మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------------
అంశం : వ్యక్తిత్వ వికాసం
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు
------------------------------------------------చందమామ కథలతో పెద్దలకు ఉపయోగం లేదా!?

 • మనిషి నాగరిక ప్రపంచం లో వ్యక్తిత్వాన్ని రూపు దిద్దు కోవడం లో అనేక అంశాలు ప్రభావితం చూపుతాయి. వాటిలో 'నీతి కథలు' అనేవి కీలకమైనవే. గతం లో చందమామ - బాలమిత్ర లాంటి పత్రికలు పిల్లలకోసం ఉండేవి. అమ్మమ్మలు - తాతయ్యలు పిల్లలకు కథలు చెప్పేవారు. వాటిలో నీతిని బోధించేవారు.
 • బుర్రకథలు - హరికథల ద్వారా నీతిని , నీతి కథలను పిట్టకథల రూపంలో బోధించేవారు.  పాఠ్యాంశాలలోనూ నీతి కథలకు ప్రాధాన్యత ఉండేది. పంచతంత్ర కథలు, అక్బర్ బీర్బల్ కథలు, రామాయణం, మహాభారతం వంటి వాటిలో ఘట్టాలు ..... ఇలా పాఠాలలో చివరన ఈ కథలో నీతి అంటూ ప్రత్యేకంగా చెప్పేవారు. ప్రత్యేకంగా నీతి పద్యాలుండేవి. నీతి పద్యాల శతకాలనుండి కొన్నింటిని ఏరి పాఠాలుగా ఉంచేవారు.
 • మారుతున్న రోజులలో అవన్నీ చరిత్రగానే ఉంటున్నాయి. ఇప్పుడు పెద్దలకూ నీతి కథలు విలువ తెలియడం లేదు. వ్యక్తిత్వ వికాసం పేరుతో విదేశీ పుస్తకాలలోని అంశాలను బట్టీ పట్టి చెప్పే చాలా అంశాలకంటే మన పెద్దలు చెప్పే వాటిలోఉన్నాయి. మన నేటివిటీకి తగ్గట్లు అవి వుంటాయి. ఈజీగా అర్ధమవుతాయి. ఫీజులు కట్టి కష్టపడి నేర్చుకోవలసిన అవసరం లేదు. ఇష్టపడి హాయిగా నేర్చుకునే వ్యక్తిత్వ వికాసం కోర్సులు మన ఇళ్లలోనే ఉన్నాయి. 
 • నా అభిప్రాయం నీతి కథలు అనేవి పిల్లలకే కాదు పెద్దలకూ ఎప్పుడూ పనికివస్థాయి.  వ్యక్తిత్వ వికాసం అనేది జీవితాంతం అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఎప్పటికీ కథలు అందులోనూ నీతిని పెంచే కథలు అందరికీ మంచిదే అని భావిస్తున్నాను. 
 • మంచి మనుషుల సమూహముంటే సమాజంలో మంచిని కాపాడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మంచి మనుషులు తయారు కావాలంటే మనసు మంచిదై ఉండాలి. అదో అలవాటుగా ఉండాలి. అందుకు సహకరించే అంశములలో నీతికథల ప్రాధాన్యత అదీ బాల్యంలో వాటి ప్రాధాన్యత చాలా అవసరం.
 • నేటి విద్యా విధానంలో, జీవన విధానంలో, ప్రచార మాధ్యమాలలో వచ్చిన మార్పులు ఈ విషయం లో తప్పు చేస్తున్నాయని, తప్పు జరుగుతుందని, దీనిని సరి చేయాలని భావిస్తూ మీ అభిప్రాయాల కోసం ఈ పోస్టు ఉంచాను
--------------------
*Re-published
Reactions:

Post a Comment

 1. మీరు ఈ ప్రశ్న చాలాసార్లు అడిగినా నేనూ చూసినా జవాబుగా యేమి చెప్పాలో తెలియక ఇన్నాళ్ళూ సందేహించాను.నేను చాలాచోట్ల మన దేశపు సమాజం కుదుపులు లేకుండా మార్పు అనేది మెల్లమేల్లగా జరుగుతూ కొంతకాలం తరవాత వెనక్కి చూస్తే ఆశ్చర్యంగా కనిపించేలా జరుగుతుందని ప్రస్తావించాను."రాజు లంతా ఒక రకంగానే వుంటారా?నిజామునీ కృష్ణదేవరాయల్నీ ఒకే గాటన కట్టెయ్యొచ్చా?" మరియు "కమలమే సకలం కావాలి అంటున్న మోదీ దూకుడును ఆపడ మెట్లా?ఇప్పటికీ వెనకపడిన కులాల వాళ్ళు ఇక ముందుకు రావడ మెట్లా!" అనె పోష్టుల్లో ఆ రక్మయిన విస్లేషణ చూదవచ్చు!

  ఇప్పుడు వున్న స్థితిని చూస్తే నేను అర్ధం చేసుకోగలిగినది - మనం ఆ ప్రవాహ దిశని మార్చకూడని దిశకి మార్చామా అనిపిస్తున్నది!?యవ్వన దసలో ఒక ఇరుకుదారి వెంబడి వెళ్తున్నట్టు గానూ హఠాత్తుగా యేదో మనని మింగెయ్యబోతున్నట్టు గానూ కలలు రావదం సహజం.కానీ నాకు ఒకసారి చాలా అర్ధవంతమయిన విస్తృతమయిన భావాలు ప్రతిబింబించే ఒక కల వచ్చింది.నాకు అప్పటికే మనో వైజ్ఞానిక సంబంధమయిన విషయం కొంత తెలుసుగనక ఆ కలలో నా మనస్తత్వాన్ని సరయిన విధంగా తీర్చి దిద్దుకునే విధంగా సహాయ పడింది.

  ఆ విధంగా ఆ కల నాకు బాగా గుర్తుండి పోయింది.ఇన్ని సార్లు మీరు ఈ ప్రశ్న వేసాక యే రకంగా జవాబు చెబుదామా అని ఆలోచిస్తున్నప్పుదు ఈ కల మరో రకంగా ఇప్పుడు దేశం సాంస్కృతికంగా నిలబడి వున్న స్థితిని సూచిస్తున్నదని అనిపించింది?!మొదట ఆ కలని చాలా క్లుప్తంగా యెక్కువ వర్ణనలు వుపయోగించకుండా చెప్తాను.

  కల మొదలవదమె నేను ఒక దిగుడుబావి మెట్టు మీద నిలబడి వున్నపూడు మొదలయింది, వెనక్కి, అంటే పైకి చూస్తే నేను దిగివచ్చిన మెట్లన్నీ మాయమైపోయినాయి.అంటే నేను తప్పనిసరిగా కిందికి దిగతమే తప్ప వెనక్కి తిరిగి పైకి వెళ్లలేను.దిగ్డం మొదలు పెట్టి ఆఖరి మెట్టు మీదకి వచ్చాను.వెనక్కి చూసే మామూలు దృస్యమే - దిగి వచ్చిన మెట్లు లేవు.కిందకి చూస్తే బావి కైవారం మొత్తం ఆక్రమించుకుని ఒక పెద్ద మొసలి నోరు తెరుచుకుని వుంది!వుంటే అక్కదే వుండి పోవాలి, లేదా ఆ మొసలి నోట్లోకి దూకెయ్యాలి - మరో దారి లేదు.ధైర్యం చేసి కళ్ళు మూసుకుని ఆ మొసలి నోట్లోకే దూకేసా!కళ్ళు తెరిచి చూస్తే బావి గట్టున నిల్చుని వున్నా!

  ReplyDelete
 2. ఆ మొసలి చాలాకాలం నుంచీ విదేశీ వస్తువుల పట్ల అతి వ్యామోహం వల్లనూ ఇవ్వాళ మార్కెట్లు బార్లా తెరవడం ద్వారానూ మనలో ఇప్పటికే జరిగిన, ఇప్పటికీ జరుగుతున్న పరాయీకరణ అనే పోలిక తెచ్చుకుంటే తప్ప ఆ కలకీ ఇప్పటి స్థితికీ నేను చూపిస్తున్న సామ్యం అర్ధం కాదు.అలా కానప్పుడు నేను బోడిగుండుకీ మోకాలుకీ ముడి పెడ్తున్నట్టు గానూ నా చిన్నప్పటి కల గురించి సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు గానూ అనిపించవచ్చునని భయంగా వుంది?

  మనకి నచ్చిన వస్తువులు కొనడం, మన దేశంలోకి వాళ్ళని పరిశ్రమలు పెట్టమని పిలవదం ఒక రేంజిలో జరిగితే తప్పు కాదు.కానీ దానివల్ల - అందరితో కలిసి మెలిసి కలుపుగోలుగా తిరుగుతున్నా మన ప్రత్యేకత నిలబెట్టుకోవాలనే స్పృహ లేకపోతే పరాయీకరణ అనే మొసలి యే క్షణంలో నైనా మింగెయ్యడానికి సిధ్ధంగా వుంటుంది!

  ఇవ్వాళ "స్వచ్చ భారత" నినాదం అంత భారీగా మోగించడం వెనక వున్న వుద్దేశం యేమిటి - "వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ మురికినీ దుర్గంధాన్నీ చూసి విసుక్కుంటారనిన్నీ మరియూ అంత వూపుగా ముందుకు రారనీ" - అవునా?మన ఇళ్ళూ వీధులూ శుభ్రం చేసుకోవడానికి కూడా బయటివాళ్ళ మెహర్బానీ కోసం చేస్తున్నట్టు కాదా?ఇప్పటిద్దాకా టూత్ పేష్టుల దగ్గిర్నుంచీ సబ్బుల వరకూ అన్ని వస్తువుల్లోనూ మనకు తెలియకుండానే చాలా అమాయకంగా విదేశీ వస్తువులనే కొంటున్నాం. ఇప్పుడు మన దేశంలో మనకి వుద్యోగాలు కల్పించమని వేరేవాళ్ళని ఇక్కడ పరిశ్రమలూ వ్యాపారాలూ పెట్టమని పిలుస్తున్నాం.

  వాళ్ళు వస్తారు,మన మధ్య తిరుగుతారు,మనమూ వాళ్ళతో కలివిడిగా వుండాలి - కానీ ఆ కలివిదిగా వుండేటప్పుదు యెలా వుండాలి?భోపాల్ గ్యాస్ విషాదానికి కారకుడయిన అవాడు ఈ దేసం విడిచి అంత త్వరగా జారుకోవదానికి సహాయం చేస్తూ ఆఖరికి వున్నతాధికారులు కూడా అతని సూట్కేసుని మోసేటంత హడావిది యెందువల్ల జరిగింది? మళ్ళీ అలాగే ప్రవర్తిద్దామా?అలా కాకూడదంటే మన మూలాల పట్ల మనకి గౌరవం వుండాలి.వాళ్ళకన్నా మనం తక్కువ వాళ్ళం కాదనేది మనం తెలుసుకుని వాళ్ళకీ తెలియజెప్పాలి!

  కానీ ఇప్పటికే పరాయీకరణలో మేధావులు అనేవాళ్ళతో సహా అందరూ ఆల్రెడీ కొన్ని మెట్లు యెక్కేసి వుండటం వల్లనే మీ ప్రశ్నకి వెంఠనే జవాబు రాలేదు!ఇక్కద ప్రజలో మనం చర్చించే విషయాల్లో అభ్యంతరకరమైనవి యేవీ లేకపోయినా యెంత గొడవ జరిగిందో చూఒశారుగా?ఇలాంటి చోట స్వాభిమానం,సంస్కృతి మూలాలు, పరాయీకరణ లాంటివాటి గురించి మాట్లాడీతే వుపయోగం యేమిటి? ఒకాయన "జీర్ణమంగే సుభాషితం" అన్నాడు.యే మంచిమాట చెబుదామన్నా సాటి కవులు అందులోని తప్పులుపట్టి అవహేలన చేసి కొంత నీరసం తెప్పిస్తున్నారట!విన్న వాళ్లలో కొందరు మాకిది ముందే తెలుస్లే అని పెదవి విరిచేస్తున్నారట!మరి కొందరు అంత వివరంగా చెప్పినా అర్ధం కాక తెల్ల మొగమేస్తున్నారట!ఇన్ని గొడవల్ని చూశి చెప్పాలనుకున్నవాటిలో చాలా విషయాలు బయటికి రాకుండా పొట్టలోనే జీర్నమై పోతున్నాయి అని ఆయన బాధ!అవీ ఇవీ అన్నీ బ్లాగులో నాపేరుతో వచ్చిన వ్యాఖల్ని చూశాక మీకు జై గుర్తు చేసిన కొటేషను గూడా కదిలించలేనంత నిరాశగా వుంది.బహుశా ఇదే నా ఆఖరి కామెంటు కావచ్చు!

  ReplyDelete
  Replies
  1. నాకు జై గారు గుర్తు చేసినట్లు నేనో వాక్యం మీకు గుర్తు చేస్తున్నాను. మీకిష్టమైన నేతగా మీరే చెప్పిన కామ్రేడ్ లెనిన్ కోట్ : " తప్పు చేయనిది శిశువూ - శవం " మాత్రమే. అంటే శిశువు అప్పుడే పుట్టింది కనుక ఇంకా ఏమీ పని మొదలెట్టలేదు కనుక తప్పు చేసే అవకాశం లేదు. శవం కదలలేదు కనుక అసలే పనీ చేయలేదు కనుక తప్పు చేయలేదు. ఇక తప్పు చేసేదెవరో తెలుసు కదా? అంటే పని చేసే వాడే తప్పులు చేస్తాడు. ఏ పనీ చేయనివాడికావకాశం లేదు. పని ఉన్న చోటే పొరపాటుకు అవకాశం ఉన్నది. కాకుంటే పాత తప్పులు చేయకూడదు మళ్లీ మళ్లీ. మనకు కొత్త తప్పులు చేసే లైసెన్స్ ఎప్పుడూ ఉన్నది. ఎప్పటికప్పుడు ట్రయల్ ఎండ్ ఎర్రర్ లా ప్రయోగాలు చేసే లైసెన్సూ ఉన్నది . చూసుకోవాల్సిందల్లా కావాలని ఎవరికైనా కీడు చేయకుండా ఉండడమే. ఇలా ఎప్పటికప్పుడు ముందుకే వెళ్లాలి. ఎవరైనా చేయగలిగేది తప్పనిసరిగా చేసేదీ అదే. ఎవరో ఏదో అనుకుంటారనుకుంటే ఏమీ చేయలేము. ఎవరేమి అన్నా ఈజీగా కూడా తీసుకోలేము. కానీ " రెండడుగులు ముందుకు - ఒక అడుగు వెనుకకు - మొత్తంగా ముందుకు " అనే పద్ధతిలో ముందడుగు వేస్తున్నామా? లేదా? అని మాత్రమే మన సమీక్ష ఉండాలి. ఇదీ లెనిన్ చెప్పినదే.

   మీరు కామెంట్లు పెంచాలి. నాకు తెలిసి ఎవరికోసమో కామెంటకండి. మీరు చెప్పదలచుకున్నది చెప్పండి. ఎదురు వచ్చే కామెంట్లలో నేర్చుకునేది ఉంటే డెఫినెట్ గా నేర్చుకోండి. ఎందుకంటే ఎప్పటికీఇ ఎవ్వరికీ అన్ని విషయాలు తెలీవు. అందుకే కామెంట్లూ వాటినుండి నేర్చుకోవడం మనకి మేలే చేస్తుంది. మీరు నేర్చుకునేందుకు సమీక్షించుకునేందుకు వెనుకాడరని మిమ్ములను అబ్జర్వ్ చేసిన వాడిగా చెప్పగలను. సో ఎదురువాదనగా కాకుండా మీ నాలెడ్జ్ మేరకు నేర్పేందుకు లేదా నేర్చుకునేందుకు కామెంట్లు వ్రాస్తుండండి. మీనుండి ఈ సమాజం నేర్చుకునేది - ఈ సమాజం నుండి మీరు నేర్చుకునేది చాలా ఉన్నది.

   మనిషి వ్యక్తిత్వాన్ని నిర్మించేదానిలో ఉమ్మడి కుటుంబాలు, నీతి కథలు, మన భారతీయ సంస్కృతిలోని అనేక అంశాలు చాలా బాగుంటాయి. కేవలం హిందూ మతం అనే భయంతో వాటిలోని మంచిని వ్యతిరేకించాల్సిన్ పిరికితనం ఎవరికైనా ఉంటే ఆ భయం పోగొట్టుకోవలసింది నిస్సందేహంగా వారే.

   కామెంటుకు ధన్యవాదములు హరి గారు.

   Delete
  2. కామెంట్ల గురించి ఏమి జరిగిందో చూశారుగా అని అడిగారు. మరో విషయం చెప్పడం మరచారు ఇప్పుడు కూడా ఈ పోస్టుకు మీరొక్కరే కామెంట్ చేశారు. నేను మంచే జరిగిందనుకుంటున్నాను. కామెంట్లను ఎవరూ ఆపలేరు. ఆపకూడదు. ఒడ్డునుండి ఉచిత సలహాలు ఇచ్చినవారెవరూ ఎక్కడా మంచిని చెప్పినట్లు నాకనిపించలేదు. ఎవరు ఎలా ఎందుకు చెప్పినా మనం పనికివచ్చేది తీసుకోవాలి గనుక నాకున్న సమయం లో అన్నీ ఒకే చోట చేసేలా ప్లాన్ చేసుకున్నాను. అందుకు జై గారి కామెంట్ ఉపయోగపడిందంటే మనిషిని మనిషే కృంగదీస్తాడు. మనిషికి మనిషే తోడుంటాడు. అందుకే మనసున మనసై ... అంటారు. మంచివాళ్లంతా ఒకరికి ఒకరుగా ఉండాలి.

   Delete
  3. నాకు కోపం చాలా యెక్కువ.అందుకు నేను బాధ కూడా పదను సరయిన విషయంలోనే తప్ప అనవసరంగా కోపం తెచ్చుకున్న దాఖలాలు లేవు!అవీ ఇవీ అన్నీ బ్లాగులో మీ బ్లాగు పత్ల చేసింది ఒక రకంగా చెయ్యగూడని పనే.అక్కడ నా భావం చెప్పాను.మీరు మరీ శాంతమార్గాన్ని యెంచుకున్నారని నాకనిపించింది.నా గురించి చేసిన వ్యాఖలు మరీ దారుణంగా వున్నాయి.

   సరే, ఆ మూడ్ నుంచి బయటపడ్డాను గాబట్టి నా అభిప్రాయం పూర్తి చేస్తాను.నా కలలో జరిగినట్టుగానే వెనక్కి నడవలేని చరిత్ర ఇవ్వాళ మనల్ని ఇక్కడ పరాయీకరణ అనే మొసలి నోటి కెదురుగా నిలబేట్టింది! పరాయీకరణ అనేది చాపకింద నీరులా మొదలయి చాలా కాలమయింది.మనం ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి.మామూలుగా బందువులో స్నేహాలో వుంటేనే వెళ్తాము కదా.ఒకప్పుదు పెళ్ళికి రాకపోవటాన్ని చాలా క్రూరంగా పరిగణించే కాలం వుండేది.ఇప్పుడు మనం అక్కడ గడిపే కొద్ది సేపట్లో యేమి చేస్తామో గుర్తు చేసుకోండి.

   అందరితో కలివిడిగా మాట్లాడతాం.మన వివరాలు చెప్తాం.వాళ్ళ వివరాలు తెలుసుకుంటాం.అవతలివాళ్ళ్ళు బాగా చనువున్న వాళ్లయితే ఈ మధ్యలో జరిగిన ఆనంద విషాదాల్ని పంచుకుంటాం! యెన్ని చేసినా మన వ్యక్తితానికి భంగం రాకుండా యెదటివాళ్ళ మర్యాదల్ని కాపాడుతూ ఆ కొద్దిసేఅపు యెలా వున్నామో మార్కెట్ శక్తులు తీసుకొచ్జ్చే సంస్కృతీ ప్రభావాల పట్ల కూడా అలాగే వుండగలిగితేనే వసుధైక కుటుంబం అనే మాట నిజంగా మేలు చేస్తుంది.లేనిపక్షంలో అది కనబడని సంకెళ్ళతో హాయిగా అనిపించే సుఖవంతమయిన బానిసత్వం లాగే వుంటుంది!

   Delete
  4. ఇప్పుడు నడుస్తున్నది చాలా గడ్డుకాలం!ఆర్ధిక పరిపుష్టిలో మన దేశం చెప్పుకోదగిన అభివ్ర్ధ్ధిని సాధించినా పరిస్థితులకి తగ్గట్టుగా విద్యావిధానాన్ని మార్చుకోకుండా ఇంకా మెకాలే తరహా చట్రాన్నే కొనసాగిస్తుండతం వల్లనే మోదీ గారు ఇక్కడ పెట్టుబడులు పెట్టి వుద్యోగకల్పన చెయ్యమని విదేశీయుల్ని అడుగుతున్న్నాడు "మేక్ ఇండియా" పేరుతో! నిజంగా మనం సాధించాల్సింది ఇది కాదు.మనవాళ్ళు విదేశీ మార్కెట్లని ఆక్రమించగలిగినప్పుడే వాళ్ళ ద్వారా లాభం మనవైపుకి ప్రవహిస్తుంది.ఇప్పటి మోడల్ వల్ల వాళ్ళిక్కడి కొచ్చి మనకి చెయ్యగలిగే మేలు వాళ్ళ కంపెనీల్లో మనవాళ్లకి ఇచ్చే వుద్యోగాలూ, పన్నుల రూపంలో వచ్చే పర్సెంటేజి మాత్రమే.లాభం వాళ్ళ దేశానికి వెళ్తుంది.అందుకు ప్రభుత్వం అదనపు సౌకర్యాలు కూడా కల్పించదం వల్ల వాళ్లకి అన్నీ చవకగా ఇచ్చి మనం పొందగలిగే లాభం తక్కువ.అయినా యెందుకు వొప్పుకుంటున్నాం.విధిలేని పరిస్థితి.ఇలాంతి గతీలేక చేసే బలవంతపు పనులే పరాయీకరణకి లొంగేటట్టు చేస్తాయి.

   ఇప్పటి నుంచి ఒక యాభై సంవత్సరాలు, అంటే రెండు తరాల పాటు మనం కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తే ఆ తర్వాత బియ్యం పళ్ళు యే చెట్టుకు కాస్తాయి అని అడిగే పరిస్థితి వచ్చినా రావచ్చు?మన స్వంత జీవనవిధానం అనేది యేమిటి?మన సంస్కృతీ స్సంప్రదాయాలు యేమిటి?అనే వివరాలు పుస్తకాలకు మాతరమే పరిమితం కావచ్చు.నేను లెనిన్ అనే వ్యక్తిని అభిమానించడానికి అతను అధికారంలోకి రాగానే ఇప్పటి కొందరు మూర్ఖపు కమ్యునిష్టుల లాగా కాకుండా బోత్స్నియన్లు, సెర్బియన్లు - ఇలా అనేక జాతులుగా వున్నవాళ్లందరికీ మీ ప్రాంతాన్ని మీరే పరిపాలించుకోండి మీ సంస్క్ర్తీ సాంప్రదాయాల కనుగుణంగా అనే విధంగా "జాతుల స్వయం నిర్ణయాధికారం" అనే ప్రస్తావన చెయ్యడం కూడా ఒక కారణం.

   Delete
  5. జంతుశాస్త్ర పరంగా జాతి అంటే పరస్పర సంయోగం ద్వారా యే విధమయిన జన్యులోపాలకీ తావివ్వని సంతానాన్ని పుట్టించే సమూహాన్ని జాతిగా గుర్తిస్తారు.అలా చూస్తే భూమి మీద వున్న మొత్తం అన్ని దేశాల లోని ప్రజలూ ఒకే జాతి.కానీ ఇప్పుడు మనుషుల్లోనే ప్రత్యెకంగా జాతి అని మనం గుర్తిస్తున్న మానవ సమూహాలని విదదీసే అంశం ప్రాంతం.ఒక ప్రాంతంలోని భౌగోళిక పరిస్తితులే ఆ ప్రాంతం వారి భాషని ఆచార వ్యవహారాల్నీ ప్రభావితం చేస్తాయి నా అభిప్రాయం ప్రకారం.ప్రాంతం,భాష,సాంప్రదాయాలు - ఈ మూడూ మనం ఇవ్వాళ జాతులుగా గుర్తిస్తున్న మానవ సమూహాలన్నిటికీ ప్రత్యెకత నిస్తున్నాయి,వీతి పట్ల మమకారం ప్రతి జాతికీ వుంది,వుండాలి!

   ఒక పెళ్ళికి వెళ్ళిన మనం యెట్లాగయితే అంతమందిలో కలివిడిగా తిరుగుతున్నా మన ప్రత్యేకతని నిలబెట్తుకుంటున్నామో అట్లాగే ఈ బూమి మీద వున్న ప్రతి మానవ సమూహం పరాయీకరణకి గురి కాకుండా తమ సంస్కృతీ మూలాల్ని మర్చిపోకుండా తమ జీవితాల్లో అనుక్షణం వాటితో సంబంధాన్ని కొనసాగిస్తూనే వుండాలి.

   యేది సత్యమో అదే శివం!యేది శివమో అదే సుందరం!!సత్యం శివం సుందరం!!

   Delete
  6. హరిబాబు గారు మీ కామెంట్లన్నీ చదివాను 'వసుధైక కుటుంబం' వర్ధిల్లాలంటే ప్రపంచం లోని ఏ సంస్కృతిలో మంచి ఉన్నా తీసుకోవాలి. చెడుని వదిలేయాలి. పాత కొత్తల మేలు కలయికగా మంచి వృద్ధి చెందాలి. మానవత్వం విలసిల్లాలి. అలా జరగడానికి మనిషిలో మనసు కు చైతన్యం ఇవ్వగలిగే వాటిలో కథ అనే సాహితీ ప్రక్రియ కూడా ప్రముఖ పాత్రనే పోషిస్తుంది. మంచి కథలన్నింటినీ వీలయితే ఓ చోట పోగేసే ప్రయత్నం చేద్దాం మన బ్లాగ్ర్లమంతా కలసి. ధన్యవాదములు.

   Delete
  7. మంచి ప్రయత్నం!"తెలుగు కధా వీధి" అని పెట్టండి పేరు,బావుంటుంది.

   Delete
  8. తెలుగు కథా వీధి ఇదేదో బాగున్నట్లుందే :))

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top