Name:Srikanth Chari 
E-Mail:deleted  
Subject:హుదూద్ తుఫాన్ను ఎదుర్కోవడంలో AP CM చంద్రబాబు పనితీరుపై మీ అభిప్రాయం?
Message:క్రింది వ్యాసం చూడండి

http://gandhipv.wordpress.com/2014/10/15/pointed-questions-to-cbn-on-readiness-and-response-to-hudhud/

ఈనెల ఏడవ తేదీనే వాతావరణ శాఖ తీవ్రమైన తుఫాను గురించి హెచ్చరించింది నిజం కాదా?

పెనుతుఫాను ఉత్తరాంధ్ర ముంగిట్లో వుంటే తొమ్మిదో తేదీ దాకా వున్న మూడురోజుల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ముందుజాగ్రత్త, పునరావాస చర్యలు ఏమిటి?

ఒకవైపు పెనుతుఫాను ముంగిట్లో నిలుచుంటే, KCRను విమర్షిస్తూ రాజకీయాలు నడపడానికి మనస్సు కేంద్రీకరిస్తూ విలువైన సమయాన్ని వృధా చేయడం సమర్ధనీయమేనా?

చూ: https://www.youtube.com/watch?v=KOylSNa_Bwk

తెలంగాణాలో బస్సుయాత్ర జరపించడంలో వున్న శ్రద్ధ తుఫానుకు ముందస్తు చర్యలమీద కనిపించిందా?

సరిపడ్డంత సమయం వున్నా ముఖ్యమంత్రి ముందస్తుగా వైజాగ్‌లో పర్యటించి సహాయక చర్యలను స్వయంగా ఎందుకు పర్యవేక్షించలేదు?

తుఫాను తీరం దాటుతున్న సమయంలో ముఖ్యమంత్రి కంట్రోల్ రూములో పరిస్థితులను సమీక్షిస్తూ, నిర్ణయాలు తీసుకుంటూ గడపవలసిన అత్యంత విలువైన సమయాన్ని మీడియాను పోగేసుకుని పిచ్చాపాటీ జరపడానికి వెచ్చించడం ఎంతవరకు సమర్ధనీయం? చివరికి ప్రధానితో కూడా మీడియా ముందే చర్చించడం చంద్రబాబు ప్రచారార్భాటానికి అద్దం పట్టడం లేదా?

తుఫాను అనంతర పరిస్థితులను ఎదుర్కోవడానికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలేమిటి?

పొరుగు రాష్ట్రమైన తెలంగాణా ప్రభుత్వ, ప్రజలయొక్క సహాయం పొందడానికి చంద్రబాబు చూపిన చొరవ ఏమిటి?

విశాఖ అంధ్కారంతో ఉన్న సమయంలో ఆపన్న హస్తం అందిస్తూ కోట్ల విలువైన విద్యుత్ పరికరాలను, ఐదుగురు IAS అధికారులను పంపించిన తెలంగాణా ప్రభుత్వంపై చంద్రబాబు వైపునుంచి గుర్తింపుగా ప్రతిస్పందన కనిపించిందా?  

                  


Reactions:

Post a Comment

  1. చంద్రబాబు సమస్యలపైనా అదీ తనకు పేరు తెచ్చి పెడతాయన్న సమస్యలపై బాగానే స్పందిస్తారు. బద్దకం ఉండదు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలనిచ్చే సమస్యలపై కంటే తనకు కీర్తి తెచ్చే వాటిపై ఎక్కువ దృష్టి పెడుతుంటాడు. కీర్తి కండూతి దూల బాబుకు ఎక్కువే. ఆ దూల వల్ల అతనికి లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇప్పటికీ దానిని వదిలించుకోబుద్ది కావడం లేదేమో పాపం!

    ReplyDelete
  2. ఒక్కో ప్రశ్నకు మార్కులు 5.
    మొత్తం 10X5 = 50 మార్కులు.
    ఆలశించిన ఆశా భంగం.

    ReplyDelete
  3. ఇక్కడ చంద్రబాబు గురించి పక్కన పెడితే, తుఫాను విలయం నుంచీ ఎలా తప్పించాలి అని ఆలోచిస్తే, నాకు ఇవి తెలిసాయి
    ౧. తీర ప్రాంతంలో చెట్లు పెంచాలి, దాని వల్ల ఒక వేళ అల్పపీడ ద్రోణి ఏర్పడినా అది ప్రజల దగ్గరకు చేరదు
    ౨. తీర ప్రాంతాలలో మాత్రమె కాకుండా అన్ని ప్రాంతాలలో చెట్లు పెంచాలి దాని వల్ల ఉపరితల ఆవర్తనం తక్కువ ఉంటుంది.
    ౩. పరిశ్రమలు ఇళ్ళు కూడా ఒక అడుగుకు ఒక అడుగు నిష్పత్తిలో చెట్లు ఉండాలి.
    ఇప్పుడు మనం తుఫాను నుంచీ తప్పించుకోగలం!

    ఇప్పుడు చంద్రబాబు గురించి మాట్లాడుదాం!
    వారం రోజుల నుంచీ ఎ ఒక్క channel లో కూడా ఉపరితల ఆవర్తనం యొక్క ప్రభావం విశాఖపట్నం మీద ఉంటుంది అని చెప్పలేదు, మరి చంద్రబాబు ఎలా చేస్తాడు, కేవలం ౨౪ గంటల ముందు మాత్రమే విశఖ పట్నం మీదకు వస్తుంది అని చెప్పారు!
    అప్పటికీ ప్రాణ నష్టం లేకుండా నివారించ గలిగారు, ఆస్తి నష్టం ఎలా నివారించగలరు?
    అంటే అక్క ఓడ రేవుల దగ్గర ఉన్న ఓడలు ౨౪ గంటలలో వేరే చోటకు తరలించాలా? ఎలా తరలించగలం?
    ఇక ఇళ్ళు, అవి ఎలా తరలించగలం?
    ఇక పశు పక్ష్యాదులు, వీటిని మనిషులలో కొందరు ఆహారంగా చూస్తున్నారు కాబట్టి వాటిని పట్టించుకునే నాధుడే ఉండడు!
    ఇక వారం రోజులలలో అక్కడ మత్స్యకారులు కోసం పక్కా ఇళ్ళు నిర్మించగలడా ?

    మరి తుఫాను విపత్తు నుంచీ ఎలా కాపాడగలడు, తెలివైన వాడు చేసిన ప్రక్రుతి వినాశనాన్ని ఎవడూ ఆపలేడు!

    ఇక్కా నేను చంద్రబాబును పొగడట్లేదు, కేవలం సాధ్యా సాధ్యాలు చెప్పను!
    ఇక ఆనతి కాలంలో ప్రక్రుతి విపత్తు నుంచీ ప్రాణికోటి ని రక్షించాలి అంటే ఇప్పుడే చెట్లు నాటడం మొదలు పెడదాం!

    ReplyDelete
    Replies
    1. >>> కేవలం ౨౪ గంటల ముందు మాత్రమే విశఖ పట్నం మీదకు వస్తుంది అని చెప్పారు!

      వాస్తవం కాదు.

      చూ: http://www.imd.gov.in/section/nhac/dynamic/week.pdf

      The Cyclonic Storm 'HUDHUD' over southeast Bay of Bengal moved west-northwestward and
      intensified into a severe cyclonic storm and laid centered at 0830 hours IST of 9th October, 2014
      eastcentral Bay of Bengal near Lat.13.8°N and Long 89.0° E about 750 km southeast of Gopalpur
      and eastsoutheast of Vishakhapatnam. The system would continue to move west-northwestwards,
      intensify further into a very severe cyclonic storm during next 24 hours. The system would cross north Andhra Pradesh coast around Visakhapatnam by the forenoon of 12th October 2014.

      ఈ ప్రెస్ రిలీజ్ 8వ తేదీనే వచ్చింది. ప్రభుత్వ విభాగాలకు అంతకన్నా ముందే తెలిపి వుంటారు. అంటే ఏర్పాట్లకు కనీసం నాలుగు రోజుల సమయం వుండి.

      >>> అప్పటికీ ప్రాణ నష్టం లేకుండా నివారించ గలిగారు, ఆస్తి నష్టం ఎలా నివారించగలరు?

      ప్రాణ నష్టం మొన్నటి ఫైలీన్ కన్నా ఎక్కువే. ఈంతటి సమాచార వ్యవస్త ఉన్న రోజుల్లో అదేం గొప్ప విషయం కాదు.

      >>> అంటే అక్క ఓడ రేవుల దగ్గర ఉన్న ఓడలు ౨౪ గంటలలో వేరే చోటకు తరలించాలా? ఎలా తరలించగలం?

      ఓడలు తరలించాల్సిన అవసరం లేదు. తుఫాను తర్వాత ప్రజలకు కనీసం మంచినీళ్ళు, పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అవసరమౌతాయని ఊహించాల్సింది, అందుకు ఏర్పాట్లు చేసి ఉండాల్సింది. విషయమ్మీద సమావేశాలు పెడితే ఎవరినుంచైనా ఆలోచనలు లభిస్తాయి. అందుకు విరుద్ధంగా పక్కరాష్ట్రం మీదనే ధ్యాస పెడితే?

      Delete
    2. "అందుకు విరుద్ధంగా పక్కరాష్ట్రం మీదనే ధ్యాస పెడితే?"

      మోడీ ఒడీశాను పట్టించుకోలేదని ఎక్కుదో చదివినట్టు ఉంది చెప్మా :)

      Delete
    3. http://timesofindia.indiatimes.com/india/Cyclone-Hudhud-changes-path-in-Andhra-Pradesh/articleshow/44778731.cms
      ఇక్కడ కూడా ౧౧ వ తేదీ నాడు
      Meanwhile, an official IMD bulletin put out at 8.30pm on Friday said the cyclone had moved northwestwards during the past six hours and now lay about 460 km east-southeast of Visakhapatnam and 490km south-southeast of Gopalpur in Odisha. The system was likely to move northwestwards and cross north Andhra Pradesh coast around Visakhapatnam by the forenoon of October 12, the bulletin said.

      ఇక మీ ప్రశ్న ప్రజలకు అవసరమైన సరుకులు ముందుగా ఏర్పాటు చేసుకోవాలి కదా!
      గిడ్డంగులు ఉన్న ప్రదేశంలోనే ఉపద్రవం వస్తుంది అని తెలిసి అక్కడ ఎలా ఏర్పాటు చేస్తారు?
      ఆయన పక్క రాష్ట్రం మీద ధ్యాస పెట్టాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ మూడు రోజులు ప్రజలను నిత్యావసరాలు ఒక వారం సరిపడా పొందు పరుచుకొండి అని ప్రచారం చేసారు అని నాకు గుర్తు!

      Delete
  4. వీరెవరో కానీ తన అభిప్రాయం బ్రహ్మాండంగా కవితారూపంగా చెప్పారు!

    http://chaakirevu.wordpress.com/2014/10/15/%E0%B0%9C%E0%B0%A8%E0%B0%82-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82-%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF/

    ReplyDelete
  5. ఈ రోజు ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ లో రాధాక్రిష్ణ వ్యాఖ్యలు.

    "ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయగలిగినంత చేశారనే చెప్పాలి. అయితే తుఫాను గురించి ముందుగానే సమాచారం ఉన్నందున నిత్యావసర వస్తువులు, నీరు వంటివి ముందుగా విశాఖకు చేరవేసి, నిల్వ చేసి ఉండి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం మాత్రం ఉంది. అందరికీఅన్ని ఆలోచనలు రావు. ఆలోచనలు ఉన్నవారు వాటిని సంబంధితులతో పంచుకోవాలి. ఉదాహరణకు తరచుగా తుఫానులు చవిచూసిన ఒడిసా ప్రభుత్వం పలు ముందు జాగ్రత చర్యలు తీసుకుంది. తుఫాను గాలులకు చెట్లు కూలిపోకుండా చెట్ల కొమ్మలను ముందుగా నరికించేశారు. అలాగే హోర్డింగ్‌లను తొలగించారు. ప్రజలందరికీఅవసరమైన నిత్యావసరాలు, మంచినీరు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నారు."

    ఒకవైపు చంద్రబాబును పొగుడుతూనే ఆయన ఏమేమి చేయలేదో, పక్కరాష్ట్రమైన ఒరిస్సా ఏమేమి చేసిందో చక్కగా చెప్పారు. "అందరికీఅన్ని ఆలోచనలు రావు. ఆలోచనలు ఉన్నవారు వాటిని సంబంధితులతో పంచుకోవాలి." అని సలహా ఇచ్చారు సరే, అవి చెప్పడానికి ఆయన ఇచ్చిన అవకాశమేది? ఆయన పార్టీ మీటింగులు తప్ప ఇంకేమి పెట్టారు తెలుసుకోవడానికి?

    ReplyDelete
    Replies
    1. తుఫాను గాలులకు చెట్లు కూలిపోకుండా చెట్ల కొమ్మలను ముందుగా నరికించేశారు అందుకె అల్పపీఢనం ఆంద్రకు వచ్చింది

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం అవినీతి ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి
 
Top