నా బ్లాగు అనుభావాలు శీర్షిక క్రింద నాకు నచ్చిన బ్లాగర్లను తెలిపే పోస్టులలో ఇంతక్రితం కప్పగంతు శివరామ ప్రసాద్ గారి గురించి తెలియజేశాను కదా! ఈ పోస్టులో దాదాపు అందరికీ పరిచయమే అయిన తాతినేని వనజ గారి గురించి నా అభిప్రాయం తెలియజేస్తాను.మనసా వాచా కర్మణా మనసు చెప్పిందే వ్రా(చే)స్తూ తనదైన ముద్రతో ముందుకెళుతున్న తాతినేని వనజ గారు బ్లాగు లోకం లో చాలామందికి ఆదర్శం. స్పూర్తి . ప్రేరణ. వనజ గారు తెలుగు బ్లాగు లోకం లో తనదైన ముద్ర వేశారు ఆమె మొదటి పోస్టులో చెప్పినట్లే. తన కుమారుని ప్రోత్సాహంతో బ్లాగు వ్రాయడం ప్రారంభించిన వనజగారు నేడు ఓ సీనియర్ బ్లాగర్ గా ఎదగడం అభినందనీయం.


ఆమె బ్లాగు అందంగా అలంకరించిన ఇల్లులా ఉంటుంది. బ్లాగులోని భావాలు చైతన్యవంతంగా ఉంటాయి. ఆనందం - ఆలోచన - ఆగ్రహం ... ఇలా అన్ని రకాల భావోద్వేగాలను ఆమె పోస్టులలో చూడగలం. నాకు నచ్చిన బ్లాగర్లలో తాతినేని వనజ గారు ఒకరు. బ్లాగును సీరియస్ గా తీసుకుని వ్రాసే మడమ తిప్పని మహిళా బ్లాగరు ఆమె. 2010 నవంబర్ 21న బ్లాగులోకం లోకి వచ్చి ఇప్పటివరకూ అప్రతిహతంగా అన్ని అంశాలపై తన భావాలను మనతో పోస్టులుగా పంచుకుంటూనే ఉన్నారు. వృత్తినీ, ప్రవృత్తినీ సమానంగా తీసుకుని మనసులోని భావాలను పదిమందితో పంచుకోవడం ఆహ్వానించదగ్గ అభినందించదగ్గ విషయం.

ప్రతీ అంశాన్ని పోస్టుగా మలచగలరు. చాలా అంశాలపై సూటిగా శాస్త్రీయంగా తన భావాలని వ్యక్తం చేయగలరు. అభివృద్ధి నిరోధక భావాలపై సద్విమర్శలు చేయగలరు. మనసులోని భావాలను నిర్మొహమాటంగా చెప్పగలరు. తనకు నచ్చిన అంశాలను ఎంత బాగా చెప్పగలరో నచ్చని అంశాలను సైతం సునిశితంగా అంతే సమానంగా చెప్పగలరు. మానవ సంబాంధాలు, ఆ సంబంధాలలో బాగును, బంధనాలను తనదైన శైలిలో విమర్శించగలరు.

తన్ హాయి నవలపై సమీక్ష చేసినా, పాలేర్లతో పలకరింపుల్లో అహంభావాన్ని విమర్శించినా, నెగిటివ్ కామెంట్లు చేసేవారిపై నిప్పులు చెరగినా ఆమె తన మనసు చెప్పినట్లే వింటుంది. చాలా విషయాలలో ఆమె శైలి ' మైండ్ లో ఫిక్ష్ అయితే బ్లైండ్ గా వెళుతున్నట్లుంటుంది '

నైతిక ప్రవర్తనలో ఏది నాగరికతో, ఏది అనాగరికమో చెపుతారు.  నచ్చిన పాటలు పోస్టు చేసి మెప్పిస్తారు. చిన్న అంశాన్నిసైతం పోస్టుగా వ్రాయగలరామె. తన బ్లాగుని తనే సమీక్షించుకోగలరు. ఒక్కోసారి కృంగిపోయినట్లనిపించినా మొదట్లో కంటే ఇప్పుడు కొంచెం రాటుదేలినట్లు కనిపిస్తుంది.

నేను మొదట్లో ఈ బ్లాగు చూసి అలంకరణ బాగుంది. ఎవరో కాలేజీ స్టూడెంట్ అనుకున్నాను. తరువాత తరువాత పోస్టులు చదువుతూ బాగా వ్రాస్తున్నారనుకున్నాను. నేను చదివేదే తక్కువ. అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడు చూస్తూ నచ్చిన బ్లాగులను మాత్రం అప్పుడప్పుడు హెడింగ్ లు చూసి చదివే ప్రయత్నం చేస్తాను. అలా అగ్రిగేటర్లు చూసినప్పుడు తప్పక అబ్సర్వ్ చేసే బ్లాగు వనజావనమాలి బ్లాగు.

పోస్టులను , వీక్షకులను , కామెంట్లను , రేంకులను అన్నింటిలో బ్లాగును సీరియస్ గానే తీసుకుంటారు. తెలుగులో బ్లాగులు వ్రాసేవారికి ఎన్నో విషయాలలో ఆమె ఆదర్శమనే చెప్పాలి.

సామాజిక సమస్యలు, సాహిత్యం, అభ్యుదయం, సినిమాలు, పాటలు, సమీక్షలు, మానవ సంబంధాలు, మనసుకు నచ్చిన భావాలు, భావోద్వేగాలు,  కవితలు, కథలు, ఫోటోలు, అమ్మమనసు, ఇలా అన్ని విషయాలపైనా తనదైన శైలితో వ్రాసే పోస్టులు తనకు ఆనందాన్నిస్తే ఇతరులకు చైతన్యాన్నిస్తాయి. కొన్ని పోస్టులు ఆలోచింపజేస్తాయి. 

ఓ విషయం మొదలుపెడితే కొనసాగిస్తారు. మధ్యలో ఆపే లక్షణం లేదు. తన అభిప్రాయాలను మనసారా ఇతరులతో ఆప్యాయంగా పంచుకోగలరు. ఇతరులపై అభిప్రాయాలను చెప్పగలరు. వాదనలోనూ వెనుకడుగు వేయరు. ఇతరుల పోస్టులలో కూడా తనకు నచ్చిన వాటిపై సద్విమర్శలు కామెంట్లుగా చేస్తుంటారు. 

బ్లాగు అనేకంటే వివిధ అంశాల చర్చావేదిక అనవచ్చనుకుంటా. ఓ ఆత్మీయ మితృనితో నిర్మొహమాటంగా చర్చించినట్లుంటుంది కొన్ని పోస్టులను చదువుతుంటే. తరచుగా ఎక్కువ పోస్టులు వ్రాయాలనే పరుగులో కొన్ని పోస్టులు ఆర్డినరీగా అనిపించడం మినహా ఈ బ్లాగు చాలా విషయాలలో మనకు పాఠాలు చెపుతుందనడం లో సంధేహం లేదు.

వనజ గారు బ్లాగు ఎందుకు వ్రాస్తున్నారో  ఆమె బ్లాగునుండి తీసిన ఈ ఇమేజ్ తెలియజేస్తుంది.
అలంకరణా ఉంటుంది అభ్యదయం ఉంటుందీ బ్లాగులో. 50 కథలు, 703 పోస్టులు వ్రాశారు. భవిష్యత్తులో మరిన్ని మంచి పోస్టులు వ్రాస్తూ సమాజానికి మంచి భావాలను ప్రేరణగా అందించాలని ఆకాంక్షిస్తూ వనజ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
Note : ఈ టపా 12-11-2013న  వ్రాసినది.
- Palla Kondala Rao
*Republished
Reactions:

Post a Comment

 1. మహిళా బ్లాగర్లలో మణిపూస వనజ.
  తనకంటూ ఓ ప్రత్యేక శైలి కలిగిన మహిళా రచయిత్రి.
  ఇతర కవులను ప్రోత్సాహించే సహృదయం,
  నెచ్చలిగా నాకు నచ్చిన మంచు పుష్పం.

  ReplyDelete
  Replies
  1. "తనకంటూ ఓ ప్రత్యేక శైలి కలిగిన మహిళా రచయిత్రి."
   అవునండీ మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. కామెంట్ కు ధన్యవాదములు.

   Delete
 2. వనజవనమాలి గారి గురించి,బ్లాగ్ గురించి మీ పరిచయం చాలా బాగుందండి ..

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's p v satyanarayana videso vm vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top