రిజర్వేషన్ల అంశం రాజ్యాంగం మేరకు భారత్‌లో స్థిరపడి పోయిన అంశమని, దీనిపై మరో మాటకు తావులేదని తెలిపింది. కుల ప్రాతిపదికన కోటాకు మోదీ ప్రభుత్వం వ్యతిరేకమని మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అశోక్‌ చవాన్‌ ఆరోపించారు. రిజర్వేషన్ల వ్యవస్థను సమీక్షించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఎన్‌సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ స్పష్టం చేశారు. (from andhrajyothy daily)
--------------------
*Re-published
  ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.
  Reactions:

  Post a Comment

  * మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
  * పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
  * నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
  * పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
  * ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
  * అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
  * తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
  * మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
  * మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
  * తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

  అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర చర్చావేదిక జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
   
  Top