మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------------
అంశం : భారత రత్న.
ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------
సుబాస్ చంద్ర బోస్, భగత్ సింగ్ భారతరత్నకు అర్హులు కారా?

భారత రత్న. దేశంలోనే అత్యున్నత పురస్కారం. ఇప్పటివరకూ 45 మందికి ఈ పురస్కారం ఇచ్చారు. వివరాలు క్రింది ఇమేజ్ లో ఉన్నాయి. భారత రత్న ఎవరికి ఇవ్వాలనే విజ్ఞప్తులు, ఇస్తున్న తీరు విమర్శలకు గురవుతూనే ఉన్నది. ఎవరికి వారు వారి అనుకూలమైన వంతలు పాడుతూనే ఉన్నారు. గత ఏడాది సచిన్ కు భారత రత్న ఇవ్వడానికి నిబంధనలనే మార్చారని వార్తలు వచ్చాయి. భారత రత్న అనేది ఓ జోక్ గా మారుతున్నదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఆక్రోషం - ఆవేదనలతో కాకుండా ఆలోచిస్తే మరుగునపడిన, మరుగుపరుస్తున్న భారతరత్నాలు వెలికి తీసి నేటి తరానికి చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి. రాజకీయ సంకుచితత్వంతో కాకుండా మన నేతలకూ ఈ విషయంలో రావలసిన పరిణితి ఏమిటి? భారత రత్నాలు రాజకీయ రత్నాలు కాకుండా ఉండాలంటే తీసుకోవలసిన చర్యలేమిటి? సుబాస్ చంద్ర బోస్, భగత్ సింగ్ లాంటి జాతిరత్నాలు భారతరత్నానికి అర్హులు కారా? ఎందుకు? భారత రత్న ఇవ్వడానికి అలాంటి నిబంధనలేమైనా ఉన్నాయా? మీ అభిప్రాయం ఏమిటి?
2014 వరకు మన భారత రత్నాల వివరాలివి :

--------------------------------------------------
*Republished
Reactions:

Post a Comment

 1. నాథూరాం గొడ్సె పేరు మరిచారా :)

  ReplyDelete
  Replies
  1. గాడ్సేకూ ఇవ్వమంటారా భారతరత్నాన్ని :)

   Delete
  2. నాథూరాం గాద్సే స్వాతంత్ర్య సమరయోధుడే. మోహన్ దాస్ గసంధీ దేశ విభజనని సమర్థించడంతో పాటు ఇందియా పాకిస్తాన్‌కి 55 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని దిమాంద్ చేస్తూ నిరాహార దీక్ష చేసాడు. అందుకే నాథూరాం గాద్సే, గోపాల్ గాద్సే, నారాయణ ఆప్తేలు గాంధీని హత్య చేసారు. ఈ నిజాలు స్కూల్ పుస్తకాలలో వ్రాయరు. అహింసావాదం ఒక బూటకం అని తెలిస్తే జనం మావోయిస్త్‌లలోనో, ఉల్ఫా లాంటి జాతుల విముక్తి పోరాట సంస్థలలోనో చేరిపోతారని పాలకుల భయం.

   Delete
  3. ఇందియా పాకిస్తాన్‌కి 55 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని దిమాంద్ చేస్తూ నిరాహార దీక్ష చేసాడు
   ??
   The following facts dissolve this much touted thesis that Gandhiji had fasted to bring moral pressure on government of India to relent.:
   Dr. Sushila Nair, as soon as she heard Gandhiji proclaim his decision, rushed to her brother Pyarelal and informed him in a huff that Gandhiji had decided to undertake fast till the madness in Delhi ceased. Even in those moments of inadvertence the mention of 55 crore of rupees was not made which clearly proves that it was not intended by Gandhiji.
   Gandhiji's own announcement about his resolve on 12th January in the evening prayer meeting did not contain any reference to it. Had it been a condition, he would have certainly mentioned it as that.
   Similarly, there was no reference to it in his discourse on 13th January.
   Gandhiji's reply on the 15th January, to a specific question regarding the purpose of his fast did not mention it.
   The press release Of the government of India did not have any mention thereof.
   The list of assurances given by the committee headed by Dr. Rajendra Prasad to persuade Gandhiji to give up his fast did not include it.
   ref:http://www.mkgandhi.org/assassin.htm

   దాదాపు నేను చూసిన అన్ని లింక్సూ ఇవే అర్ధాన్ని ఇస్తున్నాయి?నేను "కాంగ్రెసుని ద్వేషించడం నా జన్మ హక్కు - మోహన్ దాస్"అనే పోష్టు రాసినా ఇది అబధ్ధం అని నాకనిపిస్తున్నది గాబట్టి వ్యతిరేకిస్తున్నాను.మీరు గట్టి సాక్ష్యాలు చూపించగలరా గాంధీ స్వయంగా ఆ డిమాండు చేశాదని?

   Delete
  4. గాంధీ ఏమీ మహాత్ముడు కాదు. ఎవరి కులవృత్తులు వాళ్ళు చేసుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని గాంధీ అనేవాడు. ఇదే మాట గిరిరాజ్ కిశోర్ గానీ అశోక్ సింఘాల్ గానీ అంటే ఎంత గొడవ అవుతుందో మనకి తెలుసు. గాంధీ విషయానికి వచ్చినప్పుడే దేవతా వస్త్రాలు కథలాగ చాలా మంది నోరు మూసుకుంటారు.

   Delete
  5. నేను అడిగింది మీరు చెప్పిన దానికి వాస్తవమయిన సాక్ష్యాల్ని.సిధ్ధాంతంలో తప్పులుంతే విమర్సించదం హుందా అయిన పని,అదే నేను చేసాను.కానీ యేఅతివాణ్ని - అతను మహాత్ముదు కాకపోయినా సరే, మామూలు మనిషే అయినా సరే - అబధ్ధాలతో బద్నాం చెయ్యదం తప్పున్నర తప్పు!

   Delete

 2. ఇప్పటిదాక ఇచ్చినవారుకాక ఇంకా ఎందరో అర్హులు ఉన్నారు.కాని ఒకరు రాసినట్టు పద్మ అవార్డులు కి ఒక రూలు ,కన్వెన్షన్ ఏర్పాటు చేస్తే మంచిది.ఎప్పుడోగతించిన వారికి ఈ అవార్డు ఇచ్చే పద్ధతి మానుకోవాలి.లేకపోతే అబ్సర్డ్ గా మారుతుంది. ఒకవ్యక్తి జీవించివున్నకాలంలోనే,తప్పితే ఒకసంవత్సరకాలంలోposthumous గా పద్మా అ వార్డులనీస్తేమంచిది.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top