మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------
ప్రశ్నిస్తున్నవారు -  Jai Gottimukkala
అంశం : ప్రముఖులు, విగ్రహాలు-ఆగ్రహాలు,
----------------------------------------
Name:Jai Gottimukkala 
E-Mail:deleted 
Subject:విగ్రహాలు, రోడ్డులు/భవంతుల పేర్లు & ఇతర స్మారక చిహ్నాలపై కొన్ని విధానాలు 
Message:
తెలంగాణాలో విగ్రహాలు, రోడ్డులు/భవంతుల పేర్లు & ఇతర స్మారక చిహ్నాల కొనసాగింపు/ఏర్పాటుకు నాకు తోచిన విధానాలు ఇవిగో. ప్రస్తుత చర్చ దృష్ట్యా తెలంగాణా అన్నపటికీ ఇవి అన్ని రాష్ట్రాలకు వర్తింపచేయవచ్చు.

తెలంగాణా మహనీయుల గురించి ఎటువంటి పరిమితి ఉండదు. జాతీయ నాయకుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది కానీ సంఖ్యాపరంగా తక్కువ. క్షేత్రస్థాయి మహనీయులకు తమ క్షేత్రం వరకూ ఇదే పద్దతి.

ఇతరుల స్మారకాలను కొద్దికొద్దిగా పెట్టవచ్చు. ఆయా స్థలాలు ఏదో ముఖ్య సంఘటనకు సంబంధించి (ఉ. కాచిగూడా లోని సావర్కర్ సభ స్మరణలో పెట్టిన విగ్రహం) ఉండాలి లేదా వారి జీవితంలో ఆ స్థలం ప్రత్యేకత (ఉ. విశ్వనాధ సత్యనారాయణ పని చేసిన బడి దగ్గర వారి విగ్రహాన్ని పెట్టడం) కలిగి ఉండాలి.

తెలంగాణా అస్తిత్వ ప్రతిరూపాలుగా భావించబడే స్థలాలు (ఉ. ముఖ్య కూడళ్ళు & పర్యాటక ప్రాంతాలు) కేవలం తెలంగాణా మహనీయులకు & జాతీయ స్థాయి నాయకులలో అత్యంత ప్రముఖులకు (ఉ. గాంధీ & అంబేడ్కర్) మాత్రమె పరిమితం చేయాలి.

పై విధానాలు పాతవాటితో బాటు కొత్త వాటికీ వర్తించాలి  
Reactions:

Post a Comment

 1. మరే దేశంలో లేనన్ని విగ్రహాలు మన దేశంలో ఉన్నాయి. రోజు రోజుకి ఇంకా విగ్రహాల సంఖ్య పెరుగుతూనే ఉంది.
  మీరు చెప్పిన విధానం బాగుంది. ఏదైనా ఒక రాష్ట్రం ఇలా చేసి చూపిస్తే, మిగిలిన రాష్ట్రాలు ఇలాంటి పద్దతిని అనుసరించగలవు.

  ReplyDelete
 2. జాతీయ స్థాయి నేత అంటే ఎలా గుర్తించాలి? NTR జాతీయ స్థాయి నేత అవుతారా? ఆయన విగ్రహాలను తెలంగాణాలో పెట్టాలా? వద్దా?

  ReplyDelete
  Replies
  1. ఎన్టీఆర్ నటుడిగా ఎంతో మందిని ఆకట్టుకున్నారు. అయితే ఆయన నటన దేశానికే వన్నె తెచ్చే స్థాయి (ఉ. సత్యజీట్ రాయ్) కాదు.

   రాజకీయాలకు వస్తే ఎన్టీఆర్ ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించాడు. అది ఎప్పుడూ జాతీయ స్థాయిని చేరుకోలేదు. అంచేత ఆయన జాతీయ స్థాయి నాయకుడు కాడు.

   స్థల ప్రత్యేకత అనే విషయం కింద ఆయనకు ముడి పడి ఉన్న ప్రదేశం (ఉ. ఆయన గండీపేట "ఆశ్రమం" దగ్గర) ఆయన విగ్రహం పెట్టవచ్చు.

   Delete
  2. సార్!అసలు కేసీఆర్ పనికిమాలిన వాళ్ళు అనదానికి క్రైటేరియా యేమిటో అర్ధం కాక మీరంతా ఇట్లా గోల చేస్తున్నారు!ఆయన్ దృష్టిలో నిన్నటి తరంలో యేవో మంచి పనులు చేసి వుండతం మాత్రమే టాంక్ బండ్ మీద కొలువు దీరటానికి పనికొచ్చే గొప్పతనం కాదు,తను రాజేసిన వేడి చల్లారకుండా యెన్నికల్లో తనకు వోట్లు రాల్చగలిగిన వాళ్ళు అని అర్ధం, అది మీకు అర్ధ మయితే ఇంత చర్చ జరిగి వుందేది కాదు!

   టాంక్ బండ్ మీద ఇప్ప్పుడు విగ్రహాలుగా వున్నవాళ్లలో యెవరయిన తెలంగాణా ప్రజలకు అపకారం చెయ్యటం గానీ తెలంగాణా సంస్కృతిని అవమానించటం గానీ చేశారా?తమ పరిధిలో తాము - కవులయితే కవిత్వం చెప్పదం ద్వారా దాత లయితే దానాలు చెయ్యదం ద్వారా సంస్కర్త లయితే దురాచారాల్ని పరదోలి ప్రజల్ని సంస్కార వంతుల్ని చెయ్యడం ద్వారా - ప్రజలకు సంతోషాన్ని కలిగించిన వారే తప్ప అన్యు లెవరయినా వున్నారా?అయినా సరే వాళ్లని వారి గొప్పదనంతో యేమాత్రమూ సరితూగలేని ఇవ్వళ్టి ఒక రాజకీఎయ నాయకుడు పనికిమాలిన వాళ్ళు అంటుంటే అది చెల్లిపోతున్నది!ఒకనాడు సాండర్స్ అనే ఒక పోలీసు తమకు అత్యంత గౌరవనీయుదయిన నిన్నటి తరం నేతను అవమానిస్తే సింహకిశోరాలై లేచిన భగత్ సింగుని గౌరవిస్తున్నాం.ఇక్కడ నిన్నటి తరంలో నిస్వార్ధంగా ప్రాంతాల కతీతంగా యేవో కొన్ని మంచి పనులు చేసిన వారిని కూడా మా ప్రాంతం వాళ్ళు కాకపోతే వాళ్లు పనికిమాలిన వాళ్ళే, వాళ్ళ పీఠాల్నించి వాళ్ళని తొలగించి తీరుతాం అంటూ యెవరు యే స్థానంలో వుండి యెలాంటి మాటలతో ఆ ప్రల్లదనాన్ని సమర్ధించుకుంటున్నారో చూస్తే తన పర భెదం తెలియకుండా పరోపకారం తో బతికిన వారి ఔన్నత్యం కూడా యెన్నికల్ల్లో వోట్లను విదిల్చే 200/- లేక్ 300/- రూపాయల కట్తల స్థితికి దిగజారి పోయింది కదా అని బెంగగా అంపిస్తున్నది!

   అందుకే "కారే రాజులు,రాజ్యముల్ గలుగవే,గర్వోన్నతిం బొందరే?వారేరీ?సిరి మూటగట్టుకు పోవన్ జాలిరే?" అనే పద్య పాదాన్నీ "అధికారాంత మందు జూదవలె గదా అయ్యల సౌభాగ్యములు!" అనే పద్య చరణాన్నీ జవాబుగా వేస్తే బహుశా కొందల రావు గారికి అసందర్భంగా తోచిందో యేమో పబ్లిష్ చెయ్యలేదు,ఇప్పుడు వ్యాఖ్యాన సహితంగా వున్న ఈ కామెంటును పబ్లిష్ చేస్తే నా భావం యెవరెవరికి యేయే విధంగా అర్ధం అవుతుందో మరి?!

   Delete
  3. jai garu, నాకు తెలిసీ ఎన్.టీ.ఆర్ రాజకీయాలలో ఒక ప్రభంజనం. ఆయన నడిపింది ప్రాంతీయ పార్టీ అయినా జాతీయస్థాయిలో ప్రతిపక్షాలకు ఊపు తీసుకొచ్చినవారిలో ఎన్.టీ.ఆర్ పాత్ర గణనీయమైనది. నాలాంటివారికెందరికో రాజకీయాలపట్ల ఆసక్తి కలిగేలా మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చిందీ ఆయనే. ఆయనకంటే గొప్పనేతలున్నా అట్టడుగువర్గాలవారిని సైతం ప్రభావితం చేయగలిగిడాయన. రాజకీయాలపట్ల అప్పటివరకూ కొందరు మాత్రమే ఆలోచించేవారు. ఎన్.టీ.ఆర్ వచ్చాకనే రాజకీయాలలో చాలా మార్పులు వచ్చాయనీ నా అభిప్రాయం. ప్రభుత్వ పథకాలు పాలనలో కూడా మంచి మార్పులకు ఆయన నాంది పలికారు. తెలుగు భాష పరంగా తెలుగువారి పరంగా ఆయన చేసిన కృషి ప్రత్యేకమైనదే. నా దృష్టిలో ఎన్.టీ.ఆర్ జాతీయస్థాయి కలిగినవాడే. విగ్రహాల ఏర్పాటుపై నా అభిప్రాయం భిన్నమైనదయినా తెలంగాణాలో ఎన్.టీ.ఆర్ విగ్రహాన్ని ఏదో ఒక ప్రాంతంలో మీరు చెప్పిన విధంగా ఏర్పాటు చేయడమనేది సరికాదని నా అభిప్రాయం.

   Delete
  4. కొండలరావు గారూ, మీ అభిప్రాయం మీ ఇష్టం కాదని అనడానికి నేను ఎవ్వరిని? కాకపొతే ఎన్టీఆర్ రాజకీయ ప్రభావం దేశం మీద ఎదంత ఉందొ బయటి ఆధారాలను చూసి తేల్చుకుంటే బాగుంటుంది.

   మరో పరీక్ష పెట్టి చూద్దాం. జాతీయ స్థాయి నాయకుల చిహ్నాలు సంఖ్యా పరంగా తక్కువ ఉండాలని నేను చెప్పిన విధానంలో ఉంది. నా ఉద్దేశ్యంలో 15-20 జాతీయ నాయకులలా పరిగనించవచ్చు. ఇందులో స్వాతంత్ర్య సమర వీరులు పోను ఎ 3-4గురు మిగులుతారు. ఎన్టీఆర్ ఇందులో వస్తారా రారేమో?

   Delete
  5. NTR కు అంత స్థాయి లేదు. మీరన్నట్లుగా గండిపేటకు పరిమితం చేసే స్తితీ కాదు. నేను ఉదహరించింది కూడా NTR నూ YSRనూ ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇది తెలంగాణాలో ఆంధ్రాలో రెండు చోట్లా జరుగుతున్నది. వీరిద్దరూ ప్రజాభిమానం పొందినవారే. కానీ విగ్రహాల ఏర్పాటుకు ప్రజాభిమానం కోల్బద్ద కాకూడదు కదా?

   చూద్దాం చాలావరకూ స్పందనలు మంచిగానే వస్తున్నాయి. నా అభిప్రాయమైతే విగ్రహాలకంటే ప్రముఖుల జీవిత చరిత్రలు పాఠ్యాంశాలుగా ఉంచితే మంచిది. విగ్రహాలు కంపల్సరీ అనుకుంటే దీనికి దేశవ్యాపితంగా ఓ పాలసీ ఉంచాలి. ప్రముఖ ప్రాంతాలలో ఆయా ఘటనలకు చెందినవారి విగ్రహాలను పెడితే బాగుంటుందేమో. ఉదాహరణకు నాగార్జున సాగర్ వద్ద ఆ ప్రాజెక్టు రూపకల్పనకు కృషి చేసినవారి విగ్రహాలు ... అలా పెడితే సరిపోతుందేమో.

   Delete
  6. 3-4 మరీ తక్కువేమో 12-15గురు అవుతారేమో. అయినా ఎన్టీఆర్/యైఎసార్ గార్లు ఆ జాబితాలో రారు.

   ప్రజాభిమానం మాత్రమె కొలబద్ద కాలేదు కానీ పూర్తిగా కొట్టేయలేము. దీన్ని ఒక్కోసారి నిర్ణయానికి టై-బ్రేక్ చేయడానికి వాడొచ్చు. అయితే పై ఇద్దరి కేసులో దీని అవసరం లేదు.

   ప్రభుత్వం లేదా ప్రభుత్వ భూములలో పెట్టె వాటికి మాత్రమె పై "నిబంధనలు". అభిమానులు స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ ప్రైవేటు భూములలో స్మారకాలు పెట్టొచ్చు. మునిసిపల్/పంచాయత్ అనుమతులు ఉంటె మనం ఆపలేము.

   పాఠ్యాంశాలు కూడా ఇవే పద్దతిలో ఉండాలి. అదనంగా కేవలం అణగారిన వర్గాల పోరాటాలు (ఉ. కారంచేడు ఉద్యమం) ఉండాలి.

   Delete
 3. 1. విగ్రహాలు ఎవరు పడితే వారు పెట్టకూడదు. జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో విగ్రహాలు పెట్టడానికి అసెంబ్లీలో తీర్మానం జరగాలి. అలాగే ప్రాంతాలా వారీగా జిల్లా పరిషత్ లో గాని, మండల పరిషత్ లో గాని, గ్రామ సభలో గాని తీర్మానం జరక్కుండా విగ్రహాలు ప్రతిష్ఠించ కూడదు.
  2. ప్రభుత్వ రంగ విద్యాలయాలు, ఆఫీసులు, కర్మాగారాల్లో విగ్రహాలు ప్రతిష్టించాలంటే సంబంధిత యూనియన్ + మేనేజిమెంటు కమిటీ సంయుక్త ఆమోదం తప్పని సరి.
  3. ప్రైవేటు వ్యక్తులు, సమూహాలు పబ్లిక్ ప్రదేశాల్లో విగ్రహాలు ప్రతిష్ఠించడం నేరంగా శిక్షార్హమైన పరిగణించాలి. తమ సొంత జాగాలో ప్రతిష్ఠించు కుంటే ఇది వర్తించదు.
  4. వ్యక్తులు బ్రతికి వున్నప్పుడు విగ్రహాలు ప్రతిష్ఠించ రాదు.
  5. వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా కనీసం 5 సంవత్సరాల వరకూ అతని విగ్రహాలు ప్రతిష్ఠించడాన్ని నిషేధించాలి. ఆ తర్వాత కూడా సదరు వ్యక్తికీ సంబంధించిన స్కాములు, వగైరా బయట పడక పొతే, అతని గొప్పదనాన్ని ప్రజలు మరిచిపోక పొతే పైన చెప్పిన నాలుగు సూత్రాలకు అనుగుణంగా విగ్రహాలు స్థాపించుకోవచ్చును.
  6. పైన చెప్పిన అయిదు సూత్రాలకు లోబడి విగ్రహాన్ని ప్రతిష్ఠించినపుడు వ్యక్తి ప్రాంతం వాడైనా, దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వాడైనా, చివరికి ఇతర దేశం వాడైనా సరే, అడ్డంకి ఉండకూడదు.

  ReplyDelete
 4. PS పేర్లు, ఇతర స్మారకాల విషయంలో కూడా పైన చెప్పిన నియమాలను కొద్దిపాటి మార్పు చేర్పులతో అనుసరిచ వచ్చు.

  ReplyDelete
 5. రోడ్లపక్కన, ఆరుబయట ఏ విగ్రహాలు పెట్టకూడదు, అవి గాంధీవైనా, అంబేద్కర్‌వైనా. అవన్నీ తొలగించాలి.
  దేశనాయకుల విగ్రహాలని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు లాంటి చోట్ల ప్రాంగణం లోపల పెట్టాలి.
  ఇతర రాజకీయ నాయకుల విగ్రహాలన్నీ, వాళ్ళ వాళ్ళ పార్టీ కార్యాలయాల ఆవరణలో మాత్రమే పెట్టుకోమనాలి.

  ReplyDelete
 6. Evari vigraharaaloo pettanakkara leu, aa eegipshiyan samskriti emduku konasaagimchadam? Muphphai ella kritam hydarabaad oka pramtamlo mem konna khaalee jaagallo sudden ga gudiselu vesukovadam modalayindi. Mem vallaki nachcha cheppinaa vinaledu, phalana aayan mammalni ikkada vesukomannaru, mee samasya aayanato cheppukondi, mem chesedem leka o ebhai mandi kalisi aayana ni domalguda loni oka aaphis lo kalusukuni maa kashtaalu cheppukunnam, maa daggarunna rigistration pattalu choopichamu, mem andaram chinna chinna udyogaalo unnamani, viluchusukoni illu kattalane yatnam lo unnamani chepite, amta vinnaka, oka chiru navvu navvutoo .. Aunu, nene gudiselu vesukomannananu, naa peru cheppi meeru kooda gudiselu vesu
  Komdi, evar vaddannaru, ika vellamdi.. Ani mammalni pampesaadu. Ippudu aayana garu leru, ayyana vigrahaaralu dazenla koddee mukhyamaina pramtallo darsanamistunnaayi, alamti rajakeeya nayakulu manaku, mumdu taraalaki e vidhamaina sphoorti kaligistaaru?

  ReplyDelete
  Replies
  1. మీరు కలిసి మాట్లాడిన ఆ వ్యక్తి అంటే నాకు యెంత అసహ్యమంటే అంతకు ముందు యెంతో ఇష్టంగా పాడుకునే అనార్కలి లోని అత్యంత మధురమయిన పాటను కూడా ఈ వ్యక్తి పేరుతో మొదలవడం అనే ఒకే ఒక్క కారణంతో పాడుకోకుండా ఆపేశాను!మీతో అతను అన్న ఈ వొక్కమాటా చాలు తన నిజ స్వభావ మేమిటో చెప్పటానికి!

   Delete
  2. హరిబాబు గారు,

   ఆయన చెప్పినాయన, మీరు చెప్పేటాయన ఒకరు కాదు. మీరు చెప్తున్నాయన తన వాటా లేకుండా కేవలం పేరు చెప్పుకొని గుడిసెలు వేసుకొమ్మనే రకం కాదు.

   Delete
  3. పేరు చెప్పకపోయేసరికి వాలకమూ గుర్తులూ అలాగే వుండటంతో పొరపాటు పడ్డాను, సారీ!కాకపోతే గుడ్దికన్నా మెల్లనయం అన్న బాపతు మాత్రమే తేడా అన్నమాట, నో సారీ!!

   Delete
 7. పరిస్థితులు బాగాలేవు. ప్రస్తుతం నడుస్తున్న భావోద్వేగాలూ, వాటి ఆధారంగా జరుగుతున్న తీర్మానాలు ఇవేవీ సంఘంలో క్రొత్త తరం నాయకులనూ సంఘసేవకులనూ తయారుచేసేవిగా లేవు. నిర్మొగమాటంగా చెప్పాలంటే, "ఇంగితజ్ఞానం ఉన్నవాడు సమాజంకోసం జీవించాలని అనుకోకూడదు. అలా ఈ రోజు జీవిస్తే రేపు నీ‌సేవకు పెడర్థాలు తీసే వారూ, నీ జ్ఞాపకచిహ్నాలకు నిప్పులుపెట్టేవాళ్ళూ వచ్చి నీ‌ ఆత్మకు క్షోభ కలిగించటం తద్యం అన్నట్లుంది." కాబట్టి బేషజాలకు అతీతంగా పెద్దల్ని గౌరవించుకొనే సంప్రదాయానికి విలువను ఇచ్చే పరిస్థుతులు త్వరగా రాకపోతే స్వార్థపరులు తప్ప ఎవరూ నాయకత్వం అనే దాని జోలికి పోరు.

  ReplyDelete
 8. మనం కోరుకోవలిసినది అభివృద్ది దాని పేరుతో ఇలా ప్రక్రుతి హరించడం కాదు!
  బుద్ధుడు గురించి భోధి వృక్షం ఎలా ఉంచామో అలాగే ఒక మొక్కను పెంచి దాన్ని ఆ వ్యక్తికీ సూచనగా పెంచుదాం!

  ReplyDelete
 9. 3:4 అనీ జిల్లా స్థాయిలో ప్రాంతీయ నాయకుల విగ్రహాలు ఇన్నీ జాతీయ స్థాయి నాయకుల విగ్రహాలు ఇన్నీ 12-16 లో NTR వస్తాడా రాడా అనే కాకిలెక్కలు ప్రింటులో చదవడానికే అసహ్యంగా వుంది నాకు! దయచేసి ఈ దరిద్రాన్ని ఇంతటితో ఆపుతారా?శ్యామలీయం మాష్తారు చెప్పినట్టు గౌరవం అనేది హృదయమూలాల నుంచి పొంగుకు రావాల్సిన భావోద్ర్రేకపు గంగధార!మీరు హృదయపూర్వకంగా గౌరవించగల్గిన వాళ్ళవే పెట్టుకోండి!

  కానీ ఒక విషయం గుర్తుంచుకోండి.కాంగ్రెసు తన దిక్కుమాలిన రాజకీయంతో ఇన్నాళ్ళూ నమ్మకంగా వోతు చేసిన దళిత ముస్లిము వోటు బ్యాంకుకు దూరమయి ఇలా అఘోరిస్తున్నది. గోధ్రా అల్లర్ల బూచిని కమ్యునిష్టోళ్ళూ కాంగ్రెసోళ్ళూ యెంత యెక్కువ చేసి చూపించినా ముస్లిములే కాంగ్రెసు నొదిలేసి భాజపా వైపుకి తిరిగిపోయారు.అది గమనించని భాజపాలోని మకురు గొడ్లు వాళ్లని దూరం చేసుకునే తింగరి చేష్టలు చెయ్యడంతో వుపయెన్నికల్లో దెబ్బతిన్నారు.అయినా కాంగ్రెసు మోడీ హవా తగ్గిందహో అని చంకలు గుద్దుకోనక్కర్లేదు.ఒకసారి బలంగా ద్వేషించి దూరమయిన మైనార్టెలు అంత తొందరగా వెనక్కి రారు. అలా కాంగ్రెసు మరింత కృశించి పోయి కేవలం గుజరాతుకు మాత్రమే పరిమితమై తనూ ప్రాంతీయ పార్టీకి దిగజారితే గాంధీ కూడా గుజరాతుక్లు మాత్రమే పరిమితమవుతాడు గాబట్టి తెలంగాణాలో వున్న గాంధీ విగ్రహాల్ని కట్టగట్టి గుజరాతుకు తరలించాలంకుకుంటే తెలంగాణాలో వున్న గుజరాతెలు యెలా రియాక్ట్ అవుతారనుకుంటున్నారు?

  మరి అన్ని ప్రాంతాల వాళ్ళనీ అక్కున జేర్చుకున్నాం, యెవరూ ఇక్కణ్ణించి పోనక్కర్లేకుండా కడుపులో పెట్టుకు చూసుకుంటాం అనే మీరు మమ్మల్నీ మా ప్రాంతానికి చెందిన గొప్పవాళ్లని కూడా అవమానించకూడదు గదా?ప్రాంతీయాభిమానం మీకు మాత్రమే వుండాలా?మీ రాష్ట్రంలో బతికే గుజరాతీలకీ ఆంధ్రావాళ్లకీ వుందకూడదా? ఇప్పటికే అక్కద వున్న విగ్రహాల్ని పలుగులూ పారలూ వుపయోగించి పెళ్లగించి పొలిమేరలు దాటించే క్రూరత్వం దేనికి? ఇదివరకటి వాళ్ళు మర్చిపోయిన, నిర్లక్ష్యం చేసిన వాళ్ల విగ్రహాలు కొత్తగా పెట్టుకుంటే కాదని యెవరయినా నగలరా? గుజరాతీల్నీ మార్వాడీల్నీ యెలా చూస్తున్నారో అలా కూడా చూదకుండా యెందుకీ విద్వేషం?

  ReplyDelete
  Replies
  1. మీకు నచ్చిన వ్యక్తిపై ఇంకొకరికి అదే అభిప్రాయం లేకపోవడానికి ప్రాంతీయాభిమానం కారణం అని ఎలా నిర్దారించుకున్నారు? ఇది అవమానం ఎలా అవుతుంది?

   మీరు కాంగ్రెస్ పార్టీ గురించి రాసిన విషయాలు ఏవీ చర్చకు సంబందించినవి కావు. ఇక్కడ ఎవరూ కాంగీయులు ఉన్నట్టు కూడా లేదు. మైనారిటీ/మోడీ హవా వగైరాలు ఇక్కడ అప్రస్తుతం.

   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. @jai'
   మరి యాభయ్యేళ్లనుంచి అవకాశాలు అంది పుచ్చుకోవటంలో వచ్చే తేడాల్ని ఒక ప్రాంతం వాళ్ళు చేసిన దోపిడీ కారణం అని మీకు మీరే యెలా నిర్ధారించుకున్నారు? గిర్గ్లానీ గారి అభిప్రాయం ప్రకారం యెక్కడో కృష్ణాజిల్లా నుంచి కొందరు హైదరాబాదు వచ్చి బాగుపడగలిగినప్పుడు పక్కనే వుండి కూడా రాలేకపోవడం ఆంధ్రోళ్ళ దోపిడీ యెలా అయిపోయింది?

   ఒక విషయాన్ని విశదీకరించేటప్పుడు చేసే పోలికలు చర్చకి సంబంధం లేనివెలా అవుతాయి?ఒక విషయాన్ని వివరించే వ్యక్తికి తను చెప్పే విషయాన్ని పోలికలతో చెప్పే హక్కు వుండదా?యేది అసలు విషయం, యేది కొసరు పోలిక అనేది అంత అస్పష్టంగా కూడా లేదే అక్కడ!

   Delete
  4. * గమనించని భాజపాలోని మకురు గొడ్లు వాళ్లని దూరం చేసుకునే తింగరి చేష్టలు చెయ్యడంతో వుపయెన్నికల్లో దెబ్బతిన్నారు*
   మీడీయా వారు, మీలాంటి వారు ఉపన్నికలలో దెబ్బతిన్నారు అని అనుకోంట్టున్నరేమో, బిజెపి వారేమి అలా అనుకోవటంలేదు. ఐదేళ్లలో ఎన్నో జరగవచ్చు. నాలుగు సీట్లు అటుఇటు అయితే పనైపోయిందని ఎలా అనుకొంటారు? బిజెపి ఉన్నని రోజులు అధికారంలో ఉంట్టుంది, అతి చేస్తే దిగిపోతుంది.

   Delete
 10. జై గారూ,
  మీ ప్రశ్న నన్ను మరో విధంగా కూదా గందరగోలం లోకి నెట్తేసింది,కాబట్తి మీరు ప్రస్తావనకి సంబంధించి మరో ప్రశ్న వేస్తున్నాను!

  మీకు నచ్చిన వ్యక్తిపై ఇంకొకరికి అదే అభిప్రాయం లేకపోవడానికి ప్రాంతీయాభిమానం కారణం అని ఎలా నిర్దారించుకున్నారు? - అని మీరు అన్ను అడుగుతున్నారు, కానీ టాంక్ బంద్ మీద యేవరి విగ్రహాలు వుంచాలి, యెవరి విగ్రహాలు తీసెయ్యాలి అనేదానికి వాళ్ళు తెలంగాణాకి సంబంధించినవాళ్ళు మాత్రమే అయివుండాలి అని నిర్ధారిస్తున్నది మీరూ మీ ముఖ్యమంత్రే కదా?


  ఇది అవమానం ఎలా అవుతుంది? - అంటే ఆ గొప్పవాళ్ల విగ్రహాల్ని అవి అక్కద వుండటానికి వీల్లేదని పలుగులూ పారల్తో పెళ్లగించి లారీల మీదకి యెక్కించి రాష్త్రం అవతలికి విసిరెయ్యడం తెలంగాణా రాష్త్రంలోనే వాళ్లని గౌరవించే వ్యక్తులకి బాధ కలగదా?

  ReplyDelete
  Replies
  1. ఎవరి విగ్రహాలు (స్మారకాలు) ఎక్కడ పెట్టాలో అన్న విషయంపై నాకు ఒక అభిప్రాయం ఉంది. అందులో జాతీయ నాయకులకు సంఖ్యా పరంగా స్వల్పంగా పెట్టాలని నా ఉద్దేశ్యం. ఎన్టీఆర్ జాతీయ స్థాయి నాయకుడా అని కొండలరావు గారు అడిగితె నేను కాదన్నాను. ఇవన్నీ నా అభిప్రాయం మరియు దాని అన్వయణ మాత్రమె.

   నేను చేసింది నిర్ధారణ కాదు, అభిప్రాయం. ముఖ్యమంత్రో మరెవరో ఏమన్నారో ఏమి చేస్తారో ప్రస్తుతానికి అప్రస్తుతం. మీరు వారిని ఏమనదలుచుకున్నా మీ ఇష్టం కానీ నన్ను వారితో జతకట్టడం అవసరం లేదేమో? మీ ముఖ్యమంత్రి చేసిన విషయాలకు నేను మిమ్మల్ని తూలనాడను అని మాత్రం నా గారంటీ.

   మీకు ఎన్టీఆర్ మీద అభిమానం ఉంది. నాకు ఉందా లేదా అనే విషయం కానీ ఆయన గురించి నా అభిప్రాయం ఏమిటో అన్నది కానీ మనం ఇక్కడ చర్చించలేదు. కేవలం ఎన్టీఆర్ జాతీయనాయకుడు కాదన్న మాటను పట్టుకొని మీరు నాకు ప్రాంతీయ అభిమానం (దురభిమానం) అంటకట్టారు.

   I expressed an opinion. You are imputing motives when there are no grounds for doing so.

   నా "విధానాలకు" సరిపోని వ్యక్తుల స్మారకాలు తీయాలి అన్నది కూడా నా అభిప్రాయమే. తీయడం అంటే విరగ్గొట్టడమో అవమానపూరితంగా ధ్వంసం చేయడమో కానక్కరలేదు. తగు గౌరవంతో తొలగించాలన్నదే నా కోరిక.

   గిర్గ్లానీ కమిటీ నివేదిక నేను చదవలేదు. నాకు గుర్తున్నంత వరకు దాంట్లో స్పష్టత లేదు. As I remember there is a lot of detail but no summary. In any case, I am no expert on that subject.

   నీటి పంపకాల గురించి మాత్రం నేను ఎంతయినా చర్చించగలను. అయితే అవి కూడా అభిప్రాయాలే. నిర్దారించాల్సింది ట్రిబ్యూనల్ మాత్రమె.

   Your opinions on Congress, dalits, minorities, Modi etc. did not appear relevant to the present discussion.

   Delete
  2. @JAI
   గిర్గ్లానీ కమిటీ నివేదిక నేను చదవలేదు. నాకు గుర్తున్నంత వరకు దాంట్లో స్పష్టత లేదు
   >>
   నాకు మాత్రం విశేషంగా యెలా తెలిసింది?మీవాళ్లే అడిగిన వాళ్లకీ అడగని వాళ్లకీ చూడండి, గిర్గ్లానీ రిపోర్తు చదవండి - వుద్యోగాల విషయంలో మాకు అన్యాయం జరిగిందని చెప్పాడు తెలుసుకోండి అన్నందు వల్లనే నాకూ తెలిసింది.సపష్తత లేదని ఇదివరకట్నించీ అంతున్నారుగా, మిమ్మల్ని యెలా నిగ్గదీస్తాను?మీలో దానిపట్ల స్పష్తత వున్న్నవాళ్ల నించే నేనూ జవాబు ఆశిస్తున్నాను!సరయిన జవాబు దొరికితే నాకూ కడుపుబ్బరం తగ్గుతుంది.

   Delete
  3. @jai
   గిర్గ్లానీ కమిటీ నివేదిక నేను చదవలేదు. నాకు గుర్తున్నంత వరకు దాంట్లో స్పష్టత లేదు.
   >>
   నాకు మాత్రం విశేషంగా యెలా తెలిసింది?మీవాళ్ళే అడిగిన వాళ్లకీ అడగని వాళ్లకీ చూడండి, గిర్గ్లానీ రిపోర్తు చదవండి - వుద్యోగాల విషయంలో మాకు అన్యాయం జరిగిందని చెప్పాడు తెలుసుకోండి అన్నందు వల్లనే నాకూ తెలిసింది.సపష్తత లేదని ఇదివరకట్నించీ అంతున్నారుగా, మిమ్మల్ని యెలా నిగ్గదీస్తాను? మీలో దానిపట్ల స్పష్తత వున్న్నవాళ్ల నించే నేనూ జవాబు ఆశిస్తున్నాను!సరయిన జవాబు దొరికితే నాకూ కడుపుబ్బరం తగ్గుతుంది.

   Delete
  4. సరయిన జవాబు దొరికితే నాకూ కడుపుబ్బరం తగ్గుతుంది.

   ఇక్కడేదో కాస్త చర్చ జరిగినట్లుంది కదండీ !!
   https://plus.google.com/104294459323128621260/posts/Ab6QdE2qhHj

   నేను కూడా డీటెయిల్ గా రిపోర్టు చదవలేదు, కాని కొంత అవగాహన ఉంది. మీకు ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉంటె ఒక సారి ఇక్కడ అడగండి, మీ ఉబ్బరం తగ్గించగలనో లేదో చూస్తాను :-)

   బహుశా ఈ చర్చ ఆఫ్ టాపిక్ అవుతుందేమో మరి :-|

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top