మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------------

ప్రశ్న పంపినవారు : Marxist-Leninist .
------------------------------------------------
Name:Marxist-Leninist 
E-Mail:deleted  
Subject:రాజకీయ నాయకులకి చరిత్ర తెలియక్కరలేదా? 
Message:
గోల్కొండ కోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవాలు జరపాలని తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి నాయకులు వ్యతిరేకిస్తున్నారు. గోల్కొండ కోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవాలు జరిపితే నిజాం బూజుని గుర్తు చేసినట్టు అని బిజెపి నాయకుల వాదన. గోల్కొండ కోట కట్టినది నిజాం కాదు, కాకతి ప్రతాపరుద్రుడు. ఆ కోటని బహమనీలూ, కుతుబ్‌షాహీలు కూడా ఆక్రమించుకున్నారు కానీ నిజాంలు మాత్రం వాడుకోలేదు.

ఇప్పుడు హైదరాబాద్ పేరు మార్చాలని బిజెపి నాయకుడు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ కోరుతున్నాడు. హైదరాబాద్ కట్టినది నిజాంలు కాదు, కుతుబ్‌షాహీలు. రాజకీయ నాయకులకి చరిత్ర తెలియాలని రూల్ లేదు కానీ ఇలాంటి వాళ్ళని చూస్తే ఆ రూల్ పెట్టాలనే అనిపిస్తుంది.

దీనిపై మీరేమంటారు!?
Reactions:

Post a Comment

 1. ఎవరికీ అన్ని విషయాలు తెలియవు. కాని రాజకీయ నాయకుని హోదాలో వుండి దేనిగురించైనా మాట్లాడేటప్పుడు దానిగురించి అంతో ఇంతో తెలిసినవారి దగ్గరనుండి అడిగి తెలుసుకుని మాట్లాడడం కనీస బాధ్యత.

  వారి కోపం నిజాం బూజుమీద కాదు. కేవలం నిజాం మీదే! ఆ బూజు మీదే గనుక కోపం వుంటే దానిలో తొంబై శాతం హిందూ జాగీర్దారులదే. మరి ఆ బూజును వారు ఎప్పుడూ వ్యతిరేకించినట్టు కనిపించలేదు.

  ఇక పోతే గొల్కొండను వాడింది నిజాములు కాదని, కుతుబ్‌షాహీలని తెలిసినా కూడా వారి అభిప్రాయంలో తేడా వుండదనుకుంటాను. కారణం అందరికీ తెలిసిందే. మరి అదే కారణంతో ఔరంగాజేబు పరిపాలించిన ఎర్రకోట పైన వారి నాయకుడు జెండా ఎగురవేయడం ఎలా సమర్థిస్తారో వారే చెప్పాలి.

  ReplyDelete
  Replies
  1. గోల్కొండ కోటని కట్టినది హిందువులే. దాన్ని ఎవరు ఆక్రమించుకున్నా అది హిందువులది కాకుండా పోదు. హిందువులు కట్టిన కోటకి వాస్తు మార్చకుండానే అందులో నివసించడానికి బహ్మనీలూ, కుతుబ్‌షాహీలూ సంకోచించలేదు. ఆ కోట తమది అని చెప్పుకోవడానికి హిందువులకి సంకోచం అవసరం లేదు.

   ముస్లింలని మతం పేరుతో తిట్టి, రెస్తారెంత్‌లలో ముస్లింలు వండిన బిర్యానీలే తినే బిజెపి నాయకులకి నిజాయితీ అంతో అందరికీ తెలిసినదే.

   Delete
 2. నేను చరిత్ర పుస్తకాలలో చదివిన దాని ప్రకారం కమ్యూనిస్త్‌లు, ఆర్య సమాజం, కాంగ్రెస్‌వాళ్ళు నిజాంకి వ్యతిరేకంగా పోరాడారు కానీ ఆర్.ఎస్.ఎస్., హిందూ మహాసభలు మాత్రం నిజాం వ్యతిరేక పోరాటం చెయ్యలేదు.

  హైదరాబాద్ పేరు మార్చే ముందు గుజరాత్‌లోని అహ్మదాబాద్ పేరు మారిస్తే బాగుంటుంది. సమైక్యాంధ్ర ప్రభుత్వం ఆంగ్లేయులు కట్టిన సికందరాబాద్ నగరంలో స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకునేదని కూడా ఈ బిజెపి నాయకులకి తెలిసినట్టు లేదు.


  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top