మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------------
అంశం : భగవద్గీత
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------

నాకు భగవద్గీత గురించి పెద్దగా వివరాలు తెలియవు. NTR సినిమాలలో, బాల మిత్ర కథలలో , వాడుకలో చెప్పే పురాణ కథలలో చెప్పేవి మాత్రమే తెలుసు. యొధుడూ - సారధి అనే పుస్తకం కొంత చదివాను పూర్తిగా చదవాల్సి ఉన్నది. ఎక్కువగా ఘంటసాల గారి రికార్డు మాత్రమే విన్నాను. బహుశా చాలాసార్లు విన్నాను. మనసు ప్రశాంతంగా ఉంటుందది వింటే. ఎందుకో తెలీదు. చాలా విషయాలు బాగుంటాయి. కొన్నిలా ఉన్నాయేమిటి అనిపించేవీ ఉన్నాయి. బహుశా ఆ కాలమాన పరిస్తితులలో వ్రాసిన నేపధ్యం పరిశీలిస్తే సద్విమర్శ చేయవచ్చేమో. పాజిటివ్ అంశాలయితే చాలా ఉన్నాయి ఘంటసాల గారి గీత (నాకలా అనడం అలవాటయింది :))) లో. అదొదిలేస్తే మీరూ గీతని వినే ఉంటారు. మీలో గీతపై పట్టున్నవారూ ఉంటారు. గీతను అమితంగా ఆరాధించేవారూ ఉండిఉండవచ్చు. గీతపై వ్యతిరేకత ఉన్నవారూ ఉండవచ్చు. ఎవరెలా ఉన్నా భారత ప్రజపై, అంతర్జాతీయంగానూ గీత ప్రభావం నేటికీ చాలానే ఉన్నది. గీతపై మీ అభిప్రాయాలు సకారణంగా ఇతరులను కించపరచకుండా ఉండాలని విజ్ఞప్తి.

భగవద్గీత లో మీకు నచ్చిన అంశమేది? నచ్చని అంశమేది?
*Re-published
--------------------------------------------------
Reactions:

Post a Comment

 1. దైవదత్తమని చెప్పబడే ఒక పవిత్రగ్రంథం మీద అభిప్రాయాలకి తావుండదు. అక్కడ మానవుల అభిప్రాయాలకి విలువ కూడా ఉండదు. అందులో చెప్పినవాటిని నమ్మడం, నమ్మకపోవడం, ఆచరించడం, ఆచరించకపోవడం మాత్రమే ఉంటాయి.

  ReplyDelete
  Replies
  1. నచ్చిన అంశం నచ్చని అంశం అని నేనడిగాను తప్ప నమ్మాలా వదా అని కాదండీ. నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగతం.

   Delete
  2. అది దైవదత్తం అనిచెప్పుకొనేది కానీండి, ఇంకేదైనా కానీండి మానవుల అభిప్రాయాలకి విలువ ఉండాలి. ఉంటుంది కూడా. ఉంటుందికాబట్టే విమర్శలూ, డిఫెన్సులూ, చర్చలూ. నమ్మకంకన్నా అభిప్రాయం ముఖ్యమైనది. ఏవ్యక్తికైనా ఒకవిషయమ్మీద తప్పనిసరిగా నమ్మకం ఉండాల్సిన అవసరం ఏమీ ఉండదు. అలా నమ్మకం లేకపోతే దాన్ని incompetenceగానో, ignoranceగానో పరిగణించలేం. అభిప్రాయంకూడా తప్పనిసరికాకపోయినా, ఒక అభిప్రాయమంటూ లేకపోవడాన్ని విషయంపై అవగాహన లేకపోవడంగానే పరిగణించాల్సొస్తుంది.

   Delete
 2. భగవత్‌ గీతను ఒక వర్గం ప్రజలను అణచి ఉంచడం కోసం భారతీయ తత్వ శాస్త్రం పేరుతో అనేక ప్రక్షిప్తాలతో ఒక రచయిత కాకుండా అనేక రచయితల చే రాయించబడినది అని డి.డి.కోశాంబి లాంటి చరిత్ర కారులు చెపుతున్నారు దేశోద్దరణకు పూనుకున్న బాల గంగాదర తిలక్‌ గాందీ లాంటి ఆధునిక తత్వవేత్తలకు, కభీర్‌ లాంటి మత సంస్కరణ వాదులకు ఒక్కోక్కరి ఒక్కోవిధంగా కనపడిందని అలా కనపడటంలోనే దానికపటత్వం బయటపడిందని ఆయన రాస్తారు.ముఖ్యంగా వర్ణాశ్రమ ధర్మాలు ఇందులో భలంగా నోక్కి వక్కాణించబడిందని. అందులో శిరస్సునుండి బ్రాహ్మలు, భుజాలనుండి క్షత్రియులు, నాభినుండి వైశ్యులు పాదాలనుండు శూద్రులు పుట్టారని చెప్పే ఈ గీత సామాజిక గీతను నిర్ణయించడంలో ప్రధాన పాత్ర వహించిన భారతీయ సంస్కృతికి గొడ్డలి పెట్టు లాంటిదని నిస్సంకోశంగా చెప్ప వచ్చు.

  ReplyDelete
 3. Most people who fight over the gita and kuran have probably never read either book?!

  ReplyDelete
  Replies
  1. హరి బాబు గారు,
   1) భగవద్గీత తేలికగా అర్ధమయ్యేది గ్రాంధికం గాక వ్యాఖ్యానంగా ఉన్నవాటిలో మంచి బుక్ సూచించగలరా?
   2) భగవద్గీతలో మీకు నచ్చినవి లేదా నచ్చనివి లేవా?
   3) అలా అడగడం ఎలా fight అవుతుంది?
   4) మీకు నచ్చినవాటిని ఎందుకు నచ్చాయో వ్రాయండి. నచ్చని వాటినీ వ్రాయండి.
   5) నిజంగా గీతలో మంచి ఉంటే అది మీరు వివరించగలిగితే లేదా మీరభిప్రాయపడుతున్నట్లు చదివినవారు వివరించగలిగితే ఆ మంచి వల్ల వారూ మంచి నేర్చుకుంటారు కదా? కాదంటారా?
   6) ఇది ఏ విధంగానూ fight కాదని 100% పాజిటివ్ వైఖరి అని నేనటే మీరేమంటారు?

   Delete
 4. కొండలరావుగారూ,

  మీకు ఈ ప్రశ్న ఉంఛటంలో ఏ దురుద్దేశమూ లేదని నాకు తెలుసు. కాని భగవద్గీతను గురించి ఎక్కువ మందికి నచ్చినది మంచిదనీ, ఎక్కువమందికి నచ్చనిది చెడ్డదనీ అభిప్రాయపడటం సాధ్యపదదు. కాబట్టి ఆ విధంగా నా దృష్టిలో ఈ ప్రశ్న అసంగత్రమైనది. ఈ అభిప్రాయం మీకు నచ్చాలని పట్టుబట్టలేను.

  భగవద్గీత అనేది ఒక చర్చాంశంగా తీసుకోవటం ద్వారా దీనిపైన వివాదాస్పదమైన అభిప్రాయాలు కలవారికి వారి అభిప్రాయాలను హుందాగా వ్యక్తీకరంచుకుందుకు యెలా ఒక చక్కని వేదికను కల్పించటం అవుతున్నదో అలాగే వారిలో కొందరికి నిర్మొగమాటంగా దుర్వ్యాఖ్యలను చెసేందుకు సాదరంగా అహ్వానం పలకటం కూడా అవుతోంది. బ్లాగు చర్చల్లో అవేశకావేశాల పాలు ఎలా ఉంటోందో మీరు చూస్తున్నారు కదా? చర్చలో పాల్గొనేవారికి విషయపరిజ్ఞానం ఎంత ఉండాలీ అసలు అవసరమా అన్నదానిలో అభిప్రాయబేధాలు చూస్తున్నాను. దీనివలన మంచే జరుగుతున్నదని అనుకోలేకుండా ఉన్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇతరుల అభిప్రాయాలి వేరుగా ఉండవచ్చును.

  యథాప్రకారం మీరు ఒక మాట అనవచ్చును. నాకు తెలియని విషయాలను నేర్చుకుందుకు ఈ చర్చావేదికను ఆసరాగా తీసుకుంటున్నాను అని. కాని జనాభిప్రాయసేకరణల ద్వారా నేర్చుకోవటం అన్ని సందర్భాలలోనూ సరైన విధానం కాదు. ఉదాహరణకు ఈ ప్రశ్నకు జవాబు చెప్పేవారిలో అనేకులు భగవద్గీతలను అధ్యయనం చేయటం దేవుడెరుగు అసలు ఒకసారి ఐనా ఆమూలాగ్రంగా చదివిన వారు కూడా కాకపోయే అవకాశమే హెచ్చు.

  ఇప్పుడు మీరడిగిన ఈ ప్రశ్నకు భగవద్గీతతో అనుబంధం ఉన్నవారెవరూ జవాబు చెప్పరు. ఆ విషయం మీకు గ్యారంటీగా చెప్పగలను. అందుచేత, మీకు జవాబు చెప్పే వారికి భగవద్గీతతో యేమీ అనుబంధం లేనప్పుడు వారి జవాబుల్లోని విషయాలను మీరు ప్రామాణికాలుగా భావిస్తే నష్టపోయేది మీరే. ఈ చర్చను చదివి భవిష్యత్తులో మరికొందరు నష్టపోయే అవకాశం ఉందనీ అనిపిస్తోంది. ఐతే కొందరు ఈ చర్చవలన నిజానిజాలు నిగ్గుతేలి మంచే జరుగుతుందని వాదించవచ్చును కాని భగవద్గీతను తెలియని వారు చేసే నిర్ణయాలు ఇతరులను ప్రభావితం చేయటం మంచి యెలా అవుతుంది? కాదు కదా?

  భగవద్గీతతో అనుబంధం తల్లితో అనుబంధమే. 'అంబ త్వాం అనుసంధధామి, భగవద్గీతే, భవద్వేషిణీమ్' అని గీతా ధ్యానశ్లోకపాదం దీనికి ప్రమాణం.

  మీ అమ్మలో మీకు నచ్చిన అంశం యేది? మీ అమ్మలో మీకి నచ్చని అంశం యేది? అని ప్రశ్న వేస్తే ఎవరినైనా, జవాబు చెప్పవలసిన స్థానంలో ఉన్నవ్యక్తి తప్పకుండా మానసికంగా గ్లానికి గురియౌతాడు. అంతే కాదు చుట్టుప్రక్కలవారు ఎవరికితోచినట్లుగా, తన తల్లికేసి వేలుచూపి మాట్లాడితే, మరింతగా మానసికంగా గ్లానికి గురియౌతాడు.

  కాని ఈ ప్రశ్నను తొలగించమని నేను కోరటంలేదు. మీకేది ఉచితం అనిపిస్తే అది చేయండి.

  ReplyDelete
  Replies
  1. సారీ మాష్టారు నేనైతే దేనినీ తల్లితో పోల్చలేను.

   తల్లి అంత గొప్పతనం గీతకు ఉన్నదా? ఖచ్చితంగా లేదు. అమ్మ నిజం. గీత నమ్మకం మాత్రమే. నిజం వేరు నమ్మకం వేరు. అమ్మ భౌతికంగా సకల సేవలూ చేస్తుంది. గీత లాంటివి కొందరికి మాత్రమే మానసిక స్వాంతనను ఇస్తుంది. కొన్ని విషయాలలో అందరికీ కూడా నప్పెలా ఉండవచ్చు. అది గీతలోనే కాక ఇతర గ్రంధాలలో కూడా ఉండవచ్చు.

   ఎట్టి పరిస్తితులలోను నేను గీతను అవమానించే ఉద్దేశంతో ఈ పోస్టు పెట్టలేదు. అదే సందర్భంలో మితిమీరిన భావావేశంతో (అది పాజిటివ్ గావచ్చు , నెగెటివ్ కావచ్చు ) ఉండేవారుంటారని అసలు చర్చే పెట్టకుండా ఉండనూ లేము. ( ఈ వ్యాఖ్య ఏ ఒక్కరినో ప్రత్యేకంగా ఉద్దేశించి చేసింది కాదని వినతి)

   గీతలో వివిధ వ్యక్తులు ( కులాలు ) దేవుని వివిధ స్థానాలనుండి ఉద్భవించారని చెప్పారా? లేదా? చెపితే దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? మీరు దానిని నమ్ముతారా? నేనలా చెప్తే తప్పని అంటాను. ఆ చెప్పినవాడు దేవుడే అయినా వాడు దిగి వచ్చినా తప్పెందుకు చెప్తున్నవని ప్రశ్నిస్తాను? ఎలా, అలా పుట్టారో నిరూపించమని నిలదీస్తాను.

   ఏ అమ్మా అలా చెప్పదు? అలా ఫలానాచోట చెప్పారని చెప్తుందేమోగానీ, అలా చూసినట్లైతే చెప్పదు. ఫలానాది ఫలానావారు మాత్రమే చర్చించాలనేది తప్పు. చర్చించకూడని పద్దతి అంటే అది ఇతరులను కించపరచడం కాకుండా ఉండడమే తప్ప ఎంత తప్పుగా ( విషయపరంగా ) వాదించినా తప్పు లేదు. ఎందుకంటే చర్చించినప్పుడే తెలియంది తెలుస్తుంది. అసలు చర్చే లేకుంటే ఏదీ తెలీదు. భగవద్గీత ఏ కొందరిదో అయితే దానిని కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు ప్రామాణికంగా ఎందుకు వాడతారు ( తప్పనిసరి కాకున్నా అదో సాంప్రదాయం)

   సమాజంలో ఏ భావజాలాన్నైనా చర్చించే భావ ప్రకటన మన రాజ్యాంగం మనకు ఇవ్వలేదంటారా? ఇక సర్వం తెలిసినవారు ఎవరూ ఎప్పటికీ ఉండరనేదే నా అభిప్రాయం.

   మీరు చెప్పేదాని ప్రకారం అయితే ప్రతి ఒక్కటీ కొందరికి అమ్మలా భావించేలా ఉంటుంది. కనుక ఏదీ చర్చించ కూడదు. కనుక నేను మీ అభిప్రాయంతో ఏకీభవించలేను. అలా అని మీ అభిప్రాయాన్ని కించపరచను కూడా.గీతపై మీకున్న భావొద్వేగానికి తార్కాణంగ చాలా పాజిటివ్‌గా స్పోర్టివ్ గా తీసుకోగలను. కానీ మీరున్నట్లే నేనుండలేకపోవచ్చు. దానికి మనమిద్దరం విడిపోవాల్సిన పనిలేదు. ఇది మనిద్దరి కోసం చెప్పడం లేదు. ఏ ఇద్దరికైనా ఇది వర్తించాలని బ్లాగులలో మీరంటున్న గోల తగ్గడానికి ఉపయోగ్పడౌతుందని చెప్తున్నాను.

   గీతలో చాలా పాజిటివ్ అంశాలున్నాయి. వాటిని పాజిటివ్ గా తీసుకోవడం వరకే చేయాలనేది నా అభిప్రాయం. ఉదాహరణకు కర్మలను ఆచరిచుట గురించి. దాని ప్రకారమైనా నా కర్మ నేను చేస్తున్నాను. ఫలితం అతడే చూడాలిగా మరి. అలాగే గుణము లేనిదైనా స్వధర్మమే మేలన్నాడు గీతలో.

   ప్రజ అనేది స్వధర్మమే. నేను ఖచ్చితంగా స్వధర్మమ ప్రకారమే గీత గురించి చర్చ పెట్టాను. ఇందులో తప్పులు తేల్చితే తప్పని ఒప్పుకుందాం. ఒప్పును తేల్చితే ఒప్పని ఒప్పుకుందాం. సందేహంగా ఉన్నవాటిని ఎవరిష్టప్రాకారం వారo నడచుకుందాం.

   మీరన్నట్లు అమ్మతో పోల్చుకున్నా ( ఒక వేళ ) అమ్మ కూడా తప్పులు చేస్తుంది. అలా అని అమ్మనే వదులుకోలేము. అమ్మ తప్పులని సరిచేస్తే కూడా మంచిదే. ఉదాహరణకు అమ్మ పాము మంత్రం వేదామంటే చదువుకున్న కొడుకు పాము కరిస్తే ఆంటీ స్నేక్ డోస్ ఇవ్వాలి. పాము కరిచింది అమ్మనైనా మననైనా సరే.

   ఏమైనా భావ లేదా అక్షరదోషాలు ఉంటే మీరే సరిచేసి అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి. కామెంటులో పాజిటివ్ వైఖరినే తీసుకోండి భాషలో ఏమన్నా కాఠిన్యం ఉంటే ఇక్కడే మందలించినా మెయిల్ చేసినా నాకు అభ్యంతరం లేదు. నా భావం అర్ధమైతే చాలు.

   Delete
  2. కొండలరావుగారు,

   గీతను మాతృస్థానం ఇచ్చి గౌరవించటం నా భావోద్వేగానికి సంబంధింభినది. ఒప్పుకుందుకు నాకేమీ భేషజం లేదు. ఐతే అదే సందర్భంలో ఈ దేశపు ప్రజానీకానికి భగవద్గీతతో తరతరాలుగా అటువంటి భావోద్వేగమే ఉందని కూడా ఒకసారి అవసరమైతే గుర్తుచేసుకుందాం మనం.

   అన్ని మతగ్రంథాలలోనూ మనం వెదకదలుచుకుంటే ఏదో ఒకరకమైన వివాదాస్పదమైన అంశాలూ వాక్యాలు దర్శనం ఇచ్చే అవకాశం ఉంది.

   ఐతే, భగవద్గీతమీద మీరు ఈ ప్రశ్న అడగటం వెనుక ఏ దురుద్దేశమూ లేదని నాకు తెలుసినా ఒక్క ముక్క అడుగుతాను. ఇతర మతగ్రంథాలకు సంబంధించి ఇటువంటి ప్రశ్నలు వేయగల అవకాశం ఉన్నదా? ఉంటే మనదేశంలో అటువంటి పరిస్థితి ఉన్నదా? నాకు తెలిసి మనదేశంలో మైనారిటీ మతస్థుల భావోద్వేగాలకు ఎంత ఉదారంగ మన సెక్యులరిష్టువ్యవస్థ స్పందించి సానుభూతితో ప్రవర్తిస్తుందో అదేవిధంగా సనాతనధర్మానికి సంబంధించిన భావోద్వేగాలను అంతే సానుకూలంగా పరిశీలిస్తున్నదా? లేదు కదా?

   భగవద్గీతల విషయానికి వస్తే మనం వాటిని అధ్యయనం చేయకుండానే విమర్శకు దిగుతున్నాం కదా ఇప్పుడు, అలాగే యితరమతస్థుల సద్గ్రంథాలనూ ఏమీ తెలియకుండానే ప్రశ్నించటం చేయకలరా? అలా చేస్తే ఎటువంటి జవాబులు అభ్యంతరాలు వస్తాయి?

   నేను భావోద్వేగంతో స్పందించిన దాని కంటే మీరు ఎక్కువగా కదిలినట్లు అనిపిస్తోంది. ఆ అవసరం లేదు. మీకు తోచిన చర్చ చేయకుండా అక్షేపణ చేయటం లేదు. కేవలం సనాతనధర్మాన్ని మాత్రమే లక్ష్యం చేసుకొని ఇటువంటి చర్చలు లేస్తూ ఉంటాయా అని ఆశ్యర్యపడుతున్నాను. అంతే.

   భగవద్గీతపైన వ్యాఖ్యానించేంతగా నా సాధన పరిపక్వం కాలేదు. కాబట్టి వ్రాయను.

   Delete
  3. మంచి ప్రశ్న శ్యామలరావు గారు. నాకు హిందూ మతం గురించే ఎక్కువగా తెలుసు. నచ్చినవీ,నచ్చనివీ హిందూ మతంలోనివే ఉంటాయి. హిందువుగా పెరిగాను కాబట్టి. తిరుపతిలో అన్యమత ప్రచారం వెనుక కుట్ర ఉందా? అని నేనే కదా ప్రశ్నించినది? దళితులని దేవాలయాలలోకి రానివ్వకపోతేనే వారికి కొత్తదేవుడొచ్చి దేవుని బిడ్డలయ్యారన్నది నేనే కదా? ఎవరో కుహనా లౌకికులుగా ఉండి వున్నదానిని మనం చర్చించలేము.

   నిన్న గీత జయంతి దినం. మీరన్నట్లే సమాజంపై ప్రభావం ఉంది కనుక పాజిటివ్ నెగిటివ్ చర్చలు దేశ విదేశాలలో జరుగుతుంటాయి కనుక నెగిటివ్ గురించి ఎవరైనా పాజిటివ్ గా చెపితే వాటిజోలికి పోకుండా ఉండడానికి పనికి వస్తాయి. పాజిటివ్ అంశాలను ఎలాగూ ఎక్కడైనా ఉపయోగించవచ్చు అనేదే ఈ ప్రశ్న గోల్. ఇంకా చెప్పాలంటే గీతను ఎంతమేరకు పాజిటివ్‌గా తీసుకోవచ్చు అంటే ఇంకా బాగుంటుందేమో?

   ఇతర మత గ్రంధాలను గురించి ఇలాంటి ప్రశ్నలు వేయగల అవకాశం ఎందుకు లేదు? హిందూ మతం కన్నా అవేమన్నా గొప్పగా ఉంటే వేయకుండా ఉండవచ్చు? ఎవరైనా వేస్తే నేను పబ్లిష్ చేస్తాను. అయితే ఈ ప్రశ్నకున్న కండీషన్ పరిమితులే దానికీ ఉంటాయి. మతం వేరు. మతోన్మాదం వేరు. మతంలోని మంచి,చెడు వేరు. అది మతమైనా - మార్క్సిజమైనా - గాంధీ గిరి అయినా మరేదైనా మంచిని స్వీకరించి చెడుని వదిలేయడమే మనం చేయాల్సినదని నా అభిప్రాయం.

   భగవద్గీతలో నచ్చినది ఏది? నచ్చనిది ఏది? అంటే మొత్తం చదివే చెప్పాలని ఎందుకనుకుంటున్నారు మీరు? తెలిసినదాని వరకూ అది నచ్చితే నచ్చిందని ఎందుకు చెప్పకూడదు? ఉదాహరణకు 'కర్మలను ఆచరించుటయనే నీకధికారము కలదు కానీ కర్మ ఫలమునందు కాదు అట్లని నీవు కర్మలను చేయుట మానరాదు ' అని చెప్పింది నాకు బాగా నచ్చింది. అలాగే గుణములేనిదైనా స్వధర్మమే మేలు.... ఇలా చాలా ఉన్నాయి. అన్నీ అంతా చదివే అంత పరిపూర్ణులమయ్యే చర్చిస్తున్నామా? నిజంగా చెప్పండి? అలా సంపూర్ణంగా చర్చించాలి అన్నది నిజమే అయితే నావరకూ ఇక్కడ ఒక్క ప్రశ్న కూడా అడిగే అర్హత లేదనే చెప్తాను. తెలియంది తెలుసుకోవడం చర్చ ఎందుకు కాకూడదు? చర్చ అంటే తెలియంది తెలుసుకోవడం - తెలిసింది తెలియజెప్పడం అనుకుంటాను ఎందులో అయినా. గీతకూ అదే వర్తిస్తుంది.

   ముస్లింలలో తలాక్ విడాకులు, బురఖాలు నాకు నచ్చవు. వారి నమజ్ వద్ద ఉండే వజ్రాసనం నచ్చుతుంది. వారు గడ్డం పెంచుకునే పద్ధతి, వస్త్రధారణ నచ్చవు అందుకే నేను అలా వస్త్రధారణ చేసుకోను. అది నా ఇష్టానికి సంబంధించినది. అతి వ్యక్తిగతం కాబట్టి విమర్శిస్తే మూర్ఖత్వం అవుతుంది. కానీ తలాక్ విధానం, బురఖా విధానంలో అణచివేత లేదా మానవ హక్కులు ఇమిడి ఉంటాయి కనుక చర్చించకుండా మతం జోలికి పోగూడదు - భావోద్వేగాలు అంటూ నోరు మూసుకు కూర్చోవడం తప్పని అది మన గీత ప్రకారం స్వధర్మం ప్రకారం కర్మలను ఆచరించకపోవడమని నేనన్వయించుకుంటాను. ఇస్లాముఓ వడ్డీ తప్పు అనేది నచ్చుతుంది. వ్యాపారాన్ని అంగీకరిస్తుంది. అది ఎలాగూ నచ్చదు.

   ఇక భూమి బల్లపరుపుగా ఉందని దేవుని బిడ్డలు అయిన క్రీస్తు సువార్తికులు చెపితే అయ్యో!ప్రపంపంచంలోని అతి పెద్ద దైవ గ్రంధం చెప్పిందని అంగీకరించాలా? లేదే? భూమి గుండ్రంగా ఉందనీ సూర్య చంద్ర గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయో సైన్స్ చెప్పిందే పాఠాలుగా చెప్తారు తప్ప మతగ్రంధాలు చెప్పే అశాస్త్రీయం గురించి కాదు. గ్రహణాలు పంచాంగం వంటివి హిందువులు చెప్పేవీ నాకు నచ్చవు.

   సెక్యులరిజం అంటే ఏ పార్టీ అయితే ఏ మతాన్నీ ఎక్కడా దొంగాటకం (కుహనా లౌకికవాదం) గా కూడా ఓటుబేంకు రాజకీయాల కోసం వాడుకోదో అంత దమ్ముగా వ్యవహరిస్తుందో దానిని లౌకికవాదం అనాలి. నాకు తెలిసి ఎక్కువ,తక్కువలున్నాయేమో అందరూ ఇందులో సిద్ధహస్తులే. కేవలం BJP మాత్రమే మతోన్మాద పార్టీ అంటే అంగీకరించను. మతం పేరుతోనే పార్టీలు పెట్టుకుంటే అది లౌకికవాదం ఎలా అవుతుంది?

   సనాతన ధర్మాలలో ఎన్నోవాటిపై ముఖ్యంగా భారతీయ ఋషి సంస్కృతి, ప్రకృతి ఆరాధన, కుటుంబ వ్యవస్థలోని అంశాలపై పాజిటివ్ అభిప్రాయాలున్నాయి. అదే సందర్భంలో సతి, బాల్య వివాహం, ఇతర చాలా దురాచారాలపై వ్యతిరేకతా ఉన్నది.

   మీరు ఆక్షేపిస్తారని నేననుకోను. మీతో వాదిస్తే విషయాలు తెలుస్తాయి. అదే సందర్భంలో సహజంగానే కొన్ని విభేదాలూ ఉంటాయి.

   Delete
  4. @శ్యామలీయం:

   మాస్టారూ ఇతర మతాల గ్రంధాలు/ఆచారాలు/కట్టుబాట్లు గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకొంచం పెరిగితే మంచిదే కానీ అసలు ప్రశ్న వేసే అవకాశమే లేదనుకోలేము.

   కొండల రావు గారు చెప్పిన ఉదాహరణలే కాక ఇంకా ఎన్నో ఉన్నాయి. ఉ. రహమతుల్లా గారి బ్లాగులో నమాజ్ అరబ్బీలో వద్దు తెలుగులో చదవొచ్చన్న టపాపై ఆసక్తికరమయిన చర్చ జరిగింది. నేను అనేక తడవలు హజ్ సబ్సిడీ వ్యతిరేకించాను. హిందూ ధర్మ రక్షణకు కంకణం కట్టుకున్న బ్లాగులలో చర్చలు ఎన్నో. ఇంకొందరు ఇంకో అడుగు ముందు కేసి ప్రజలోనే ఇబ్న్ వార్రాక్ రాసిన నేను ముస్లిమును ఎందుకు కాను (Why I am not a Muslim) పుస్తకం ప్రస్తావన తెచ్చారు.

   గీత క్షుణ్ణంగా సాధన చేసాకే రాస్తాను అన్నారు. అదేమాట ఇతర మతాల గురించి అంటే మనం ఒప్పుకోవాలా?

   Delete
  5. కొండలరావు గారు, మీరు కొంచెం గీత,కొంచెం కారల్ మార్క్స్,ఇతర మతగ్రంథాలు కలగలిపి అర్థంచేసుకొంట్టు అనవసరం గా గందరగోళం లో చిక్కుకొంట్టున్నారేమో అని పిస్తున్నాది.మీరు రాజకీయ,ఆర్ధిక కోణాల్లో విశ్లేషణ చేయాలనుకొంటే వాటిని మాత్రమే చేయండి. ఆధ్యాత్మిక జ్ణానం తో ముడిపెడితే లాభం లేదు. ఆధ్యాత్మిక పుస్తకాలను చదివితే డబ్బులు రావు. అది సోషల్ సైన్స్ అంతకన్నా కాదు. హిందూ మత గ్రంథాలు మీ రోజువారి వ్యవహారిక జీవితాన్ని ప్రభావితం చేయటంలేదు. పాకిస్థాన్ లో లాగా, మనదేశంలో ఉన్న చట్టం హిందూ మతగ్రంథ నియమాలతో రూపొందించింది కాదు.ఇక ఏ గ్రంథాలనైనా ఎక్కువగా చదివేకొద్ది వాదనా పటిమ పెరగటం తప్పించి, వ్యక్తిగతంగా పెద్ద మేలు జరగదు. పుస్తకాలను చదివి అర్థం చేసుకోవటంతోనే జీవితం అయిపోతుంది. ఆ గ్రంథాల మొత్తం సారాంశాన్ని మాహాభారతం లో భీష్ముడు, నీకు ఇతరులు ఎదీ చేస్తే బాధ కలుగుతుందో, దానిని నువ్వు ఇతరులకు చేయకు అని ఒక్క ముక్కలో చెప్పాడు. ఇంకా మీరు జీవితంలో పైకి ఎదగాలనుకొంటే ఇచ్చి న మాట మీద నిలబడితే చాలు. ఒకవేళ మీకు హిందూమతం లో ఏముంది? ఇస్లాం,క్రైస్తవ మతగ్రంథాలలో ఏముంది అని కంపేరిటివ్ స్టడి చేయాలనుకొంటే, కొంటే అది మీ ఇష్టం. మీరడగక పోయినా,నాకు రాయలని పించింది,ఎమనుకోకండి.

   Delete
  6. శ్రీ రాం గారు, నేనేమీ అనుకోను.నన్నేదో అనుకుని ఈ కామెంట్ చేశారని అనుకుంటున్నాను :)) మీరు నా ప్రశ్నను జాగ్రత్తగా గమనిస్తే, నేను చాలావరకు ఈ కామెంట్ లో చెప్పిన సారాంశం ప్రకారమే ఉన్నానని అవగతం అవుతుందనుకుంటున్నాను.

   గీత మొత్తం చదవకుండా గీతను తెలుసుకోకూడదా? అయితే చాలా తక్కువమందే అందుకు అర్హులవుతారేమో. గీతలో విడి విడి అంశాలుగా విషయాలు అర్ధం కావా? అయితే మీకు పాజిటివ్ అంశాలే కనపడడం లేదా? కనపడితే వాటిని చెప్పవచ్చు. లేదా ఆర్టికల్ గా వ్రాసి పంపితే పల్లెప్రపంచం పోర్టల్ లో జన విజయం లో పబ్లిష్ చేస్తాను. ఇక్కడ గోల్ ఎందులో అయినా మంచిని స్వీకరించడమే.ఏ గ్రంధాన్నైనా ఎక్కువ చదవవొద్దన్న మీ సూచన ప్రకారం కూడా ఎక్కడ మంచి ముక్క ఉన్నా తీసుకుందాం. అది ఎక్కడనుండైనా, ఎవరినుండైనా.

   నాకే మతంపైనా ద్వేషం లేదు. నాపై హిందూ మతం ప్రభావం తప్పక ఉంటుంది. ఇతర మతాల గురించి పెద్దగా తెలీదు. నేను హిందూ మతం లో పెరిగాను కాబట్టి పూజలు, పండగలు , కథలు , సినిమాలు , కొన్ని చర్చల ద్వారా కొంతమేరకు మాత్రమే హిందూ మతం గురించి తెలుసు.

   నేను కొంత కాలం రాముడికి భక్తుడిగా ఉన్నాను. నేను కారల్ మార్క్స్ కు భక్తుడిగా ఎపుడూ లేను. కానీ మార్క్సిజాన్ని పాజిటివ్ గా అధ్యయనం చేస్తే చాలా మంచి విషయాలున్నాయి. నాకు మార్క్సిజమూ సంపూర్ణంగా తెలీదు. తెలిసినవాటిలో కొన్ని తిరుగులేకుండా నచ్చినవి ఉన్నాయి. కొన్ని నచ్చనివి ఉన్నాయి.

   అన్నీ సంపూర్ణంగా తెలిస్తేనే వాదించాలనే దానికి నేను వ్యతిరేకం. తెలిసినమేరకు వాదిస్తాను. తెలియనిదానిని తెలియదని చెప్తాను. ఎందులోనైనా మంచిని స్వీకరించలేక పోవడమే అసలు గందరగోళానికి కారణం అని నా అభిప్రాయం. అన్నీ తెలిసాకే వాదించాలంటే నా జీవితకాలం తెలుసుకోవడానికే సరిపోతుంది. నాకు తెలీనిదానిని తెలిసినట్లు ఎక్కడా వాదించను. నాకు తెలిసింది తప్పైనా వాదిస్తాను. వాదనలో తప్పు తెలిస్తే తెలుసుకుంటాను. ఇందులో తప్పులేదని నా అభిప్రాయం.

   మీరన్నదానిలో అన్నింటినీ కలిపి గందరగోళం చేయడం కానీ నేను గందరగోళం పడడం కానీ అసలు లేదు. నాకు కావలసినది ఎక్కడ ఉన్నా తీసుకుంటాను. అలా తీసుకోకుండా కొందరు ఒకదానికి ఎడిక్ట్ అయి ఆ మూసనుండి బయటకు రాలేక తమ పక్కన ఉన్నవారు ఏమనుకుంటారోననే ఒకరకమైన భయంతో అవే వాదిస్తారు. నాకు హిందూ మతంలో నచ్చినవి చెప్పేటప్పుడు కొందరికి నచ్చుతాను. నచ్చనివి చెప్పేటప్పుడు కొందరికి నచ్చకపోవచ్చు. అలాగే అన్నివిషయాల పట్లకూడా. ఇక్కడ నేను మారేదేమీ లేదు. ఏ ఒక్క ఇజాన్నో మూఢంగా సాగిలపడి భక్తుడిగా వాదించడం నాకిష్టముండదు. ఒకవేళ ఇది తప్పని అనిపిస్తే అప్పుడాలోచిస్తాను.

   నాకు కావలసినది పల్లెల సమూహంగా ఉండే ఒకే కుటుంబం - ఒకే ప్రపంచం. ఇది వివరించడానికి వేరే పోస్టు వ్రాస్తాను. నాకు కావలసింది ఏ ఇజంలో ఉంటే ఆ అంశంలో ఆ ఇజాన్ని సమర్ధిస్తాను. ఆ అంశాన్ని నేర్చుకుంటాను. వాడుకుంటాను. అంతే.

   పాకిస్తాన్ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకెందుకు చెప్తున్నారో అర్ధం కాలేదు. భీష్ముడేమి చెప్పాడో నాకు తెలీదు గానీ నేను మాత్రం ఎవరికీ ఇబ్బంది చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. సమాజానికి ఇబ్బంది కలిగించే అంశాలపట్ల బాగున్నదానిని బాగుందని అన్నట్లే, బాగోలేని దానిని బాగోలేదని అనాలని అనుకుంటాను. బాగోలేదనిపించిన దానిపై నాకు చేతనైన పోరాటం చేస్తాను. అలా చేసేవారికి వీలయినంత మద్దతిస్తాను. బాగున్నది ఎక్కడున్నా స్వీకరిస్తాను. ప్రచారం చేస్తాను. వీలయినంత సహాయం చేస్తాను.

   ఆధ్యాత్మికత అంటే మతపరమైనదే అని నేననుకోవడం లేదు. ఆత్మ పరమైనదని అనుకుంటున్నాను. ఆత్మ అంటే అది మనలో ఉండే మనసు అని అభిప్రాయపడుతున్నాను. ఆధ్యాత్మికత గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను.

   Delete
  7. లెఫ్టిస్ట్ ల లో పాలగుమ్మి సాయినాథ్, బాలగోపాల్ అంటే గౌరవం.

   Delete
  8. వీరిద్దరంటే నాకూ ఇష్టమే. సాయినాధ్ గారు గ్రామీణులపైనా, వ్యవసాయం పైనా ఎక్కువ శ్రద్ద కనబరుస్తారు. జర్నలిస్టులు పట్టించుకోవలసిన అసలైన సమస్యలు ఆయనను చూసి నేర్చుకోవాలని అనిపిస్తుంది నాకైతే. బాలగోపాల్ చెప్పిన మానవ ప్రవృత్తిని గురించి అర్ధం చేసుకోవాలి. దీనిని మార్క్సిష్టులు అంగీకరించరు. పరిస్తితులే మనిషి మనసుని నిర్ణయిస్తాయంటారు. మార్క్సిజంలో ఖాళీలు లేవంటారు. బాలగోపాల్ మరింత వివరంగా చెప్పి ఉంటే ఏమైనా ప్రయోజనం ఉండేదేమో. ఆయన చెప్పినవన్నీ అంతక్రితం చర్చించినవే అంటారు. బాలగోపాల్ వ్యక్తిత్వం ఆలోచనలు మూసధోరణికి విరుద్ధంగా కనిపిస్తాయి. ఆయనపై గౌరవం ఉన్నా ఆయన చెప్పినవాటిపై విశ్లేషించేంత శక్తి నాకు లేదు.

   Delete
 5. శ్యామలీయం మాస్టారు గీతను తల్లితో పోల్చడం వదిలేస్తే, వారి వ్యాఖ్యలో ఎంతో నేర్చుకోవాలి. మత గ్రందాల విలువను అభిప్రాయ సేకరణతో కొలవలేమన్నది 100% వాస్తవం. అలాగే వాటి గురించి లేదా నిష్ణాతులు రాసిన సమీక్షలను సొంతంగా అధ్యయనం చేసిన వారు చెప్పిన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నది కూడా చక్కటి ఆలోచన. (వారికి ఆ గ్రంధంపై ఉండే భక్తి భావన వల్ల కలిగిన బయాస్ ఉంటె దాన్ని neutralize చేసే మార్గాలు ఉన్నాయి).

  కొండలరావు గారి ప్రశ్నలో తికమక ఉందని నా అభిప్రాయం. ప్రశ్నను divergent గా లేవనెత్తడం అసంబద్ద వ్యాఖ్యలకు ఆహ్వానం. ఇది వారికి కాస్త ఎక్కువగానే అలవాటు అయ్యిందని నాకు అనిపిస్తుంది.

  ఉ. గీత ఉద్దేశ్యం & సామాజిక కోణాలు ప్రశ్న పరిధిలో వస్తాయా? రావని అనుకుంటే ఆ మాట స్పష్టంగా చెబితే బాగుండేది.

  అలాగే చాతుర్వర్ణ ఆశ్రమం గీత నుండి వచ్చిందా లేక వేరేగానా అని తెలుసుకోవాలంటే ప్రశ్న ఆ దిశగా వేయొచ్చు.

  కొండల రావు గారి అన్వేషణా స్పూర్తి పూర్తిగా మెచ్చుకుంటూనే ప్రశ్నలు targeted గా వేస్తె జవాబులు సరిగ్గా దొరుకుతాయని చెప్పడమే నా ఉద్దేశ్యం. నేను ఎవరినీ తప్పు పట్టలేదని గ్రహించండి.

  ReplyDelete
  Replies
  1. నేను భగవద్గీతపై అభిప్రాయం అడగలేదు జై గారు, నచ్చినవి - నచ్చనివి అడిగాను.

   గీతపై నేనడిగిన దానికి వారి అభిప్రాయాలు సకారణంగా చెప్పమన్నాను కించపరచేలా, లేదా ద్వేషంతో వద్దనే చెప్పాను. అంటే అది విన్నవారో, చదివినవారో వారు విన్నంత వరకూ అభిప్రాయం చెప్పవచ్చు. నచ్చనివారు ఇక్కడ పైన కొందరు చెప్పినట్లు చెపితే తప్పేంటి? అంటే వివిధ కులాల వారు దేవుని శరీరంలోని ఫలానా భాగం నుండి వచ్చారనేది తప్పని తిరుపాలు గారు చెప్పారు. అలా చెపితే తప్పేంటి? అందులో తప్పుంటే మీరన్నది తప్పని చెప్పొచ్చు. అలా గీతలో చెప్పలేదని చెప్పవచ్చు. అది ఉన్నది గీతలో కాదని తేల్చవచ్చు. అప్పుడలా అభిప్రాయపడేవారికి అది ఎలా తప్పో తెలుస్తుంది.

   ఒకవేళ గీతలో అలా ఉంటే దానిని సమర్ధించదలచుకుంటే అదీ ఎలానో చెప్పవచ్చు. వ్యతిరేకించేవారూ చెప్తారు. అలాగే భగవద్గీత పూర్తిగా పనికి రానిదని చెప్పక్కర్లేదు. అందులో పాజిటివ్ అంశాలను తీసుకోవచ్చు. అది వ్రాయబడిన కాలమాన పరిస్తితులను తీసుకుని ఎవరికి వారు కొన్ని అభిప్రాయాలు చెప్పవచ్చు. ఇక్కడ మనం చెప్పేది సాధికారికం కాదు. కేవలం ద్వేషఒతో భగవద్గీతపై అక్కసు వెళ్ళగక్కితే ముమ్మాటికీ తప్పు.

   అదే సందర్భంలో గీతతో సహా ఏ మత గ్రంధంలో తప్పునైనా ఎత్తి చూపవచ్చు. పాజిటివ్ అంశాలను గ్రహించవచ్చు. నేను నా వివరణలో అదే చెప్పాను.

   ఇక అమ్మ విషయం నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. కనిపించని దేవుడికంటే కని పెంచిన అమ్మే గొప్పదనే భావోద్వేగం లేదా వాస్తవిక ధృక్పథాన్నే నేను ఇష్టపడతాను. అది తప్పని నేననుకోవడం లేదు. సరే, అది పక్కన బెడదాము.

   అన్వేషణా స్పూర్తిని అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదములు. ప్రశ్నలుంచే విధానం పై మీ విమర్శ నాకర్ధం కాలేదు. మీకు వీలున్నప్పుడు ఉదాహరణలతో మరింత వివరంగా మెయిల్ చేయగలరు. తప్పకుండా స్వీకరిస్తాను. ఇప్పుడీ పోస్టుని రీ పబ్లిష్ చేసినప్పుడు కూడా గతంలో లేని వివరణ క్రింద ఇచ్చినది కొత్తగా యాడ్ చేశాను. అది మీరు సూచించినదే. రాను రాను ప్రశ్నల పద్ధతిలో తప్పక మార్పులు చేద్దాం. కానీ అవేమిటో కాస్త వివరంగా ఎవరు మెయిల్ చేసి చెప్పినా స్వీకరిస్తాను.

   చాతుర్వర్ణ వ్యవస్థ గురించి తిరుపాలు గారు అడిగినదానిని నేను ఉదాహరణగా మాత్రమే శ్యాంలీయం గారిని ప్రశ్నగా ప్రస్థావించాను. అది ఉదాహరణ మాత్రమే. నేను కావాలని అడిగింది కాదు. శ్యామలీయంగారినుండి సమాధానం రాబట్టడానికే అలా అడిగాను.

   Delete
  2. కొండలరావు గారూ, మీ పాజిటివ్ మనస్తత్వం తెలుసు కనుకే కొంచెం ధైర్యం చేసాను. కాకపొతే నా సూచన సరిగ్గా చెప్పలేకపోయానని నాకే అనిపిస్తుంది.

   ఉదాహరణలు ఉపయోగపడే రీతిలో ఇప్పటికి ఇప్పుడే ఇవ్వలేకపోతున్నాను. నా సలహాను కొంత విపులీకరించి కొన్ని ఉదాహరణలు ఇస్తాను. అవి అంతగా సరిపోకపోవోచ్చు కానీ కొంతయినా ప్రయోజనం ఉండొచ్చు.

   ఒక వాక్యంలో అనేక పదాలు ఉంటాయి. వెరసి ఒక ప్రశ్నకు 7-8 కోణాలు రావొచ్చు అనుకుందాం. ఈ 7-8 లో ప్రతి దాని నుండి చెరో 7-8 దృక్పథాలు ఏర్పడితే అతిత్వరలో చర్చ పట్టు దాటుతుంది. ఈ తరహా చర్చను divergent approach లేదా open ended debate అంటారు.

   దీనికి పూర్తిగా భిన్నంగా ఉండే అప్రోచులో 1-2 కోణాలు మాత్రమె ఉంటాయి ప్రతిదానికీ మళ్ళీ 1-2 మాత్రమె సాధ్యం. ఒకరకంగా చెప్పాలంటే ఇది మల్టిపుల్ చాయిస్ కంటే కొద్దిగా స్వేచ్చ ఇస్తుంది కానీ అంత గట్టి కంట్రోల్ ఉండదు. దీన్ని convergent approach లేదా closed ended questions అనవచ్చు.

   అవసరాన్ని బట్టి రెండూ ఉపయోగకరమే. అలాగే ప్రతి చర్చ స్త్రిక్తుగా ఏదో ఒక పద్దతిలో కాక మధ్యేమార్గంలో ఉంటుంది.

   ఇంటర్వ్యూలలో "మీ బలహీనతలు ఏమిటి" అని అడుగుతూ ఉంటారు. ఇది మొదటి తరహా ప్రశ్న.

   రెండో తరహా ప్రశ్న ఉ. ఇంటర్వ్యూలో "మీకు జావా భాషలో పర్యాటక వెబ్ సైటు రాసిన అనుభవం ఉందా". దీంట్లో కూడా ఆసక్తికరమయిన విషయాలు బయటపడతాయి కానీ ఎక్కువ కంట్రోల్ వస్తుంది.

   Delete
  3. జై గారు, మొదట్లో మీపై నాకు సరయిన అభిప్రాయం ఉండకపోయేది :)) కానీ కొన్నాళ్లు చర్చలలో గమనించాక నా అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను. మీరు పాజిటివ్ గానే చెప్తారని నాకు నమ్మకముంది.ఇప్పుడు మీరు చెప్పినదీ నాకు అర్ధం కాలేదు. నేను గతంలో "ప్రశ్న - చర్చ - వాదనలు - నిర్ధారణ" ఈ ప్రాసెస్ ఎలా జరగాలి? అని ప్రశ్నిస్తే ఒక్క కామెంటూ రాలేదు. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు నిర్మోహమాటంగా వివరంగా నాకు మెయిల్ చేయగలరు. అందులో నాకు అర్ధం కానివి ఉంటే మళ్లీ మళ్లీ అడుగుతాను దయచేసి ఏమీ అనుకోవద్దు. దీనిని ఇంత వివరంగా ఎందుకు అడుగుతున్నానంటే ప్రశ్న + చర్చ పద్ధతిలో నాకూ అసంతృప్తులు చాలా చాలా ఉన్నాయి. మీరు నాకు మెయిల్ చేయగలరు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడే ప్రజ కోసం కాస్త సమయం కేటాయించగలరు. ధన్యవాదములు.

   Delete
  4. భగవద్గీత గురించి ముందుగా చెప్పాల్సింది - అది వేదాలూ,వుపనిషత్తులూ ఇంకా హిందూ ధర్మ ప్రబోధం లోని అతి ముఖ్యమయిన విషయాలన్నింతినీ మరోసారి సారాంశంగా చెప్పిన కంపైలేషన్.అన్న్నింటినీ ఒకచోత చేర్చేతప్పుదు సహజంగా వుత్తమమైనవాతినే కూరుస్తారు, నచ్చ్చకపోవదం అంతూ వుండదు.

   1.అది మరీ సాగతీత ధొరణిలో వుండకుందా క్లుప్తంగా విషయాన్ని చెప్పి వూరుకుంటుంది.వాడింది అనుష్టుప్ చందస్సు,పైగా కవిత్వీకరించబడింది.జన్మలూ పునర్జ్మలూ అనేసరికి అవి యెలా జరుగుతాయి అనే సందేహం పీడించే వారికి ఒక మనిషి చిరిగిన దుస్తుల్ని విసర్జించేసి నూతన దేహాల్ని ధరించదం అనే పోలికతో మళ్ళీ వాదించే పని లేకుందా చేసింది!

   2.కొందరు వర్ణాశ్రమ ధర్మాల కుట్ర అంటున్నారు,కానీ అక్కడ స్పష్తంగా చెప్పింది గుణకర్మ విభాగం గురించే తప్ప జన్మ పరమయిన విభజన చెయ్యలేదు?స్వభావజమయిన కర్మలు చేసే వారిని ఆయా కర్మల స్వభావాన్ని బట్టే నాలుగు వర్ణాలుగా విశ్లేషించడమే గానీ కులాల ప్రస్తావనే లేదు!

   3.ప్రక్షిప్తాలు అనేది కూదా అంత నమ్మదగిన వాదన కాదు.ప్రతి అధ్యాయంలో ఒక ప్రత్యేకమయిన విషయాన్ని చెప్తూ మొత్తం గీత అంతా ఒక ప్రణాళిక తోనే సాగినట్టుగా కనిపిస్తుంది.ఒక్కొక్కరికి ఒక్కలాగా అనిపించింది గాబట్టి,మార్మికత వుంది గాబట్టి కొందరు అందులో వున్న విషయం ఖచ్చితంగా విద్రోహ పూరితమేనని కొందరు సిధ్ధాంతీకరిస్తున్నారు."రాయల సీమ జానపద గీతాలు" అనే ఒక పుస్తకం చదివాను.అందులో "నువ్వు నాకు ముద్దు పెడితే నేను నీకు మోక్ష మిత్తురా!" అనే చరణం వుంది.శృంగార గీతంలో మోక్షం అనే పదం యెందు కొచ్చింది?ఆ పాట మొత్తం పైకి మామూలు పల్లీయులు పడుకునే శ్రంగార గీతం లాగా అనిపించినా అది మార్మికంగా వేదాంత భావన వున్న పాట!ఒక మామ్మూలు పల్లీయుడు రాసిన పాతలోనే వేదాంతం చెప్పవచ్చేసరికి మార్మికత వచ్చేసింది - ఆ సబ్జేక్టే అంత! పోతన లాంటి సులువుగా అర్ధమయ్యే లాగా రాసిన వాళ్ళ కవిత్వం లోనే అర్ధమయ్యీ అర్ధం కాని మార్మికత వుంటుందే? గీతని సరిగ్గా అర్ధం చేసుకుంటే కనబడే అర్ధం ఒకటే - నిస్తేజంగా వున్న వాళ్ళని కార్యోన్ముఖుల్ని చేసేటందుకు అవసరమయిన వుత్ప్రేరకాల వంటి భావాలు అందులో వున్నాయి.తిలక్ అయినా కబీర్ అయినా వాళ్ళ కార్యరంగాలు వేరు అయినా వాళ్ళ అవసరం ఒకటే - తమ కార్య రంగంలో వుత్సాహవంతులు కావటం - అందువల్లనే వారందరికీ గీత ఒకేవిధంగా వుపయోగ పడ్న్=ఇంది!

   తి.తి.దే వారు తెలుగులో అదే సంస్క్ర్తంలోని అనుష్తుప్ చందస్సులో "అనుష్టుప్ గీత" అని ప్రచురించారు.అది నా దగ్గిర వుంది!మీకు తెలిసిందే గదా యే భాషలోని పదాల కయినా డుమువులు చేరిస్తే తెలుగు మాటలు అయిపోతాయని - అదే పని అక్కడా చేశారు కవిగారు."ధర్మ క్షత్రే కురుక్క్షత్రే" అనే శ్లోకం అందులో ఇలా వుంటుంది:

   ధర్మ క్షేత్రం కురుక్షేత్రం చేరి అట్లు రణార్ధులై సంజయా?
   చేసిరేమా పైన మావారున్ మరి పాందవుల్!

   మొత్తం 700 పైగా వున్న వాటిని చాలా సార్లు చదివీ చదివీ అందులోని ముఖ్యమయిన భావాల్ని 108కి తీసుకొచ్చాను.108 అంటే అక్షమాలకు వున్న అక్షులు,అంతే ప్రైరోజూ అతి తక్కువ సమయంలోనే అదీ తెలుగులో గీత లోని సారాన్ని చదవ వచ్చు.
   నా బ్లాగులో ఒక పోస్టుగా మొదలు పెట్టాను.పూర్తి కాగానే చెప్తాను.తెలుగులో చదవదం కాబట్టి తేలికగానే అర్ధం చేసుకోవచ్చు!

   Delete
  5. వెల్కం. వ్రాయండి హరిబాబు గారు.

   Delete
 6. గీత ను పరిశీలిస్తూ (వ్యతిరేక వైఖరి తో, ఈ నాటి ఆలోచనా దృక్పధం తో) విస్తారం గా రాసిన ఓ పాతిక వ్యాసాలున్నాయి ఇక్కడ. http://innaiahn.blogspot.in/2013/06/truth-about-gita.html
  ఈ పరిశీలన authentic గానే కనిపిస్తుంది.
  గీత, భారతం, రామాయనం మొదలగు వాటి పై చర్చల కు నా వైఖరి పై మాత్రం, "గత జల సేతు బంధనం ఎందుకు?, baggage of the past ని వదిలేసి, ఇక ముందు ఏమి జరగాలో అనే దాని గురించి ఆలోచించటం మంచిది. ఎప్పుడో వేల ఏళ్ళనాటి గ్రంధాలలో ని ఈకలు పీకితే( అనుకూలం గా గానీ, ప్రతి కూలం గా గానీ), రేపు నా పొయ్యి లో పిల్లి లేస్తుందా?

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు బొందలపాటి గారు. ఆ ఒక్క వ్యాసమేన? ఆ బ్లాగులోనే మిగతా ఆర్టికల్స్ కూడా ఉన్నవా?

   Delete
 7. హరి బాబుగారు

  భగవద్గీత గురించి ఇంత సాధికారకంగా చెప్తున్నారంటే, మీరు గీతని క్షుణ్ణం గా చదివుంటారనే భావిస్తున్నాను. అందుకే జన్మ పరమయిన విభజన, కులాల ప్రస్తావన గీతలో లేవనే మీ వాదన కొంచం ఆశ్చర్యం కలిగించింది.

  కొన్నిఉదాహరణలు ఈ క్రింద (1 - 41, 42, 43 శ్లోకాలు):

  అధర్మాభిభవాత్ కృష్ణప్రదుష్యంతి కులస్త్రియః
  స్త్రీషు దుస్టాసు వార్ష్ణే యజాయతే వర్ణసంకరః

  సంకరో నరకాయైన కులఘ్నానాం కులస్యచ
  పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః

  దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః
  ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః

  ఓ కృష్ణా, అధర్మము వృద్ధ్హినొందుట వలన కులస్త్రీలు మిక్కిలి చెడిపోవుదురు. స్త్రీలు చెడి పోవుటవలన వర్ణ సంకరము కలుగును .

  వర్ణ సంకరము వల్ల కులముచెడిపిన వారలకును మరియు కులమునకు నరకప్రాప్తియే. వీరి యొక్క పితరులును శ్రాద్ధ తర్పణ క్రియలు లేనివారై పతనమగుదురు.

  ఈ వర్ణ సంకరమునకు కారకులైన కులఘాతకులయొక్క దోషముల చేత శాశ్వతములైన జాతి ధర్మములు కులధర్మములు నశించుచున్నవి.

  ReplyDelete
  Replies
  1. Q.ఈ మాటలు గీతలో ఎక్కడున్నాయి?
   Ans: అర్జున విషాద యోగం అనే మొదటి అధ్యాయంలో.

   Q: వాటి నేపధ్యం ఏమిటి?
   Ans: అర్జునుడి మనస్సు వికలంగా ఉండి యుద్దాన్ని విరమించుకోవటానికి సాకులు చెప్పటం.

   Q: ఈ మాటలను గీతాచార్యుడు శ్రీకృష్నుడు అమోదించాడా?
   Ans: ఎంతమాత్రం ఆమోదించలేదు. అందుకే, వెంటనే, అతడిలో ఉన్న నైరాశ్యం, యుధ్ధం విషయంలో వైముఖ్యం., కర్తవ్యాకర్తవ్యనిర్ణయంలో ఉన్న గందరగోళం, ధర్మాధర్మనిర్ణయంలో అపరిపక్వమనస్థితి వంటివి తొలగించటానికి ఉపదేశం చేసి కర్తవ్యబోధ చేసాడు. అదే గీతామృతం అని విశిష్టమైన స్థానం సంపాదించుకుంది భారతీయసంస్కృతిలో.

   Q: ఈ శ్లోకాలను ఇక్కడ సందర్భశుధ్ధి లేకుండా ఉటంకించటం తప్పేనా?
   తప్పే. ఏ‌ మాటలను గీత ఖండించిందో, ఆ మాటలను గీతాబోధ అని చూపి నిరసించటం కేవలం అజ్ఞానం.

   Q: ఏమి చేయాలి?
   Ans: తెలిసి మాట్లాడాలి. తెలియక పోతే తెలుసుకునే ప్రయత్నం చేసి మాట్లాడాలి. బహిరంగంగా గీతావిమర్శచేయటం తెలుసుకోవటంలో భాగం అనటం ఒక తెలివైన పని కావచ్చును, కాని విషయం నేర్చుకునే పధ్ధతి అది కాదు. అదే అని మీరనుకుంటే ఎవరూ ఇంక చెప్పనవసరం‌ లేదు.

   కొండలరావుగారికి విజ్ఞప్తి
   అయ్యా ఇలా వీధిన పడి నేర్చుకోవటం అనే ప్రయత్నం వలన నేర్చుకునేది సైకతరేణుమాత్రం. జరిగే హాని హిమవత్పర్వత మంత. దయచేసి అర్థం చేసుకోండి. ఏ విషయాన్నైనా సరే ఇలా బహిరంగ చర్చలద్వారా నిగ్గు తేల్చేయవచ్చుననే ఆలోచన అంత ఉదాత్తమైనది కాదు. చర్చలో పాల్గొనే వారిలో అధికులు సంబంధిత విషయం పైన అధికారులు కానప్పుడు అది చర్చ కావటం కన్న రచ్చ కావటమే తర్చుగా జరుగుతుంది. ఈ‌ మాటలు మానసిక గ్లాని అనుభవించి చెబుతున్నాను

   Delete
  2. గీతలో కులవ్యవస్త సమర్తన ఉందా అన్న చర్చ పక్కకు పెడితే పై శ్లోకాలలో తెలిసే విషయం: చాతుర్వర్ణ వ్యవస్థ అప్పటికే ఉంది అర్ధాత్ ఇక్కడే పరిచయం చేయబడలేదు.

   Delete
  3. వీధిన బడి అంటే ఏమిటి శ్యామలరావు గారు? వీధిలో ఉన్నవారికి జ్ఞానం ఈయలేనిది ఎంత పవిత్ర గ్రంధమైనా శుద్ధ దండుగమారిదే అని నా అభిప్రాయం. వీధులలో బుర్రకథలు, హరికథలు, ఒగ్గుకథలు, తోలుబొమ్మలాటలుగా కూడా నేర్పుతుంటారు కదా? ఎందుకలా చేస్తారు? మంచిని చెప్పడానికి కాదా? అవి చూడడానికి వచ్చేవారికి ఏమీ అర్ధం కాదంటారా? సినిమాలలో, కథలలో , పాఠాలలో ముక్కలు ముక్కలుగా ఈ గ్రంధాలలోని సన్నివేశాలను ఎందుకు పెడతారో చెప్పాలి? వాటి ఉద్దేశం అవసరమైన మేరకు మంచిని చెప్పడానికేనని నా అభిప్రాయం. హేళన చేయడమైతే తప్పుకానీ నేర్చుకోవడానికి ఎలా అయినా ఫర్వాలేదని నా అభిప్రాయం. పనికి వచ్చేది ఏది ఎలా నేర్చుకున్నా, ఎలా నేర్పినా విషయం అవగతం కావడమే ముఖ్యం. వాదన వల్ల ఆ గ్రంధంలో నిజంగా మంచి ఉంటే వికసిస్తుంది. చెడు గానీ దుర్మార్గం గానీ ఉంటే దాచలేము. దాచాల్సిన అవసరం లేదు. మంచిని స్వీకరించి చెడుని వదిలేస్తే సరి. ప్రపంచంలో మంచి మాత్రమే వర్ధిల్లుతుంది. మానవత్వం ఉన్న అంశాలే పరిఢవిల్లుతాయి. మిగతావి ఎంత పవిత్రంగా చెప్పినా మనుగడ సాగించలేవు.

   Delete
  4. శ్యామలీయం గారు,
   అక్కడ అడిగిన నాలుగు ప్రశ్నలేమిటి, అలాంటి ఎన్నో ప్రశ్నలు వేస్తూ పుస్తకాలు రాసినవారు ఉన్నారు. బహుశ మీరు ఆపుస్తకాలు చదివి ఉండకపోవచ్చు. అలా మేధావులు ప్రశ్నలు వేసి వేసి,పుస్తకాలు రాసి రాసి, అధికారంకొరకు అలసిపోయి చివరికి బ్రాహ్మణికల్/బ్రాహ్మణ భావజాలం పార్టిలైన కాంగ్రెస్, బిజెపి ల తీర్థం పుచ్చుకొన్నవారు కొందరున్నారు. వారేమి ఎర్ర పార్టిలలో చేరలేదు. ఒకవేళ అందులో ఉన్నా, అక్కడ క్లాస్ వర్సెస్ కేస్ట్ డిబేట్ ఆ పార్టిలలో జరగటంలేదని, బయటికి వచ్చి, ఈ ప్రశ్నలను సంధించి అధికార పార్టిల వైపే మొగ్గుచూపారు. అందువలన ఆ ప్రశ్నలను చూసి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆ ప్రశ్నలను అడగటంలోఉద్దేశమే వేరు. అది మీరు గ్రహిస్తే చాలు. అనవసరంగా వాదనలో కి దిగి సమయం వృథా చేసుకోకండి.

   Delete
  5. వీధినబడు అన్నది ఒక తెలుగుపలుకుబడి మాత్రమే నండీ. అందులో దురర్థం యేమీ లేదు. రచ్చ కెక్కి అన్నా అటువంటి పలుకుబడి మాత్రమే. చర్చలు ఒక ప్రశాంతవాతావరణంలో విషయపరిజ్ఞాతల మధ్య జరుగవలసినవే తప్ప ఎవరి హడావుడిలో వారు అస్థితిమితంగా ఉండే వీధివంటి వాతావరణంలో కాదు అన్నదే ఉద్దెశితార్థం. దీనికి మీరు నొచ్చుకొనవలసిన పని లేదండి. ఐనా మీకు సంతృప్తి కలుగక పోతే క్షమించండి. నాకు నుడికారపుతెలుగుతో కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చె అవకాశం ఉందని తట్టలేదు.

   పవిత్రగ్రంథమా వేరే రకమైన శాస్త్రగ్రంథమా ఎటువంటి గ్రంథమూ అన్న ప్రసక్తి ప్రక్కన ఉంచుదాం. ఏ గ్రంథమైనా ఎవరైనా చదివి వెంఠనే అర్థం చేసుకొనలేని పక్షంలో అది దండుగమారిది అన్న సిధ్ధాంతం ఆమోదయోగ్యమైన పక్షంలో ప్రపంచసాహిత్యమంతా వఠ్ఠి దండుగమారి సరుకుగా మారిపోతుంది ఆ గొప్ప సిధ్ధాంతాన్ని ఆమోదించే సమాజానికి. అన్ని విషయాలు కూడా ద్రాక్షాపాకంగా సులభంగానే ఉండితీరాలి అన్న పక్షంలో విద్యార్థులు సంవత్సరాల తరబడి ఎందుకు చదువుకోవాలండీ? సరాసరి అందరూ పిహెచ్‍డి చేయటానికి కూర్చోవచ్చును. డాక్టరు డిగ్రీ ఏకంగా ఎమ్‍డి యే వెంటనే తీసుకో వచ్చును. ఏ భాష అయినా సరే మొదటిసారిగా చెవిన పడగానే మనకి అర్థమై తీరాలి -లేకుంటే ఆ భాషను నేర్పే పుస్తకం ఒకటి ఇలా చదవగానే అలా అర్థం ఐతీరాలి. లేకుండాపోతే అవన్నీ దండుగభాషలే.

   వీధుల్లో కళారూపాలను చూపటం వెనుక పురాణాదులను పరిచయం చేయటమూ, వినోదమూ కూడా కలిసి ఉన్నాయి. అంతే కాని అవి చూడగానే ఆయా పురాణాదుల్లో మనకి సమస్త విజ్ఞానమూ కరతలామలకం కావటం జరుగదు. పైగా అలా తెలిసిన వాటిలో సంపూర్ణంగా ప్రామాణికత ఉండదు , ఉండనవసరం కూడా లేదు - వినోదాదులు ప్రథానం కావటం కారణంగానూ, మనస్థాయికి విషయాలను కుదించి ద్రించి చెప్పటం కారణంగానూ. అందుచేత వాటిని వాటిపరిథులు తెలిసి స్వీకరించాలి. అంతవరకే వాటి ప్రయోజనం. అంతకన్నా మీరన్నట్లు అన్నికళలూ సమాజహితం కోసమే, కాబట్టే విషయపరిచయం లేని వారికోసం కుదించి ఐనా చెప్పటం. దాని అర్థం సర్వ విషయాలూ ఆస్థాయిలోనే ఆగిపోవాలని ఆశించటం అమాయకత్వం.

   మీకు ( ఇక్కడ ఉన్న మిత్రులకు కాని) నాకు తెలియజెప్పటం చేతకావటంలేదో, లేదా మీరు మీ ధోరణికి కట్టుబడి నా మాటలను త్రోసివేస్తున్నారో తెలియదు. అనవసరమైన అపార్థాలు నాకు కూడా యిష్టం కాదు. ఒకటి మాత్రం నిజం, ఏదైనా గభీరమైన విషయం గురించి నిజంగా తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే అది 1. పరిజ్ఞానం కలవారి వద్ద వినయపూర్వకంగా నేర్చుకున్నప్పుడు 2. దానిలో పిమ్మట మనదైన కృషి చేసినప్పుడు 3. బోధయంత పరస్పరం అని గీతలో చెప్పినట్లుగా అభ్యాసంచేస్తున్నవారు తమలో తాము చర్చించుకుంటున్నప్పుడు అవగాహన కలగటమూ పెరగటమూ జరుగుతుంది. తద్విరుధ్ధంగా ఆలోచిస్తూ, ఏ పూర్వావగాహనా అవసరం కాదు, సందర్బాలను గమనించటం కూడా మాకు అవసరం లేదు, తోచినట్లుగా యే విషయం పైన ఐనా ఎవరైనా చర్చించుకుంటే అవగాహనా విజ్ఞానం కలుగుతాయని మీరు అభిప్రాయపడితే అది సరికాదని మాత్రమే సవినయంగా చెప్పగలను. యథాప్రకారం నా అభిప్రాయాలతో మీరు విబేధించవచ్చును. నా ఆలోచనా ధోరణి పాతగా అనిపించవచ్చును ఈ కాలం వారికి అన్నది ఎరుగుదును.

   Delete
  6. >>> వీధినబడు అన్నది ఒక తెలుగుపలుకుబడి మాత్రమే నండీ.

   గతంలో "కూతలు కూసేరు" అన్న తెలుగుపలుకుబడి ఉపయోగించిన పాపానికి వీధినబడి... సారీ రచ్చకెక్కి అసలు చర్చను పక్కదోవ పట్టిస్తూ నానా యాగీ చేసినవారెవరు?

   Delete
  7. శ్రీకాంత్ చారిగారూ,

   రెండూ ఒకటే నంటారా?

   మీరలా అనుకుంటే, ఆమాత్రానికే నేను మీతో వాదిస్తూ పోవాలంటారా? మీ రణన్నినాదాలు ముచ్చట గొలుపుతున్నాయి. కాని నాకు ఆసక్తి లేదు.

   నేను ఒక మాట వాడాను. కొండలరావుగారికి అది అభ్యంతరం తోచింది. వారికి నా వివరణ ఇచ్చాను. మీరు విషయాన్ని పెంచి దానిమీద చర్చను లేవదీయా లనుకుంటే అది మీ యిష్టం. అలాగే కానివ్వండి. కాని ఒంటి చేతి తప్పటు కొట్టుకోవలసి ఉంటుంది..

   మీరు నాపై అభియోగాలు మోపటం అనేది యేమీ క్రొత్త విషయం కాదు. కాబట్టి మీ అభిబాషణలనూ వైమనస్యాన్నీ నేను గణించను.

   Delete
  8. Q 1) Edge గారు Quote చేసిన విషయం ఏమిటి?

   Ans:
   >>> ఓ కృష్ణా, అధర్మము వృద్ధ్హినొందుట వలన కులస్త్రీలు మిక్కిలి చెడిపోవుదురు.
   >>> స్త్రీలు చెడి పోవుటవలన వర్ణ సంకరము కలుగును .
   >>> వర్ణ సంకరము వల్ల కులముచెడిపిన వారలకును మరియు కులమునకు నరకప్రాప్తియే.
   >>> వీరి యొక్క పితరులును శ్రాద్ధ తర్పణ క్రియలు లేనివారై పతనమ