మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------------
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------

దైవదత్త అంశాలను ప్రశ్నించడం నేరమా?!

ఈ ప్రశ్న అడగడానికి కారణం కొందరు మతపరమైన అంశాలను, నీతి లేదా ధర్మబోధనలను లేదా ఆయా మత గ్రంధాలలోని అంశాలను అసలు ప్రశ్నించకూడదని వాదిస్తారు. ఒకరకంగా శాసిస్తారనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఎవరికి వారు విడిగా తాము అలా నమ్మి తమకు తాము ప్రశ్నించకూడదని, అలా ప్రశ్నించడం పాపమనుకుని తమను తాము శాసించుకుంటే అది వారిష్టం. వారి అభిప్రాయాన్ని ఆ మేరకు అవగాహన చేసుకునేందుకు ఇతరులకు పెద్దగా అభ్యంతరం-ఇబ్బంది ఉండదు. వారి పాపభీతిని సానుభూతితో అర్ధం చేసుకోవచ్చు. అలా కాక ఫలానా విషయాలను ఫలానా విధంగా చర్చ చేసి రచ్చ చేయకూడదు అని వాపోయేవారిని ఏమనాలి? వారు వాపోవడమే కాదు ప్రశ్నించేవారిని తప్పు చేస్తున్నారని, పాపాత్ములని భావించి మీరు ఎట్టి పరిస్తితిలోనూ అలా ప్రశ్నించకూడదని వాదించడాన్ని ఏమనాలి? వారికా హక్కు ఉన్నదా? దేవుడు అనేది విశ్వాసం అయితే దైవదత్తమైన వాదనలకు సంబంధించిన అంశాలన్నీ దేవుడిపై విశ్వాసం ఉన్న మనిషి సృష్టించిన ఆలోచనలే. ఆ ఆలోచనలలో మంచీ - చెడూ రెండూ ఉంటాయి. కొందరికి వాటిలో మంచిని తీసుకుని చెడుని వదిలేయాలనిపిస్తుంది. కొందరికి దేవుడి పేరుతో ఏది చెప్పినా తప్పేననిపిస్తుంది. కొందరికి దేవుడి పేరుతో ఏది చెప్పినా ఎదురు ప్రశ్నించకుండా అనుసరించాలని అనిపిస్తుంది. ఇందులో వ్యక్తిగత వైఖరులను తప్పు బట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆలోచన - ప్రశ్న- చర్చ అనే ప్రాసెస్ లో ఇలాంటి వాదనల పట్ల ఏ వైఖరి సరైనదనే చర్చ వస్తుంటుంది. ప్రశ్నిస్తే ఒప్పు కు మెప్పు కోల్పోవడం జరుగుతుందా? ఒప్పులో ఉన్న పవర్ ప్రశ్నిస్తే మరింత మెరుగవ్వాలి కదా? దైవదత్తమైన అంశాలను లేదా ఆ పేరుతో కొనసాగే భావాలను ప్రశ్నించకూడదా? మీ అభిప్రాయం ఏమిటి?

-------------------------------------------------------
*Republished
Reactions:

Post a Comment

 1. Replies
  1. శ్యామలీయం గారు, మీ వివరణ పై చివరిగా స్పందిస్తాను. లేదా మీకు మెయిల్ చేసి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. చివరిగా అంటే మరిన్ని కామెంట్లు వచ్చాక అందుకు కొంత సమయం కేటాయించాక అని అర్ధం చేసుకోగలరని విజ్ఞప్తి.

   Delete
  2. శ్యామలీయం గారు, క్రింద వరుసగా అడిగిన ప్రశ్నలకు కాస్త వివరంగా జవాబు చెప్పగలరు. తెలుసుకుందామని లేదా తేల్చుకునేందుకు ఏదైనా ఉపయోగకరమైన సమాచారం దొరుకుతుందేమోననే తప్ప మీకెంత తెలుసో తేల్చుకుందామని కాని, కపటబుద్ధితో అసలు కాదని వినయపూర్వక మనవి.

   1) సంప్రదాయ, సంప్రదాయేతర అంటే ఏమిటి? సంప్రదాయ అనేది ఎప్పటినుండి లెక్క? ఎప్పటివరకు ఉంటుంది? సంప్రదాయ అనేది ఎప్పటికి మారదా? మారకూడదా? మారుతుందంటే ఏ పద్ధతిలో ఎందుకు మారాలి? ప్రశ్నించకుండానే సంప్రదాయం అవసరమైన మార్పు తీసుకోగలదా? సంప్రదాయం ఆదినుండీ ఒకేలా ఏ మార్పూ లేకుండానే యథతధంగా ఉంటూ వస్తున్నదా?

   2) అసలు దైవదత్తం అనబడే అంశాలున్నాయని మీరు నమ్ముతున్నారా? దైవదత్తమైనవని నమ్మడానికి ఆధారాలు ఉన్నాయా? కేవలం నమ్మకంతోనేనా? లేక దైవదత్తమని చెప్పబడుతున్న వాటిలో దైవం పేరుతో మానవ పరికల్పనలేనని నమ్ముతున్నారా? మానవ పరికల్పనలను ప్రశ్నించడానికి పద్దతులున్నాయని చెప్తున్నారా? దైవదత్తం కాబట్టి ప్రశ్నించకూడదంటున్నారా?

   3) వైదిక వాజ్మయం , ఉపనిషత్తుల ఆధారంగా చెప్పబడే కథలు లేదా విషయాలు మానవ సమాజంపై ప్రభావం ఎలా చూపుతాయి? సామాన్యులకు అన్నీ అర్ధం కావు కదా? గురువులు అందరూ మంచివారే ఉంటారని గేరంటీ ఏమిటి? ఒకవేల ఉన్నారనుకున్నా అమాయకంగా తెలియని అజ్ఞానులు గురువులను అసలు ప్రశ్నలే వేయకూడదా? ఆ ప్రశ్నలలో దైవాన్ని, దైవదత్త అంశాలను ప్రశ్నించడానికి మనసులో కలిగిన సంశయమే కారణం అయితే (మిగతా గురువుని ఎద్దేవా చేసే అవసరం బుద్ధి లేనివారైతే) ఆ అమాయకునికి ప్రశ్నించే అవకాశం ఉండకూడదా?

   4) స్వామి వివేకానంద కనిపించిన వారినల్లా మీకు దైవం కనిపించాడా? అని అడిగింది ప్రశ్నించడం కాదా?

   5) ఓ విషయం మనకు ఎంత బాగా అర్ధమయిందన్నది తెలియాలంటే మనం ఎలాంటివారికైనా ఆ విషయాన్ని ఉదాహరణలతో సహా వివరించగలిగినపుడని ఐన్స్టీన్ అన్నారు కదా? ఎలాంటి ప్రశ్నకైనా వారికి అర్ధమయ్యేలా చెప్పగలిగేలా వైదిక వాజ్మయం, ఉపనిషత్తులు ఎందుకు ఉండవు? మరింత తేలికగా టి.వి సీరియల్స్ మాదిరిగా విషయాలను అవగతమయ్యేలా వేదాలలోని, ఉపనిషత్తులలోని అంశాలను చెప్పేలా మహనీయులు ఎందుకు కృషి చేయకూడదు? అలా చేస్తే లోకకళ్యానికి ఉపయుక్తమా? కాదా? అలా చేయకూడదా? చేసే అవకాశం లేదా?

   6) వేదాలలో గొప్ప విషయాలున్నపుడు అవి మానవాళి ప్రయోజనానికి మేలు చేసేవే అయినపుడు దాశరధి రంగాచార్యులు లాగా అందరికీ అందుబాటులోకి ముఖ్యంగా తెలుగులోకి సామాన్యుల భాషలోకి అనువదించాలి కానీ కేవలం మాన్యులకే అందుబాటులో ఉండడం లేదా ఉంచాలనుకోవడం దుర్మార్గం కాదా? వాటిని తెలుసుకునేందుకు ప్రశ్నించాలనుకునేవారిని అడ్డుకోవడమూ ఏ పేరుతో ఏ పద్దతులలో చేసినా అదీ దుర్మార్గం కాదా?

   7) నిరంకుశంగా మీరు చెప్పేది మాకు అర్ధమయి తీరాలనేవారు, ఏ మాత్రం అభ్యాసం లేకుండానే అన్నీ అర్ధం కావాలనుకునేవారు నవీనులు అవుతారని మీరు ఎలా చెపుతున్నారు? వీరు అన్ని కాలాలలో ఉన్నా వితండవాదులు అవుతారేమో తప్ప నేర్చుకోవాలనే తపన ఉన్నవారు కానీ తెలుసుకునే ప్రయత్నం చేసేవారు కానీ కారు. వితండవాదులకు మీరు నవీనులు అని పొరపాటుగా పేరు పెట్టారని భావిస్తున్నాను. తెలుసుకోవడానికి ప్రశ్నించడానికీ, మాకు తెలిసేలా చెప్పి తీరాలనేవారికీ చాలా తేడా ఉంటుంది శ్యామలీయం గారు. వారినీ వీరినీ ఎప్పటికీ ఒకే గాటన కట్టకూడదనేది నా అభిప్రాయం.

   8) నక్కీరుడి శివుడి పద్యంలో లోపాన్ని ప్రశ్నించాడంటారు నిజమేనా? మరి భక్తుడు దేవుడినే ప్రశ్నించగా లేనిది తప్పును కడిగేందుకైనా లేదా తప్పును సరిచేసుకునేందుకైనా ప్రశ్నించడాన్ని ఎలా తప్పుపడతామండీ? నక్కీరుడు శివుడిని ఏమి ప్రశ్నించాడో వివరంగా నాకు తెలీదు. తెలిసినమేరకు వ్రాశాను. ఇక్కడ నా ఉద్దేశం తప్పులుంటే భగవంతుడిపై భక్తుడైనా పోరాడవచ్చు అని మాత్రమే.

   9) ప్రశ్నించడానికి తగినంత అర్హత ఉండాలన్నారు? ఆ తగినంత ఎంత అనేది ఎలా? తగినంత అనేబదులు తెలుసుకోవాలనే వినయం, బుద్ధి, ఓపిక , ఒద్దిక లాంటి గుణాలు అంటే సరి పోదా? ఈ సలక్షణాలున్నవాడు ఏదైనా ఎలాగైనా ప్రశ్నించి నేర్చుకుంటే నేర్పేవాడికి మంచిదే కదా?

   10) ధార్మిక విషయాలు వ్యక్తిగతంగా ఆచరించేవారు నేర్చుకునేవారికి భక్తి గురువుపై విశ్వాసం ఉండాలేమో గానీ వాటిలో సమాజానికి హాని చేసేవి ఉంటే ప్రశ్నించేందుకు వాటిని నేర్చుకునేవారికి అవి లేకున్నా తప్పు లేదు. ఖచ్చితంగా భక్తి ఉంటేనే దేవుడిని నమ్మితేనే ఆ ధార్మిక విషయాలు నేర్చుకోవాలనడం తప్పని నా అభిప్రాయం. మానవాళికి ఉపయోగపడే భౌతికవాద ధృక్పధంతో ఉన్న అంశాలు దేవుడు లేదా మతం పేరుతో ఉన్నా ఎవరైనా ప్రశ్నించి నేర్చుకోవచ్చని నా అభిప్రాయం. ఉదాహరణకు యోగా-సూర్య నమస్కారాలు. సూర్యుడిని దేవుడు గా కాక శక్తిని ఇచ్చే నక్షత్రంగా భావించి విటమిన్ D కోసం సూర్యనమస్కారాలు అభ్యాసం చేస్తే తప్పేంటి? సూర్య నమస్కారాలను ఆ 12 భంగిమలు ఏవి ఎందుకు ఎలా అని ప్రశ్నించి నేర్చుకుని ఆచరిస్తే తప్పేంటి? ప్రశ్నించకుండా కంటే ప్రశ్నించడం ద్వారా నేర్చుకుంటేనే ఎక్కువ మేలని నా అభిప్రాయం.

   Delete
 2. దైవదత్తాలంటే ఏమిటి? గతంలో ఇదే బ్లాగులో జరిగిన చర్చల ప్రకారం వేదాలు, భగవద్గీత, ఖురాను, బైబిలు లాంటివని భావిస్తున్నాను. ఇవన్నీ కూడా మానవ పరికల్పనలు లేదా రూపకల్పనలు మాత్రమే. కాకపోతే రాసినవారు అవి వారికి భగవంతుడు కల్లో కనిపించో, మరోలాగో చెప్పాడని రాస్కుకుంటారు. లేదా భగవంటున్నే పాత్రగా సృష్టించి, ఆ పాత్ర ద్వారా విషయం చెప్పించడం జరుగుతుంది.

  ఈ కాలం సంగతి సరే, వేల సంవత్సరాల క్రిందట చట్టాలూ, న్యాయ వ్యవస్థా పటిష్టంగా లేని రోజుల్లో ప్రజల చేత కొన్ని నియమాలు ఆచరింప జేయటం కష్ట సాధ్యమైన విషయం. కాబట్టి ఆ కాలం నాటి పాలకులు ఇటువంటి గ్రంధాలు స్వయంగా రాసొ, లేదా ఇతరులచేత రాయించో, అవి భగవద్ ప్రసాదాలుగా ప్రచారం కల్పించే వారు. అలా చేస్తే భయంతోనో, భక్తితోనో ప్రజలు అందులో రాసిన నియమాలు పాటిస్తారని వారి ఆశ.

  అయితే అప్పటికి ఇప్పటికీ కాలం చాలా మారింది. ప్రజల మేధా సంపత్తి పెరిగింది. విఙ్ఞానశాస్త్రాల ప్రభావం వల్ల మనిషి అవగాహనాశక్తి పెరిగింది. మరింత సునిశింతంగా ఆలోచించడం వల్ల కొత్తకొత్త న్యాయసూత్రాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఇటువంటి పరిస్థితిలో ఇంకా ఎప్పుడో వేల ఏళ్ళక్రింద మిడిమిడి ఙ్ఞానంతో చెప్పిన విషయాలు శిలాక్షరాలుగా భావించాలి, వాటిని ప్రశ్నించకూడదు అని ఎవరైనా అంటే అది హాస్యాస్పదంగా వుంటుంది. అలా అని వాటిలో చెప్పిన విషయాలను గుడ్డిగా తీసి పారవేయకుండా శాస్త్రీయ పద్ధతిలో పరిశోధించి, అందులోని మంచిని గ్రహించ వచ్చును.

  ReplyDelete
  Replies
  1. శ్రీకాంత్ చారి గారు, స్థూలంగా మీ వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను. మీ కామెంట్ పై నాకున్న మరికొన్ని అభిప్రాయాలు వెల్లడిస్తున్నాను. అవి సరయినవో, కావో తెలుసుకోవాలని లేదా మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉంచుతున్నాను.

   < ఇటువంటి పరిస్థితిలో ఇంకా ఎప్పుడో వేల ఏళ్ళక్రింద మిడిమిడి ఙ్ఞానంతో చెప్పిన విషయాలు > ఇప్పుడది మిడి మిడి జ్ఞానం కావచ్చు. కానీ అప్పటి పరిస్తితులను దృష్టిలో ఉంచుకుని వాటిని ఆలోచించాలి.

   < శిలాక్షరాలుగా భావించాలి, వాటిని ప్రశ్నించకూడదు అని ఎవరైనా అంటే అది హాస్యాస్పదంగా వుంటుంది. >
   ఏకీభవిస్తున్నాను.

   < వాటిలో చెప్పిన విషయాలను గుడ్డిగా తీసి పారవేయకుండా శాస్త్రీయ పద్ధతిలో పరిశోధించి, అందులోని మంచిని గ్రహించ వచ్చును. >
   చేయాల్సిందిదే. పాత కొత్తల మేలు కలయిక గా ఉండాలి.

   'శాస్త్రీయత' అనేది కూడా కొందరు మొరటుగా , గుడ్డిగా , మూర్ఖంగా ప్రవర్తించే సందర్భాలుంటున్నాయి. అదెలా అంటే సనాతన లేదా పాత కాలం వారు చెప్పినవన్నీ లేదా దేవుడి పేరుతో చెప్పినవన్నీ ఏవైనా వ్యతిరేకించాల్సిందే అన్నట్లుగా. ఇక్కడే నాదొక సందేహం. దేవుడి పేరుతో మనిషే వాటిని వ్రాయడం, పరి కల్పన చేయడం లేదా సృష్టించడం చేసినపుడు మనిషి ఆలోచనలో సమాజానికి దేవుడి పేరుతో కంట్రోల్ చేయాలనుకోవడం లేదా కొన్ని నియమాలను అలవాటు చేయాలనుకున్నవి, అందులోనూ ఆచరణలో, వందల సంవత్సరాల గమనంలో గ్రహించినవాటిలో నేటికీ ఫలితాలనిస్తున్నవాటిని శాస్త్రీయంగా ఎలా నిరూపించాల్నో చూడాలి తప్ప గుడ్డిగా వ్యతిరేకించకూడదు.

   ఉదాహరణకు యోగా-ఆయుర్వేదం వంటివి కూడా హిందూ ధర్మం లేదా గ్రంధాలలోనివే వీటిలో కూడా కొన్ని దైవం పేరుతో చెప్పినవి ఉన్నాయి. ఆ పార్ట్ తీసేసి మిగతావి ఎందుకు ప్రచారం చేయకూడదు. ఉదాహరణకు హిందూ ధర్మం లేదా జీవన విధానంలోని మంచిని బి.జె.పికో మరో మత సంస్థలకో మాత్రమే ఎందుకు ధారాదాత్తం చేయాలి? వేల సంవత్సరాల క్రితం ఆచరణలో మార్గదర్శకాలుగా ఉన్నవాటిలో మంచిని కేవలం మూర్ఖంగా ఎందుకు వ్యతిరేకించాలి?

   Delete
  2. >>> ఇప్పుడది మిడి మిడి జ్ఞానం కావచ్చు. కానీ అప్పటి పరిస్తితులను దృష్టిలో ఉంచుకుని వాటిని ఆలోచించాలి.

   విషయం మేలు చేసేది కానప్పుడు, ఒకోసారి కీడు చేసేదే ఐనప్పుడు అప్పటి పరిస్థితులను ఊహించి, సానుభూతి చూపి ప్రయోజనం లేదు. ఎందుకంటే దాన్ని ఆచరించలేం కాబట్టి. పనికి వచ్చే విషయాలు గ్రహించాలి అని ముందే చెప్పాను.

   >>> వందల సంవత్సరాల గమనంలో గ్రహించినవాటిలో నేటికీ ఫలితాలనిస్తున్నవాటిని శాస్త్రీయంగా ఎలా నిరూపించాల్నో చూడాలి తప్ప ...

   నిరూపించ గలిగేది శాస్త్రీయమైనది, నిరూపించలేనిది గుడ్డి నమ్మకమే.

   ఏదైనా నిరూపణ జరిగేంత వరకూ నమ్మకంగానే పరిగణించాలి తప్ప, ఎప్పుడో నిరూపణ చేయబోతున్నాం కాబట్టి ఇప్పుడే అది శాస్త్రీయమైనది అని వాదించలేం. అలాగే ఎవరు ఒక విషయాన్ని శాస్త్రీయం అని బల్లగుద్ది చెపుతున్నారో నిరూపణ కూడా అక్కడినుండి మాత్రమే రావాలి. అంతే తప్ప నేను హఠయోగం చేసి గాల్లోకి ఎగరగలను అని చెపితే దాన్ని మీరు కష్టపడి నిరూపించ నవసరం లేదు.

   Delete
  3. కీడు చేయడం కోసమే దుర్మార్గపు ఆలోచనలతో చేసినవి ఏమిటి? అప్పటి జ్ఞానపు అంచనాతో చేసినవాటిలో ఇపుడు తప్పయ్యేవి ఏవి ? ఈ తేడాను గమనించాలనేది నా అభిప్రాయంలో చెప్పినది శ్రీకాంత్ చారి గారు. సానుభూతి సమస్యే లేదు. ఎవరి మీద సానుభూతి చూపగలం. ఇపుడేది అవసరం అనేది కూడా సానుభూతితో కాదు అర్ధం చేసుకోవాల్సింది. ఖచ్చితంగా శాస్త్రీయంగానే.

   నిరూపించలేనివన్నీ గుడ్డి నమ్మకాలు కావు. నిరూపించడానికి కొంత సమయం సైస్న్ కు కూడా పట్టవచ్చు. సైన్స్ కంటే ముందే పదార్ధ దర్మం ఇమిడి ఉంటుంది. నిరూపణకు ముందు కూడా ఫలితాలు ఇస్తున్నవాటిని, అదీ నష్టాలు లేకుండా ఉన్నవాటిని నమ్మకంతో ఆచరిస్తున్నారనుకోండి. వాటిని గుడ్డి నమ్మకం అన కూడదు. ఫలితం నష్టం కలిగిస్తుంది లేదా ఆ నమ్మకం వల్ల ఫలానా విధంగా నష్టం ఉంది అని తెలిసి ఆచరిస్తుంటే, లేదా ఆచరించాల్సిందేనని హుంకరిస్తే ఆ గుడ్డి నమ్మకాన్ని అడ్డుకోవాలి. నమ్మకానికి సంబందీంచి ఈ తేడా ఉంటుంది.

   నిరూపణ అయ్యేంతవరకు నమ్మేవాటిలో ఫలితం ఆధారం ను గుర్తించి తీరాలి. గుడ్డినమ్మకం లేదా విశ్వాసాలను శాస్త్రంగా , దైవదత్తంగా విని తీరాలని వాటిని ప్రశ్నించనే కూడదనే మూర్ఖత్వానికి తలొగ్గాల్సిన పని లేదు. నమ్మకం అనేది వ్యక్తిగతంగా ఉన్నంత వరకు అర్ధం చేసుకునేదానికి, నమ్మకాన్ని శాస్త్రంగా బలవంతంగా ప్రచారం చేయడానికి తేడాను గమనించాలి.

   Delete
  4. >>> నిరూపించలేనివన్నీ గుడ్డి నమ్మకాలు కావు.

   ఇలా అనడం కంటే నమ్మకాలన్నీ శాస్త్రీయమని నిరూపించలేం అంటే బాగుంటుంది.

   రెండు ఉదాహరణలు తీసుకుందాం.

   పసుపు గాయాలు నయం చేస్తుంది.
   ధనుర్వాతం వస్తే కర్రుతో వాత పెడితే నయమౌతుంది.

   మీ స్టేట్‌మెంట్ ప్రకారం రెండిటినీ నమ్మి తీరాల్సిందే! ఎవరైనా కర్రుతో వాతలు పెడుతుంటే ఆపడం మాని "నిరూపించలేనివన్నీ గుడ్డి నమ్మకాలు కావు, కాబట్టి అందులో వాస్తవం వుండొచ్చు, కాబట్టి అతన్ని వాత పెట్టనివ్వండి" అని సపోర్టు చేయవలసి వస్తుంది.

   >>> ఫలితాలు ఇస్తున్నవాటిని, అదీ నష్టాలు లేకుండా ఉన్నవాటిని ...

   ముందే చెప్పాను, కనీసం 90% ఫలితాలు కరెక్టుగా వస్తే అది నిరూపణ అయినట్టేనని. నిరూపణ అంటే ల్యాబ్‌లో నిరూపించడమొక్కటే కాదు, ప్రత్యక్షమైన సాక్ష్యాలతో కూడిన గణాంకాలు కూడా నిరూపణ కిందే వస్తాయి.
   Delete
  5. < పసుపు గాయాలు నయం చేస్తుంది.
   ధనుర్వాతం వస్తే కర్రుతో వాత పెడితే నయమౌతుంది. >

   నా స్టేట్ మెంట్ ప్రకారం ఈ రెండు స్టేట్ మెంట్ లను నమ్మి తీరాల్సిందే అని ఎలా చెపుతున్నారు? ఆ రెండింటిలో ఏదైతే ఫలితాన్నిస్తుందో అదే నమ్మాలి.

   Delete
  6. కొండలరావు గారు,

   "నిరూపించలేనివన్నీ గుడ్డి నమ్మకాలు కావు."

   ఇది, మీరిచ్చిన స్టేట్‌మెంట్. దానిప్రకారం ఏమిటన్నమాట? కర్రు వాత నయం చేస్తుందని నిరూపించలేక పోయిన, అది గుడ్డి నమ్మకం కాదు, ఆ వైద్యం చేసుకునే వారిని చేసుకోనివ్వండి, ఎప్పుడో ఒకప్పుడు అదీ నీరూపించబడే అవకాశం ఉండొచ్చు అన్న అర్థం రావడం లేదా? మీరు మరోసారి పరిశీలించుకోండి.

   మీరు ఇప్పుడు అంటున్నది...
   "ఆ రెండింటిలో ఏదైతే ఫలితాన్నిస్తుందో అదే నమ్మాలి."

   ఫలితాలిస్తుంది అని తేలిందంటే నిరూపణ అయినట్టే కదా? నేను చెప్పిందీ అదే కదా, కనీసం 90% ఫలితాలొచ్చినా చాలని? మీ రెండో స్టేట్‌మెంట్ మొదటి స్టేట్‌మెంట్‌ని ఖండిస్తుందని ఒప్పుకుంటారా?

   Delete
  7. " నిరూపించలేనివన్నీ గుడ్డి నమ్మకాలు కావు " అంటే నిరూపించలేనివాటిలో అన్నీ గుడ్డినమ్మకాలు కావు, కొన్ని గుడ్డి నమ్మకాలు ఉంటాయి. అని ఎందుకు అనుకోగూడదు? నేను నిరూపించడానికి సైన్స్ కు కొంత సమయం పడుతుంది. ఈ లోగా ఫలితం ఇస్తున్న నమ్మకాలను నిరూపించలేక పోయినా నమ్మవచ్చు అని కొనసాగించిన పేరాని చదవాలి.

   కేవలం "నిరూపించలేనివన్నీ గుడ్డి నమ్మకాలు కావు." అని సింగిల్ లైన్ స్టేట్ మెంట్ నేను ఇస్తే మీ వివరణ లేదా వాదన సరైనది అవుతుంది. నా వివరణ మొత్తాన్ని చదవాలి తప్ప అందులో ఒక వాక్యాన్ని మాత్రమే అలా విడిగా ఎలా చూస్తారు? మీరు నేనిచ్చిన వివరణ మేరకు మరోసారి చూసి చెప్పాలని కోరుతున్నాను.

   Delete
  8. అలాగయితే మీరు చెప్తున్నదీ, నేను చెప్తున్నదీ ఒకటే :)

   ప్రాచీనులు చెప్పినది (అది దైవదత్తమైనా, చార్వాక దత్తమైనా, బౌద్ధమైనా, జైనమైనా) అది నిరూపించ బడితే (సైన్సు పరంగా ఐనా, గణాంక పరంగా అత్యధిక జనానికి మేలు చేకూర్చినా) దాన్ని ఆమోదించ వచ్చు. లేనప్పుడు దాన్ని గుడ్డి నమ్మకంలానే చూడాలి.

   Delete
  9. మీరు చెప్పేదీ , నేను చెప్పేదీ ఒకటే. అయితే నేను చెప్పేదానికి మీ వాదన వల్ల మరింత తేలికగా చెప్పేందుకు, జాగ్రత్తగా చెప్పేందుకు నాకు సహకారం అందింది. అందుకు ధన్యవాదములు.

   Delete
 3. దైవదత్తం అంటూ ఏదీ లేదు. దేవునికి ఆపాదించబడినవుమాత్రం ఉన్నాయి (వేదాలు, ఉపనిషత్తులు, బైబిలు, ఖురాను).

  విషయం (అది దైవదత్తమైనదిగా పరిగణించబడేదైనా) దాని శాస్త్రీయతకి సైన్సే గీటురాయితప్ప, ప్రచారాలు, నమ్మేజనసందోహాలు కాదు. When it is proved, it is proved. When it is not, it is just trash. దేవుడు అనేది (ఎలాంటి dataకైనా సరిపోయే ఒక bad theory) అలాంటి వాడిమీడు ఏకంగా ఏదో ఇచ్చేశాడని మీరు ఒక టపా రాశారు.

  ReplyDelete
  Replies
  1. విశేషజ్ఞ గారు, దైవమే నిరూపితం గానపుడు దైవదత్తం అనేది మానవ సృష్టే తప్ప దైవదత్తం అబద్దం. దేవునికి ఆపాదించినవి మానవ రూపకల్పనలే. అయితే అందులో లోకకళ్యానానికి ఉపయోగపడేవి మాత్రం వ్యతిరేకిమ్చాల్సిన పనిలేదు. అలా పనికి వచ్చేవి ఏవనేది నిరూపించేందుకు శాస్త్ర్రీయత ఉపయోగడుతుంది. శాస్త్రియతకు అందకుండా ఫలితాలిచ్చేవి వ్యక్తిగతంగా నమ్మేవి సమాజానికి ఆటంకం కలగనంతవరకు అర్ధం చేసుకోవాలి.

   < దేవుడు అనేది (ఎలాంటి dataకైనా సరిపోయే ఒక bad theory) అలాంటి వాడిమీడు ఏకంగా ఏదో ఇచ్చేశాడని మీరు ఒక టపా రాశారు. > ఇది అర్ధం కాలా? ఎవరు ఏ టపా వ్రాశారు?

   Delete
  2. గణితంలో నిరూపణకు వీలుకాని 1/0 ని ఇన్‌ఫినిటీ అని చెప్పి వదిలేస్తాం.

   కాని నిజజీవితంలో మాత్రం సదరు "ఇన్‌ఫినిటీ" వచ్చి ఫలానా మనిషి కలలో కనిపించాడని, ఆయనతో ఫలానా పుస్తకం రాయించాడనీ, అది "ఇన్‌ఫినిటీ" చెప్పిండి కాబట్టి తప్పక పాటించాలనీ ప్రచారాలు చేస్తాం. అదే తేడా!

   Delete
  3. శ్యామలీయం గారు, నిరూపణకు అందని వాటిలో వేటిని, ఎలా? ఏ ప్రాతిపదికన? నమ్మాలి. 1/0 విలువ అనంతం. అనంతం అంటే లెక్కచెప్పలేనిది. దానిని ఎవరిష్టం వచ్చినట్లు వారు విలువను ప్రతిపాదించుకునేందుకు అవకాశం లేదు కదా? 2/0 అన్నా అనంతమే. అంటే ఇక్కడ సున్న చేత ఏ సంఖ్యను భాగించినా విలువని చెప్పలేమనేది నేటికి ఉన్న సైన్స్. మొదట సున్న లేదు. తరువాత సున్న పరిచయమైంది. అలాగే సున్న చేత భాగిస్తే ఏమిటన్నది ఇదీ అని నిరూపిస్తే నమ్మవచ్చు. అలాగే దైవదత్తంగా ప్రతి దానికి సమాధానం ఉండి ఉంటే సున్న కూడా దైవదత్తమనుకుంటే దానిచేత భాగితమైనదానికి విలువని కూడా దైవదత్తం లో చెప్పాలి కదా? ఇలా ప్రశ్న ఉద్భవిస్తుంది కదా? ఇక్కడ చర్చ ప్రకారం మీరన్న ప్రకారం నిరూపణకు అందనివి నిజాలు ఉంటాయి. వాటిని ఏ ఆధారంగా నమ్మాలి? అనేదానికి మీనుండి వివరణ కోరుతున్నాను.

   Delete
 4. మంచి చర్చాంశం ఎంచుకున్నందుకు కొండలరావు గారికి & చక్కని వ్యాఖ్యలు రాసిన మిత్రులకు అభినందనాలు. ప్రయాణంలో ఉండడం మూలాన వ్యాఖ్యలన్నిటినీ పూర్తిగా ఫాలో కాలేకపోయాను. అంచేత ఫలానా వ్యాఖ్యలకు జవాబుగా కాక నా అభిప్రాయాన్నివిడిగా మీముందు ఉంచుతున్నాను.

  వేదాలు, తోరా (పాత/యేహూదీ బైబిల్), గురు గ్రంధ సాహెబ్ గ్రంధాలు (నాకు తెలిసినంతవరకు) దైవదత్తమని ఆ గ్రందాలలోనే లేదు. వేదాల మూలాలు తెలియవు కనుక ఉపనిషత్తులు చర్చల సారాంశమని దాదాపు అందరూ ఒప్పుకుంటారు. కొత్త బైబుల్ యేసు చరిత్ర & ఆయన ప్రవచనాల గురించి చెప్తుంది కానీ దైవదత్తం అని ఎక్కడా లేదు. గీత వ్యాస భారతంలో ఒక అంశం మాత్రమె ప్రత్యెక గ్రంధం కాదు. అంచేత ఒక్క ఖురాన్ మాత్రమె స్పష్టంగా దైవదత్తం క్లైమ్ చేసిందని నా అభిప్రాయం.

  ఒకవేళ ఫలానా గ్రంధం దైవదత్తమయినా దాన్ని ప్రశ్నించడం పాపం కావాలంటే కొన్ని షరతులు నిజం కావాలి: 1. ప్రశ్నించడం పాపమని గ్రంధంలోనే ఉండాలి 2. సదరు "పాపి" గ్రంధం (ప్రశ్నిచడం పాపమన్న అంశంతో సహా) దైవదత్తమని నమ్మాలి. ఏతావాతా "పాపే" తన పాపాన్ని ఒప్పుకోవాలి :)

  చర్చలు ఎలా జరగాలన్న విషయంపై ఇక్కడ ఏకాభిప్రాయం కుదిరినట్టు లేదు పైగా అదంత సులభం కాదు కూడా. నా ఉద్దేశ్యంలో చర్చలో పాల్గొనే వారందరికీ కొన్ని మౌలిక విషయాలపై అంగీకారం ఉండి & వాటి ఆధారంగా చర్చలు జరిగితే తప్ప (ఈ పరిస్తితులు ప్రస్తుతం దాదాపు అసంభవం అనుకుంటా) చర్చ ఒక కొలిక్కి రాదు. అయితే చర్చల పరమావధి వాస్తవాన్ని నిగ్గు తేల్చడం కానక్కరలేదనీ, అభిప్రాయాల్ని పంచుకున్నా మంచిదేనని నా అభిప్రాయం.

  నిరూపించలేని ప్రతి అంశాన్ని కొట్టేయడం సబబు కాదు. మనకు తెలిసిన వాస్తవాలకు అనుగుణంగా ఉన్న విషయం (a theory consistent with known facts) నిరూపణకు లొంగకపోయినా స్వీకరించాలి. ఒకవేళ ఆ విషయం కొన్ని వాస్తవాలకు విరుద్దంగా ఉన్నాకూడా అందులో తత్తిమ్మా అంశాలను (residual elements after discounting the inconsistent aspects) పరిగణలో తీసుకోగలమా అని ఆలోచించి నిర్ణయం చేయడం మంచిది.

  ఎవరయినా నా వ్యాఖ్యపై స్పందిస్తే చర్చ కొనసాగిస్తా లేకపోతె ఇక్కడితో ఆపేస్తాను.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు జై గారు. ప్రశ్నించడం పాపం అనుకోవడానికి మీరు చెప్పిన షరతులు నిజం కావడం కూడా అలా నమ్మేవారికి మాత్రమే వర్తిస్తాయి.

   చర్చల విషయంలో మీ ప్రస్తుత వివరణ ప్రస్తుతానికి బాగానే ఉంది. పరిష్కారం చెప్పినట్లు లేదు. గతంలోనూ ఈ అంశమై మీ నుండి వివరణ వస్తుందని చూశాను. ఎపుడైనా తీరికగా ఉన్నపుడు ఆలోచించి ఓ ఆర్టికల్ రూపంలో వ్రాయడానికి ప్రయత్నించగలరని విజ్ఞప్తి.

   నిరూపణకు ప్రస్తుతానికి సాధ్యం కాని విషయంలో అనుసరించాల్సిన విధానంపై కూడా మీ అభిప్రాయం పరిగణనలోకి తీసుకోవడానికు ఉపకరిస్తుందని భావిస్తున్నాను.

   Delete
  2. The three rules listed below are by no means exhaustive; they are merely the first leads to the understanding of a vast subject.

   1) In any conflict between two men (or two groups) who hold the same basic principles, it is the more consistent one who wins.

   2) In any collaboration between two men (or two groups) who hold different basic principles, it is the more evil or irrational one who wins.

   3) When opposite basic principles are clearly and openly defined, it works to the advantage of the rational side; when they are not clearly defined, but are hidden or evaded, it works to the advantage of the irrational side.

   - Ayn Rand

   పై విషయాన్ని క్లుప్తంగా తెలుగులో వ్రాయడానికి ప్రయత్నిస్తాను ...

   ఏదైనా విషయం మీద వాదనల గెలుపోటములు ఈ క్రింది మూడు నియమాల మీద ఆధారపడి వుంటాయి.

   1) చర్చ ఒకే రకమైన భావజాన్ని కలిగిన వారి మధ్య జరిగితే విషయం మీద ఎవరికి ఎక్కువ పట్టు ఉంటే వారి వాదం గెలుస్తుంది.

   2) విరుద్ధ భావాలు కలిగిన వారి మధ్య అనియంత్రిత చర్చ జరిగితే దానిలో తర్క విరుద్ధంగా మాట్లాడే వారికే గెలిచే అవకాశం వుంటుంది.

   3) విరుద్ధమైన సిద్ధాంతాలు స్పష్టంగా, అందరికీ తెలిసేలా ముందే నిర్వచించ బడ్డప్పుడు ఆ చర్చలో తార్కికంగా వాదించే వారికి గెలిచే అవకాశం వుంటుంది. అలా కానప్పుడు తర్క విరుద్ధంగా వాదించే వారికే గెలిచే అవకాశం వుంటుంది.

   కొండలరావు గారు, బహుషా ఈ నియమాలు మీకు చర్చలను నడపడంలో ఉపకరించ వచ్చు.

   Delete
  3. శ్రీకాంత్ చారి గారు,

   తర్క విరుద్ధంగా వాదించేవారు ఎలా గెలుస్తారు? అర్ధం కాలా.... వివరించగలరు.

   Delete
  4. తర్క విరుద్ధంగా వాదించేవాళ్ళు గెలవడం ఏమిటి? పశువుల వైద్యుని చేత కుందేలుకి ఒక కాలు తియ్యించేసినంతమాత్రాన కుందేలుకి మూడుకాళ్ళు ఉంటాయని వాదించేవాడు గెలిచినట్టు కాదు.

   Delete
  5. గెలవడం అంటే ఇక్కడ పైచేయి సాధించడంగా అర్థం చేసుకోవాలి.

   చర్చపై ఎలాంటి నియమ నియంత్రణ లేనపుడు నోరున్న వాడిదే పై చేయి అవుతుంది. తర్కబద్ధంగా చర్చించాలనుకునే వాడు విసుగెత్తి వెళ్ళి పోతాడు.

   తర్క విరుద్ధంగా మాట్లాడడం అంటే తమ మాటలకు జవాబుదారీ వహించక పోవడం. తాము చెప్పే మాటలకు సరైన ఋజువులు, కారణాలు చూపకుండా, ఇంకా ఎక్కువ అడిగితే అసలు ఋజువులే అవసరం లేదని దబాయించడం వగైరా.

   Delete
  6. పై చేయి సాధించడం అయితే చాలా సందర్భాలలో , కొన్ని కీలక అంశాలలొ చాలా కాలం పాటు అన్యాయం కూడా పై చేయి సాధిస్తూనే ఉంటుంది. పై చేయి సాధించడం గెలుపు కాదని అభిప్రాయపడుతున్నాను. మీరన్నది అర్ధమయింది. తర్కవిరుద్ధంగా వాదించేవారితో ఎందుకని వదిలేస్తే అది అవతలి వాడు గెలిచినట్లు భావిస్తాడంటారు.

   Delete
  7. తెలంగాణ చచ్చినా రాదని ప్రచారం చేసినవాళ్ళు ప్రజలని నమ్మించడంలో అయితే సఫలమయ్యారు కానీ తెలంగాణా రాకుండా అడ్డుకోవడంలో సఫలమవ్వలేదు కదా. వాదన ఎంతైనా చెయ్యొచ్చు. వాదనలో గెలవడం వేరు, ఆచరణలో గెలవడం వేరు.


   Delete
  8. >>> వాదనలో గెలవడం వేరు, ఆచరణలో గెలవడం వేరు.

   ఇక్కడ మాట్లాడుతున్నది వాదన గురించి మాత్రమే! మధ్యలో ఆచరణ ఎలా వచ్చింది? నిజాం అవసరం ఏముంది? ఒక విషయం నుండి మరో విషయం లోకి కుప్పిగంతులు వేయడం విషయంలో కొండలరావు గారికి ఈ ఉదాహరణ పనికొస్తుందనుకుంటాను!

   ఆచరణ, వాదన రెండు వేరు వేరు విషయాలు.

   వీరేశలింగం తన వాదాన్ని గెలిపించుకోవడానికి విధవా వివాహం చేసుకోనక్కర్లేదు.
   అల్లూరి సీతారామరాజు పోడు వ్యవసాయాన్ని సమర్థించడానికి స్వయంగా పోడు చేయవలసిన అవసరం లేదు.
   మొన్న స్వలింగ సంపర్కం గురించి చర్చ జరుగుతున్నప్పుడు కూడా మీరిలాగే మాట్లాడారు. వారి హక్కులను సమర్థించడమంటే స్వయంగా అందులో పాల్గొనడం కాదు.

   Delete
  9. తెలంగాణా వస్తే సమైక్యవాదం ఓడినట్లా ప్రవీణ్ గారు. వాదనలో గెలవడానికి , ఆచరణలో గెలవడానికి తేడా ఉంటుంది. ఇపుడు మీరు తెలంగాణ ఏర్పాటు ఆధారంగా చేసేది తర్క విరుద్ధమైనది కాదా? నన్నడిగితే సోనియా రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి తెలంగాణా ఇచ్చిందని వాదిస్తాను. శ్రీకాంత్ చారి గారినడిగితే తెలంగాణా ఇవ్వడం అనివార్యం అని వాదిస్తారు. దీనిలో ఎవరు గెలిచినట్లు? సమైక్యవాదులు చెప్పినట్లు ఆచరణ ఉంటే తెలంగాణా ఉద్యమమే వచ్చేది కాదు. తెలంగాణా ఉద్యమం రావడానికి కారణాలున్నాయి. ఆ కారణాలకు నిజంగా పరిష్కారం చూపగలిగి ఉంటే. ఆచరణలో అలా వ్యవహరించి ఉంటే కనీసం నమ్మకం కలిగించేలా ఉంటే పరిస్తితి వేరుగా ఉండేది. ఒకవేళ సోనియా తెలంగాణా ఇవ్వలేదు. తెలంగాణా ఉద్యమం తాత్కాలికంగా చల్లారింది అనుకుందాం. అపుడు సమైక్యవాదం గెలిచినట్లా? తెలంగాణాకు సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరుగలేదా? మీ ఉత్తరాంధ్రకు , రాయలసీమకు అన్యాయం జరుగలేదా? కేవలం హైదరాబాద్ మీదనే అభివృద్ది దృష్టి సారించారని మీరే చాలా సందర్భాలలో చెప్పారు కదా? దీని ప్రకారం రాష్ట్రం విడిపోవడం సమస్యకు పరిష్కారం కాదని నేను వాదిస్తాను. ఇక్కడ మీరు పొంతనలేని ఉదాహరణలు చేయడం తర్కవిరుద్ధం. తెలంగాణా ఏర్పడిందనేది నిజం. అందువల్ల సమైక్యవాదం ఓడినట్లు కాదు. సమైక్యవాదం పేరు చెప్పి వ్యాపారాలతో లాబీయింగులు చేసి కొన్నాళ్లపాటు మాత్రమే తెలంగాణాను ఆపగలిగినవారు ఓడినట్లు. నిజమైన ఉద్యమం తెలంగాణా ఉద్యమం కనుక, తెలంగాణా ఏర్పడింది కనుక వారు గెలిచినట్లు. తెలంగాణా ఏర్పడితే సమైక్యవాదం ఓడినట్లని నేను ఇప్పటికీ భావించడం లేదు. ఎప్పటికీ భావించను కూడా. ఇక్కడ నేనలా ఉంటే నా వాదనలో గెలిచినట్లా? ఓడినట్లా?

   Delete
  10. This comment has been removed by the author.

   Delete
  11. ఆచరణ - వాదం ఎప్పటికీ పరస్పరాధారితాలు నీహారిక గారు. పాతది లేకుండా కొత్తది లేదు. కొత్తది ఒకప్పటికి పాతబడుతుంది. దాని ఆధారంగా మాత్రమే ఆ వచ్చే కొత్తది ఉంటుంది. ఆచరణకు ఉపయోగపడేది ఫలితాన్నిచ్చే వాదనే నిలబడుతుంది. ఆ వాదనకు గీటురాయిగా ఫలితం ఉంటుంది. ఒక్కోసారి ఫలితం పూర్తిగా రాకపోవచ్చు. చివరికి అసలు ఫలితం వచ్చినపుదు నిజమైన వాదన సత్తా తెలుస్తుంది. దీనికి సమయం పట్టవచ్చు. అయితే ఎత్తుగడలకు సంబంధించిన వాదనలకు, నిజ నిర్ధారణకు సంబంధించిన వాదనలకు తేడా ఉంటుంది. వాదన కోసం చేసే వాదనకు , నేనన్నదే గెలవాలనే చేసే వాదనకు, నాకు జ్ఞానం ఉన్నదన్న బలుపుతో చేసే వాదనకు విలువ , గుర్తింపు ఉండవు. వాదన నిజ నిర్ధారణకు , నిజ నిరూపణకు , తెలియంది తెలుసుకోవడానికి, తెలిసింది చెప్పడానికి అయి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.

   Delete
  12. ఆచరణ లేని వాదం ఆచరణకు ఉమ్మడి శక్తిని కూడగట్టడానికి అంటే ఐకమత్యాన్ని ప్రోది చేయడానికు ఉపకరించాలి. ఉపకరిస్తుంది కూడా. అయితే అది వాదించే బోధకుని తీరుపై ఆధారపడై ఉంటుంది. నేను పండితుడిని అని పాండిత్యాన్ని ప్రదర్శించడానికి , ఇతరులకు తన పాండిత్యాన్ని మాత్రమే సలహాలుగా అందించేందుకు మాత్రమే ఉపయోగించే వారితో ఆచరణకు ప్రయోజనం ఉండదు. ఏది సత్యమో దానిని ప్రజలు గమనించే చైతన్యరహితులై ఉన్నపుడు వారికి అది అర్ధమయ్యేలా ఓపికగా చెప్పగలిగేలా వాదన ఉండాలి. ఉదాహరణగా చెప్పాలి అంటే శాస్త్ర విషయాలను టి.వి సీరియల్ లా చెప్పాలి. వేమన తత్త్వాలు ఆటవెలదిలో నేటికీ ప్రజల నాలుకలపై నాట్యమాడుతున్నాయే అలా తేలికగా , సమాజ హితం కోరి వాదం ఉండాలి. వాదం వాదన ప్రచారం లేకుండా కార్యాచరణలో మార్పులు రావు. ఆచరణను పరిశీలించడం ద్వారానే కొత్త వాదం లేదా ఆలోచనలు పుడతాయి.

   Delete
 5. ఒక స్థలం మీ తాతగారు కొన్నారు.కొడుకులు దానిని అవసరాల కోసమో,బలహీనతల కోసమో వేరే వాళ్ళకు అమ్మేసారు.మీరొచ్చి ఆ స్థలం మా తాతది మీరు వెళ్ళిపొండి అని పోట్లాడారు అనుకోండి.మీరు బలవంతులన్నా కావాలి,లేదా తర్కవిరుద్ధంగా మాట్లాడుతున్నారని భావించాలి.మీరు ఎంతసేపూ మా తాతదే ఆ స్థలం అని ఒక వంద సాక్ష్యాలు చూపిస్తారు,వాదిస్తారు కానీ మీ తండ్రి అసమర్ధత వల్లే మీరు స్థలాన్ని పోగొట్టుకున్నారని ఒప్పుకోరు.ఆ స్థలం తెలంగాణా వారిదో,హిందువులదో ,దళితులదో అయితే వారందరూ మీకు సపోర్టుగా నిలబడడం వల్ల మీరు తాత్కాలికంగా గెలుస్తారు.ఇపుడు అర్ధం అయిందా ?

  న్యాయంగా అయితే స్థలం మీ తాతదే అయినా మీకు ఆ స్థలమే కావాలి అంటే కొనుక్కోవాలి.అతనికి అమ్మే ఉద్దేశ్యం లేనపుడు ఇలా తర్కవిరుద్ధంగా వాదించి లేదా దౌర్జన్యం చేసి గెలుస్తారు.మీరు గెలవడమే కావాలి.ఎలా గెలిచారన్నది మీకు తెలుస్తూనే ఉంటుంది అయినా మీదే కరెక్ట్ అనీ మిమ్మల్ని ఎదిరించిన వాళ్ళని పిచ్చివారనీ నిందలేసి మళ్ళీ గెలుస్తారు.ఎలా అయినా మీరు గెలవడమే మీకు ముఖ్యం !వాస్థవంతో మీకు పనిలేదు.తర్కం మీ ముందు నిలబడలేదు.ఇంకా ఎక్కువ మాట్లాడితే దోచుకున్నారు అని కూడా అంటారు.ఇటువంటి తర్కవిరుద్ధమైన వాదనలు చేస్తూ కూడా నీకు చరిత్ర తెలియదు,శాస్త్రం చదువుకునిరా అని ఉచిత సలహా ఒకటి పారేస్తారు.
  మీ తాతదే స్థలం అని ఒప్పుకోడానికి ఎటువంటి శాస్త్రం అవసరం లేదు కానీ కొనుక్కున్నవాడిదే భూమి అని చెప్పడానికి కూడా శాస్త్రం చదవాలా ?

  ReplyDelete
  Replies
  1. @aakula dhana udaya lakshmi
   తన తాతగారి స్థలాన్ని మనవడు కొంటానంటే,ఆ స్థలాని 1కి 10 ఇచ్చి కొంటానంటే అమ్మేవాడు ఒప్పుకుంటాడా?వొప్పుకోడా?అది వాళ్ళిద్దరూ ఒకచోత కూర్చుని మాట్లాడుకోవాలి,అమ్మేవాడు అమ్మను అన్నా అది కూడా యెవడూ కాదనడు,కానీ వాడు అమ్మినా వీదు కొన్నా నేను పీక కోసుకుంటాననై ఆ స్థలంతో యే సంబంధమూ లేనివాళ్ళు గొడవ చెయ్యటం అసలైన తప్పు అనై చెప్పటానికి కూడా శాస్త్రాలు చదవనక్కర లేదు కదా!కేవలం కామన్ సెన్సు చాలు కదా!ఆ కామన్ సెన్సు మొత్తం యే ఒకరిలోనో గూడుకట్టుకుని ఉందదు,మిగతా వాళ్లకి కూడా ఉంటుంది,అవునా కాదా?

   సూటిగా అనరికీ అర్ధమయ్యేలా చెప్పాలంటే ఈ వ్యాఖ్య రామజన్మభూమికి సంబంధించినది అని అర్ధం అవుతున్నది గదా!ఆ పోష్టులో ఒక రౌండు ప్రశ్నలు వేసి జవాబు అడిగితే అక్కద వెయ్యకుండా ఇక్కడ వెయ్యటం అంటే దానర్ధం యేమిటో?!

   Delete
 6. ప్రశ్నించడానికి కావలసిన ఒకే ఒక్క అర్హత తెలుకోవాలనే ఆసక్తి.

  తెలుసుకోవడం అనేది నిరంతర ప్రయాణం. ఆ ప్రయాణానికి ఎల్లపుడూ ముందుండి దారి చూపేదే ప్రశ్న.

  గురువు(లు), భక్తి ప్రపత్తులు, వినయ విధేయతలు ఆ ప్రయాణానికి ఉపకరించే సాధనాలలో కొన్ని మాత్రమే. ఇవన్నీనో లేక వీటిల్లో ఏ ఒక్కటో మాత్రమే అర్హతలు కాబోవు.

  సరిగా గమనిస్తే… మనిషి జీవితంలో గురువు(ల) నుంచి నేర్చుకోనేవాటికంటే పరిశీలన, చర్చ, అభ్యాసం, అనుభవం ద్వారా నేర్చుకోనేవే అధికం.

  శ్యామలీయం గారు తరచుగా వల్లె వేసే సుభాషితాలు సుద్దులలో ప్రశ్న నుంచి పారిపోయే పలాయనవాదం, తెలుసుకోవాలనే ఆసక్తిని ఏదో సాకులతో నియంత్రించాలనే ఉద్దేశ్యమే నాకు ఎక్కువగా కనిపిస్తుంది.

  ReplyDelete
  Replies
  1. శ్యామలీయం గారు Edge గారు చేసిన కామెంట్‍లో మీ పట్ల వ్యాఖ్యానం తప్ప మిగతా భాగం మంచి సూచన. మీ పట్ల ఆయన ఏదైతే వ్యాఖ్యానం చేశారో మీ కామెంట్ సారం దానిని నిజం చేసేలా ఎందుకు ఉండాలి? నిజానికి మీరు సమాధానం చెప్పకపోతే ఆయన కామెంట్ లో పై భాగం వరకు రీ పబ్లిష్ చేద్దామనుకున్నాను. మీ పట్ల Edge గారి అభిప్రాయం ఇక్కడ టపాకు సంబంధం లేనిది. ఆయనకు మీ పట్ల ఆ అభిప్రాయం ఉండకూడదని కాని, ఉండాలి కాని నేను చెప్పడం లేదు. ఏ మనిషినీ అందరూ అన్ని విషయాలలో మెచ్చుకోరు. పైగా విమర్శ ను స్వీకరిస్తే లోతుగా విశ్లేషించుకుంటే మనకు ఉపయోగమే కదా? మీ పట్ల బ్లాగు లోకంలో ఎక్కువమందికి సదభిప్రాయమే ఉన్నది. కానీ వివిధ విషయాలలో మీ అభిప్రాయాలపై వ్యతిరేకతను మీ పట్ల వ్యతిరేకత అని భావించవద్దని మనవి. మీరలా భావించేవారు కాదనీ నాకు తెలుసు. నాకు కూడా మీ అభిప్రాయాలపై కొన్నింటిపై భినాభిప్రాయం, వ్యతిరేకతా ఉన్న విషయం మీకు తెలుసు. అదే సందర్భంలో బ్లాగు ప్రపంచంలో నాకున్న మంచి మిత్రులు శ్రేయోభిలాషులలో మీరు ప్రధమ భాగంలోనే ఉంటారు. విషయాన్ని విబేదించడం వ్యక్తిని విబేధించడం కాదు కదా? అయితే వ్యక్తిగతంగా కామెంటడం వల్ల ఉపయోగం ఉండదు. ఆ మేరకు మిమ్ములనే కాదు, ఎవరినీ ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. కానీ ఇది పదే పదే చర్చిస్తున్నాం తప్ప ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉందని నా అభిప్రాయం. నా విన్నపం ఏమిటంట్ ఎవరు ఏమంటున్నారు అనేది విజ్ఞతతో వదిలేసి నా ప్రశ్నలకు మీకు ఎపుడు వీలుంటే అపుడు, మీ అభిప్రాయం ఏదైతే అది తెలియజేస్తారని ఆశిస్తున్నాను.

   Delete
  2. @ శ్యామలీయం,

   నేను ఏది మాట్లాడినా విషయాన్ని వదిలేసి, నేను మాట్లాడిన దాన్ని గిచ్చి గిచ్చి రాచపుండు చేయడం తమ అలవాటుగా నాకు తోస్తున్నది, అయినా వదిలేయండి, నేను అలాంటి వాటిని పట్టించుకోను. వీలయినంత వరకు విషయం మీదనే దృష్టి కేంద్రీకరిస్తాను.

   మీరు దేవుడిని ఇన్‌ఫినిటీతో పోల్చగా లేనిది, నేను ఇన్‌ఫినిటీని అదే కాంటెక్స్టులో వాడితే మీకు వెగటుగా ఎందుకు కనిపించింది?

   అసలు ఇక్కడ చర్చిస్తున్న విషయం ఏమిటి?

   "దైవదత్తాలను ప్రశ్నించొచ్చా?" అనేది.

   "దైవమే నిరూపితం కానప్పుడు దేన్నైనా దైవదత్తం అని చెప్పడం అసాధ్యం" అన్నారు కొండలరావు గారు.

   దాన్ని వ్యతిరేకిస్తూ మీరు "నిరూపణకు వీలు కానివి కూడా ఉంటాయండీ" అని అన్నారు. దానికి ఇన్‌ఫినిటీని ఉదాహరణగా ఇచ్చారు. అంటే మీ భావంలో నిరూపించలేక పోయినా దైవమూ, దైవదత్తాలూ ఉంటాయనే గదా?

   మీరు గణితాన్ని ఉపయోగించుకుని షార్ట్‌కట్‌లో మీ వాదాన్ని నెగ్గించుకుందామని ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ ఉదాహరణనే తీసుకుని అది మీ వాదనకు ఎలా అతకదో చెప్పే ప్రయత్నం చేశాను. ఫలితం... షరా మామూలే! మీరు అలగడం. తద్వారా ఇక్కడికొచ్చిన వారిని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ ద్వారా ఆకట్టుకోవాలని చూడ్డం.

   మీ దగ్గర నిజంగా పాయింటే వుంటే అలాంటి చీప్‌ట్రిక్స్ ప్రయోగించేవారు కాదు. నిరూపణ చేయలేనిది ఖచ్చితంగా ఉంటుంది అని నిరూపించ లేక పోయారు.

   మీరు చెప్పిన గణిత ప్రకారమే చూసినా అఙ్ఞాతమైన విషయం ఙ్ఞానతకు మూలమని చెప్పడం సాధ్యం కాదు.

   ఉదా:

   1 ÷ 0 = ∞
   1000 ÷ 0 = ∞
   10000000 ÷ 0 = ∞
   1 X ∞ = ∞

   అవుతుంది తప్ప తెలుసుకోలేనివిషయం తెలిసిన విషయానికి కచ్చితమైన మూలమని చెప్పడం సాధ్యం కాదు.

   ∞ + a = b
   ∞ - a = b
   ∞ ÷ a = b
   ∞ x a = b

   పై సమీకరణాలు నిరూపించడం సాధ్యం కాదు.

   Delete
  3. శ్యామలీయం గారు,

   మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. నా వ్యాఖ్యలు, విమర్శ, మీరు తరచుగా వ్యక్తం చేసే భావాలు, అభిప్రాయాలపైనే. అది అనుచితంగా నేను భావించడంలేదు.

   ఇక మీ 'ఎమోషనల్ బ్లాక్‌మెయిల్’ ధోరణికి, ఇతరుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కట్టడి చేయడానికి మీరు అతిగా పడే ఆరాటానికి మచ్చుకి ఒక ఉదాహరణ మీ/నా వ్యాఖ్యలు ఈ క్రింద బ్లాగులో:

   http://yaramana.blogspot.com/2015/03/blog-post_28.html

   Delete
  4. Edge gaaru,
   You too have 2 options: grow some thick skin or stop responding to Syaamaleeyamgaaru's comments :)

   ప్రశ్నించేవారిని తప్పు చేస్తున్నారని, పాపాత్ములని భావించి మీరు ఎట్టి పరిస్తితిలోనూ అలా ప్రశ్నించకూడదని వాదించడాన్ని ఏమనాలి?//
   నా అభిప్రాయం: దైవం నమ్మకానికి సంబంధించినది. నేను నమ్మేది మరొకరు నమ్మాలని లేదు. 'ఇంకొకరి నమ్మకాన్ని వెక్కిరించేలా/నొప్పించేలా నేను మాట్లాడుతాను, నా ఇష్టం' అనుకుంటే ఏమంటాం? మీ ఇష్టం అంటాం.

   శ్యామలీయం మాస్టారు ఒకడుగు ముందుకేసి మీరిలా మాట్లాడటం వలన మరొకరు నోచ్చుకునే అవకాశం వుంది అని అన్నారు. శ్యామలీయం మాస్టారు వొప్పుకున్నా వోప్పుకోకపోయినా ప్రశ్నించేవారు ప్రశ్నిస్తూనే వుంటారు. నేను నమ్మే పురాణాల మీద, పురాణ పురుషుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూనే వుంటారు. ఎవరి సరదా వారిది.

   Delete
  5. మాష్తారు గారు నొచ్చుకుంటారనీ ముడుచుకుంటారనీ వాస్థవాలు చర్చించకుండా ఉండలేం కదా ? ఒకరు గొప్పవారైతే గొప్పవారని ప్రచారం చేసుకోండి ఎవరూ కాదనరు,నిజాలు మాట్లాడితే మీకైతే ఒక నీతి వెరొకరికి ఇంకొక నీతి ఉండకూడదు.
   దైవం ఉంటే నిరూపణ జరిగితీరుతుంది.నమ్మకమే దైవం !దైవానికే నమ్మకం లేనపుడు దైవం కాడు.ఆలమందలన్నిటికీ ఒక ఎద్దు చాలన్నట్లు ఒకడిని ఉద్ధరిస్తే మిగతావారందరూ సక్రమంగా అయిపోతారు.


   Delete
 7. Replies
  1. దైవదత్త ప్రశ్నలను ప్రశ్నించడం పాపం కాదు. సందర్భాన్ని గమనించకుండా ప్రశ్నించడం అనే లోపం కారణంగా మీ ప్రశ్నలలో ఇక్కడ టపా పరిధి దాటి ఉన్నందున వాటిపై చర్చ ఇక్కడ టపా చర్చకు ఖచ్చితంగా ఆటంకం కలిగించేవి అని నేను అభిప్రాయపడినందున మాత్రమే తొలగించాను. మీ ప్రశ్నలు తప్పుడవనో, అడగ కూడనివనో మాత్రం కావండీ. గమనించగలరు.

   Delete
 8. Replies

  1. నా స్వానుభవంలో కూడా ఎంతకూ తెగని సమస్యలకు సమాధానాలు స్వప్నంలో అవబోధన ఐన సంఘటనలున్నాయి

   ఒక సమస్య గురించి ఆలోచిసూ నిద్రకుపక్రమించినపుడు,ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం తళుక్కున మదిలో మెరవడం సహజం.చాలామంది కలలు కదా అని నిర్లక్ష్యం చేస్తారు కానీ నిజంగా ప్రయత్నిస్తే కలలను సాకారం చేసుకోవడం అసాధ్యమేమీ కాదు.అయితే ఒకరిని దైవదత్తమైనవారిగా కొలుస్తున్నపుడు మనుషులందరినీ దైవదత్తమైనవారిగా కొలవడం జరిగితీరాలి.అలా జరగనంత కాలం దైవకార్యాలు సఫలం కావు.ఒక జింకని వేటాడాలంటే ఎంతో సహనం కావాలి,జింకని చంపినవాణ్ణి వేటాడాలంటే ఎంత సహనం కావాలి ?

   Delete
  2. కల దైవదత్తం కాదు. మనసు కు సంబంధించింది. మనిషి ఆలోచనలకు సంబందించినది. అయితే మనిషి ఆలోచనలలో భావవాదం-భౌతికవాదం ఉన్నట్లే కలలలో కూడా ఈ రెండూ ఉంటాయనేది యదార్ధం. కలలో పరిష్కారాలు రావడం ఆశ్చర్యమో, అనుమానించాల్సిందో కాదు. అదే సందర్భంలో కలలన్నీ పరిష్కారాలను చూపేవి కావు కదా! కలలపై పరిశోధనలు జరుగుతున్నందున శాస్త్రవేత్తలు తేల్చాల్సిన అంశాలకోసం ఎదురుచూద్దాం.

   Delete
 9. సాక్ష్యాధారాలు లేకుండా దేనినీ విశ్వసించమని అంటున్నవారూ దేవుడు లేడని యెట్లా బల్ల గుద్ది వాదిస్తున్నారు?యే ఆధారాలతో దేవుడు నిర్రూపితం కాలేదని అంటున్నారు!

  శాస్త్రీయత అంటే యేమిటి?ఇవ్వాళ మీరు మీ వాదనల్ని బలపరుచుకోవడాఇకి ఆధారంగా తీసుకున్న శాస్త్రీయ సిధ్ధాంతాలలో అన్నీ నిరూపితమైనాయని గ్యారెంటీగా చెప్పగలరా?నేను యేదయినా ప్రతిపాదన చేస్తే వ్యూహత్మకంగా నేను గెలవడానికి అవకాశం ఉన్నవాటినే సపోర్టు తెచ్చుకుంటున్నట్టు కనిపించవచ్చు.కనుక మీరు యే సిధ్ధాంతాన్నై అయినా ఉదాహరణగా తీసుకోవచ్చు!చెప్పండి,మీరు గట్టిగా ఇది శాస్త్రీయమైనది అని యే సిధ్ధాంతాన్ని గురించి సమర్ధించబోయినా ముందుగా మీకే గోచరమయ్యే ఒక రెండు విషయాల్ని నేను చెప్తాను.మీరు ఉదాహరణగా తీసుకున్న సిధ్ధాంతంలో అవి లేకపోతే అప్పుడు చూద్దాము.

  ప్రతి సిధ్ధాంతానికీ మొదటా ఆధారాలతో సంబంధం లేని ఒక వూహాత్మక పరిష్కారం ఉంటుంది!కొన్ని సిధ్ధాంతాలకి ఆ వూహ నిజమయ్యే ఆధారాలు కనబడి నిరూపితమైతే కొన్నిసార్లు ఆ వూహ పూర్తిగా తప్పు అని తేలి దానికి విరుధ్ధమైన వూహ నిజమని తెలుస్తుంది!ప్రతి సిధ్ధాంతానికీ అనుబంధంగా ఎక్సెప్షన్లు - అంటే ఆసిధ్ధాంతాన్ని వర్తింపజెయ్యడానికి వీలు లేని సందర్భాల లిస్టు ఉంటుంది!

  కంటికి కనిపించే మరియూ పూర్తిగా ఇంద్రియ జ్ఞానం మీద ఆధారపడిన సైన్సులో ఇంత గందరగోళం యెందుకు ఉంది?ముందు మీరు శాస్త్రీయత అన్న దాంట్లోనే శాస్త్రీయత లేకపోవడం గురించి తేల్చి చెప్తే శ్యామలీయం మాసార్ని అశాస్త్రీయంగా మాట్లాడుతున్నారని అనడం వరకూ వెళ్ళొచ్చు!

  P.S:ఐన్స్టీన్ సాపేక్ష సిధ్ధాంతం గురించి,అందులోనూ విశ్వంలో కాంతి వంగుతంది,విశ్వంలో తిన్నని దారిలో ప్రయానించడం కన్నా వంపుదారిలో ప్రయాణించడమే తేలిక అనే సంక్లిష్టమైన వాదనల్ని ఒక 8వ తరగతి కుర్రాడికి అర్ధమయ్యేలాగా మీరు చెప్పలేకపోతే రెలేటివిటీ చెత్త సిధ్ధాంతం ఔతుందా?మీరు రిలేటివిటీని కనీసం 8వ తరగతి కుర్రాడికి కూడా విడమర్చి చెప్పలేని వెర్రివాళ్ళవుతారా?ఆ 8వ త్రగతి కుర్రాడు యెందుకూ పనికిరాని దద్దమ్మ వౌతాడా?

  ReplyDelete
  Replies
  1. ఇక్కడ వాదన దేవుడు లేడని వాదించడం గురించి కాదు హరి బాబు గారు. దేవుడు చెప్పాడని చెప్తున్న అంశాల గురించి, వాటిని ప్రశ్నంచడం పాపమంటున్న వాదన గురించి. దేవుడిని నమ్మాలా? వద్దా? ఎలా? అనేది వేరే టపా వ్రాయడం అక్కడ చర్చలు జరగడం జరిగాయి కనుక ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం.

   Delete
  2. దేవుడు లేడనేది పూర్తిగా నిరూపితం కాలేదు గదా అన్నదే నా పాయింటు!సరే,అసలు పాయింటు అది కాదనేది నేనూ ఒపుకుంటాను.ఇదివరలో నా ప్రశ్నలకి యెదటివాళ్ళు జవాబు చెప్పకపోవడం వల్ల చర్చ ఆగిపోయినా నేను మధ్యలో పారిపోయానని అన్నారు!కాబట్టి నా మొదటి రౌండు ప్రశ్నలకి జవాబులు చెప్పాకనే నా చర్చ కొనసాగిస్తాను.P.S:అని అడిగిన ప్రశ్నలు మరీ ముఖ్యమైనవి

   Delete
  3. హరి బాబు గారు,

   మిమ్ములను పారిపోయారని అన్నానా? ఎపుడు?

   దేవుడు లేడని ఎందుకు నిరూపించాలసలు? ఆ అవసరం ఎందుకు? ఎవరికి ఏమి ప్రయోజనాన్ని ఇస్తుందది. ఉన్నాడనుకుని మంచి పనులు చేసేవారికి అది గొప్ప వరంలా పని చేస్తుందని నా అభిప్రాయం. వారిని ఎందుకు కెలకాలి?

   దానికి దైవదత్తమని చెప్పేవాటికి తేడా ఉన్నది. అది ఇదీ ఒకటి కానేకాదు.

   < ఐన్స్టీన్ సాపేక్ష సిధ్ధాంతం గురించి,అందులోనూ విశ్వంలో కాంతి వంగుతంది,విశ్వంలో తిన్నని దారిలో ప్రయానించడం కన్నా వంపుదారిలో ప్రయాణించడమే తేలిక అనే సంక్లిష్టమైన వాదనల్ని ఒక 8వ తరగతి కుర్రాడికి అర్ధమయ్యేలాగా మీరు చెప్పలేకపోతే రెలేటివిటీ చెత్త సిధ్ధాంతం ఔతుందా? >

   కాదు. కానీ అది అర్ధం చేసుకునే కెపాసిటీ ఉన్న వారందరికీ ఒకేలా అర్ధం అవుతుంది. పైగా నిరూపితం అవుతుంది. దైవదత్తమైన అంశాలు అలా కాదు. ఇంకా చెప్పాలంటే కేవలం నమ్మకం ఆధారంగా చెప్పేవి అందరూ నమ్మాలి అనిగానీ ఎవ్వరూ ప్రశ్నించకూడదని గానీ అనడం తప్పు.

   < మీరు రిలేటివిటీని కనీసం 8వ తరగతి కుర్రాడికి కూడా విడమర్చి చెప్పలేని వెర్రివాళ్ళవుతారా? >

   కాను.

   < ఆ 8వ త్రగతి కుర్రాడు యెందుకూ పనికిరాని దద్దమ్మ వౌతాడా? >
   కాడు. ప్రశ్నించడం తెలుసుకోవడానికే అయినపుడు. ఆ కుర్రాడు తెలుసుకుంటాడు. లేదా తెలుసుకునే శక్తిని తను ప