Name:Srikanth Chari 
E-Mail:deleted  
Subject:ఉమ్మడి రాష్ట్రంలోని వినియోగ దామాషాలు ఇప్పుడూ పాటిస్తుంటే తెలంగాణాలో తీవ్రమైన విద్యుత్ లోటు, అదేసమయంలో ఆధ్రప్రదేశ్‌లో 100% విద్యుత్తు ఎలా సాధ్యమైంది? 
Message:
తెలంగాణాలో వినియోగం ఎక్కువగా వుంటుందని తెలిసీ, బొగ్గు నిలువలు అత్యధికంగా తెలంగాణలో వున్నప్పటికీ, అప్పటి పాలకులు పక్షపాత బుద్ధితో విధ్యుత్ ఉత్పత్తి కేంద్రాలను సీమాంధ్రలోనే నిర్మించారు. విభజన తర్వాత ఆర్డినెన్సు ద్వారా తెలంగాణాకు చెందిన సీలేరు పవర్ ప్రాజెక్టును సీమాంధ్రలో కలిపారు. అయినప్పటికీ విభజన సందర్భంలో వినియోగ దామాషా ప్రకారం తెలంగాణాకు అధిక శాతం విద్యుత్తు కేటాయిస్తూ బిల్లులో పొందుపరచ బడింది.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత కొత్తగా శంకుస్థాపన చేసి నిర్మాణం పూర్తి చేసిన ప్రాజెక్టులు ఏమీ లేవు. ఉన్న ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినవే. అప్పటి విద్యుత్ పంపకాలను యధాతథంగా అమలు చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఉన్నది.

తెలంగాణ ప్రభుత్వం తనకు లభించిన ఉత్పత్తికేంద్రాల పూర్తి కెపాసిటీని వినియోగిస్తూ, ఆంధ్ర నుంచి వస్తున్నది కాక, సదరన్ గ్రిడ్ మొత్తం మిగులులో 75% కొనుగోలు చేస్తుంది. అయినా కూడా తెలంగాణాలో విద్యుత్ సరిపోవడం లేదు. గ్రామీణ ప్రాంతాలకు 3 గంటలు కూడా రావడం లేదు. హైదరాబాదులో కూడా ఎన్నడూ లేనంత పవర్‌కట్ ఉంది. పరిశ్రమలకు వారానికి రెండురోజుల పవర్ హాలిడే ప్రకటించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్‌కట్ లేని సంవత్సరమే లేదు. చలికాలంలో పవర్ కట్ అమలు చేసిన సందర్భాలు ఎన్నో. అటువంటిది నాలుగు నెలల నవ్యాంధ్ర పాలనలో 100% పవర్ సప్లై ఎలా సాధ్యమైంది? అదే సమయంలో తెలంగాణా రాష్ట్రానికి గతంలో ఎప్పుడూ లేనంత లోటు ఎలా ఏర్పడింది?

విభజన సమయంలో దామాషా నిర్ణయించడంలో తప్పు జరిగిందా?

లేక నిర్ణీత దామాషా ప్రకారం AP విద్యుత్ సరఫరా చేయడానికి నిరాకరిస్తుందా?

లేకపోతే అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌లోనూ సీమాంధ్రలో కోత పెట్టక 100% కరెంటు ఇస్తూ రెండువేపులా సమానంగా కోత విధించినట్టు తెలంగాణా వారిని భ్రమింప జేశారా? 
Reactions:

Post a Comment

 1. ఈ ప్రశ్నకు సీమాంధ్ర సోదరులనుండి సమాధానం వస్తుందని ఆశించాను. కాని ఇంతవరకు ఒక్క స్పందన కూడా లేక పోవడం ఆశ్చర్యంగా వుంది.

  ReplyDelete
  Replies
  1. ఈ ప్రశ్నలకు సమాధానాలు అవసరం ఉన్నది.

   Delete
  2. కరెంటు కష్టాలు ఎందుకు ఉన్నాయి?
   ఒక్క ముక్కలో చెప్పాలి అంటే .. "శకుని రాజకీయాలు". "మీ శకుని రాజకీయాలు మీరు జేశారు, ఒల్లుమండి, మా శకుని రాజకీయాలు మేమూ జేస్తున్నాం". ఎవరి "శకుని రాజకీయాలు" వారికున్నాయి. (హ హ)

   ఏంటా శకుని రాజకీఆయాలు?
   శకుని రాజకీయాలేంటో, మీకూ తెలుసూ మాకూ తెలుసు. చేసినవారు, చేస్తే వెనకేసుకు వచ్చిన వారూ మీకు తెలీదా, తిరిగి జేస్తున్న వాల్లం, మాకూ తెలీదా..?

   నా అభిప్రాయాన్ని టైపు జేసే కన్నా, తెలంగాణా కరెంటు కష్టాల గురించి ఓ వ్యకి విపులంగా రాస్తున్నాడు. ఆవ్యక్తి రాసిన లింకులిస్తాను. దానిలో "శకుని రాజకీయాలతో" సహా విపులంగా వివరిస్తూ రాయడం జరిగింది. ఆ సిరీస్ ఇంకా రన్నింగులో ఉంది. ఇప్పటికి వరకూ రాసినవి ఇస్తున్నావు, ఇక మీదట రాయబోయేవి మీరే చదువుకోండి.

   అన్నట్టు, ఈ లింకులు నేను "శకుని రాజకీయాలు" అంటే ఏమీ తెలీని అమాయకుల కోసం ఇస్తున్నాను. అన్నీ తెలిసిన వారికోసం కాదు.

   ఎమ్బీయస్‌ : కలహాలతో కరంటు వచ్చేనా? - 1
   ఎమ్బీయస్‌ : కలహాలతో కరంటు వచ్చేనా? - 2
   ఎమ్బీయస్‌ : కలహాలతో కరంటు వచ్చేనా? - 3
   ఎమ్బీయస్‌ : కలహాలతో కరంటు వచ్చేనా? - 4
   <a href="http://telugu.greatandhra.com/articles/mbs/mbs-kalahalatho-current-vachenaa-56455.html>ఎమ్బీయస్‌ : కలహాలతో కరంటు వచ్చేనా? - 5</a>

   సీమాంధ్రుల సోదరులా? తెలంగాణా సోదరులు, సీమాంధ్ర సోదరులు అని మనం పరస్పరం పిలుచుకుంటే .. ప్రపంచములో "సోదర భావానికి" బ్యాడ్ నేం వస్తుందేమో అన్న భయం పట్టుకుంది నాకీ మధ్య.

   Delete
  3. పైన ఇచ్చిన లింకు ఒకటి సరిగా లేదు. దాన్ని, కొత్తగా వచ్చిన చివరి భాగాన్ని కలిపి ఇస్తున్నాను. దీన్ని చదివి, కాస్త అవగాహనకు వస్తారని భావిస్తున్నను. (వీటి గురించి తెలీని అమాయకులు కోసమే ఈ లింకులు, "శకుని రాజకీయాలు" చేస్తూ, వాటిని సమర్ధిస్తూ, పైకి మాత్రం అమాయకత్వాన్ని నటిస్తున్న వారికోసం కాదు).

   ఎమ్బీయస్‌ : కలహాలతో కరంటు వచ్చేనా? - 5
   ఎమ్బీయస్‌ : కలహాలతో కరంటు వచ్చేనా? - 6

   కుట్రలూ, కుతంత్రాలూ - తరువాత తీరిగ్గా ఏడుపులూ పెడబొబ్బలూ. తమ చేతగాని తనాన్ని, ముందు చూపు ఏమాత్రం లేకుండా (కరెంటు)"కోతలు" కోసిన వైనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పక్క రాష్ట్రాల మీద, వారి నాయకుల మీద పడి ఏడుపులు, ఇవన్నీ మానేసి, ప్రశాంతంగా ఇరువురూ కూర్చుని మాట్లాడుకుని ఇచ్చి పుచ్చుకునే ధోరని కనబరిస్తే, పరిష్కారం కాని సమస్యలు ఉండవు. ఒకరు కష్టాలతో మరణిస్తూ ఉంటే చూసి ఆనందించాలన్న కోరిక ఎవ్వరికీ ఉండదు. కానీ, నాయకులలో తెలివిడి లోపించి, ప్రజా సంక్షేమాన్ని అహమో, "హిడెన్ ఎజెండాలో" డామినేట్ చేస్తే, పరిష్తితులు ఇలానే ఉంటాయి. అవన్నీ, నాయకుల స్వయంకృతాలే. మరొకరిని నిందించి ఏమిలాభం??

   Delete
 2. విభజన సమయంలో దామాషా నిర్ణయించడంలో తప్పు జరిగిందా?
  >> ఖచ్చితంగా. అసలు ఈ ప్రశ్న ఎందుకు లేవనేత్తల్సి వచ్చిందో కూడా ఆలోచించాలి. రాష్ట్ర విభజన యెంత అడ్డగోలుగా, సరైన దిశా నిర్దేశం లేకుండా జరిగిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

  లేక నిర్ణీత దామాషా ప్రకారం AP విద్యుత్ సరఫరా చేయడానికి నిరాకరిస్తుందా?
  >> 'AP విద్యుత్ సరఫరా చేయడానికి నిరాకరించడం లేదు' అని ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. కాబట్టి, ఒక విధంగా నిరాకరిస్తుంది అనే చెప్పవచ్చు.

  రాష్ట్ర విభజన అనంతరం 'ఏ రాష్ట్రానికి యెంత' అనే దానిపై సరైన అవగాహన లేకుండా, ఎక్కడా విపులంగా ప్రస్తావించకుండా కానిచ్చేసారు. ఆ లొసుగల వల్లనే ఇప్పుడు తెలంగాణా విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఆ లోసుగులని అడ్డం పెట్టుకుని ఇప్పుడు సీమాంధ్ర ప్రభుత్వం 'We are not bound by anything' అనే వాదన వినిపిస్తోంది.

  కరంటు విషయంలో సీమాంధ్ర ప్రభుత్వానిది పై చేయి. అది ఎప్పుడూ పైనే వుండదు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు అందరికి శ్రేయస్కరం. కరంటు విషయంలో సీమాంధ్ర ప్రభుత్వం ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనపరిస్తే మంచిది.

  లేకపోతే అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌లోనూ సీమాంధ్రలో కోత పెట్టక 100% కరెంటు ఇస్తూ రెండువేపులా సమానంగా కోత విధించినట్టు తెలంగాణా వారిని భ్రమింప జేశారా?
  >> హ హ హ! పోయిన సంవత్సరం సీమాంధ్రలో కరంటు కష్టాలు యెంత దారుణం అంటే ఒక పల్లెటూరు నుండి, ఒక కుర్రాడు ఉదయమే ఒక ముప్పై నలభై సెల్ ఫోన్స్ తీసుకుని వూరికి 20 కి.మీ. దూరంలో వున్న రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ ఛార్జింగ్ చేసుకుని రావడం నాకు తెలుసు. అలా చేసుకుని రావడం ఆ అబ్బాయికి పాకెట్ మనీ అన్న మాట. శ్రీకాకుళం లోని ఒక పల్లెటూర్లో రోజుకి 4 గంటలు వుండేది - కరంటు కోత కాదు, కరంటే 4 గంటలు వుండేది. విజయనగరంలో రోజుకి 7 కరంటు కోత వుండేది.

  తెలంగాణా మిత్రులకి నా మనవి: నేను తెలంగాణా వ్యతిరేకిని కాను. సీమాంధ్రని గుడ్డిగా అభిమానించేవాడిని కాను. రెండు రాష్ట్రాలు బాగుండాలనే నా ఆకాంక్ష.

  ReplyDelete
 3. ఆంధ్ర లో 100% విద్యుత్ అనేది కేవలం భ్రమ మాత్రమే. అందులో నిజం లేదు. ఆంధ్ర కూడా వేరే రాష్టాల నుండి విద్యుత్ కొంటుంది. కానీ తెలంగాణా కంటే పరిస్తితి మెరుగు.

  ఆంధ్ర లో 100% విద్యుత్ అనేది కేవలం భ్రమ మాత్రమే. అందులో నిజం లేదు. ఆంధ్ర కూడా వేరే రాష్టాల నుండి విద్యుత్ కొంటుంది. కానీ తెలంగాణా కంటే పరిస్తితి మెరుగు.

  దామాషాల లెక్కలలో తేడా ఉంటే ఉండవచ్చు. ఉమ్మడి రాష్ట్రం లో హైదరాబాద్ అనే ఏనుగు కోసం, మిగిలిన అన్ని ప్రాంతాలు అంధ కారంలో ఉండేవి.

  కొత్త ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ కోసం త్యాగం చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర కి హైదరాబాద్ ప్రధానం కాదు. స్తానిక ప్రజల, పరిశ్రమల, కాబోయే రాజధాని ప్రాంత అవసరాలు ప్రధానం.

  విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం లో, ఉత్పత్తి లో తెలంగాణా కి అన్యాయం జరిగి ఉంటే అది గత పాలకుల తప్పిదమే. పాలకులు అంటే 294 MLAs+42 MPs...

  ReplyDelete
  Replies
  1. ప్రవీణ్ చాలా కరెక్టుగా అభిప్రాయం చెప్పారిప్పుడు.

   Delete
  2. అయితే ఆంద్రప్రదేశ్లో 100% కరెంటు ఇస్తున్నారని తెతెదేపా వారు చెప్పుకుంటూ తిరగడం ఉత్తిదేనా?

   Delete
  3. >>> ఆంధ్ర లో 100% విద్యుత్ అనేది కేవలం భ్రమ మాత్రమే. అందులో నిజం లేదు. ఆంధ్ర కూడా వేరే రాష్టాల నుండి విద్యుత్ కొంటుంది. కానీ తెలంగాణా కంటే పరిస్తితి మెరుగు.

   అయినా కూడా రెండు రాష్ట్రాల విద్యుత్ లభ్యతలో చాలా వ్యత్యాసం వుందన్నది వాస్తవం. దామాషాలను నిపుణులు లెక్కిస్తారు కాబట్టి మరీ ఇంతటి వ్యత్యాసాలు రావడానికి అవకాశం లేదు. కాబట్టి విభజన బిల్లులోని దామాషాలను AP అమలు పరచడం లేదని స్పష్టంగానే తెలుస్తోంది.

   >>> కొత్త ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ కోసం త్యాగం చేయలేరు.

   ఏవరూ ఎవరికోసం త్యాగాలు చేయనవసరం లేదు. బిల్లు ఇచ్చిన దామాషాలను గౌరవిస్తూ మోసాలు చేయకుండా నడుచుకుంటే సరిపోతుంది.

   >>> స్తానిక ప్రజల, పరిశ్రమల, కాబోయే రాజధాని ప్రాంత అవసరాలు ప్రధానం.

   ఎవరి అవసరాలు వారికుంటాయి. కాని ఒప్పందలను అమలు పరచడం తప్పని సరి. కరెంటు ఆంధ్రా నుండి రావలసినట్టే నీరు కర్నాటక, తెలంగాణాల నుండి రావాలి. మాకు అవసరం వుండి అని ఆపి వేస్తే ఊరుకుంటారా?

   Delete
  4. అయితే ఆంద్రప్రదేశ్లో 100% కరెంటు ఇస్తున్నారని తెతెదేపా వారు చెప్పుకుంటూ తిరగడం ఉత్తిదేనా?
   >> అవును. ఉత్తిదే.

   అయినా కూడా రెండు రాష్ట్రాల విద్యుత్ లభ్యతలో చాలా వ్యత్యాసం వుందన్నది వాస్తవం.
   >> అవును. ఈ వాస్తవాన్నే గత ప్రభుత్వాన్ని నడిపించిన కిరణ్ కుమార్ రెడ్డిగారు చెప్పారు. "తెలంగాణా విద్యుత్ సంక్షోభంలో పడుతుంది అని" చెప్పారు కూడా. ఆయన చెప్పిన తరువాత కూడా విభజన బిల్లు లో విద్యుత్ పంపకాల గురించి స్పష్టంగా రాయలేదు - దాని గురించి చర్చ కూడా జరగలేదు.

   కాబట్టి విభజన బిల్లులోని దామాషాలను AP అమలు పరచడం లేదని స్పష్టంగానే తెలుస్తోంది
   >> విభజన బిల్లులోని దామాషాల గురించి మీరు కొంచెం వివరణ ఇవ్వండి. విభజన అనంతరం యే రాష్ట్రానికి యెంత అని యెక్కడ రాసారు? లింక్ లు ఇవ్వగలరు.

   బిల్లు ఇచ్చిన దామాషాలను గౌరవిస్తూ మోసాలు చేయకుండా నడుచుకుంటే సరిపోతుంది.
   >> "మోసం" అని మీరు అనుకుంటున్నారు. విభజన బిల్లులో స్పష్టంగా లేదు కాబట్టి ఇవ్వనక్కరలేదు అని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటోంది.

   కరెంటు ఆంధ్రా నుండి రావలసినట్టే నీరు కర్నాటక, తెలంగాణాల నుండి రావాలి. మాకు అవసరం వుండి అని ఆపి వేస్తే ఊరుకుంటారా?
   >> నీళ్ళు ఆపేస్తాం అని హరీష్ రావ్ పేలాడు. అప్పట్లో జోరుగా వర్షాలు కురిసి నీళ్ళు వదలకపోతే వరద వచ్చే ప్రమాదం వుందని అధికారులు బుద్ది చెబితే ఊరుకున్నాడు.

   సీమాంధ్ర జలాశయాల్లో నుండి విద్యుత్ గాలి నుండి పుట్టడం లేదు. నీళ్ళ వల్లనే పుడుతోంది. మీరు నీళ్ళు ఆపేస్తే అసలు విద్యుత్ ఉత్పత్తి వుండదు [అదీ తెలంగాణా నుండి నీరు వచ్చే కొన్ని జలాశయాల్లొనె]. మరి అప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?

   ఇప్పుడైతే తెలంగాణలో విద్యుదుత్పత్తి చేయడానికి వనరులు లేవు. ఇప్పుడు ఆ పనులు మొదలెట్టి రెండు మూడు సంవత్సరాలలో జలాశయాలు కట్టేసి సీమాంధ్రకు అస్సలు నీరు రాకుండా చేస్తారు. అప్పుడు సీమాంధ్ర మొత్తుకున్నా ఎవ్వరూ పట్టించుకోరేమో. ఆ పరిస్తితే వస్తే మీరేం చేస్తారు? ఇప్పుడు తెలంగాణాకు అన్యాయం జరుగుతుందని అంటున్న మీరు అప్పుడు ఏం చేస్తారు?

   Delete
 4. చక్కగా చెప్పారు ప్రవీన్.

  ReplyDelete
 5. తెలంగాణా విద్యుత్ కొరతపై చంద్రబాబుని నిందించదం పై ఆయనిచ్చిన సమాధానం:
  http://newjings.blogspot.in/2014/10/blog-post.html

  విద్యుత్తంతా యెటు పోతోంది?
  http://www.eenadu.net/news/newsitem.aspx?item=panel&no=3

  ReplyDelete
  Replies
  1. సమైక్య ప్రభుత్వంలో తెలంగాణాలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణంలో చంద్రబాబు తెలంగాణాకు ఏమి న్యాయం చేశాడో చెప్పగలరా హరిబాబు గారు?

   ఈనాడు ఆర్టికల్ నమ్మశక్యంగానూ లేదు. సమగ్రంగానూ అనిపించడం లేదు.

   కే.సీ.ఆర్ ప్రభుత్వం పొరుగువారిపై నిందలు మాని తక్షణం ఏమేమి చేయాలో, దీర్ఘకాలికంగ ఏమి చేయాలో తేల్చుకోలేకపోతే ఎన్ని రాజకీయ గిమ్మిక్కులు వేసినా తెలంగాణా ప్రజలు క్షమించరు. కరెంటు కష్టాలిలాగే ఉంటే ప్రజాగ్రహం తప్పదు. సామాన్య ప్రజానీకానికి లోతైన లెక్కలు అర్ధంకావు. అవసరమూ లేదు. వారికి కావలసింది వారి అవసరం తీరడమే. ఇందులో వారి చైతన్యాన్ని అర్ధం చేసుకోవడం తప్ప తప్పు పట్టి అప్పుడు ఉపయోగముండదు.

   Delete
  2. సమైక్య ప్రభుత్వంలో తెలంగాణాలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణంలో చంద్రబాబు తెలంగాణాకు ఏమి న్యాయం చేశాడో చెప్పగలరా హరిబాబు గారు?
   >>
   సమైక్య ప్రభుత్వంలో జరిగిన తప్పులకు 94 MLAs+42 MPs. అనే ప్రవీణ్ అభిప్రాయంతో యేకీభవిస్తాను!
   ఇప్పుడు యేమి చేయాలనేది మీరు చెప్పినట్టు ప్రజలకి అర్ధం కాని విశ్లేషనలూ దూషణల కన్నా వీలయినంత కొనడం, సమకూఎచుకోవదం తప్పదు. మూడేళ్ళ వరకూ సమస్యలు తప్పవు అనే పాట యెక్కువ రోజులు పని చెయ్య్యదు.

   Delete
  3. >>> సమైక్య ప్రభుత్వంలో జరిగిన తప్పులకు 94 MLAs+42 MPs.

   రాష్ట్రాన్ని విడగొట్టింది 540 MPs అనుకోక మరి సోనియా మీద, కాంగ్రెస్ మీద ఏడుస్తారెందుకు?

   Delete
  4. ఇప్పుడు కేటీఆర్ చెప్పే మాట : విద్యుత్ సంక్షోబానికి కారణం ఎవరు? గత ప్రభుత్వం
   కొద్ది రోజుల తరువాత 'అసలు తెలంగాణా వస్తే విద్యుత్ సమస్యలు వస్తాయి అని మేం జెప్పినా వినకుండా గాంక్రెస్ మనల్ని విడదీసింది' అని అంటాడు.

   Delete
 6. @ ఉమ్మడి రాష్ట్రంలోని వినియోగ దామాషాలు ఇప్పుడూ పాటిస్తుంటే తెలంగాణాలో తీవ్రమైన విద్యుత్ లోటు, అదేసమయంలో ఆధ్రప్రదేశ్‌లో 100% విద్యుత్తు ఎలా సాధ్యమైంది?

  ఎలా అంటే, చంబు దగ్గర మంత్రం దండం ఉంది, అందరికి ఈ విషయం తెలుసే !!

  ReplyDelete