మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------
అంశం : స్వచ్చ భారత్ , పల్లెప్రపంచం
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
----------------------------------

(image coutesy 10tv)

తాళిబొట్టు ముఖ్యమా !? టాయిలెట్ ముఖ్యమా!? మీ అభిప్రాయం ఏమిటి!?

ఈ పోస్టు జీవితంలో కొత్త కోణం అనే బ్లాగులోనిది. చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

" ఎవరైనా సరే... ఆస్తులు, నగలు ఎప్పుడు అమ్ముకుంటారు? అప్పులు గాని, అనారోగ్య సమస్యలు గాని, పిల్లల చదువుల కోసమో... సొంతిల్లు కట్టుకునేందుకోవడానికో అమ్ముతారు. కానీ మరాఠీ గ్రామీణ మహిళ సంగీత అహాల్వే తన మంగళసూత్రంతో సహా నగలన్నీ అమ్మేసింది. మహారాష్ట్రలోని వషీం జిల్లా పరిధిలో ఉన్న సాయిఖేదా గ్రామ వాసి సంగీత అహ్వాలే. నగల కంటే మరుగుదొడ్డే తన కుటుంబానికి మేలు చేస్తుందని భావించింది. అందుకోసం తన నగలన్నీ అమ్మేసింది. భారతీయ మహిళలు ప్రాణం కంటే మిన్నగా భావించే మంగళసూత్రం కూడా! ఈ సంగతి సర్కారు దృష్టికి వచ్చింది. సంగీతను రాష్ట్ర మంత్రి పంకజ ముండే ప్రభుత్వం తరపున తన కార్యాలయంలో సత్కరించారు. సంగీత స్పందిస్తూ, మరుగుదొడ్డి అనేది ప్రాథమిక అవసరమని, అందుకే నగలమ్మానని తెలిపింది. మంత్రి పంకజ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధిగా తనకు వచ్చే నిధుల్లో 25 శాతం మరుగుదొడ్లు కట్టించేందుకు ఖర్చు చేస్తానన్నారు."

ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో నేటికీ మన మహిళలు బహిర్భూమికి వెళ్లే ఇక్కట్లు ఇంకా కొనసాగాలా? ఈ అంశంపై పల్లెప్రపంచంలోనే ఊరిబయట మలవిసర్జన ఇంకెన్నాళ్లంటూ రెండేళ్ల క్రితం నేనో పోస్టు వ్రాశాను. నరేంద్ర మోడీ స్వచ్చ భారత్ పిలుపు లో సెలబ్రెటీల హడావిడితో ఆగిపోకుండా మరుగుదొడ్డిలేని పల్లె మిగలడానికి వీలులేకుండా మన పల్లె ప్రపంచం వర్ధిల్లాలని కోరుతూ.....సంగీత అహ్వాలే కు పల్లె ప్రపంచం తరుపున అభినందనలు తెలియ జేస్తున్నాను.స్వచ్చ భారత్ కు మద్దతుగా ప్రచారానికి ఈ అంశమూ ఉపయోగపడుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఓ మంచి పనికి మనమంతా మద్దతిద్దాం. 

తాళిబొట్టు ముఖ్యమా !? టాయిలెట్ ముఖ్యమా!? మీ అభిప్రాయం ఏమిటి!?
*Re-published
Reactions:

Post a Comment


 1. తాళి బొట్టు స్ట్రాంగ్ గా కలకాలం నిలబడా లంటే టాయిలేట్టు చాలా ముఖ్యవసరం.

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ఉభయ తారక మంత్రమిది జిలేబి గారు. కామెంటుకు ధన్యవాదములు.

   Delete
 2. Thali bottu vunna lekapoyina TOILET mukhyam......

  ReplyDelete
  Replies
  1. రావు గారు తీవ్రమైన నిజం చెప్పారు. ధన్యవాదములు.

   Delete
 3. మతం ముఖ్యమా? మంచితనం ముఖ్యమా అని అడిగినట్లుంది మీ ప్రశ్న.

  తాళిబొట్టు (మతంలాగే) personal. శుభ్రత (మంచితనంలాగే) social. కానీ భారతీయులకు జన్మత: civic sense లేని కారణాన ఇది వర్కౌట్ అవుతుందనుకోను. సంగీత గారు ఒక abnormality తప్ప ఎన్నటికీ ఆదర్శంకారు. మీరు ఒకరికి ఒకపదివేలు ఇస్తే దాంటో ఆ వ్యక్తి మొభైల్ కొనుక్కుంటాడేకానీ టాయ్‌లెట్ గురించి ఆలోచించడు/దు. యాభైవేలివ్వండి మొబైల్తోపాటు. టీవీ గురించీ, మోటార్ సైకిల్ గురించీ ఆలోచిస్తాడు. టాయ్లెట్ గురించిమాత్రం కాదు.

  ReplyDelete
  Replies
  1. త్రిశూల్ గారు ఆ వైఖరి మారాలని కోరుతూ చైతన్యం తేవడానికి ఉడతా భక్తిగానే ఈ పోస్టుని ఉంచడం జరిగిందండీ. కామెంటుకు ధన్యవాదములు.

   Delete
 4. ఈ సమాధానం మీ ప్రశ్న కు బదులు కాదు
  ఇప్పుడు మురుగు దొడ్డి నిర్మించాం కానీ ఆ మురుగు ఎక్కడకు పోతుంది? కొన్నాళ్ళ తరువాత అది నిండి ప్రజలకు ఇక్కట్లు మొదలవుతాయి! అది నిండాకా ఏమి చెయ్యాలి అన్న అవగాహన కూడా కల్పించాలి! దాని గురించి ప్రత్యెక వ్యాసం వ్రాస్తాను.
  ఇక మీ ప్రశ్నకు నాకు జిలేబీ గారి సమాధానం సబబుగా ఉంది!

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top