ఈ పోష్టుని 1-2-2013 న అప్పటికి నేను నడుపుతున్న బ్లాగుల వివరాలను తెలిపేందుకు వ్రాశాను. నాకున్న బ్లాగుల వివరాలను ఆ టపాలో చెప్పాను. అభినందనలు తెలుపుతూ ఏడుగురు కామెంట్ చేశారు. ఇపుడా టపాని కొంచెం మార్చి రీ పబ్లిష్ చేస్తున్నాను. గతంలో నాకున్న బ్లాగుల వివరాలు ఇలా ఉన్నాయని జ్ఞాపకం ఉంచుకోవడానికి ఇపుడు మార్చి వ్రాసిన పోష్టు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.

మొదట్లో నా బ్లాగుగా ఉన్న 'జన విజయం' ని తరువాత ఆన్‍లైన్  మేగజైన్ గా మార్చాను. కొన్నాళ్లు పక్ష పత్రికగా నడిపాను. ఇపుడు ఈ బ్లాగులోనే "జన విజయం" ఓ శీర్షికగా ఉంచాను. జనవిజయం పేరుతో పక్షపత్రీకకోసం టపాలు పంపినవారికి ధన్యవాదములు. ఆ టపాలలో ముఖ్యమైనవి ఈ బ్లాగులో జనవిజయం లేబుల్ క్రింద రీపబ్లిష్ చేస్తున్నాను. జనవిజయంలో నడిపిన ఇతర శీర్షికలను కూడా ఈ బ్లాగులో కంటిన్యూ చేస్తున్నాను. ఆన్లైన్లో జనవిజయం ద్వారా వచ్చిన అనుభవంతో ప్రింట్ మీడియాలోకి ప్రవేశించాను. ఇపుడు జనవిజయం పేరుతో వారపత్రికను నడుపుతున్నాను.

నాకు డిస్కషన్స్ పై కొంచెం ఆశక్తి ఎక్కువ. ఏదైనా విషయం పై అందరం కలసి చర్చిస్తే నిర్ధారణలలో మేలైన, మెరుగైన ఫలితాలు వస్తాయనేది నా అభిప్రాయం. అనుభవం కూడా! అందుకే గతంలో జనవిజయం బ్లాగులో చర్చావేదికగా నడిపిన అంశాన్ని ప్రజ బ్లాగుగా క్రియేట్ చేయడం జరిగింది. చర్చావేదికగా నడిపిన " ప్రజ" బ్లాగును కూడా రద్దు చేసి 'ప్రజ' చర్చావేదికను ఓ శీర్షికగా ఉంచాను. జనవిజయం వారపత్రికలో కూడా ప్రజ చర్చావేదికను కొనసాగిస్తున్నాను. బ్లాగులలో ప్రజ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ చర్చలలో పాల్గొన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఈ బ్లాగులో కూడా అవసరమనిపించిన విషయాలపై ప్రజ శీర్షిక నడుపుతాను. కానీ కంపల్సరీగా కామెంట్ మోడరేషన్ ఉంచాలనేది నిర్ణయం. ప్రజలో పాత టపాలలో ముఖ్యమైన వాటిని ఇందులో రీ పబ్లిష్ చేస్తున్నాను.

పల్లెప్రపంచం విజన్ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా "పల్లెప్రపంచం" బ్లాగు ఉండేది.  పల్లెప్రపంచం కార్యక్రమాలు, విజన్ అంశాల ప్రచారం కోసం పల్లెప్రపంచం, కార్యక్రమాలు అనే లేబుల్స్ ను ఉపయోగిస్తాను. ఇపుడు పల్లెప్రపంచం  పేరుతోనే నా బ్లాగులన్నింటిలో ఉన్న సమాచారాన్ని, పాత టపాలను పల్లెప్రపంచంలోకి బదిలీ చేస్తున్నాను.

నాకు స్వంతంగా అభిప్రాయాలు వ్రాసుకోవడానికి 'నా ప్రయాణం' అని ఈ బ్లాగుని ప్రారంభించాను. కంటిన్యూ చేయలేకపోయాను. ఆ బ్లాగు టపాలు పల్లెప్రపంచంలోకి బదిలీ చేసి వ్యక్తిగతం లేబుల్ క్రింద టపాలు ఇందులోనే వ్రాస్తాను.ఈ విజయం నాది కాదు....! 

జనవిజయం బ్లాగులో నేను వ్రాసినవి చాలా తక్కువ. ఇకపై నేను అన్ని విషయాలపై నా అభిప్రాయాలు వ్రాయడానికి పల్లెప్రపంచం బ్లాగు ద్వారా కృషి చేస్తాను. ఈ బ్లాగుకు ఇప్పటివరకూ (19-10-2016) 7,62,024 పేజీ వీక్షణలు, 66 మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఎక్కువగా ప్రజాశక్తి దినపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో ఆర్టికల్స్, ఇతర ఎక్కడ మంచి అనిపించినా సేకరించి జన విజయంలో పోస్టులుగా ఉంచాను. నేను చేసిందల్లా వాటిని మంచిగా డిసైన్ చేసి పెట్టడమే. ఆయా సమాచారం ఒరిజినల్‌గా వ్రాసినవారందరూ ఈ ప్రొగ్రెస్ కు కారకులు. నా పాత్ర నామ మాత్రం మాత్రమే.  ఈ పేజీ వీక్షణలు - ఫాలోవర్స్ లిస్ట్ అంతా ఇపుడు పల్లెప్రపంచం బ్లాగు కు  చేర్చబడ్డాయి.


ctl 'c ' + ctl 'v ' కు పవర్ ఉంది సుమా ....! 

ఇప్పటిదాకా జనవిజయం, ప్రజ  లో ఉన్న పోస్టులలో బాగున్నవి, సమాజానికి పనికివచ్చేవి 'పల్లెప్రపంచం'లో పోస్టులుగా ఉంచాను. ఎప్పటిలాగే సమాజానికి అవసరమైనవి అనిపించినవి సేకరణలుగా ఉంచుతాను. ఎందుకంటే ఈ సేకరణలలోని అంశాల వల్ల తమకు మేలు జరిగిందని కొందరు నాకు మెయిల్ చేశారు. వాస్తవానికి అవి నేను వ్రాసినవేమో అనుకుని వారు నాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా సమాజానికి ఉపయోగపడే అంశాలుగా నాకు తారసపడినవి సేకరణలుగా ఉంచి వాటి ఒరిజినల్ లింక్ ఇస్తాను.


వినదగు నెవ్వరు చెప్పిన........!

జన విజయం బ్లాగు గురించి జీడిపప్పు బ్లాగులోనూ, కొందరు వ్యక్తులతోనూ జరిగిన చర్చలో నేను నా బ్లాగును సరిచేసుకుంటానని హామీ ఇచ్చాను. మార్క్సిజం గురించి, వ్యక్తిత్వ వికాసం గురించి నాకు తెలిసిన అంశాలు గతంలో కొన్ని పోస్టులు వ్రాసి వదిలేయడం జరిగింది. ఆ రెండింటి తో పాటు  ఇతర అంశాలపై వీలున్నంతవరకూ స్వంతంగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

కేవలం బ్లాగు గురించి తెలుసుకోవడానికీ,  బ్లాగును మంచిగా తయారుచేయాలనే తలంపుతో ఒకింత ఎక్కువ ప్రయోగాలు చేయడంతో ఇంత సమయం పట్టింది.  అయినా నా బ్లాగులను  ఆదరించారు. వారందరికీ ధన్యవాదములు.  నా ప్రయోగాలవల్ల  చాలామంది విసిగిపోయి ఉంటారు వారికి క్షమాపణలు.  బ్లాగు అగ్రిగేటర్లకు, కొందరి బ్లాగులలో జనవిజయం ను ఉంచిన బ్లాగర్లకు అందరికీ కృతజ్ఞతలు.  సమయాభావం వల్ల అన్ని బ్లాగులను కలిపి పల్లెప్రపంచం గా నడపాలని నిర్ణయించుకున్నాను.అందరూ స్పూర్తి ప్రదాతలే....! 

తాతినేని వనజగారు, కప్పగంతు శివరామప్రసాద్ గారు, నీలం రాజ్ కుమార్నల్లమోతు శ్రీధర్ వంటివారు చాలా మంచి విషయాలు తమ బ్లాగుల ద్వారా వ్రాస్తున్నారు. ఇంకా చాలామంది సమాజానికి ఉపయోగపడే మంచి విషయాలు వ్రాస్తున్నారు. వారందరి స్పూర్తితో నేనూ బ్లాగు వ్రాయడానికి ప్రయత్నిస్తాను. నా బ్లాగు అనుభవాలను, బ్లాగు ప్రపంచంలో స్పూర్తిగా నిలిచినవారి వివరాలను, బ్లాగులు ఎలా వ్రాయాలో తెలియని నాకు వివిధ రకాలుగా సహకరించి వివరాలు తెలిపినవారి గురించి,  నాకు నచ్చిన బ్లాగూల గురించీ 'నా బ్లాగు అనుభవాలు' అనే లేబుల్ క్రింద ఈ బ్లాగులో వ్రాస్తాను.

అనగననగ రాగమతిశయిల్లుచునుండు ....!

నాకు డిస్కషన్స్ పై ఉన్నంత ఆసక్తి వ్రాయడం మీద ఉండదు. అందుకే సహజంగా వ్రాయాలంటే భయం. అందంగా ఆకర్షించేలా వ్రాయడం రాకపోవడమూ ఓ కారణం. ఈ భయం బద్ధకంగా మారి ఎప్పటికప్పుడు బద్ధకంగా వాయిదా వేస్తూ పోతుంటాను. ప్రయత్నిస్తూ పోతే ఈ విషయం లో కూడా మెరుగుదల సాధించవచ్చనే అనుకుంటున్నాను. ఎప్పటిలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
Reactions:

Post a Comment

 1. అన్నయ్య మీరు చక్కగా వ్రాయగలరు.శుభాకాంక్షలు

  ReplyDelete
  Replies
  1. థేంక్యూ శశి చెల్లెమ్మా! నేను బ్లాగు సీరియస్‌గా వ్రాదామనుకుని మొదటి పోస్ట్ వ్రాశాక మొదటి కామెంట్ ఇదే. మీ నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాను.

   Delete
 2. చక్కగా రాసేసారు ఆల్రెడీ !

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు లక్ష్మీ రాఘవ గారు.

   Delete
 3. mee yaatra digvijayamgaa konasaagaalani korukumtunnaanu

  ReplyDelete
  Replies
  1. థేంక్యూ దుర్గేశ్వర గారు.

   Delete
 4. రావు గారు,
  మీరు చాలా బాగా రాస్తున్నారు,already.
  ఇంకా బాగా రాయగలరు,కొనసాగించండి. గుడ్ లక్

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top