------------------------------------------------
ప్ర : 81
అంశం : మతం
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------

'మతం' అనే పదానికి హిందూ మత గ్రంధాలు ఇచ్చే నిర్వచనం ఏమిటి? 
హిందువులు మతం అనే పదానికి ఏమి నిర్వచనం చెపుతారు? 
------------------
మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

 1. హిందూ మతం అనేది "సప్తసింధు" అనే ప్రాంతాన్ని విదెశీయులు గుర్తించి పలుకుబడిలో హిందూ అని పిలిచే విధంగా కాలం మారుతున్నప్పుడే ఇక్కడ పాటించే మతం అని వాళ్ళు అనుకున్న దానికి హిందూ మతం అని పేరు పెట్టారు.కానీ హిందువులు మాత్రం తమది "సనాతన ధర్మం" అని చెప్పుకుంటారు!
  దానికి కారనం ప్రస్తుతం ఇంగ్లీషు వాళ్ళ కాలంలో భారత దేశానికి సంబంధించి దొరికిన అతి ప్రాచీనమైన నాగరికతని "సింధు నాగరికత" అని పేఉ పెట్టి విశ్లేషించి అంతకు ముందు ఇక చరిత్ర లేదనే అర్ధం వచ్చేటట్టు "చరిత్ర పూర్వ దశ" అని పేరుపెట్టి వొదిలేశారు.కానీ అదే శాస్త్రీయ పధ్ధతులతో ఇప్పుడు మన ప్రభుత్వం సాగించే తవ్వకాలలో అంతకు ముందు కూడా ఇక్కడ అప్పటికి మరే ప్రాంతంలోనూ కనబదని విశేషాలతో నిండిన చరిత్ర బయట పడుతున్న్నది. రామసేతుకి గట్టి ఆధారాలు చూపించి కృషి చేసింది జర్మన్లు!మరొకరూ మరొకరూ(ముఖ్యంగా బ్రిటిషర్లు) అబధ్ధాలతో నైనా మిగతా వాళ్ళ కన్నా మేమే గొప్పవాళ్లం అనదుకే మిమ్మల్ని పాలించే అర్హత మాకుంది అని డప్పు కొట్టుకున్నా దాన్ని కూడా ఒప్ప్పుకునే వాళ్ళు మన చరిత్రలోని గొప్పదనం ఆధారాలతో నిరూపించడినా గర్వించటానికి బదులు తక్కువ చేసి మాట్లాడుతున్నారు,యెందుకని?

  కాబట్టి అంత ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతూ వస్తున్నది కాబట్టి "సనాతన ధర్మం" అంటున్నారు.పైగా ఈ సాంప్రదాయంలో ంగత అమతాల్లో దేవుడ్ని ఖచ్చితంగా నమ్మాలనే నిక్కచ్చితనం లేకుండా దేవుని ఆస్తిత్వాన్ని గుర్తించని వాళ్ళు కూడా ఋషిపరంపరలో ఉండటం,మనిషి యెట్లా జీవించాలి అనే ధర్మస్మబంధమైన విషయాలకి యెక్కువ ప్రాధాన్యత ఇవ్వతం కూడా "సనాతన ధర్మం" అని చెప్పుకోవదానికి ఒక కారణంగా ఉన్నది!

  ReplyDelete
  Replies
  1. హరిబాబు వివరణకు ధన్యవాదములు. అయితే 'హిందూ మతం' లేదంటారా?

   Delete
  2. ఒక మనిషికి ఉరఫ్ అని ఉంటే కొందరు అసలు మనిషి పేరుని వాదతారు,కొందరు ఉరఫ్ పేరుని వదతారు!

   ఈ సాంపదాయాన్ని పాటించే వాళ్ళు దీన్ని "సనాతన ధర్మం" అంటున్నారు.కొన్ని సార్లు "హిందూ మతం" అని నేను కూడా అంటున్నాను గానీ ఖచ్చితంగా చెప్పాలంటే మాత్రం "హిందూ మతం" అని అనకూడదనేది నా అభిప్రాయం.గొప్పగా చెప్పాలని చెప్పడం కాదు గానీ మతం అనే నిర్వచనానికి ఒదగని లక్షణాలు చాలా ఉన్నాయి!నేను "విన్నారా?విన్నారా?ఈ వింతను విన్నారా?దేముడి దయవల్లనె ఇంగిలీజులరాజ్య మొచ్చెనంట!" అనే పొష్టులో ఐలయ్య గారు హిందూ దేవతలు అప్రజాస్వామికంగా ఉంతారు అనేదాని మీద ఆయన ప్రస్తావించిన అన్ని మతాల్నీ పోల్చాను.స్థూలంగా ప్రతి మతానికీ ఉన్నట్టు దేవుడు,కర్మకాంద,నిషేధాలు - వీటిల్లో మిగతా వాటిల్లో కనబదే రిజిడిటీ ఇక్కద లేదు.దానికి గట్టి సాక్ష్యం దేవుడి ఉనికిని ఒప్పుకోని కపిలముని సాంఖ్యవాదం గౌరవనీయ స్థానం సంపాదించుకోవతం,ఇంకా గీతలో మునులలఓ నేను కపిలమునిని అని కూడా చెప్పుకున్నాడు.

   మొత్తంగా ధర్మం అనేది దైవాని కన్నా ప్రముఖ స్థానం ఆక్రమించంది కాబట్టే దీఎని సనాతన ధర్మమ లేక హిందూ ధర్మం అనై పిలవతమే న్యాయం!

   Delete
  3. < గొప్పగా చెప్పాలని చెప్పడం కాదు గానీ మతం అనే నిర్వచనానికి ఒదగని లక్షణాలు చాలా ఉన్నాయి! >

   సనాతన ధర్మంలో ఉన్న గొప్పని గొప్పగా చెప్పాల్సిందే హరిబాబు గారు. మీరు సూచించిన మీ ఆర్టికల్ వీలు చూసుకుని తప్పక చదువుతాను.

   దేవుడిని నమ్మనివాడు కూడా హిందువుగా ఉండొచ్చంటారా?

   Delete
  4. >దేవుడిని నమ్మనివాడు కూడా హిందువుగా ఉండొచ్చంటారా?
   ఊండవచ్చును. షడ్దర్శనాలలో నాస్తికదర్శనాలూ ఉన్నాయి.

   Delete
  5. శ్యామలీయం గారు, ధన్యవాదములు. ఇది కొత్త విషయమే. వీలయితే షడ్దర్శనాలు-నాస్తిక దర్శనం గురించి వివరిస్తారా?

   Delete
  6. కొండలరావుగారు,
   ప్రస్తుతానికి నాకు వీలుపడదు. (మీకు ఈ రోజు వ్రాసిన జాబులో కారణాలు ఇప్పటికే వివరించాను.) సాంఖ్య, న్యాయవైశేషిక దర్శనాలను నాస్తికదర్శనాలని అంటారు. అంటే వీటిలో భగవంతుడి పారమ్యం గురించి కాక ఇతరవిషయాలు ప్రథానంగా ఉంటాయి. యోగ, (పూర్వ, ఉత్తర)మీమాంసా దర్శనాలను ఆస్తికదర్శనాలుగా చెప్పవచ్చును. వీలైతే పుల్లెల శ్రీరామచంద్రుడుగారి 'హిందూమతం - సనాతన ధర్మం' పుస్తకం చదవండి. చూడండిః http://pustakam.net/?p=5732

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top