మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
---------------------------------
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు. 
---------------------------------


వారి సమస్యలతో పోల్చుకుంటే నాది చాలా చిన్నది: నాగ్


"ఇదో కొత్త ప్రపంచంలా ఉంది. సినిమా వాతావరణం ఎక్కడా లేదు. విభిన్న తరహా వ్యక్తులతో ఇంటరాక్షన్ చాలా తృప్తినిస్తోంది. ముఖ్యంగా ఆయా వ్యక్తుల సమస్యలు తెలుస్తున్నాయి. వాటిని నా సమస్యలతో పోల్చుకుంటున్నాను. వారి సమస్యలతో పోల్చుకుంటే నా సినిమా ఫ్లాప్ అనేది చిన్నదిగా అనిపిస్తుంది. ఈ షో నాలో పెద్ద మార్పు తెచ్చే అవకాశం ఉంది" అని అంటున్నాడు నాగార్జున. మాటీవీలో ఆయన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరిట ఓ క్విజ్ షోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 'అన్నమయ్య', 'మనం' చిత్రాల విజయం తనకు ఎంతటి ఆత్మసంతృప్తిని ఇచ్చిందో, ఈ షో కూడా అంతటి సంతృప్తినీ ఇస్తోందని నాగ్ అంటున్నాడు. ఈ షో తనలో పెద్ద మార్పు తెచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ షో ను హిందీలో 'కౌన్ బనేగా కరోడ్ పతి' పేరుతో అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే 'మనం' సక్సెస్ తో వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న నాగార్జున కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ షో ద్వారా నాగార్జున సాధించిన విజయానుభూతి ఇది.
 • మీలో ఎవరు కోటీశ్వరుడు మీరు చూస్తున్నారా?
 • ఈ షోలో మీకు నచ్చిన అంశాలేమిటి?
 • ఈ షో ద్వారా సమాజానికి ఏమైనా మేలు జరుగుతున్నదా?
 • మీలో ఎవరు కోటీశ్వరుడు పై మీ అభిప్రాయం ఏమిటి?
Reactions:

Post a Comment

 1. కొన్ని షోలు చూశాను.ఒకమ్మాయి తన తండ్రి గురించి చెప్తుంటే ఇలాంతివాళ్ళు కూఒడా వుంటారా అనిపించింది!

  తను వేరే పెళ్ళి చేసుకుని ఇది చెప్పదానికే ఫోను చేసాను అంటే కొడుక్కి మండి మరి మా పెళ్ళిళ్ళు యెవరు చహెస్తారు అని అడిగితే ఠక్కున ఫోను పెట్తేసిన సంగతి చెప్తుంటే, ఆ తర్వాత ముగ్గురూ పడ్డ కష్టాలు చెప్తుంటే ఆశ్చర్యం వేసింది,వాళ్ళ ధైర్యం,ఆశ విన్నవాళ్ళూ చూసిన వాళ్ళూ తమ కష్తాల పత్ల గూఒడా నాగార్జున లాగే ఫీలవుతారని అనిపించింది,బాగుంది!ఆ అమ్మాయి చివరి వరకూ నిలబది కోతి వరకూ వెళ్ళక పోయినా గెల్చుకున్న మొత్తం తక్కువేం కాదు.డబ్బు కన్నా అక్కద పంచుకున్న విషయాలు గొప్పవి.

  ReplyDelete
 2. ఈ షో నాగార్జునకు రీచార్జ్ నిచ్చింది. మాటీవికి టీ.ఆర్.పీ రేటింగ్ పెంచింది. ఈ అంశాలు నిర్వాహకులకు సంబంధించినవి. అయితే ఈ షోలో పాల్గొంటున్నవారి అనుభవాలు , వారితో నాగార్జున డిస్కషన్ జరుపుతున్న విధానం నాగార్జున చెప్పినట్లే అతనికే గాక అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. మొన్నీ మధ్య 70 ఏళ్ల వయసున్న ఓ ముసలావిడ చాలా ఏక్టివ్ గా పాల్గొనడం ఆమె తన అనుభవాలు చెప్పడం... ఇలా చాలామంది అనుభవాలు మనం సమాజాన్ని అధ్యయనం చేయడానికి టీ.వీ లలోని చాలా చెత్త సీరియల్స్ స్థానంలో ఇలాంటివి రావడమనేది ఉపయోగరమైన పరిణామమే. ఓ సినీ నటుడు నిర్వహిస్తున్న షో అనే ఉద్దేశంతో చాలామంది దీనిని చూస్తున్నారు. ఆ దిశగా ప్రజలలో ఎంతో కొంత ఆలోచించే శక్తి పెరుగుతుంది. టీ.వీ మీడియాలో మంచి ప్రోగ్రాముల మార్పుకు ఇలాంటివాటి అనుభవం ఉపయోగపడుతుంది. నేడు సినిమా కంటే బుల్లితెర ప్రభావం ముఖ్యంగా మహిళలపై ఎక్కువగా ఉంటోంది.

  ReplyDelete
 3. నాకు మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం రెండవ సంచికలో చివరలో నాగార్జున చెప్తున్న అక్కినేని ఆలోచనలనుండీ "ఒక మంచి మాట" బాగుంది. రోజుకో మంచిమాట గురించి తెలిసికుంటున్నాం. ఇక ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యధాభరిత గాధలు.అవి చూసినపుడు మనమే కాదు మనకన్నా ఎక్కువ బాధలున్నవాళ్ళున్నారని ఒక స్వాంతన.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top