మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
--------------------------------------------
ప్రశ్నిస్తున్నవారు - పల్లా కొండల రావు
-------------------------------


భారత దేశ లేదా ఏదైనా దేశ చరిత్రను ఎలా వ్రాయాలి? చరిత్ర అధ్యయనం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? చరిత్ర అంటే రాజుల జీవితాలు - వారి యుద్ధాలు - విజయాలు - వారి ప్రేమ కథలేనా? అందుకే శ్రీ శ్రీ అడిగాడు రాజెక్కిన పల్లకీ కాదు అది మోసిన బోయీలను చూడమని. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరనీ ఆయనే అడిగాడనుకుంటాను. ప్రజలే చరిత్ర నిర్మాతలని కారల్ మార్క్స్ అన్నారు. భారత దేశ చరిత్ర అంటే పురాణాలతో సహా అన్నీ రావాలని ఓ రచయిత అభిప్రాయపడ్డారు. పురాణాలు చరిత్ర కాదా? అయితే ఎందుకు? మొత్తంగా ఇటీవల చరిత్ర పాఠ్యాంశాలలో మార్పులపైనా చర్చ నడుస్తోంది. విద్యార్ధులకు పాఠాలయినా, చరిత్రపై ఆసక్తి ఉన్నవారైనా చరిత్రను సరిగా తెలుసుకోవాలంటే చరిత్ర రచన ఎలా జరగాలి? ఈ అంశంపై మీ అభిప్రాయాలు ఏమిటి?
చరిత్ర అంటే నిర్వచనం ఏమిటి? చరిత్ర అధ్యయనం ఎందుకు? ఎలా లిఖించాలి?
*Re-published
Reactions:

Post a Comment

 1. నేనొకప్పుడు "Religion and History are not independent but inter dependent" అనే టాపిక్ తీసుకుని అగ్నిమీళే పురోహితం దగ్గిర్నుంచి మొదలు పెట్టి ఆ కొద్ది సమయంలోనే పౌరణిక సాహిత్యం-చరిత్రక వాస్తవం యెలా ఒకదానిని ఒకటి వుపయోగించుకుంటయో సెమినార్ లాగా ఇస్తే అంతా ముగ్ధులై విన్నారు.ప్రపంచ భాష లన్నిట్లోనూ "ళ" అనే అక్షరం ఒక్క సంస్కృత భాష లోనే యెందుకు వుంది?

  ReplyDelete
 2. చరిత్రను మలుపు తిప్పిన ప్రతి గొప్ప వ్యక్తి యేదో ఒక రకమయిన భావావేశం కోసం తనకన్నా ముందు ఘనకార్యాలు చేసిన వారి వీరగాధల్ని చదివి వుత్తేజం పొందిన వాదే ఆ సాహిత్యంలో పొగడబడేవాళ్ళు కూడా తమ కాలంలో గానీ తమ ముందు తరాల్లో గానీ అలాంటి ఘనకార్యాల్ని చేసిన వారికి మహత్వాన్ని కల్పించారు.నేను "ఇమ్మోర్తల్స్ ఆఫ్ మెలూహా" 3భాగాల్లొ చదివాను.ఆ రచయిత ఈ రెంటికీ మధ్య వున్న అన్నిరకాల కూడికల్నీ తీసివేతల్నీ చాలా చక్కగా చూపించాడు!

  భారతీయమయిన చారిత్రక కావ్యాల్లో కళణుది "కాశ్మీర రాజ తరంగిణి" అనేదాన్ని గురించి చదివాను.అది కవిత్వ రూపంలో వున్నా చరిత్రని రికార్డు చేస్తున్న్నట్టే ఉంటుంది,మరి అందులోని విషయాలకి ఆధారాలు వున్నాయా లేవా కేవలం కల్పనల్నే కవి చరిత్ర లాగా చెప్పాడా అనేది మాత్రం నాకు తెలియదు, తెలుసుకోవాలి.

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పినది ఎంతో నిజం. పండిట్ కోట వెంకటచలం గారు రాజతరంగిణి గురించి క్షుణ్ణంగా పరిశోధనలు జరిపారు. అందులో పేర్కొన్న ఎన్నో సంఘటనలకు ఆస్ట్రానమీ ఆధారంతో సరిచూసి కాలనిర్ణయం చేసారు. ఆయన పుస్తకాలు నెట్లో దొరుకుతున్నాయి.

   Delete
 3. మనిషికి, మనిషి చుట్టూ ఉన వ్యవస్థకి సంబంధించిన సంఘటనల అధ్యయనాన్ని చరిత్ర అని చెప్పవచ్చు. సంఘటనలు అన్నప్పుడు అవి నిర్ధారించే ఆధారాలు కూడా తప్పనిసరి.

  ఇక పురాణాల సంగతి. పురాణాల్లో అటువంటి ఆధారాలు గనుక వుంటే తప్పనిసరిగా అంతమేరకు వాటిని చరిత్రగా స్వీకరించ వచ్చు. ఆధారాల ప్రాతిపదిక మాత్రం తప్పనిసరి.

  పురాణాల్లో చెప్పబడిన కథలను ఆధారాలు లేకుండా చరిత్రగా స్వీకరించలేం. కాని వాటిలో కేవలం కథే కాక అనేక విషయాలు వుంటాయి. ఉదారణకు వ్యాయబడిన కాలం నాటి ప్రజల జీవన విధానం, ఆచార వ్యవహారాలు, కులాలు, కట్టుబాట్లు, వృత్తులు మొదలైన వాటి గురించి పరిశోధించవచ్చు. అంతే కాక వాడిన భాష, అది పరిణామం చెందిన విధానం కూడా పరిశోధించ వచ్చు. అందులో చెప్పబడిన ఊర్లు, పట్టణాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి అక్కడ చారిత్రిక పరిశోధనలు చేయవచ్చు.

  పురాణాల్లో ఫలానా సంఘటనకు ఆధారాలున్నాయి కాబట్టి మొత్తాన్ని యధాతథంగా నమ్మాల్సిందే నని కొందరు పిడివాదులు వాదిస్తుంటారు. కాని చరిత్ర అంటే కేవలం ఋజువులతో కూడినది మాత్రమే.

  ReplyDelete
  Replies
  1. exactly. 100% i agree with u srikanth garu.

   Delete

  2. ఇది చాలా పెద్ద ప్రశ్న.వివరంగా చర్చించలేను.కాని క్లుప్తంగా రాస్తాను.చరిత్రచదవడం ఎందుకంటే ఉదాహరణకి,మనదేశ చరిత్ర చదువుతే,మనదేశం కొన్ని శతాబ్దాలు పరదేశీయులపాలన లో ఉండిపోయిందో తెలుస్తుంది.ఇక పురాణాలగురించి : పురాణాలలో చారిత్రికాంశాలు ఉంటే స్వీకరించవచ్చును.కాని వాటికి తగిన ఆధారాలు హేతుబద్ధత ఉంటేనే తీసుకోవాలి.

   Delete
  3. ధన్యవాదములు కమనీయం గారు. పురాణాలలో ఆధారాలున్నవాటితో పాటు వర్ణనలను బట్టి అప్పటి వారి గురించి కొంత అంచనాకు రావచ్చు. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vm అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top