మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------------
అంశం : బ్లాగు వ్రాతలు, భావ ప్రకటన.
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు. 
------------------------------------------------
 • బ్లాగును ఎలా ఉపయోగించాలీ అనేదానికి నిబంధనలుంటాయా?
 • బ్లాగు. ఎవరి స్వేచ్చమేరకు వారు వ్రాసుకుంటారు. మన బ్లాగు కు మనమే సంపాదకులం కదా?
 • ఓ బ్లాగులో ఏమి వ్రాతలు ఉండాలనేదానిలో ఒక్కొక్కరికీ ఒక్కొక్క రకమైన అభిప్రాయాలుండొచ్చు.
 • ఒక్కొక్కరికీ ఒక్కోరకం బాగులు నచ్చవచ్చు. కొందరికి అసలు బ్లాగులలో ఏముంటుందిలే అనిపించవచ్చు. కొందరికీ బ్లాగులలో మాత్రమే అన్ని రకాల అభిప్రాయాలు ఎడిటింగ్స్ లేకుండా వస్తాయనే అభిప్రాయం ఉండవచ్చు.
 • మొత్తం మీద జనరలైజ్ చేసి స్వీయ మానసిక ధోరణులకు లోను కాకుండా బ్లాగులో వ్రాతలెలా ఉండాలీ అంటే మీరేమి చెపుతారు?

------------------------------------------------
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.

  *Re-published
  Reactions:

  Post a Comment

  1. కొండలరావు గారూ ! బ్లాగు అనేది భావ వ్యక్తీకరణకు వాడుకొనే ఓ మాధ్యమం.

   అది ఎలా అయినా ఉండొచ్చు .

   కానీ నా అభిప్రాయం ఏమిటంటే

   " ఓ బ్లాగర్ తన బ్లాగును ఏదైనా సంకలిని లో కలపాలని నిర్ణయించుకుంటున్నప్పుడు తన అభిప్రాయాలను చెపుతూనే వేరేవారి సాంప్రదాయాలకు, సంసృతికి, ఆలోచనలకు తన తపాల ద్వారా భంగం వాటిల్లకుండా చూడాలి. "

   " ఒకవేళ ఏ సంకలిని లోనూ తన బ్లాగులేనప్పుడు ఎలాగైనా చెప్పుకోవచ్చు. "
   ఏమంటారు?

   ReplyDelete
  2. శ్రీనివాస్ గారూ నాదో సందేహం.

   1930ల్లోనే బ్లాగులుండేవనుంకుందాం. మనం నేడు వైతాళికులుగా భావిస్తున్నా శ్రీ వీరేశలింగం, గురజాడ లాంటివాళ్ళు బ్లాగులు రాస్తున్నారనుకుందాం. ఇప్పుడు ఈ సందర్భాన్ని మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం.

   నా ఉద్దేశ్యం : సంస్కృతీ, సాంప్రదాయాలకు ఎదురువెళ్ళవచ్చు. కానీ, ఒక తర్కబద్ధమైన వ్యక్తీకరణతో (సభ్యమైన కానవసరంలేదు). ఓవేళ పైనుదహరించినవాళ్ళుకూడా private blogs రాసుకొనుంటే వాళ్ళభావాలు నేడు రాజ్యమేలిటివా?

   ReplyDelete
  3. శ్రీనివాస్ గారు.

   వ్యక్తులను కించపరచకూడదు తప్ప, ఎదుటివారి భావాలకు భంగం కలుగకుండా మన అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం లేదని నేను అభిప్రాయపడుతున్నాను.

   ReplyDelete
  4. అంటే ఎదుటివారి భావాలకు భంగం కలిగేలా అభిప్రాయాలు చెప్పాలనా? నాకు అర్ధం కాలేదు మీరేమన్నారో !!!!

   ReplyDelete
  5. తప్పకుండా ! వారు వ్రాసిన పుస్తకాలు, వ్యాసాలూ ఇప్పటికీ ఆదర్శనీయం ఆచరణీయం కాదా? కొన్ని అప్పటి పరిస్టితులకనుకోవచ్చు ... ఇప్పుడు ఉన్న సమస్యలకు, దురాచారాలకు వ్యతిరేకంగా వ్రాస్తున్న ఎన్నో బ్లాగులు ప్రపంచవ్యాప్తంగా హిట్ అయ్యాయి ..అవుతున్నాయి. ( విమర్శించేవారు ఉండవచ్చు అనుకోండి )

   ReplyDelete
  6. ఎదుటివారి భావాలకు భంగం కలిగించేలా చెప్పండి అని నేను చెప్పలేదు. భంగం కలిగించకుండా మాత్రమే చెప్పలేము అంటున్నాను.


   ఒక మూఢనమ్మకాన్ని మూఢనమ్మకమని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం అదెలా నష్టం కలిగిస్తుందో శాస్త్రీయంగా వివరణ ఇస్తున్నాము అనుకోండి. ఆ మూఢ నమ్మకాన్ని నమ్మే లేదా పాటించే వ్యక్తి భావాన్ని మనం ఖండించినట్లా? కాదా?


   ఆ సందర్భంలో ఫలానా వ్యక్తినే టార్గెట్ చేస్తున్నట్లు కాదు ఫలానా అంశాన్ని టార్గెట్ చేస్తున్నట్లు అర్ధం. ఆ అంశం పై అదే అభిప్రాయం కలిగిన వారందరి అభిప్రాయంపై చైతన్యం కలిగించేందుకు చెపుతున్నట్లు అర్ధం చేసుకోవాలి. ఇది మీరు మొదటి కామెంట్లో చెప్పినదానికి భిన్నమైనది.


   అందుకే వ్యక్తుల అభిప్రాయాలను భంగం కలుగకుండా అభిప్రాయం చెప్పడం ఏ ఘర్షణా లేకుండా భావజాలం వ్యాప్తి కావడం జరుగదు.


   అయితే కావాలని వ్యక్తులను టార్గెట్‌గా పెట్టుకుని అభిప్రాయం చెప్పకూడదు. వాదించేటప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేయకూడదు.

   ReplyDelete
  7. Nag గారు, తర్కబద్ధమైనది సభ్యమైనదే అవుతుంది. తర్కం సభ్యతగానే ఉండాలి.

   ReplyDelete
  8. శ్రీనివాస్ గారు,

   వీరేశలింగం, గురజాడ చెప్పినవి ఇప్పటికీ ఆదర్శాలే, కానీ వారు వ్రాసే కాలంలో వ్రాయడానికే భయపడేవి. ఈనాడు మనం వారి గురించి చెప్పుకుంటున్నాము. కానీ ఆనాడు అలాంటి భావం వ్యాప్తి చేయడానికి చాలా ఇబ్బందులుండేవి.


   ఇప్పుడు కూడా ఇతర అంశాలు అలా ఉన్నవి చాలా ఉన్నాయి. అలాంటప్పుడు ఇతరుల భావాలు, సాంప్రదాయాలు, సంస్కృతికి భంగం వాటిల్లకుండా మనం టపాలు వ్రాయాలి అనడం సరయినది కాదు.


   సంస్కృతి-నీతినియమాలు-కట్టుబాట్లు మనిషి ఏర్పాటు చేసుకున్నవే. ఇందులో దుర్మార్గమైనవి-అశాస్త్రీయమైనవి ఆచరణలో నిలబడవు. ఆచరణలో నిలబడవు అనేది ఏకకాలంలో ఏ భావ సంఘర్షణ జరుగకుండా పోరాటం లేకుండా జరుగదు.


   దేవాలయాల్లోకి ఫలానా కులం వారు రాకూడదు అనే భావం పై భంగం కలుగకుండా వ్రాయాల్నా? వద్దా?


   ఇది శాస్త్రీయంగా చెప్పాలనుకున్నప్పుడు మనిషికి - మనిషే ఏర్పాటు చేసుకున్న దేవుడికీ మధ్య అడ్డుగోడలు ఏర్పాటు చేసిందీ మనిషేనని నిర్ద్వంధ్వంగా చెప్పాలి.


   అలా చెప్పేటప్పుడు ఒకవేళ కాలమాన పరిస్తితులను బట్టి ఎక్కువమందికి ఇష్టం లేకున్నా, వారి భావాలకు భంగం వాటిల్లుతుందనుకున్నా తప్పుని తప్పని చెప్పలేము కదా?

   ReplyDelete
  9. "దేవాలయాల్లోకి ఫలానా కులం వారు రాకూడదు" అనేది భావమా? లేక మూడనమ్మకమా???

   ReplyDelete
  10. ఏది భావం? ఏది మూఢ నమ్మకం? అనేది అర్ధం చేసుకోవాలి ముందుగా.

   మూఢ నమ్మకాలనే భావాలుగా కూడా కలిగి ఉంటారు. భావం అనేది శాస్త్రీయంగా ఉండొచ్చు. అశాస్త్రీయంగా ఉండొచ్చు.

   సమాజంలోని పరిస్తితులను బట్టి వ్యక్తికి భావాలు ఏర్పడుతుంటాయి. అవి తర్కం లేదా చర్చల ద్వారా మార్పు చెందుతుంటాయి. వ్యక్తి చైతన్యం ఇనుమడిస్తుంటుంది. అయితే చైతన్యం పెంచుకోవడం అనేది ఆ వ్యక్తి ధోరణి పై ఆధారపడి ఉంటుంది.

   ReplyDelete
  11. కొండలరావు గారూ.. నా మొదటి కామెంట్ మీరు అపార్ధం చేసుకోవద్దు. సమాజంలో పత్రికలు, టీవీ ఎలాగో బ్లాగులోకానికి "సంకలిని" లు అలాంటివి . వాటికి కొన్ని పరిమితులు,అందరి భావాలను గౌరవించవలసిన బాధ్యత ఉంటాయి . అందుకే వాటిలో బ్లాగును కలపాలనుకున్నప్పుడు అవి చదివేవారి "సాంప్రదాయాలకు, సంసృతికి, ఆలోచనలకు తన టపాల ద్వారా భంగం వాటిల్లకుండా చూడాలి." అని మొదట చెప్పాను. భిన్నమైన అభిప్రాయం చెప్పవద్దనలేదు. మీరన్నట్లు వ్యక్తులను ఘర్షణావైఖరితో టార్గెట్ చెయ్యవద్దని దాని అర్ధం .
   ఒకవేళ సంకలిని లో తన బ్లాగు లేనప్పుడు ఎలాగైనా ( ఎటువంటి వైఖరి తోనైనా ) చెప్పవచ్చు. చదివేవారు చదువుతారు లేని వాళ్ళు ఆ బ్లాగుకే రారు. ..

   ReplyDelete
  12. శ్రీనివాస్ గారు, నేను మీ వ్యాఖ్యను బట్టి నా అభిప్రాయం చెప్పానండీ. ఇప్పుడు మీరు చెప్పినది సరిగానే ఉంది. వ్యక్తులను టార్గెట్ చేయకుండా మన అభిప్రాయం భిన్నమైనదైనా చెప్పడం సరయినది. ఏ అభిప్రాయం కరెక్టో తేల్చుకునేలా వాదన ఎంతైనా ఉండొచ్చు. వాదనలో వ్యక్తుల గొప్పతనం-పాండిత్య ప్రతిభ ప్రదర్శన సరయినది కాదని నా అభిప్రాయం. ఎవ్వరికీ ఎప్పటికీ అన్ని విషయాలూ తెలియవు. కనుక ఎవరైనా ఎప్పటికీ తనకు తెలియంది తెలిసినవారి వద్దనుండి తెలుసుకోవలసిందేననై నా అభిప్రాయం.

   ReplyDelete
  13. Dear Kondal Rao Garu, first of all i would like to congratulate and appreciate your efforts in bringing such a wonderful blog. Kindly excuse me as i cant type in telugu hence i am writing in english only. The way blog is presented is too good & quite impressed by the look & feel of the template. Could you pls share the name of the template so that i would like implement it on my blog Telugu Rhymes

   ReplyDelete

  * మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
  * పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
  * నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
  * పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
  * ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
  * అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
  * తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
  * మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
  * మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
  * తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

  అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర చర్చావేదిక జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
   
  Top