మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------
ప్రశ్నిస్తున్నవారు - పల్లా కొండల రావు
అంశం : రాజకీయం 
----------------------------------------

రాజకీయం అనే పదం లేదా కార్యక్రమం రాజ్యం ఏర్పాటుని బట్టి ఏర్పడినదేనా? రాజకీయం పుట్టుక ఎలా జరిగింది?

Reactions:

Post a Comment

 1. రాజ్యం పుట్తుక తోనే రాజకీయం కూడా పుట్టింది.రాజు విష్ణువు తో సమానం అని మూఢ నమ్మకాల్ని ప్రచారం చేసిన కాలం లో కూడా ఆ రాజు అసమర్ధుడయితే మంత్రో సేనాధిపతో అతన్ని తప్పించేసి అధికారం లోకి రావదం చరిత్రలో భాగాలే గదా!ఇప్పుడు పార్టీ పెట్తినట్టు అప్పుడు పురాణాల్నీ ఇతిహాసాల్నీ తిరగదోడి తమకూ దివ్యత్వాన్ని కట్టబెట్టే ఒక కొత్త రాజవంశాన్ని సృష్టించుకునే వాళ్ళు!!

  చుట్టూ వుండే వాతావరణాన్ని తీసేస్తే రాజ్యం అనేది యెప్పుడూ ఒక్కలాగే వుంది.ప్రజలు తమకేం కావాలో స్పష్తంగా తెలుసుకుని అవి డిమాంద్ చేసి మరీ సాధించుకోవాలే తప్ప నాయకులకి దాసోహం అనకూడదనే తెలివి తెచ్చుకోనంత వరకూ ఇది ఇలాగే నడుస్తుంది. "కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ)" అనే నా పోష్టులో గాంధీ ఆ చట్రాన్ని మార్చకుండా స్వతంత్రాన్ని సాధించి పెట్టాడనేది చెప్పినది కూడా ఇదే వుద్దేశంతోనే.

  పాతకాలం మనుజేశ్వరాధముల్ని కొత్త వేషాలతో జనం ముందు పార్లమేంటేరియన్లుగా నిలబెట్టింది గాంధీ నేతృత్వం లోని కాంగ్రెసు.తెలంగాణాలో జరిగిన తిరుగుబాటులో అది స్పష్టంగా తెలుస్తుంది గనక గుర్తు పట్టగలుగుతున్నాం, మిగతా చోట్ల అస్పష్టంగా వుండటంతో తెలియదం లేదు.

  తెలంగాణాలో భారత సైన్యం అడుగు పెట్టక ముందే ప్రజలు నిజామునీ ప్రజా వ్యతిరేకుల్నీ తరిమి కొట్టి భూస్వాములు కబళించిన భూముల మీద జండాలు పాతడం వాస్తవం.అది కమ్యునిష్టుల అధ్వర్యంలో జరగడం చేత నాన్ కమ్యునిష్తులు వొప్పుకోక పోయినా జరిగింది మాత్రం అదే.కాంగ్రెసూ నిజామూ కూడా కమ్యునిష్టు భూతాన్ని చూసి దడుచుకునే రకాలే కాబట్తి ఒకరి కొకరు సహాయాలు చేసుకుని మిత్రభావంతో సర్దుకు పోగలిగారు. రాజకీయ స్వభావాన్ని మార్చకుండా గాంధీ అనే రాజ పురోహితుదు చేసిన దానికి తెలంగాణాలో జరిగింది స్పష్తమయిన వుదాహరణగా తీసుకున్నానే తప్ప విలీనం, విమోచన వంటి వాటిని ఇక్కడా కెలికే వుద్దేశం నాకు లేదు! భారత సైన్యం చేసిన అసలు ఘనకార్యం ప్రజలు స్వాధీనం చేసుకున్న భూముల్ని మళ్ళీ తమ మితృలయిన మనుజేశ్వరాధములకి అప్పగించి దానికి చాలా గంభీరమయిన పేరుని తగిలించటం.

  అందువల్లనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పేరుతో వంశపారంపర్య ప్రధాన మంత్రిత్వాలు కూడా చాలా సహజమయిన పధ్ధతిలో అమలు జరుగుతున్నాయి.మన ప్రజా ప్రతినిధుల భాష కూడా పదజాలం మార్పు తప్ప అప్పటి రాజుల మాదిరే వుంటున్నది. యేవరికి వారే మాటల్లోనూ చేతల్లోనూ దైవాంశ సంభూతులుగా ప్రవర్తిస్తున్నారు.కొండల రావు గారు గాంధీ అలా చెయ్యదం వల్లనే ప్రజలు ఇలా వోతు చేస్తున్నా రంతారా అని అడిగారు.గాంధీ చేసిన అసలయిన మాజిక్ ప్రజల మైండ్ సెట్ ని అందుకు అనుగుణంగా మార్చటమే.ప్రజల ముందు యే రకమయిన విభిన్నతా కనబదని ఒకే బ్రహ్మ పదార్ధం అన్ని పార్టీల రూపంలో వున్నది!

  కాబట్టి రాజ్యంతో పాటే పుట్తిన అప్పటి రాజకీయమే ఇప్పుడూ నడుస్తున్నది!

  ReplyDelete
 2. హిందీలో రాజకీయ అన్న పదాన్ని ప్రభుత్వం అనే అర్థంలో వాడతారు. ఉదా:- రాజకీయ పాఠశాల అంటే ప్రభుత్వ పాఠశాల అని అర్థం.
  మనం రాజకీయం (politics) అని వాడే పదానికి బదులుగా వాళ్ళు రాజ్‌నీతి అనే పదాన్ని వాడుతారు.

  ReplyDelete


 3. నారదుల వారాద్యులుగా రాజ కీ యము మొదలయ్యింది :)


  జిలేబి

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top